Thursday, September 24, 2026

ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వెంటనే ఇలా చేయండి! | అష్టావక్ర గీత

ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వెంటనే ఇలా చేయండి! | అష్టావక్ర గీత

Author Name:Telugu Box Stories

Youtube Channel Url:https://www.youtube.com/@telugubox_stories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ozrj8segIsQ





Title: ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వెంటనే ఇలా చేయండి! | అష్టావక్ర గీత

Author Name: Telugu Box Stories

Description: మిమ్మల్ని ఎవరైనా అవమానించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు?
కోపంతోనా? బాధతోనా? తిరిగి అవమానించడమా? లేక ప్రశాంతంగా ఉండడమా?
ఈ వీడియోలో అష్టావక్ర గీత బోధనల ఆధారంగా, అవమానం, కోపం, బాధ, అహంకారం మరియు మనస్సు యొక్క స్పందన గురించి లోతుగా తెలుసుకుందాం.
ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు అసలు బాధ కలిగించేది వారి మాటలా? లేక ఆ మాటలను మనం మనసులోకి తీసుకోవడమా?
ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా:
🔹 అవమానాన్ని ఎలా ఎదుర్కోవాలి?
🔹 ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఎలా స్పందించాలి?
🔹 కోపం వచ్చినప్పుడు మనస్సును ఎలా నియంత్రించాలి?
🔹 ఇతరుల మాటలకు ఎందుకు బాధపడుతున్నాం?
🔹 అహంకారం మన ప్రశాంతతను ఎలా ప్రభావితం చేస్తుంది?
🔹 మౌనం ఎప్పుడు బలం అవుతుంది?
🔹 మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి?
🔹 ఇతరుల అభిప్రాయాల నుండి మన అంతరంగాన్ని ఎలా వేరు చేసుకోవాలి?
అష్టావక్ర గీతలోని ఆత్మజ్ఞాన దృష్టితో ఈ విషయాన్ని పరిశీలిద్దాం.
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి.
ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం, భగవద్గీత, అష్టావక్ర గీత, జీవిత సత్యాలు, మనశ్శాంతి మరియు self-improvement వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
🔎 ఈ వీడియోలో చర్చించే అంశాలు:
అవమానం ఎలా ఎదుర్కోవాలి, అవమానించినప్పుడు ఎలా స్పందించాలి, కోపాన్ని ఎలా నియంత్రించాలి, మనశ్శాంతి, అహంకారం, ఆత్మజ్ఞానం, అష్టావక్ర గీత బోధనలు, జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, emotional control, self mastery.
#అష్టావక్రగీత #ఆధ్యాత్మికజ్ఞానం #మనశ్శాంతి

Transcript:
(00:00) ఎవరైనా అన్న ఒక్క మాట వల్ల మీరు ఎప్పుడైనా రాత్రంతా నిద్ర కోల్పోయారా పక్కమీద అటూ ఇటు దొర్లుతూ ఎప్పుడో ఎవరో చేసిన అవమానాన్ని తలచుకుంటూ మీ గుండె భారంగా మారిన క్షణాలు మీ జీవితంలో ఉన్నాయా ఆ సమయంలో గడియారంలో ముళ్ళు ముందుకు కదులుతుంది కానీ మనసు మాత్రం ఆ ఒక్క చేదు సంఘటన చుట్టూనే గిరికీలు కొడుతూ ఉంటుంది. నిజానికి మిమ్మల్ని నిందించిన వ్యక్తి ఆ మాట అనేసి ప్రశాంతంగా నిద్రపోతూ ఉండవచ్చు.
(00:31) కానీ ఆ మాటల విషాన్ని మీ మనసులోకి ఎక్కించుకుని రాత్రంతా మిమ్మల్ని మీరు దహించుకుంటూ ఉంటారు. అసలు అవమానం మనిషిని ఇంతలా ఎందుకు బాధిస్తుంది? ఎందుకు ఒక చిన్న మాట మన ఆత్మగౌరవాన్ని అంత తీవ్రంగా గాయపరుస్తుంది. మహర్షి అష్టావక్రుడు రాజైన జనకుడికి చెప్పిన ఒక అద్భుతమైన పరమ సత్యం మీ ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చబోతోంది.
(00:59) అది అర్థమైన తర్వాత ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని బాధ పెట్టడం అసాధ్యమవుతుంది. ఒక అర్ధరాత్రి వేళ విశాలమైన మిధిలా నగరంంతా నిద్రలో మునిగిపోయింది. కానీ రాజభవనంలో మహారాజైన జనకుడి కళ్ళల్లో మాత్రం నిద్ర లేదు. ఆయన మనసులో ఏదో తీవ్రమైన ఆలోచన అశాంతి రగులుతున్నాయి. సింహాసనం అపారమైన సంపద లక్షలాది మంది ప్రజలు ఆయన ఆజ్ఞ కోసం ఎదురుచూసే అధికారం ఉన్నప్పటికీ ఆయన అంతరంగం మాత్రం ఒక చిన్న మారతాలుకు గాయంతో అల్లాడిపోతోంది.
