Self pity వద్దు! పిల్లల కోసం adjust అవ్వాలా? Best Tips On Relationships - Drama Free Book Self Care👍
Author Name:Jeevithamastu
Youtube Channel Url:https://www.youtube.com/@Swapna_Jeevithamastu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c6hSH0CmIi4
Transcript:
(00:00) రిలేషన్షిప్స్ అంటే డ్రామా డ్రామా అంటే రిలేషన్షిప్స్ మన లైఫ్ లో అన్ని రిలేషన్షిప్స్ స్మూత్ గా ఉండవు. కొంతమందితో రిలేషన్షిప్స్ చాలా ఇబ్బంది పెడతాయి ఇంకా మనకి బాధని డిసపాయింట్మెంట్ ని స్ట్రెస్ ని మిగులుస్తాయి. అండ్ ఆ కొంతమంది ఎవరో కాదు మన పేరెంట్స్ సిబ్లింగ్స్ అవ్వచ్చు మన స్పౌస్ ఇన్లాస్ అవ్వచ్చు ఇంకా మన క్లోజ్ కజిన్స్ ఫ్రెండ్స్ అవ్వచ్చు.
(00:24) ఈ వీడియోలో డ్రామా ఫ్రీ అనే బుక్ నుంచి కొన్ని మంచి ఆలోచనలు మీకు షేర్ చేయబోతున్నాను. ఇలాంటి కష్టమైన రిలేషన్షిప్స్ ని బెటర్ గా డీల్ చేయడానికి ఇంకా మీ మనసు కొంచెం తేలికపరిచి మీ రిలేషన్షిప్స్ లో అండ్ మీ లైఫ్ లో కొంచెం డ్రామాని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలానే మన వీడియోస్ లో కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి హస్బెండ్ తో చాలా ప్రాబ్లం గా ఉంది అటు డైవర్స్ తీసుకోవాలా లేకపోతే పిల్లల కోసం రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో సజెషన్స్ అడుగుతూ ఉంటారు.
(00:52) సో ఆ విషయం గురించి కూడా ఈ వీడియోలో నా వ్యూస్ షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చివర్లో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం నేను మీ స్వప్న జీవితమస్త ఛానల్ కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో అవతలి వాళ్ళని మార్చడం అనేది మన కంట్రోల్ లో లేదు కానీ ఆ రిలేషన్షిప్ లో మనం ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేది మన కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
(01:22) మన దృష్టిలో కొడుకు అంటే ఇలా ఉండాలి మదర్ అంటే ఇలా ఉండాలి కోడలు అంటే ఇలా ఉండాలి అందరూ అందరిని సమానంగా చూడాలి ఇలా కొన్ని నార్మ్స్ పెట్టేసుకున్నాం మైండ్‌లో కానీ రియల్ లైఫ్ లో అది మోస్ట్లీ పాసిబుల్ కాదు మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉండరు వాళ్ళ రోల్ కి తగ్గట్టు ఉండరు. ఎవరి గురించో అక్కర్లేదు ఈవెన్ మన మదర్ కూడా కొన్ని విషయాలు మనకి నచ్చినట్టు ఉండరు.
(01:42) అప్పుడు ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి మన ఎక్స్పెక్టేషన్స్ మార్చుకోవాలి. అమ్మ అంటే ఇలా ఉండాలి కదా కోడలు అంటే ఇలా ఉండాలి కదా అని మార్చాలి అని ట్రై చేస్తే అది చాలా చాలా ఎనర్జీ డ్రైనింగ్ ప్రాసెస్ ఏంటి వీళ్ళు ఇలా ఆలోచిస్తారు ఇలా ఎందుకు ఆలోచించరు ఆ మాత్రం తెలియదా చెప్తే వినరా అని మన బుర్ర అంతా పాడైపోతుంది.
