Wednesday, August 12, 2026

యూ.పీ.ఎఫ్ తింటే ప్రమాదం! | Ultra Processed Foods | Dr M S S Mukharjee

యూ.పీ.ఎఫ్ తింటే ప్రమాదం! | Ultra Processed Foods | Dr M S S Mukharjee

Author Name:Dr M S S Mukharjee | Pulse Heart

Youtube Channel Url:https://www.youtube.com/@DrMukharjeeOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9LSTM-Jbdf0



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ మీ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ని ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీకు తెలియకుండా మీరు ఎక్కువ తీసుకుంటున్నారని మీకు తెలుసా అంటే చాలా జాగ్రత్తగా తింటున్నాం అనుకుంటారు కొంతమంది కానీ వీటిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
(00:21) కొన్ని లార్జ్ స్టడీస్ లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళలో ఒబేసిటీ డయాబెటీస్ గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ ఈ మాత్రమే కాకుండా ఆల్ కాజ్ మోర్టాలిటీ కూడా 62% ఎక్కువగా కనిపించింది. అసలు ప్రాబ్లం ఏంటంటే మనం సూపర్ మార్కెట్ ట్రాలీలో ఏవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి చాలా మందికి తెలియదు. ఈవెన్ డాక్టర్స్ కూడా సైన్స్ చదువుకున్న వాళ్ళకి కూడా ఎక్కడ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి అనేది తెలియదు.
(00:43) ఇవాళ అవన్నీ క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. చిప్స్ కూల్ డ్రింక్స్ అన్హెల్తీ అని అందరికీ తెలుసు కానీ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, బిస్కెట్స్, బ్రౌన్ బ్రెడ్, ప్రోటీన్ బార్స్, జీరో షుగర్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్, ఇన్స్టంట్ సూప్స్ హెల్దీగా కనిపించే వీటిలో కూడా చాలా ప్రొడక్ట్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు.
(01:02) మరి ఎలా గుర్తుపట్టాలి ప్యాకెట్ ముందు చూడకండి వెనక్కి తిప్పండి ఇంగ్రిడియంట్స్ లో ఈ పేర్లు వెతకండి. ముందుగా బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ బిస్కెట్స్ గ్రనోలా ప్రోటీన్ బార్స్ వీటిలో గనుక షుగర్ గ్లూకోస్ సిరప్ ఇన్వర్టెడ్ షుగర్ సిరప్ కార్న్ సిరప్ ఫ్రక్టోస్ సిరప్ మాల్టోడెక్స్ట్రిన్ ఇలాంటి వాటి పదాలు గనుక కనపడితే ముఖ్యంగా మొదటి మూడు నాలుగు ఇంగ్రిడియంట్స్ లో షుగర్ లేదా సిరప్ అనే మాటలు ఉన్నట్లయితే ఇవి డైలీ ఫుడ్ గా తీసుకోవడానికి పనికిరావు ఎప్పుడన్నా అకేషనల్ గా మాత్రమే తీసుకోండి.
(01:35) రెండోది బిస్కెట్స్ కేక్స్ బేకరీ ప్రొడక్ట్స్ వీటిల్లో పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ లేదా పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అని ఉంటే అవాయిడ్ చేయడం మంచిది. మూడోది చిప్స్ నమకీన్స్ ఇన్స్టంట్ నూడిల్స్ ఇన్స్టంట్ సూప్స్ వీటిలో ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ inన్ఎస్ 627 inన్s 631 అనేవి కనపడ్డాయి అంటే ఎక్కువగా తీసుకోకూడదు.
(02:03) ఇది పాయిజన్ అని నేను చెప్పట్లే కానీ ఫ్లేవర్స్ గాని ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ గాని రిఫైన్డ్ స్టార్చ్ ఫ్యాట్ హై సోడియం అన్ని కలిపి ఉంటే అది హైలీ ఫార్ములేటెడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కి అని ఒక మంచి క్లూ సోడియం కూడా ఎలా ఉందో చూడండి. నాలుగోది జీరో షుగర్ డ్రింక్స్ డైట్ డ్రింక్స్ కొన్ని ప్రోటీన్ బార్స్ షేక్స్ వీటిల్లో సుక్రలోజ్ యస్పర్ టేమ్ లేదా ఏస్ సల్ఫేమ పొటాషియం లేదా ఏస్ సల్ఫేమ కే అని ఉంటది.