(01:34) ఆ రాత్రే ఆయన మారువేషంలో నిశశబ్దంగా అడవి మార్గాన ఉన్న అష్టావక్రుడు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలో అష్టావక్రుడు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖంలో పౌర్ణమి నాటి చంద్రుని వంటి ప్రశాంతత కొలువై ఉంది. జనకుడు వినయంగా ఆయన పాదాల చెంత కూర్చొని చేతులు జోడించి ఇలా అడిగాడు. గురుదేవా ఈ లోకంలో ఒక మనిషిని అత్యంత తీవ్రంగా లోలోపల కుంగదీసే బాధ ఏది? శరీరానికి తగిలే దెబ్బల కంటే సంపద కోల్పోవడం కంటే ఎక్కువ నరకం ఏమిటి? మహర్షి అష్టావకరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
(02:15) ఆయన స్వరంలో ఒక అంతులేని గాంభీర్యం ప్రతిధ్వనించింది. రాజా శరీరానికి తగిలిన కత్తిగాయం కాలక్రమేణ మానిపోతుంది. కోల్పోయిన రాజ్యాన్ని ధనాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ప్రియమైన వారి వియోగం కూడా కాలం గడిచే కొద్దీ భరించగలిగేలా మారుతుంది. కానీ అవమానం ఒకవేళ మనసు దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటే అది చితిమంట కంటే ఘోరంగా మనిషిని జీవితాంతం దహించుకుంటూనే ఉంటుంది.
(02:47) జనకుడు తలదించుకుంటూ బరువెక్కిన గొంతుతో అన్నాడు గురుదేవా సరిగ్గా ఇదే నా అంతరంగాన్ని పీడిస్తున్న సమస్య పగటిపూట సభలో ఎవరో అన్న మాటలు చేసిన హేళన నా మనసును గుచ్చుతున్నాయి. రాత్రుళ్లు నిద్రపోయేందుకు కళ్ళు మూస్తే ఆ దృశ్యాలే మళ్ళీ మళ్ళీ నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. నాలో ఆవేశం కోపం నిస్సహాయత రగులుతున్నాయి. అసలు అవమానం జరిగినప్పుడు మనసు ఎందుకు ఇంతలా బంధి అయిపోతుంది? దీని మూలం ఎక్కడుంది? అష్టావక్రుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు.
(03:27) రాజా అవమానం అనేది బయట ఉన్న వ్యక్తి చేతుల్లో లేదు. అది నీ మనసు ఆ మాటను ఎలా స్వీకరిస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంది. మూలాన్ని అర్థం చేసుకోకుండా కేవలం గాయాన్ని తడుముకుంటే ప్రయోజనం ఉండదు. అవమానం ఎందుకు పుడుతుందో దానికి నీ మనసు ఎందుకు స్పందిస్తుందో తెలుసుకోవడానికి నాతో రా అలా చెప్పి మహర్షి అష్టావక్రుడు జనక మహారాజును తీసుకొని ఆశ్రమం వెలుపలకు నడిచాడు.
(03:53) అప్పటికే తెల్లవారు జాము మంచు కురుస్తుంది. ఆశ్రమానికి కొద్ది దూరంలో ఒక మహా మర్రి వృక్షం నిలబడి ఉంది. దాని శాఖలు ఆకాశమంత ఎత్తుకు నలుదిక్కులా వ్యాపించి వందలాది పక్షులకు ఆశ్రయం ఇస్తూ గంభీరంగా నిశ్చలంగా కులువై ఉంది. అష్టావక్రుడు ఆ చెట్టు ముందు ఆగి జనకుడి వైపు తిరిగి ఇలా అడిగాడు. రాజా ఒకవేళ ఎవరైనా వచ్చి ఈ మహా వృక్షాన్ని కఠినమైన మాటలతో దూషించినా తీవ్రంగా అవమానించినా ఈ చెట్టు బాధపడుతుందా తన కొమ్మలను నేలకేసి కొట్టుకుంటూ సోకిస్తుందా? జనకుడు ఆశ్చర్యంగా చూస్తూ లేదు గురుదేవా అదిఎలా సాధ్యం చెట్టు జడమైనది పైగా దానికి ఇతరుల
(04:38) మాటలతో పనేముంది అది ఏమీ మాట్లాడదు మౌనంగానే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. అష్టావక్రుడు మళ్ళీ చిరునవ్వుతో ప్రశ్నించాడు. సరే రాజా ఒకవేళ ఎవరైనా సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూలమాలలు వేసి నువ్వు ఈ సృష్టిలోనే అత్యంత అందమైన గొప్పదైన వృక్షానివి అని ఆకాశానికి ఎత్తేలా పొగిడితే అది సంతోషంతో పొంగిపోయి గాలిలో నాట్యం చేస్తుందా? జనకుడు మందహాసం చేస్తూ లేదు గురుదేవా తిట్టినా అది కుంగిపోదు పొగిడినా అది ఉప్పొంగదు అది ఎలా ఉండాలో అలాగే స్థిరంగా ఉంటుంది అన్నాడు అప్పుడు అష్టావక్రుడి కళ్ళల్లో ఒక దివ్యమైన మెరుపు కనిపించింది.