(02:02) అలాంటి వాళ్ళతో వాళ్ళు ఇంతే అని యక్సెప్ట్ చేసి మనల్ని మనం హామ్ చేసుకోకుండా ఎంతవరకు వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలో చూసుకోవాలి. వాళ్ళని మార్చడం మన కంట్రోల్ లో లేదు కానీ ఆ రిలేషన్షిప్ లో మనం ఎలా ఉండాలి అనేది చాలా వరకు మన కంట్రోల్ లో ఉంటుంది. ఆ పర్సన్ ని బట్టి మనం కొన్ని హద్దులు పెట్టుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
(02:23) మీ గురించి ఏం చెప్పినా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో మీ పర్సనల్ విషయాలు అన్నీ చెప్పేయక్కర్లేదు. అన్ని విషయాలు చెప్పకుండా అవసరమైనంత వరకు చెప్పొచ్చు. మూవీస్ జనరల్ అప్డేట్స్ లాంటి విషయాల వరకే మాట్లాడొచ్చు. సపోజ్ మీ సిస్టర్ ఇన్లా అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్పే టైప్ అనుకోండి మీరు చెప్పేవి ఆవిడ ఎక్కడ చెప్పినా పర్లేదు ఏం ప్రాబ్లం రాదు అనుకునే విషయాలే ఆవిడకి చెప్పండి.
(02:47) నెక్స్ట్ వాళ్ళతో స్పెండ్ చేసే టైం ని లిమిట్ చేయొచ్చు వాళ్ళని కలవడం తగ్గించొచ్చు అసలు మానేయ అక్కర్లేదు కాల్ చేసి గంటలు గంటలు మాట్లాడడం కాకుండా జస్ట్ పలకరించి ఒక ఫైవ్ మినిట్స్ లో కాల్ కట్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఏదైనా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే లేదంటే ఈ టాపిక్ డెఫినెట్ గా గొడవకి దారి తీస్తుంది అంటే నువ్వు చెప్పేది నాకు అర్థమైంది ఇక్కడితో వదిలేద్దాం అని టాపిక్ కట్ చేసేయొచ్చు.
(03:10) నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ విషయాలే చెప్తున్నారు అనుకుంటే దానిలోకి డీప్ గా వెళ్ళకుండా పైపైన విని స్లోగా టాపిక్ చేంజ్ చేయొచ్చు లేదా ఇప్పుడు ఈ టాపిక్ వద్దులే ఇంకేమన్నా మాట్లాడుకుందాం అని చెప్పొచ్చు. మీకు కంఫర్టబుల్ గా లేని టాపిక్స్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు చేయలేని పని ఏదైనా వాళ్ళు అడిగినా లేదా వాళ్ళు అడిగినప్పుడు మీరు వేరే విషయాలతో చాలా బిజీగా ఉన్నా నో చెప్పేయండి ఇప్పుడు కుదరదు నెక్స్ట్ టైం అని నెక్స్ట్ అనవసరంగా గాసిప్స్ గొడవల్లోకి మిమ్మల్ని లాగుతుంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు అని చెప్పొచ్చు.
(03:41) వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు మీ వర్క్ ని గుర్తించరు అని తెలిసినప్పుడు వాళ్ళ నుంచి ఆ వాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ ఎక్స్పెక్టేషన్ తీసేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ హద్దులు అనేవి అదేదో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే మన ఎనర్జీని మన ప్రశాంతతని కాపాడుకోవడానికి నెక్స్ట్ కొన్ని రిలేషన్షిప్స్ చాలా ఛాలెంజింగ్ ఉంటాయి.
(04:06) కానీ అందులో మీకు పాజిటివ్ గా అనిపించే విషయం ఏదైనా ఉందేమో ఆలోచించండి. ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేని బిజీ పేరెంట్స్ ఉంటే మీరు త్వరగా ఇండిపెండెంట్ అవుతారు. ఎమోషనల్ గా అవైలబుల్ గా లేని పేరెంట్స్ ఉంటే మీ ఎమోషన్స్ ని మీరే మేనేజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. తన పని తను తప్ప వేరే విషయాలు ఏమి పట్టించుకొని హస్బెండ్ ఉంటే మీకు ఎక్కువ బాధ్యతలు ఉండొచ్చు కానీ అన్ని మీకు నచ్చినట్టు మీరు నిర్ణయించుకని చేసుకునే ఫ్రీడమ ఉంటుంది.
(04:31) ఏమి హెల్ప్ చేయని అత్తగారు ఉంటే మీకు అన్ని పనులు చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇలా పాజిటివ్ సైడ్ ఆలోచించి చూడండి. నెక్స్ట్ వాళ్ళ స్టోరీస్ ఏంటి అని ఆలోచించడం. మీకు ఎవరితో అయితే డిఫికల్ట్ రిలేషన్షిప్ ఉంటుందో ఒకసారి వాళ్ళ స్టోరీ ఏంటి అంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ స్ట్రగల్స్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని ఆలోచించడం హెల్ప్ అవుతుంది.
(04:52) అంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఇది కాబట్టి నన్ను ఇలా ట్రీట్ చేయొచ్చు మనం భరించొచ్చు అని కాదు ఇక్కడ ఉద్దేశం. కానీ అవి తెలుసుకోవడం ద్వారా మనం వాళ్ళని చూసే విధానం మారొచ్చు కొంచెం కోపం తగ్గించుకోవచ్చు ఇంకొంచెం బెటర్ గా రెస్పాండ్ అవ్వచ్చు. సపోజ్ మీ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అప్పుడు ఎందుకు నన్ను నమ్మరు ఎక్కడికి అలవ చేయరు అని మీకు అనిపించొచ్చు.
(05:11) బట్ మే బీ మీ ఫాదర్ పెరిగిన వాతావరణంలో అనవసరంగా లైఫ్ ని పాడు చేసుకున్న అమ్మాయిల్ని చూశరేమో మీ లైఫ్ కూడా అలా అవ్వకూడదు అని ఎక్కువ భయపడుతున్నారేమో అండ్ మే బీ మీ మదర్ చిన్నప్పుడు ఎక్కువ ఫ్రీడమ లేదేమో అవే భయాలు మీ విషయంలో ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళు అలా ఎక్స్పీరియన్స్ చేశారని మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు కానీ స్టోరీ తెలుసుకుంటే వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా ఉంటారు కొంచెం ఓపిక్గా ఉండడానికి ట్రై చేస్తారు.
(05:36) మీ సిస్టర్ మీ విషయంలో కొంచెం జెలసీగా ఉన్నారు అనుకోండి మేబీ చిన్నప్పుడు తనని మీతో ఎక్కువ కంపేర్ చేశారేమో మీకంటే వెనకపడిన ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల అలా ఆలోచిస్తున్నారేమో అని మీరు ఆలోచించగలిగితే తనని మీరు ఇంకొంచెం అప్రిషియేట్ చేయొచ్చు ఇంకొంచెం కలుపుకోవడానికి ట్రై చేయొచ్చు. అది ఇద్దరికీ హెల్ప్ అవుతుంది. అలానే మీ హస్బెండ్ మిమ్మల్ని ఎప్పుడూ అప్రిషియేట్ చేయరు అనుకోండి మేబి తను పెరిగిన ఫ్యామిలీలో లవ్ ని అంత బయటకి ఎక్స్‌ప్రెస్ చేయరేమో అందుకని అలవాటు లేదేమో ఇది మీరు తెలుసుకుంటే మీరు నన్ను బాగా చూసుకుంటారు అప్పుడప్పుడు మాటల్లో కూడా చెప్తే
(06:07) బాగుంటుంది అని అనొచ్చు. దీనివల్ల మీకు కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గుతుంది ఆయన కొంచెం ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలానే ప్రతి దానిలో మీ అత్తయ్య ఇన్వాల్వ్ అయ్యి కంట్రోల్ చేస్తున్నారు అనుకోండి మేబీ ఆవిడ కొడుకే లోకంగా బ్రతికిందేమో ఇప్పుడు ఇంపార్టెన్స్ పోతుంది అని భయపడుతున్నారేమో ఇది మీరు అర్థం చేసుకోగలిగితే మీ సలహాలకి నేను వాల్యూ ఇస్తాను కానీ ఈసారి మాత్రం నా వేలో ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పొచ్చు.