(02:32) ఇవి జాగ్రత్తగా చూసుకోండి ముందు జీరో షుగర్ అని పెద్దగా ఉంటది కానీ జీరో షుగర్ అంటే ఆటోమేటికలీ హెల్దీ కాదు. ఐదోది ప్యాకేజ్డ్ బ్రెడ్స్ కేక్స్ ఐస్ క్రీమ్స్ క్రీమీ డెసర్ట్స్ యస్ ఇట్ ఈస్ గా ఇవి మంచివి కాదు బట్ వీటిల్లో ఎమఎల్సిఫయర్స్ ఐన్ఎస్ 471 472 స్టెబిలైజర్ థికనర్ యడెడ్ ఫ్లేవర్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ యడెడ్ కలర్స్ ఇలాంటివి ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి.
(02:59) ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఐఎన్ఎస్ నెంబర్ కనిపించిందంటే డేంజర్ అని కాదు కానీ రిఫైన్డ్ ఫ్లోర్ షుగర్ రిఫైన్డ్ ఆయిల్స్ ఫ్లేవర్స్ కలర్స్ ఎమల్సిఫయర్స్ స్టెబిలైజర్స్ ఇలా ఇంగ్రిడియంట్ లిస్ట్ లో ఒక ఇండస్ట్రియల్ ఫార్ములేషన్ లా కనపడితే అది రోజు తినాల్సిన ఫుడ్ ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఒక సింపుల్ కంపారిజన్ ఒక ప్యాకెట్ వెనకాల ఓట్స్ 100% అంతే మరో బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ వెనకాల రిఫైన్డ్ సీరియల్ షుగర్ గ్లూకోస్ సిరప్ మాల్టోడెక్స్టిన్ ఫ్లేవర్ ఎమల్ స్పైర్ రెండు ప్యాకెట్లోనే ఉన్నాయి కానీ రెండు ఒకటే కాదు మిల్క్ ప్యాకెట్లో మిల్క్ కూడా ప్యాకెట్ లోనే వస్తది దాలు
(03:35) కూడా ప్యాకెట్ లోనే వస్తది నట్స్ ఓల్డ్స్ రోస్టెడ్ చనా కూడా ప్యాకెట్స్ లోనే వస్తాయి ప్రాబ్లం ప్యాకెట్ తో కాదు ప్యాకెట్ లోపల ఏమైంది అనేదే మెయిన్ ప్రాబ్లం సో సూపర్ మార్కెట్స్ లో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి షుగర్ సిరప్ పార్షనల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ మాల్టో డెస్ట్రింగ్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 621 627 631 సుక్రలోస్ యస్ పర్ టేమ ఏసల్ఫంకే మల్టిపుల్ ఫ్లేవర్స్ కలర్స్ ఎమల్ స్పైర్స్ స్టెబిలైజర్స్ ఒక్క ఇంగ్రిడియంట్ కనిపించిందని ప్యాకెట్ పారయన అవసరం లే కానీ ఇలాంటి ఇంగ్రిడియంట్స్ చాలా ఉండి షుగర్ సాల్ట్ రిఫైన్డ్ స్టార్చ్ ఫ్యాట్స్
(04:13) కూడా ఎక్కువగా ఉంటే ఆ ఫుడ్ డైలీ ఫుడ్ కాదు అకేషనల్ ఎప్పుడైనా తీసుకుంటే పర్ల డైలీ తీసుకోవడానికి అది అనువైన ఫుడ్ కాదు. ముఖ్యంగా సూపర్ మార్కెట్ లో హై ప్రోటీన్ మల్టీ గ్రైన్ బేక్డ్ జీరో షుగర్ జీరో మైదా అనే ఫ్రంట్ లేబుల్ చూసి మోసపోకండి ప్యాకెట్ తిప్పండి ఇంగ్రిడియంట్స్ చదవండి ఎందుకంటే మార్కెటింగ్ ముందు ఉంటుంది నిజం వెనకాలు ఉంటది.
(04:37) అమెరికాలో చాలామంది చూసి కొనుక్కుంటుంటారు ఇండియాలో వీటి గురించిన అవగాహన ఎవరికీ లేదు అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. లార్జ్ స్టడీస్ లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళలో మనకి మోర్టాలిటీ ఎక్కువ పెరిగింది అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలి. కాబట్టి ఇవాళ మనం ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఏది ప్రాసెస్డ్ ఫుడ్ ఏది కాదు అనేది తెలుసుకోవడానికి ఒక్కసారి ప్యాకెట్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదవండి.
(05:02) నమస్తే

No comments:

Post a Comment