(05:22) ఆయన గంభీరమైన స్వరంతూ ఇలా అన్నాడు. రాజా చూశావా ఈ ప్రకృతికి ఇతరుల ధ్రువీకరణ అంటే ఎక్స్టర్నల్ వాలిడేషన్ అస్సలు అవసరం లేదు. చెట్టు తన స్వభావాన్ని పట్టుకొని జీవిస్తుంది తప్ప దారిన పోయేవారు తన గురించి ఏమనుకుంటున్నారో అనే భ్రమలో బతకదు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే బుద్ధిజీవులమైన మనుష్యులం మాత్రం మన ఆత్మశాంతిని ఇతరుల చేతుల్లో తాకట్టు పెడుతున్నాం.
(05:53) జనకుడు ఆ మాటలకు ఆశ్చర్యపోతూ వింటున్నాడు. అష్టావక్రుడు కొనసాగించాడు. ఒక చిన్న ప్రశంస వినపడగానే మనం గాలిలో తేలిపోతాం. అహంతో ఉప్పొంగిపోతాం. అదే ఎవరో ఒక చిన్న మాట అనగానే మన విలువ మొత్తం పడిపోయినట్లు అగాధంలోకి కుంగిపోతాం. అంటే నీ సుఖాన్ని నీ దుఃఖాన్ని నిర్ణయించే రిమోట్ కంట్రోల్ ను సమాజంలో ఉన్న ప్రతి మనిషి చేతికి ఇచ్చేసావు. వాడు నువ్వు మంచివాడివి అంటే నవ్వుతావు.
(06:20) నువ్వు పనికి రాని వాడివి అంటే ఏడుస్తావు. నీ ఆనందానికి నువ్వు యజమానివి కానప్పుడు నీలో ప్రశాంతత ఎలా నిలుస్తుంది రాజా జనకుడు తలదించుకున్నాడు. అష్టావక్రుడు మళ్ళీ అన్నాడు ఆత్మజ్ఞాని లక్షణం కూడా సరిగ్గా ఆ చెట్టు లాంటిదే అతడు పొగడ్తలకు గర్వపడడు నిందలకు చలించిపోడు. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం వారు ఇతరుల సర్టిఫికెట్ల మీద ఇతరుల అభిప్రాయాల ఆధారంగా తమ విలువను లెక్కించుకుంటారు.
(06:51) రెండవ రకం వారు తమ ఆత్మ స్వరూపాన్ని తమలోని నిజమైన శక్తిని గుర్తించవారు. మొదటి రకం వారు జీవితాంతం అవమానాల బానిసలుగా బ్రతుకుతారు. రెండవ రకం వారు ఈ లోకపు మాటలను చూసి కేవలం చిరునవ్వు నవ్వుకుంటూ తమ మార్గంలో ముందుకు సాగిపోతారు. ఆ మాటలు జనకుడి హృదయాన్ని బలంగా తాకాయి. కానీ అంతలోనే ఆయన మనసులో మరొక లోతైన సందేహం మొదలైంది.
(07:18) ఆయన చేతులు జోడించి ఇలా అడిగాడు. గురుదేవా వృక్షం లాగా చలించకుండా ఉండడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు కదా సమాజంలో నలుగురి మధ్య నిలబడినప్పుడు ఎవరైనా కావాలని మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఆ క్షణంలో మనసు దానంతటదే గాయపడుతుంది. ఆ మంటను ఆ భావోద్వేగాన్ని తక్షణమే ఎలా నిలువరించాలి? అష్టావక్రుడు నవ్వుతూ దానికి సమాధానం నీకు ఇప్పుడే లభిస్తుంది.
(07:48) రాజా అటు చూడు అంటూ ఆశ్రమం వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఒక కోపిష్టి యువకుడి వైపు చూపించాడు. ఆశ్రమ ముంగిట్లోకి ఒక యువకుడు వేగంగా దూసుకు వచ్చాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. శ్వాస వేగంగా ఆడుతోంది. ముఖమంతా తీవ్రమైన క్రోధంతో నిండిపోయింది. అతడు నేరుగా అష్టావక్ర మహర్షి ముందుకు వచ్చి నిలబడి ఆవేశంతో రగిలిపోతూ ఇలా అరవసాగాడు. ఓ మునీశ్వర నీ శిష్యులలో ఒకడు నగర చౌరస్థాలో అందరి ముందు నన్ను అవమానించాడు.
(08:19) నన్ను పనికి రాని వాడిగా చిత్రీకరించాడు. నా పరువును మట్టిలో కలిపాడు. నేను అతన్ని ఎప్పటికీ క్షమించను. దీనికి బదులు తీర్చుకోకపోతే నా రక్తం సలసలా మరిగిపోతుంది. ఆ యువకుడి అరుపులకు అక్కడున్న పక్షులు సైతం భయపడి ఎగిరిపోయాయి. జనక మహారాజు ఆశ్చర్యంగా ఆ యువకుడి వంక ఆపై అష్టావక్రుని వంక చూశాడు. కానీ అష్టావక్రుడి ముఖంలో ఎలాంటి అలజడి లేదు.
(08:46) ఒక నిశ్చలమైన సరస్సుల ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. యువకుడు కాసేపు ఆవేశంతో ఊగిపోయిన తర్వాత అష్టావక్రుడు ఎంతో నెమ్మదైన మధురమైన స్వరంతో ఒక సాధారణమైన ప్రశ్న అడిగాడు. నాయనా ఒక చిన్న విషయం చెప్పు ఒకవేళ ఎవరైనా ఒక అందమైన కానుకను ఒక బహుమతిని నీ చేతికి ఇవ్వడానికి తెచ్చారనుకో కానీ నువ్వు దానిని తీసుకోకుండా చేతులు వెనక్కి పెట్టుకొని తిరస్కరించావు.
