*భగవద్గీతలో హింసా యుద్ధం గురించి బోధించలేదు*
భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. వాటి పేర్లు...
1. అర్జున విషాద యోగం
2. సాంఖ్య యోగం
3. కర్మ యోగం
4. జ్ఞాన యోగం
5. కర్మ సన్యాస యోగం
6. ఆత్మ సంయమ యోగం
7. జ్ఞాన విజ్ఞాన యోగం
8. అక్షర పరబ్రహ్మ యోగం
9. రాజవిద్య రాజగుహ్య యోగం
10. విభూతి యోగం
11. విశ్వరూప దర్శన యోగం
12. భక్తి యోగం
13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం
14. గుణత్రయ విభాగ యోగం
15. పురుషోత్తమ ప్రాప్తి యోగం
16. దైవాసుర సంపద్విభాగ యోగం
17. శ్రద్ధాత్రయ విభాగ యోగం
18. మోక్ష సన్యాస యోగం
ప్రతి అధ్యాయంలో కూడా యోగం గురించే బోధించబడింది (యుద్ధం గురించి కాదు). అనగా నిజ జీవితంలో ఈశ్వరుడి సాన్నిధ్యం ఎలా నిలుపుకోవాలి అని విశదీకరించబడింది. ఆత్మజ్ఞానం గురించి, కర్మసిద్దంతం గురించి, అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటూ ధర్మయుక్తంగా ఉండాలని ప్రబోధించింది. పాప కర్మల వినాశనం కోసం ఆత్మ స్వరూపంలో ఉంటూ సదా భగవంతుణ్ణి స్మృతి చేయాలని సూచించింది. మనలో ఉండే విషయ వికారాల (అరిషడ్వర్గాలు/కామ, క్రోధం, అహంకారం,....) పైన యుద్ధం చేసి విజయులు కావాలని ఆదేశించింది.
అంతేకానీ ఆయుధాలతో యుద్ధం చేయమని, రక్తపాతంతో చంపమని చెప్పలేదు. మనలో ఉండే చెడు గుణాలను నిర్మూలించమంది/హతమార్చమంది.
కానీ దానిని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం.
పాండవులు అనగా సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సన్మార్గం చూపించేవాళ్ళు. కౌరవులు అనగా మనలోనే ఉండే చెడు గుణాలకు గుర్తు.
ఆత్మజ్ఞానివై చెడుగుణాలపై విజయం పొందమని భగవంతుడు సర్వ మానవాళికి బోధించాడు.
అర్జునుడు అంటే ఏ ఒక్కరో కాదు...అర్జునుడు అంటే జ్ఞానాన్ని ఆర్జీంచేవారు అని అర్థం. అనేక మానసిక రుగ్మతల్లో, దుర్గుణాల్లో కూరుకుపోయిన మానవులకు ఆ రుగ్మతలపై ఆత్మిక బలం, ఈశ్వరీయ బలంతో పోరాడి వాటిపై విజయం సాధించేందుకు బోధించిన జ్ఞానం, యోగమే ఈ భగవద్గీత.
భగవంతుడు సర్వ మానవాళికి, జిజ్ఞాసులకు, తన భక్తులకు ఇచ్చిన దివ్య సందేశమే ఈ *శ్రీమత్ భగవద్గీత* జ్ఞానం, యోగం.
భగవద్గీత... రాజయోగం గురించి బోధించే శాస్త్రమే కానీ రక్తపాత యుద్ధాన్ని పురికొల్పే బోధన కాదు.
No comments:
Post a Comment