(06:34) వాళ్ళ స్టోరీ తెలియకపోతే వాళ్ళ బిహేవియర్ మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళ స్టోరీ తెలుసుకుంటే వాళ్ళ కారణాలు భయాలు బాధలు అర్థం చేసుకోవచ్చు. అలాని వాళ్ళు చేసేది కరెక్ట్ గా మనం భరించాలని కాదు మనం కొంచెం బెటర్ గా రెస్పాండ్ అవ్వడానికి హద్దులు పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ లో ఉన్న హెల్తీ పార్ట్ ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి.
(06:54) ప్రతి రిలేషన్షిప్ లోనూ కొన్ని పడని సిచువేషన్స్ విషయాలు ఉంటాయి అలానే కొన్ని కలిసి ఎంజాయ్ చేసేవి కూడా ఉంటాయి. అలాంటి వాటిని గుర్తించండి వాటికి వాల్యూ ఇవ్వండి వాటిని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. దీని ద్వారా వాళ్ళతో పూర్తిగా మనం రిలేషన్ కోల్పోకుండా ఎట్ ద సేమ్ టైం మన ప్రశాంతతను కూడా కాపాడుకుంటూ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు.
(07:15) మనీ విషయంలో మీ సిస్టర్ ఆలోచించే విధానం మీకు నచ్చకపోవచ్చు కానీ వంటల గురించి మాట్లాడుకోవడం కలిసి వంట చేయడం ఎంజాయ్ చేయొచ్చు. మీ బ్రదర్ రెగ్యులర్ గా ఫోన్ చేయకపోవచ్చు మీకు గిఫ్ట్ లాంటివి ఇవ్వకపోవచ్చు కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచువేషన్స్ లో తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. అవసరమైనప్పుడు హి విల్ బి దేర్ అనే ఫీలింగ్ ని ఎంజాయ్ చేయొచ్చు.
(07:35) మీ అత్తయ్య మీరు చేసే పనిని గుర్తించకపోవచ్చు కానీ మీ పిల్లల్ని బాగా చూసుకుంటుంది అనుకోండి ఆ బాండింగ్ ని సపోర్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. మేబీ మీ సిస్టర్ లో కొన్ని విషయాల్లో డిమాండింగ్ గా ఉండొచ్చు కానీ అవసరమైనప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది అనుకోండి ఆ పార్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకటో రెండో విషయాలు నచ్చలేదు అని ఇంక ఈ రిలేషన్షిప్ వేస్ట్ అని తీసేయక్కర్లేదు.
(07:54) మీకు ఏది వర్క్ అవుతుందో దాని మీద ఫోకస్ చేయండి మిగతా విషయాల్లో హద్దులు పెట్టుకోండి. నెక్స్ట్ నా లైఫ్ ఇంతే నా లైఫ్ ఇలా అయిపోయింది నాకు ఏమి నేర్పించలేదు నాకు ఏమి ఇవ్వలేదు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు అని ఇలా ఆలోచిస్తూ సెల్ఫ్ పిటి ఫీల్ అవ్వద్దు. అందరూ హెల్దీ ఫ్యామిలీ లో పుట్టి పెరగాలని లేదు పెళ్లయ్యాక అందరికీ చాలా సపోర్టివ్ ఫ్యామిలీ రావాలని లేదు.
(08:15) ఈ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనం కోరుకునేది వాళ్ళు ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవచ్చు. ఈ మధ్య నేను చేసిన షార్ట్ వీడియోలో చాలా మంది చెప్పారు హస్బెండ్ ఇన్లాస్ అస్సలు చేసే పని గుర్తించరు అని అలాంటప్పుడు వాళ్ళు గుర్తిస్తారు అని ఎదురు చూడడం మానేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ కానీ హస్బెండ్ ఆర్ ఇన్లాస్ కానీ మీకు సపోర్టివ్ గా లేకపోతే మీకంటూ ఒక సేఫ్ సర్కిల్ క్రియేట్ చేసుకోండి మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు నేబర్స్ అవ్వచ్చు మెంటర్స్ అవ్వచ్చు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి.
(08:44) ఈ బుక్ లో ఒక మంచి పాయింట్ ఉంది అదిఏంటంటే నీ చిన్నప్పుడు ఇలాంటి సపోర్ట్ ఇచ్చే పర్సన్ ఫ్యామిలీలో ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తే అలాంటి పర్సన్ గా నువ్వు మారు అని సో ఎలాంటి సపోర్ట్ అయితే మీకు మీ పేరెంట్స్ నుంచి ఇన్లాస్ నుంచి రావట్లేదు అనుకుంటున్నారో అలాంటి సపోర్ట్ మీకు మీరు ఇచ్చుకోండి అండ్ మీ పిల్లలకి ఇవ్వండి.
(09:04) ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్లాస్ మీకు రెస్పెక్ట్ ఇవ్వారనుకోండి మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోండి మీకు ఫ్యూచర్ లో వచ్చే డాటర్ ఇన్లాకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ఈ మధ్య మన కమ్యూనిటీలో ఒక క్వశ్చన్ అడిగాను. మీరు మీ పిల్లలకి చెప్పే ఒక మాట. ఆ మాట మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ మీకు చెప్పుంటే బాగుండు అనిపించే మాట కామెంట్స్ లో చెప్పమని.
(09:23) నిజంగా ఇది చాలా లోతైన ప్రశ్న అండ్ దీనికి మీరు ఇచ్చిన ఆన్సర్స్ కూడా చాలా ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి టచింగ్ గా ఉన్నాయి. మన జనరేషన్ పేరెంట్స్ కి పాపం అంత అవేర్నెస్ లేక మనకి ఇవ్వాల్సిన సపోర్ట్ కొన్ని విషయాల్లో ఇచ్చిఉండకపోవచ్చు. అది మనం తెలుసుకుని మన పిల్లలకి ఇవ్వగలగడం అనేది ఒక బెస్ట్ పని అప్పుడే మన పిల్లలు ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారు సొసైటీలో కూడా పాజిటివ్ చేంజెస్ వస్తాయి.
(09:48) మీరు గనుక ఆ పోస్ట్ చూడకపోతే తప్పకుండా చూడండి కామెంట్స్ చదవండి పోస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని మీరు రీపేరెంట్ చేసుకోండి. మీకు చిన్నప్పుడు ఎవరు నేర్పించలేదు అనుకున్న విషయాలు మీరు బుక్స్ ద్వారానో వేరే వాళ్ళ ద్వారానో ఇప్పుడు నేర్చుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికీ మనీ మేనేజ్మెంట్ లేక మనీ వేస్ట్ చేస్తున్నారు అంటే మీరు మనీ మేనేజ్మెంట్ నేర్చుకోండి.
(10:11) ఏదైనా అచీవ్ చేస్తే చిన్నదైనా పెద్దదైనా మీకు మీరు ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పుకోండి సెలబ్రేట్ చేసుకోండి. ఇతరుల కోసం బ్రతకడమే కాదు మీ అవసరాలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ గురించి మీరు తెలుసుకోండి ఇది చేయగలను అని మిమ్మల్ని మీరు నమ్మండి మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకోండి. సెల్ఫ్ కేర్ గురించి అయితే ఈ ఆథర్ చాలా సందర్భాల్లో స్ట్రెస్ చేస్తూ ఉంటారు ఈ బుక్ లో.
(10:34) సెల్ఫ్ కేర్ సెల్ఫ్ అవేర్నెస్ అని మన గురించి మనం కేర్ తీసుకోవడం గురించి అన్ని విషయాలు కవర్ చేస్తూ సెల్ఫ్ లవ్ అని ఒక వీడియో చేశాను. మీరు గనుక ఆ వీడియో మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి. అన్నిటికీ మించి సెల్ఫ్ పిటీ విక్టిం మెంటాలిటీని పక్కన పెట్టేయండి. మా పేరెంట్స్ సిబ్లింగ్స్ ఇలా ఉన్నారు హస్బెండ్ ఇన్లాస్ అలా ఉన్నారు నాకు ఎవరు సపోర్ట్ చేయరు అని బ్లేమ్ చేస్తూ ఉంటే మనం అక్కడే స్టక్ అయిపోతాం.