(09:16) ఇప్పుడు చెప్పు ఆ బహుమతి ఎవరి వద్ద ఉంటుంది? ఆ ప్రశ్న వినగానే ఆ యువకుడు ఒక్క క్షణం ఆగిపోయాడు. అసందర్భంగా అడిగిన ప్రశ్నలా అనిపించినా అతడు చిరాకుగా బదిలిచ్చాడు. అదేం విచిత్రమైన ప్రశ్న గురుదేవా నేను ఆ బహుమతిని స్వీకరించనప్పుడు అది ఎవరైతే తెచ్చారో వాళ్ళ చేతుల్లోనే మిగిలిపోతుంది. అందులో ఆలోచించడానికి ఏముంది? అప్పుడు అష్టావక్రుడి పెదవులపై ఒక జ్ఞానోదయమైన చిరునవ్వు మెరిసింది.
(09:44) ఆయన జనకుడి వైపు ఆపై ఆ యువకుడి వైపు చూస్తూ గంభీరంగా ఇలా అన్నాడు. సరిగ్గా ఇదే సూత్రం అవమానానికి కూడా వర్తిస్తుంది. ఎవరైనా నీ పైకి నిందలు విసిరినా అసభ్యకరమైన పదాలతో దూషించినా ఆ మాటలు ఒక చేదు బహుమతి లాంటివి. నువ్వు ఆ మాటలను నీ మనసులోకి తీసుకోకుండా నీ హృదయంలోకి ఆహ్వానించకుండా నిశ్చలంగా వదిలేస్తే ఆ అవమానం ఎవరిది అవుతుంది? ఆ ద్వేషం ఆ అశాంతి ఆ పాపం ఎవరైతే ఇచ్చారో వారి వద్దే ఉండిపోతాయి కదా యువకుడు ఒక్కసారిగా [సంగీతం] నిశ్చేష్టుడయ్యాడు.
(10:21) అతని ఆవేశం అంతా గాలిలో కలిసిపోయినట్లు అయిపోయింది. జనక మహారాజు కూడా తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. అష్టావక్రుడు కొనసాగించాడు. ఒకరు నీకు విషం తెచ్చి ఇస్తే నువ్వు దానిని తాగుతావా తాగవు కదా మరి ఎవరో విసిరిన విషపూరితమైన మాటలను నీ చెవుల ద్వారా మనసులోకి ఎందుకు తాగుతున్నావు ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నువ్వు కూడా కోపంతో ఊగిపోతే నువ్వు ఆ బహుమతిని స్వీకరించినట్టే లెక్క వారు విసిరిన బురదను నీ చేతులతో పట్టుకొని నీ శరీరంపై పూసుకున్నట్టే లెక్క ఆ క్షణం నువ్వు గాయపడేది వారి మాటల వల్ల కాదు ఆ మాటలను నీ సొంతం చేసుకున్న నీ అజ్ఞానం వల్ల ఆ యువకుడు మహర్షి మాటల అంతరార్థాన్ని
(11:03) గ్రహించి శాంతించిన హృదయంతో చేతులు జోడించి అక్కడి నుండి నిష్క్రమించాడు. జనక మహారాజు మాత్రం ఇంకా ఆలోచనల్లోనే మునిగిపోయి ఉన్నాడు. ఆయన అష్టావక్రుడి వైపు చూస్తూ వినయంగా ఇలా అడిగాడు. గురుదేవా బహుమతిని తిరస్కరించినట్లే అవమానాన్ని కూడా తిరస్కరించవచ్చని అర్థమైంది కానీ అసలు మనుషులు మరొకరిని ఎందుకు అవమానిస్తారు ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వారి కళ్ళల్లో కన్నీళ్లు చూడటంలో వారికి దొరికే ఆనందం ఏమిటి? అష్టావక్ర మహర్షి చిరునవ్వు నవ్వి మానవ అంతరంగాన్ని విశ్లేషించే ఒక లోతైన మానసిక సత్యాన్ని వివరించడం మొదలుపెట్టాడు. రాజా ఈ సృష్టిలో ఒక
(11:46) ప్రాథమిక నియమం ఉంది. ఎవరి పాత్రలో ఏది నిండి ఉంటుందో వారు బయటకు అదే వలకబోస్తారు. అమృతం నిండిన పాత్ర నుండి అమృతమే జాలు వారుతుంది. విషం నిండిన పాత్ర నుండి విషమే బయటకు వస్తుంది. అదేవిధంగా ఒక మనిషి లోపల శాంతి, సంతృప్తి, ఆనందం ఉంటే అతడు ఇతరులకు ప్రేమను గౌరవాన్ని పంచుతాడు. ఎవరి లోపలైతే అశాంతి అసూయ వైఫల్యం అభద్రతా భావం గూడుకట్టుకొని ఉంటాయో వారు ఇతరులపై నిరంతరం కోపాన్ని ద్వేషాన్ని చిమ్ముతుంటారు.
(12:21) జనకుడు ఆశ్చర్యంగా వింటుండగా అష్టావక్రుడు కొనసాగించాడు. ఈ ప్రపంచంలో చాలా మంది ప్రజలు తమ అంతర్గత పోరాటాన్ని తమ లోపలి దుఃఖాన్ని మరొకరిపై రుద్దుతారు. నిజానికి వారు నీతో పోరాడడం లేదు. వారి లోపల రగిలే అగ్నితో వారు పోరాడుతున్నారు. తమ సొంత జీవితాల్లో విఫలమైన వారు తమను తాము ప్రేమించుకోలేని వారు ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి ఓర్వలేక అవమానం అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారు.
(12:49) ఎదుటివాడిని కించపరిచి తక్కువ చేసి మాట్లాడితే తామేదో ఉన్నతమైన స్థానంలో ఉన్నామనే ఒక భ్రమ తాత్కాలికమైన అహంకార తృప్తి వారికి కలుగుతుంది. అప్పుడు అష్టావక్రుడు జనకుడి భుజంపై చెయ్యి వేసి ఇలా అన్నాడు. కాబట్టి రాజా ఒక వ్యక్తి నిన్ను అవమానించాడంటే అది నీ విలువను ఏమాత్రం నిర్ణయించదు. అదినూటికినూ శాతం ఆ వ్యక్తి యొక్క మానసిక సంస్కారాన్ని అతని లోపలి దరిద్రాన్ని మాత్రమే తెలియజేస్తుంది.
(13:16) రోడ్డు పక్కన పడి ఉన్న మురికి గుంట తన స్వభావంతో బట్టి దుర్వాసన వెదజల్లుతుంది. దానికి నువ్వెందుకు కుంగిపోవాలి? ఆ మురికి నువ్వెందుకు బాధ్యత వహించాలి? ఈ మాటలు విన్న జనకుడికి ఒక గొప్ప ఉపశమనం కలిగింది. కానీ ఆయన బుద్ధిలో మరో ధర్మ సందేహం తలెత్తింది. గురుదేవా అవమానించే వ్యక్తి బలహీనుడే కావచ్చు అతని మాటలు అతని అంతరంగానికి అద్దం పట్టవచ్చు కానీ ఆ అవమానాన్ని చూస్తూ మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలా.
(13:45) ప్రతిదానిని భరిస్తూ లోపల కుమిలిపోతూ మౌనంగా ఉండడమే ధర్మమా? అలా ఉంటే ఎదుటివారు మనల్ని చేతకాని వారిగా అసమర్థులుగా భావించరా అన్యాయాన్ని ఎదిరించడం తప్ప అష్టావక్రుడి కళ్ళల్లో ఒక తీక్షణమైన చూపు మెరిసింది. ఆయన ముఖం మరింత గంభీరంగా మారింది. రాజా సహించడం వేరు స్వీకరించడం వేరు అన్యాయాన్ని ఎదిరించడం వేరు ఆవేశంతో దిగజారడం వేరు మౌనం ఎప్పుడు సమాధానం కావాలి. ప్రతిఘటన ఎప్పుడు ఆయుధం కావాలి.
(14:16) దీని వెనక ఒక అద్భుతమైన నియమం దాగి ఉంది అంటూ అష్టావక్రుడు ఆశ్రమం లోపలికి అడుగులు వేశడు. మరుసటి ఉదయం ఆశ్రమం నిశశబ్దంగా ఉంది. జనక మహారాజు ముందురోజు రాత్రి అష్టావక్రుడు చెప్పిన మాటలను నెమరు వేసుకుంటూ కూర్చున్నాడు. అష్టావక్రుడు నవ్వుతూ జనకుడి చెంతకు వచ్చి ఇలా అడిగాడు. రాజా ఒక వ్యక్తి మెడలోతు బురద గుంటలో నిలబడి ఉన్నాడనుకో అతడు నిన్ను చూసి ధైర్యం ఉంటే నా దగ్గరకు రా నాతో యుద్ధం చేయి అని సవాలు విసిరితే నువ్వు కూడా నీ రాజవస్త్రాలను విడిచిపెట్టి ఆ బురదలోకి దూకుతావా జనకుడు క్షణం కూడా ఆలోచించకుండా లేదు గురుదేవా నేనుఎందుకు బురదలోకి
(15:02) దిగుతాను ఒకవేళ నేను దిగితే వాడి శరీరం మీద ఉన్న దుర్వాసన మలినమే నా శరీరం అంతటా అంటుకుంటుంది. వాడి స్థాయికి దిగజారడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉన్నదు అని బదులిచ్చాడు. అష్టావక్రుడు గంభీరంగా తల ఊపుతూ ఇలా అన్నాడు. సరిగ్గా ఇదే మొదటి నియమం రాజా సమాజంలో ఎవరైనా నిన్ను అవమానించి నీ స్థాయిని దిగజార్చాలని చూసినప్పుడు వారి ఆహ్వానాన్ని తిరస్కరించడమే నీ అసలైన విజయం.
(15:34) ఒక మూర్ఖుడు కోపంతో అరిచినప్పుడు నువ్వు కూడా అదే స్థాయిలో అరిస్తే మీ ఇద్దరి మధ్య తేడా ఏముంటుంది వాడి లక్ష్యం నిన్ను కూడా బురదలోకి లాగడమే నువ్వు స్పందించి బదులిస్తే వాడి ఉద్దేశాన్ని నువ్వే స్వయంగా నెరవేర్చిన వాడివ అవుతావు. సరిగ్గా అదే సమయంలో ఆశ్రమంలో ఒక పెద్ద అలజడి రేగింది. ఒక శిష్యుడు వణకిపోతూ పరిగెత్తుకు వచ్చాడు.
(16:02) గురుదేవా నగరానికి చెందిన ఒక ధనిక వ్యాపారి ఆశ్రమం గేటు వద్ద నిలబడి మీ గురించి అత్యంత నీచంగా మాట్లాడుతున్నాడు. మీరు దొంగ గురువని జ్ఞానం ముసుగులో మోసం చేస్తున్నారని కేకలు వేస్తున్నాడు అని చెప్పాడు. జనకుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు గురుదేవా అనుమతిస్తే నా సైనికులను పంపి వాడి నాలుక కోయిస్తాను అన్నాడు.
(16:26) కానీ అష్టావక్రుడు ప్రశాంతంగా ఆగు రాజా వేచి చూడు అని సైగ చేశాడు. కొద్ది క్షణాల్లోనే ఆ వ్యాపారి ఆశ్రమ ప్రాంగణంలోకి దూసుకు వచ్చాడు. అతని కళ్ళు నెప్పులు చిరుగుతున్నాయి. అతడు అష్టావక్రుడి ముఖం మీదే అసభ్య పదజాలంతో విరుచుకు పడ్డాడు. నువ్వు నిజంగా జ్ఞానివైతే నాతో వాదించు సమాధానం చెప్పలేకపోతే నీ బూటకపు సన్యాసాన్ని వదిలేయ్ అని రంకెలు వేశడు.
(16:51) శిష్యులు ఆవేశంతో ముందుకు రాబోయారు [సంగీతం] కానీ అష్టావక్రుడు చేతులెత్తి వారిని నిలువరించాడు. ఆయన ముఖంలో కోపం లేదు భయం లేదు కేవలం ఒక దివ్యమైన కరుణ మాత్రమే ఉంది. అష్టావక్రుడు ఆ వ్యాపారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిశ్చల స్వరంతో ఒక ఒక్క మాట అన్నాడు. నాయనా నీ లోపల రగులుతున్న తుఫాను శాంతించిన తర్వాత రా ఇప్పుడు నువ్వు సత్యాన్ని వినడానికి సిద్ధంగా లేవు.
(17:18) నీ కోపం గొంతును మాత్రమే నువ్వు వింటున్నావు. ఆ వ్యాపారి ఇంకా ఏదో అరవబోయి అష్టావక్రుడి నిశ్చలతను తట్టుకోలేక విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జనకుడు ఆశ్చర్యపోయి గురుదేవా ఇంతటి దుర్మార్గాన్ని చూస్తూ కూడా మౌనంగా ఉండడం ఎలా సాధ్యం అని అడిగాడు. అష్టావక్రుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు వినడానికి రాని వ్యక్తికి నచ్చ చెప్పడం సమయాన్ని వృధా చేసుకోవడం రాజా కొన్ని రోజుల తర్వాత ఫలితం చూడు కొన్ని రోజులు గడిచాయి అదే వ్యాపారి మళ్ళీ వచ్చాడు కానీ ఈసారి అతని తల వంగి ఉంది.
(17:55) కళ్ళల్లో పశ్చాత్తాపం కన్నీరై కారుతోంది. అతడు అష్టావక్రుడి పాదాలపై పడి గురుదేవా ఆ రోజు వ్యాపారంలో సర్వస్వం పోగొట్టుకొని పిచ్చివాడినై మీపై కోపం చూపించాను. మీరు నన్ను కొట్టినా బాగుండేది కానీ మీ మౌనం నన్ను నిలువున దహనం వేసింది. నా తప్పును తెలుసుకునేలా చేసింది అని వేడుకున్నాడు. అష్టవక్రుడు అతన్ని లేవనెత్తి [సంగీతం] కౌగిలించుకున్నాడు.
(18:22) తర్వాత జనకుడి వైపు చూసి ఇలా అన్నాడు. చూసావా రాజా ఆ రోజు నేను కూడా వాడితో గొడవపడి ఉంటే ఒక శత్రువు తయారయ్యేవాడు కానీ నా వివేకవంతమైన మౌనం వాడిలో పశ్చాత్తాపాన్ని నింపింది. కోపానికి కోపం ఎన్నడూ సమాధానం కాదు. వ్యాపారి పశ్చాత్తాపంతో వెళ్ళిపోవడం చూసిన జనక మహారాజుకు మౌనం యొక్క గొప్పతనం అర్థమైంది. కానీ ఆయన అంతరంగంలో మరొక తీవ్రమైన సందేహం మొదలైంది.
(18:50) ఆయన అష్టావక్రుని వైపు చూస్తూ వినయంగా ఇలా అన్నాడు. గురుదేవా కోపంలో ఉన్న వ్యక్తి ముందు మౌనంగా ఉండటం సరైనదే కానీ ఒక వ్యక్తి కావాలనే పదే పదే మనల్ని అవమానిస్తుంటే మన బలహీనతను ఆసరాగా చేసుకుని నిరంతరం కించపరుస్తుంటే అప్పుడు కూడా మౌనంగా భరిస్తూ ఉండటం పిరికితనం అనిపించుకోదా అలాంటి వారితో ఎలా వ్యవహరించాలి ఈసారి అష్టావక్రుడి ముఖం అత్యంత గంభీరంగా మారింది.
(19:20) ఆయన జనకుడిని తీసుకొని ఆశ్రమానికి ఆనుకొని ఉన్న దట్టమైన అడవి వైపు నడిచాడు. అక్కడ ఒక ఎండిపోయిన మహావృక్షం ఉంది. పెనుగాలులు వీచినప్పుడల్లా ఆ చెట్టుకు ఉన్న బరువైన ఎండిన కొమ్మ ఒకటి పదే పదే విరిగి కింద పడుతుంది. అష్టావక్రుడు ఆ చెట్టుని చూపుతూ ఇలా అడిగాడు రాజా ఆ ఎండిన కొమ్మ పదే పదే నీ తలమీద పడుతూ నిన్ను గాయపరుస్తుంటే నువ్వు ప్రతిసారి దాన్ని క్షమిస్తూ అదే చెట్టు కింద నిలబడి ఉంటావా దానికి జనకుడు వెంటనే లేదు గురుదేవా మొదటిసారి అది ప్రమాదం కావచ్చు కానీ పదే పదే కొమ్మ పడుతుంటే అక్కడే నిలబడటం మూర్ఖత్వం నేను వెంటనే ఆ ప్రదేశం నుండి తప్పుకుంటాను. ఆ
(20:01) చెట్టుకు దూరంగా జరుగుతాను అని [సంగీతం] బదులిచ్చాడు. అష్టావక్రుడి కళ్ళల్లో మెరుపు కనిపించింది. ఆయన ఇలా అన్నాడు రాజా సరిగ్గా ఇదే రెండవ నియమం పదే పదే నిన్ను అవమానిస్తూ నీ ఆత్మ గౌరవాన్ని కాలరాస్తూ ఎప్పటికీ మారడానికి ఇష్టపడని వ్యక్తిని దూరంగా జరగటం బలహీనత కాదు అది పరమ వివేకం. మన మనశశాంతిని కాపాడుకోవడానికి జీవితంలో కొన్ని దృఢమైన సరిహద్దులు అంటే హెల్దీ బౌండరీస్ గీసుకోవడం ఎంతో అవసరం.
(20:34) ఆ సమయంలో ఒక వృద్ధ సాధువు అక్కడికి వచ్చాడు. ఆయన అష్టావక్రుడికి నమస్కరించి బరువెక్కిన హృదయంతో ఇలా అన్నాడు. గురుదేవా ఎన్నో ఏళ్ల క్రితం నా ప్రాణ స్నేహితుడు నన్ను నమ్మించి తీవ్రంగా మోసం చేశాడు. నా గౌరవాన్ని మట్టిలో కలిపాడు. నేను అతన్ని మనస్ఫూర్తిగా క్షమించాను. కానీ ఈనాటికి నేను అతనితో మాట్లాడటం లేదు అతనికి దూరంగా ఉంటున్నాను.
(21:00) క్షమించిన తర్వాత కూడా దూరం పెట్టడం పాపమా గురుదేవా అష్టావక్రుడు ఆ వృద్ధుని భుజం [సంగీతం] తట్టి వాత్సల్యంతో నవ్వి ఇలా అన్నాడు నాయనా నువ్వు చేస్తున్నది ఏమాత్రం తప్పు కాదు క్షమించడం అంటే నువ్వు పదే పదే అదే విషాన్ని తాగుతూ ఉండాలని కాదు విష సర్పం మీద మనసులో ఎలాంటి ద్వేషం పెంచుకోకు కానీ అంతమాత్రాన దాన్ని తెచ్చి నీ మెడలో వేసుకోలేవు కదా దాని కాటు నుండి తప్పించుకోవడానికి దూరం పాటించడమే ధర్మం.
(21:30) ఆ మాటలు విన్న జనకుడు చలించిపోయాడు. అష్టావక్రుడు జనకుడి వైపు తిరిగి ఇలా వివరించాడు. రాజా నీకు ఈ లోకంలో మూడు రకాల మనుషులు ఎదురవుతారు. మొదటి రకం వారు అజ్ఞానంతో పొరపాటున నిన్ను నొప్పించేవారు వారికి నచ్చ చెప్పండి. రెండవ రకం వారు క్షణిక ఆవేశంలో అవమానించి తరువాత పశ్చాత్తాప పడేవారు వారిని పెద్ద మనసుతో క్షమించండి.
(21:55) ఇక మూడవ రకం వారు అహంకారంతో కావాలనే పదే పదే నిన్ను కించపరిచేవారు వారి పట్ల ద్వేషం పెంచుకోకండి కానీ గౌరవప్రదంగా వారి జీవితాల నుండి వైదొలగండి. ఇదే అసలైన ఆత్మగౌరవం. అప్పుడు జనకుడు వినయంగా గురుదేవా ఒకవేళ ఆ అవమానించే వ్యక్తి మన కుటుంబ సభ్యుడే అయితే రక్త సంబంధీకుడే అయితే అప్పుడు ఏం చేయాలి? కుటుంబ సభ్యుల నుంచి ఎదురయ్యే అవమానాల గురించి జనకుడు అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు కొద్ది క్షణాలు నిశశబ్దంగా ఉండిపోయాడు.
