Friday, June 12, 2026

 *స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది*
కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు
           కార్యేషు యోగీ, కరణేషు దక్షః 

         రూపేచ కృష్ణః క్షమయా తు రామః

         భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం

         షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 

--> కరణేషు దక్షః 
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే  ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. 

--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

--> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. 

--> సుఖదుఃఖ మిత్రం
 సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ  పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.      *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment