గతాన్ని మోస్తున్నావా? అయితే మిగిలేది ఇదే! 😔⏳ II @keerthicreatives8265 #telugumotivation
Author Name:Keerthi creatives
Youtube Channel Url:https://www.youtube.com/@keerthicreatives8265
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DeXOb7OdFEM
Transcript:
(00:00) కొంతమంది వర్తమానంలో జీవిస్తున్నప్పటికీ కూడా గతంలో మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలని పదే పదే గుర్తు చేసుకుంటూ అడుగు ముందుకు వేయాలి అంటే చాలా భారంగా భావిస్తూ ఉంటారు. గతంలోనో చిన్నప్పుడో లేదంటే ఏదో కారణం వల్ల జరిగినటువంటి సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ తమ వర్తమాన జీవితం అంటే ప్రస్తుత ప్రస్తుత పరిస్థితులని చాలా బాధగా భారంగా మోస్తూ ముందడుగు వేస్తూ ఉంటారు.
(00:24) కొంతమంది జీవితాల్లో మోసపోవడం ద్వారా జరిగినటువంటి సంఘటనలు అయితే కొంతమంది జీవితాల్లో తాము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల జరిగినటువంటి సంఘటనలు అయితే కొంతమంది జీవితాల్లో విధివశాత్తో జరిగినటువంటి సంఘటనలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ పాత జ్ఞాపకాలను ఎలా పక్కకు నెట్టాలి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి వర్తమాన జీవితాన్ని సరైనటువంటి దిశలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి మొదలైనటువంటి అంశాలన్నింటిని కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం.
(00:51) [సంగీతం] వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్ నేను మీ కీర్తన రెడ్డి. గతాన్ని గుర్తుంచుకో కానీ అది ఎందుకు ఉపయోగపడాలి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండటం కోసం లేదంటే మన అడుగులు సరైనటువంటి దిశలో నడవడం కోసం లేదంటే గతంలో ఒకవేళ మనకు బాగా నచ్చినటువంటి వ్యక్తిని దూరమయ్యారు అంటే వాళ్ళ వాళ్ళ కలలు నెరవేర్చటం కోసం ఇలా గుర్తుపెట్టుకొని అడుగు ముందుకు వేయాలి తప్ప దాన్నే మోస్తూ బాధపడుతూ జీవితాన్ని భారంగా మాత్రం మార్చుకోకూడదు కొన్ని కొన్ని అంగీకరించలేనటువంటి గాయాలు ఉంటాయి అవతలి వాళ్ళు ఏదో మోసం చేయడం వల్లనో లేదంటే మనల్ని బాగా నమ్మించి నట్టే ముంచటం
(01:30) వల్లనో జరిగేటువంటి సంఘటన ఆధారంగా ఇలాంటి అంశాలు జరుగుతున్నప్పుడు వాటినే పదే పదే గుర్తు చేసుకుంటూ గతంలో జరిగినటువంటి సంఘటనని మళ్ళీ మళ్ళీ నెమరి వేసుకుంటూ కూర్చుంటే గతమంతా బాధాకరంగానే జరిగింది. దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల వర్తమానం కూడా బాధగానే జరుగుతుంది. వర్తమానం సరిగ్గా నిర్వర్తించలేకపోవడం వల్ల భవిష్యత్తు కూడా బాధాకరంగానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
(01:53) మీరు బాధని లేదంటే మీకు బాధ కలిగించినటువంటి సంఘటనని వదిలి వేస్తేనే కొత్త పరిస్థితులకు తలుపులు తెరుచుకుంటాయి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదే బాధలో కూరుకొని ఊరుకొని పోతూ ఉంటే మాత్రం మిమ్మల్ని బాధ వెంటాడుతూ అడుగు ముందుకు వేయనీయదు సరి కదా సరైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోనివ్వదు. గతంలో జరిగినటువంటి ఏ అంశమైనా కానీ అది ఒక గుణపాఠంగా ఉండాలి పాఠంగా ఉండి మళ్ళీ తీసుకునేటువంటి నిర్ణయాల వైపు మళ్ళీ సాగించేటువంటి జీవితాన్ని సరైనటువంటి దిశలో తీసుకువెళ్ళేదిగా ఉండాలి తప్ప గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే నీకు తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా నీ
(02:27) జీవితం నీకు భారంగా తోస్తుంది. ఆత్మన్యూనత భావంతో అందరికీ సంతోషం ఉంటే నా జీవితంలోనే ఎందుకు ఇంత బాధ ఉంది అనేటువంటి నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి. దీన్నే మనము ఎమోషనల్ బ్యాగేజ్ అంటూ ఉంటాం. ఎవరైతే మనల్ని బాధ పెట్టారో ఎవరైతే ఏ సంఘటన అయితే మనల్ని ఇబ్బంది పెట్టిందో ఎవరైతే మన చెడును కోరుకుంటూ ఉన్నారో లేదంటే ఏ సంఘటన అయితే నిన్ను పదే పదే కలిచి వేస్తుందో వాటిని నెమ్మది నెమ్మదిగా వదిలిపెట్టడం అనేది నేర్చుకోవాలి.
(02:53) ఎలా మర్చిపోతాం మేడం మీరు అంటారు చాలా సులువుగానే మీరు చెప్పినంత సులభం ఏమి కాదు ఆ సంఘటనలు మా జీవితాన్ని తలకిందులుగా మార్చేసాయి ఎలా ఉండాల్సినటువంటి వాళ్ళము ఎలాగో మారిపోయాము మీరు చెప్పినంత సులువేమి కాదు భావోద్వేగ భారాన్ని అంటే ఎమోషనల్ బ్యాగేజ్ ని వదిలిపెట్టడం అంత సులువేమీ కాదు అని చెప్పి మీరు మీరు అంటున్నారేమో కానీ సులువు కాదు కానీ అలాగే పట్టుకొని కూర్చుంటే మాత్రం ప్రస్తుత జీవితము తర్వాత ఉండబోయే భవిష్యత్తు మాత్రం భారంగా మారుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(03:20) వదిలిపెట్టడం సులువు కాకపోవచ్చు కానీ ప్రస్తుత జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం మన వల్లే అవుతుంది కదా అందుకని కాస్త ఆ అంశాలని గుణపాఠాలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ప్రస్తుత జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి గతంలో ఎలాంటి సంఘటన అయినా జరగనివ్వండి ఇక వాటిని క్షమిస్తారో బాధపడతారో ఏడుస్తారో ఏం చేస్తారో ఏదైనా చేయండి బాధపడేంత సమయం బాధపడి ఇక వదిలేసి సరికొత్త జీవన విధానానికి పునాది వేయండి అంతేకానీ జరిగిపోయిన దాని గురించే బాధపడుతూ ప్రస్తుత జీవితాన్నంతా కూడా ఎరగా వేస్తారా మరి ప్రస్తుత జీవితం బాధలో ఉంటే భవిష్యత్తు కూడా బాధలోకే వెళుతుంది
(03:54) అనేటువంటి విషయాన్ని గమనించుకోరా మీరు గమనించుకోవాలి కదా చిన్ననాటి చేదు అనుభవమే కావచ్చు ప్రేమలో మోసమే కావచ్చు భర్త మరణించటమే కావచ్చు భార్య మరణించడమే కావచ్చు పిల్లలకు ఏదైనా జరగరాంది జరగటమే కావచ్చు ఎవరైనా దగ్గరి వాళ్ళు మనల్ని మోసం చేయటమే కావచ్చు అవమానాలు కావచ్చు తిరస్కరణలు కావచ్చు కోల్పోయినటువంటి వ్యక్తుల జ్ఞాపకాలు కావచ్చు ఇవేవైనా కూడా భావోద్వేగ భారాలుగా మారి మన జీవితాన్ని అక్కడే ఆపేయకూడదు.
(04:21) ఈ మానసిక భారాన్ని ఎక్కువగా మోస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఎవ్వరిని సులభంగా నమ్మలేకపోతారు. అందరితో కలిసి ముందడుగు వేయలేకపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు నాకుఎవ్వరూ లేరు అనేటువంటి ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. గతాన్నే పదే పదే గుర్తు చేసుకోవటం అందరికీ గతంలో జరిగినటువంటి విషయాల గురించే నెమరు వేస్తూ చెబుతూ చెబుతూ ఉండటం కొత్త అవకాశాలు అంటే కొత్త కొత్త విషయాలంటే భయపడుతూ ఉండటం కోపాన్ని బాధని ఎక్కువ కాలం మోస్తూనే ఉండటం ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది అసలు మీలో నుండి మీరే లేకుండా మాయమైపోతారు. కాస్త మేల్కొండి
(04:54) జీవితం అన్నాక కష్టాలు నష్టాలు బాధలు దుఃఖం ఇవన్నీ సహజం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి అందరి జీవితాల్లో ఉంటాయి అందరూ వాళ్ళ భావోద్వేగాన్ని భారాన్ని బాధని కొంతకాలం అనుభవించిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నారు. సరికొత్తగా దిశగా ఆలోచనలు కొనసాగిస్తూ ఉన్నారు.
(05:14) సరైనటువంటి జీవన విధానంతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ మామూలు జీవితాన్ని గడపడానికి సరికొత్త భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఇలా బాధనే ఆలోచిస్తూ బాధపడుతూ భావోద్వేగ పరంగా ఇలాగే కన్నీరు కారుస్తూ ఒంటరితనంగా మీలో మీరే ఆత్మనుతా భావంతో ఆత్మవిశ్వాసం తగ్గింప చేసుకుంటూ ఇలాగే కూర్చుండిపోతారా ఎంత కాలమని ఇలా బాధపడుతూ గతాన్నే తలుచుకుంటూ కూర్చుంటారు చెప్పండి దీని వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటో తెలుసా పదే పదే బాధను గుర్తు చేసుకుంటూ మీకు తెలియకుండానే మీరు ఇతరులతో సంబంధాలని దెబ్బ తినేలాగా ప్రవర్తిస్తారు.