(11:00) ఇప్పుడు నాకున్న సిచువేషన్ లో ఏం బెటర్ చేయగలను చిన్నదైనా సరే ఒక మంచి స్టెప్ ఏం తీసుకోగలను అని ఆలోచించండి. సో పాస్ట్ ఇస్ పాస్ట్ మీ రిలేషన్షిప్స్ ని యక్సెప్ట్ చేయండి సెల్ఫ్ పెట్టి ఫీల్ అవ్వకుండా బయట ఒక మంచి సపోర్ట్ ని బిల్డ్ చేసుకోండి ఇంకా మీకు లేని క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోండి స్కిల్స్ నేర్చుకోండి ఇంకా మంచి సెల్ఫ్ కేర్ తీసుకొని మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి ప్రయారిటీ ఇవ్వండి.
(11:24) నెక్స్ట్ వీడియోస్ లో కొంతమంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు హస్బెండ్ తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అటు డైవోర్స్ తీసుకోవాలా లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాము సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో ఈ విషయంలో నేను కొన్ని థాట్స్ షేర్ చేయాలని అనుకుంటున్నాను అదేంటంటే ఫస్ట్ అఫ్ ఆల్ మీకు ఫిజికల్ గా హామ్ ఉంది మీ లైఫ్ డేంజర్ లో ఉంది అంటే తప్పకుండా మీరు దూరంగా ఉండాలి.
(11:49) అదర్వైస్ ఈ విషయంలో మీరే ఆలోచించుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అండ్ అలా ఆలోచించుకోవడానికి ఇక్కడ ఈ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ షేర్ చేస్తున్నాను ఆ క్వశ్చన్స్ ద్వారా మీరు ఆలోచించుకొని మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేసి లేదా లాయర్ ఆర్ కౌన్సిలర్ తో మాట్లాడి మీ రైట్స్ ఏంటో తెలుసుకొని ఆ డెసిషన్ మాత్రం మీరే తీసుకోవాలి.
(12:11) ఎందుకు మీరే తీసుకోవాలి అంటున్నాను అంటే అక్కడ సిచువేషన్ ఏంటి అనేది కంప్లీట్ గా మీకే తెలుసు అండ్ మీ గురించి మీకు బాగా తెలుసు అవతల పర్సన్ గురించి మీకు బాగా తెలుసు అలానే ఏదైనా డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ పర్యావసానాలు ఫేస్ చేయాల్సింది కూడా మీరే కాబట్టి ఆ డెసిషన్ మాత్రం మీరే తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించుకోవడానికి హెల్ప్ అయ్యే ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
(12:34) నేను ఎందుకు ఈ రిలేషన్షిప్ లో హ్యాపీగా లేను ఇది మనీ వర్క్ లేదా పిల్లలకు సంబంధించిన ఒక టెంపరరీ స్ట్రెస్ మాత్రమేనా లేదా డీప్ ఇష్యూస్ ఉన్నాయా అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం తిట్టడం నిందించడం ద్రోహం చేయడం ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం ఇలాంటివి ఉన్నాయా నెక్స్ట్ రిలేషన్షిప్ వర్క్ అవ్వడానికి అవతల పర్సన్ నుంచి ఏమన్నా ఎఫర్ట్ ఉందా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అదేంటో వినడం దాని గురించి మాట్లాడడం సొల్యూషన్ కోసం ఏమన్నా ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారా లేకపోతే పోతే ఇగ్నోర్ చేయడం బ్లేమ్ చేయడం ప్రాబ్లం చెప్తే ఇంకా బ్యాడ్ గా బిహేవ్ చేయడం లాంటివి చేస్తున్నారా ఈ రిలేషన్షిప్ లో నేను ఎలా ఫీల్
(13:10) అవుతున్నాను సేఫ్ గా రెస్పెక్టెడ్ గా ఫీల్ అవుతున్నానా అలసిపోతున్నానా కంగారు పడుతున్నానా సైలెంట్ గా ఉండిపోతున్నానా ఇంకా ఇది పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రేమ రెస్పెక్ట్ లాంటివి పిల్లలు చూడగలుగుతున్నారా లేకపోతే టెన్షన్ పడుతున్నారా అరవడం లేదా సైలెంట్ గా ఉండిపోవడం లాంటివి నేర్చుకుంటున్నారా? చాలామంది పిల్లల కోసం భరిస్తున్నాను అని అంటారు కానీ అన్నిసార్లు అది కరెక్ట్ అవ్వకపోవచ్చు మీరు ఒక స్ట్రెస్ ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు అంటే ఆ టెన్షన్ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.