(05:45) అంతేకాదు మీకు నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. అస్తమానం బాధని భారాన్ని మోస్తూ ఉండటం వల్ల మీ మెదడు పనితీరు చురుగ్గా ఉండకుండా అది కూడా బాధ బాధాపూరితమైనటువంటి ఆలోచనలు మాత్రమే మీకు మిగిలిస్తుంది. మనశశాంతి అనేదే ఉండకుండా అవుతుంది. ప్రస్తుత వర్తమాన పరిస్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఏమాత్రం కూడా ఆస్వాదించలేకపోతూ ఉంటారు.
(06:04) ప్రతీక్షణం కాస్త నవ్వగానే కాస్త సంతోషంలోకి రాగానే వెంటనే మిమ్మల్ని మీరు గతంలోకి లాకెళ్ళిపోతూ ఉంటారు. ఇలా జరిగింది అలా జరిగింది అలా జరగకుండా ఉండాల్సింది జరగకుండా ఉండాల్సింది ఉండే అని చెప్పి మళ్ళీ బాధలోకి నెట్టేస్తూ ఉంటారు. మీ వ్యక్తిగత ఎదుగుదల అనేది ఆగిపోతుంది. మీ పైన మీరు శ్రద్ధ వహించడం అనేది తగ్గిపోతుంది.
(06:22) ఇన్ని నష్టాలను మిగులుస్తున్నటువంటి ఎమోషనల్ బ్యాగేజ్ అంటే గతంలో జరిగినటువంటి సంఘటనని బాగా గుర్తుపెట్టుకొని పదే పదే కుమిలిపోవటం బాధపడటం అసూయ పెంచుకోవటం, ఈర్ష పెంచుకోవడం, వాళ్ళు పతనం కావాలి అని కోరుకోవటం ఇవన్నీ కూడా మిమ్మల్ని దిగజారుస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఎలా తగ్గించుకోవాలి మేడం ఇది ఎలా తగ్గుతుంది అంటే ఏది ఏమైనా జరగనివ్వండి జరిగిన దాన్ని అంగీకరించండి అలా జరిగింది అదంతా కర్మానుసారం జరిగింది అని ఒప్పేసుకొని అక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి ఒకవేళ మనం మోస మోసానికి గురి అవ్వటమే అయితే అది భగవంతుడి భగవంతుడి ఖాతాలో వేసి
(06:54) కర్మానుసారం ఆయన చూసుకుంటాడులే అన్నట్టుగా వాళ్ళని క్షమించేసినట్టుగా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి మరి మరో అవకాశం వైపు మరో సరికొత్త నిర్ణయం వైపు మీ పయనం కొనసాగించండి. మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోండి వర్తమాన జీవితం పై దృష్టి పెట్టండి మీకోసం మీరు సమయాన్ని వెచ్చించుకోండి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి.
(07:16) మన గతం అనేది మన జీవితానికి ఒక గురువులాగా మారాలి. మన అనుభవాలు మనకి పాఠాలుగా మారాలి. అంతేకానీ భవిష్యత్తుకి వర్తమానానికి భారాలుగా మాత్రం మిగలకూడదు. మీరు మోస్తున్నటువంటి భావోద్వేగ భారాన్ని బాధని గుండెల నిండా ఉన్నటువంటి భారాన్ని ఇప్పుడే దించేయండి. ఈ రోజు నుంచి మీ జీవితాన్ని సరికొత్తగా మొదలు పెట్టండి. మీ జీవిత ప్రయాణం అత్యద్భుతంగా ముందుకు సాగాలి అని నేను అభిలషిస్తున్నాను.
(07:41) గతం ఏదైనా జరగనివ్వండి ఎలాగైనా జరగనివ్వండి. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి అన్నింటిని కూడా క్షమించేసి వీలైనంత వరకు అవసరం లేనటువంటి అంశాలను పక్కకు నెట్టేసి సరికొత్త జీవితానికి నాంది పలుకుతాను అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ అస్తమానం బాధలు భారాలు గతంలో మిగిలినటువంటి సంఘటనలని గుర్తు చేసుకుంటూ కూర్చోవడం కాకుండా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడి నుంచి నా జీవితం మొదలు పెట్టాలి అంటే నేను ఏ వైపుగా ఆలోచన కొనసాగించాలి నా భవిష్యత్తు బాగుండాలి అంటే నేను వర్తమానంలో ఏ అంశాలు మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని అర్థం
(08:12) చేసుకొని సరికొత్తనైనటువంటి జీవిత ప్రణాళికతో అడుగు ముందుకు వేయి నీకంతా శుభమే జరుగుతుంది. మీ జీవిత ప్రయాణం అంతా తేలికగా సంతోషకరంగా జరగాలి అని ఆశిస్తూ థాంక్యూ ఫర్ వాచింగ్ బాయ్
No comments:
Post a Comment