(13:38) మనం ఎక్కడ పెరిగాము ఎవరితో పెరిగాము చిన్నప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేశము అనే దాని ఎఫెక్ట్ చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది మన బాడీ మైండ్ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ ఫైనాన్షియల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ ని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ దృష్టిలో కూడా ఆలోచించి చూడండి. నెక్స్ట్ ఈ రిలేషన్షిప్ వదిలేస్తే నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందా నా లీగల్ రైట్స్ ఏంటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఎమోషనల్ సపోర్ట్ ఉంటుందా ఇంకా ఆవేశంలో నిర్ణయించుకుంటున్నానా బానే టైం తీసుకొని ఆలోచించి నిర్ణయించుకుంటున్నానా ఈ క్వశ్చన్స్ వేసుకొని ఆలోచించండి. ప్రేమ
(14:12) రెస్పెక్ట్ ఇద్దరి నుంచి ప్రయత్నం ఉంది మాట్లాడుకోవడం లేదా కౌన్సిలింగ్ ద్వారా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే డెఫినెట్ గా టైం ఇవ్వచ్చు లేదంటే మీ సిచువేషన్ బట్టి ఆలోచించుకొని మీ ఫ్యామిలీ లాయర్ కౌన్సిలర్స్ తో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోండి. సో అదండి చిన్న చిన్న ఇష్యూస్ అయితే అన్ని రిలేషన్షిప్స్ లోనూ ఉంటాయి ఏ రిలేషన్షిప్ పర్ఫెక్ట్ కాదు మనం ఒక రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మనకి ప్రేమ ఉంటది ఎట్ ద సేమ్ టైం మనకి నచ్చని విషయాలు ఉంటాయి కొన్ని విషయాల్లో చిరాగు తెప్పిస్తారు అని యక్సెప్ట్ చేయాలి.
(14:44) కొంతవరకు భరించాలి దాన్ని కాస్త బెటర్ గా ఎలా డీల్ చేసుకోవచ్చో చూసుకోవాలి. ఎక్కడ హద్దులు పెట్టుకోవాలో ఆలోచించుకోవాలి. లేదు చాలా డీప్ ఇష్యూస్ ఉన్నాయి నేను అన్ని ప్రయత్నించాను చాలా ఓపికగా ఉన్నాను ఇంకా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేను ఈ రిలేషన్షిప్ ని వదిలేయడమే నాకు హెల్దీ ఆప్షన్ అనుకుంటే తప్పులేదు అది కంప్లీట్లీ మీ ఛాయిస్ అలాంటప్పుడు సొసైటీ నుంచి జడ్జ్మెంట్స్ సలహాలు కూడా ఫేస్ చేస్తాము సిస్టర్ తో మాటలు లేవా అత్తగారితో మాట్లాడదా అని అలాంటివి స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం.
(15:14) నేను రిలేషన్షిప్స్ గురించి నాకు బాగానే తెలుసు అనుకున్నాను కానీ ఈ బుక్ చదివిన తర్వాత కొన్ని విషయాల్లో చాలా చాలా క్లారిటీ వచ్చింది. మెయిన్లీ అన్ హెల్తీ రిలేషన్షిప్స్ ని ఫోకస్ చేస్తూ రాసిన బుక్ అన్నమాట ఇది అన్‌హెల్తీ రిలేషన్షిప్స్ ఉండే ఫ్యామిలీలో ఎలా సఫర్ అవుతారు ఎలాంటి పాటర్న్స్ ఉంటాయి వాటిని ఎలా బ్రేక్ చేయాలి ఇలాంటివన్నీ డిస్కస్ చేశారు.
(15:33) ఇంకా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అంటే ఎలా ఆలోచించాలి వదిలేయాలి అంటే ఎలా డీల్ చేసుకోవాలి అలానే ఇన్ లాస్ సిబ్లింగ్స్ రిలేటివ్స్ పేరెంట్స్ చిల్డ్రన్ గురించి కూడా సెపరేట్ చాప్టర్స్ ఉన్నాయన్నమాట సో చాలా మంది ఈ బుక్ తెలుగులో ఉందా అని అడుగుతూ ఉంటారు అన్ఫార్చునేట్లీ లేదు తెలుగులో అండ్ అసలు ఈ బుక్ ని బ్రేక్ డౌన్ చేసి ఇలా వీడియోస్ గా చెప్పడం అంటే కూడా నిజంగా చాలా కష్టం ఇంతకుముందు ఒక చాప్టర్ ని బేస్ చేసుకొని ఒక వీడియో చేశాను అండ్ ఈ వీడియోలో అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ద కోర్ పాయింట్స్ మెయిన్ పాయింట్ పాయింట్స్ ని కవర్ చేశాను మనకి
(16:04) హెల్ప్ అవుతాయి అనిపించినవి అండ్ ఇంకేమనా హెల్ప్ అయ్యే పాయింట్స్ ఉంటే షార్ట్స్ రూపంలో తప్పకుండా షేర్ చేస్తాను. మరి మీరు వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు తెలుసు నేను సైకాలజిస్ట్ ని కాదు థెరపిస్ట్ ని కాదు ఈ వీడియోస్ లో షేర్ చేసే విషయాలు ఏంటి అంటే నాకు హెల్ప్ అయిన విషయాలు నేను అబ్సర్వ్ చేసిన విషయాలు లేకపోతే ఇలా బుక్స్ నుంచి నేర్చుకున్న విషయాలు కొన్ని ఆలోచనలు ఐడియాస్ గా మీకు షేర్ చేస్తూ ఉంటాను.
(16:36) ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలిీదు ఓహో ఇలా కూడా ఆలోచించొచ్చా అని బికాజ్ నేను బుక్స్ లో కొన్ని చదివినప్పుడు ఓహో ఇలా కూడా ఆలోచించొచ్చు ఇలా ఆలోచిస్తే ఇలా హెల్ప్ అవుతుంది అని రియలైజ్ అయ్యాను సో ఆ పర్పస్ తోనే నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను. వీటిని మీరు ఫ్రెండ్లీ సజెషన్స్ కింద కొన్ని థాట్స్ అండ్ ఐడియాస్ కింద చూడండి ఎందుకంటే అన్ని సిచువేషన్స్ కి అన్ని అప్లై అవ్వకపోవచ్చు కూడా సో మీకున్న సిచువేషన్ ప్రకారం మీకు నేను చెప్పిన పాయింట్స్ కన్విన్సింగ్ గా అనిపిస్తే హెల్ప్ అవుతాయి అనిపిస్తే ట్రై చేయండి.
(17:05) సో అదండి నా సైడ్ నుంచి అండ్ నౌ ఇట్స్ యువర్ టర్న్ ఈ వీడియోలో ఏ పాయింట్ కి మీరు బాగా రిలేట్ అయ్యారు ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది అండ్ ఓవరాల్ గా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలానే కుదిరితే మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీకున్న డిఫికల్ట్ రిలేషన్షిప్స్ ని డీల్ చేయడానికి మీకు హెల్ప్ అయిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి అది వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఇప్పుడైతే మంచి ఆలోచన
(17:34) చూసేద్దాం మన సమస్యలకి ఎప్పుడూ ఇతరులే కారణం అని అనుకుంటే మన జీవితం ఎప్పటికీ మెరుగుపడదు. సో అదండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు జీవితం మస్తు [సంగీతం]
No comments:
Post a Comment