(22:27) ఆయన ముఖంలో కరుణతో కూడిన గాంభీర్యం మరింత దట్టమైంది. ఆయన ఇలా అన్నాడు రాజా రక్త సంబంధం గౌరవనీయమైనదే కానీ సత్యం ఆత్మగౌరవం అంతకంటే ఉన్నతమైనవి. ఎక్కడైతే గౌరవం నశించి నిరంతరం అవమానాలు ఎదురవుతుంటాయో అక్కడ ప్రేమ కూడా నెమ్మదిగా కనుమరుగవుతుంది. ద్వేషం బంధిస్తుంది. కానీ ఆరోగ్యకరమైన దూరం ప్రశాంతతను కాపాడుతుంది. అప్పుడు జనకుడు నిట్టూరుస్తూ గురుదేవా వ్యక్తుల నుండి వచ్చే అవమానాలను ఏదోలా తట్టుకోవచ్చు.
(23:01) కానీ సమాజం మొత్తం మనల్ని చూసి నవ్వితే విధి మనల్ని నేలకేసి కొడుతుంటే ప్రతివైపు నుండి వైఫల్యమే ఎదురై జనం మనల్ని చూసి హేళన చేస్తుంటే ఆ గుండె కోతని ఎలా తట్టుకోవాలి అప్పుడు మనసును ఎలా నిబ్బరంగా ఉంచుకోవాలి అని అడిగాడు. అష్టావక్రుడు జనకుడి వైపు ఎంతో లోతుగా చూసి ఇలా అన్నాడు. రాజా ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ రోజు నా జీవితంలో జరిగిన ఒక పరమ చేదు సత్యాన్ని నీకు చెబుతాను.
(23:28) శ్రద్ధగా విను నేను బాలుడిగా ఉన్నప్పుడు నా శరీరం ఎనిమిది చోట్ల వంకర్లు తిరిగి ఉండేది. నన్ను చూసి తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు వీధిలో నడుస్తుంటే జనం వింత జంతువును చూసినట్లు చూసి పకపక నవ్వేవారు. పెద్దలు జాలిగా చూస్తూ వీడి జన్మ వృధ అనేవారు. నా లోపల ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఎవరూ చూడలేదు. అందరూ కేవలం నా వంకర్లు తిరిగిన చర్మం మాంసాన్ని మాత్రమే చూశారు.
(23:57) జనకుడి గుండె కరిగిపోయింది. అష్టావక్రుడు కొనసాగించాడు. ఒకరోజు మిథిలా నగరంలోనే మహా పండితులు కొలువైన ఒక గొప్ప శాస్త్రార్థ సభకు నేను వెళ్ళాను. సభా మందిరంలోకి నా వికారమైన శరీరంతో అడుగు పెట్టగానే అక్కడున్న పండితులంతా ఒక్కసారిగా నన్ను చూసి వికటాట్టహాసం చేశారు. ఈ వంకర్ల బాలుడు మనకేం జ్ఞానం బోధిస్తాడు ముందు వీడి శరీరాన్ని చక్కదిద్దుకోమను అంటూ సభంతా పరిహాసాలతో మారుమోగింది.
(24:27) జనకుడు ఆవేదనతో గురుదేవా ఆ క్షణంలో మీకు ఎంతటి తీవ్రమైన ఆవేశం అవమానం కలిగి ఉండాలి అప్పుడు మీరు ఏం చేశారు అని అడిగాడు. అష్టావక్రుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి రాజా వారు నన్ను చూసి నవ్వుతుంటే నేను కూడా వారిని చూసి గట్టిగా నవ్వాను అన్నాడు. జనకుడు దిగ్భ్రాంతి చెంది మీరు కూడా నవ్వారా ఆ అవమానానికి బదులుగా నవ్వారా అని ఆశ్చర్యపోయాడు.
(24:54) అష్టావక్రుడు గంభీర స్వరంతో ఇలా అన్నాడు. అవును రాజా ఎందుకంటే అక్కడ కూర్చున్నవారు పండితులు కారని కేవలం తోలును మాత్రమే గుర్తించే చెప్పులు కుట్టే చర్మకారులని ఆ క్షణంలో నాకు అర్థమయింది. శరీరం అనే చర్మాన్ని చూసి నా విలువను నిర్ణయించే అజ్ఞానుల మాటలకు నా లోపల ఉన్న దివ్యమైన ఆత్మ ఎందుకు బాధపడాలి ఇతరుల అభిప్రాయాలతో నా విలువను నిర్ణయించుకోవడం ఏ రోజైతే నేను మానేశానో ఆ రోజే నేను అంతర్గతంగా సంపూర్ణ స్వతంత్రునయ్యాను అష్టావక్రుడు జనకుడి కళ్ళల్లోకి చూస్తూ ముగించాడు రాజా నిన్ను నువ్వు ఒక శరీరంగా ఒక పదవిగా ఒక పేరుగా మాత్రమే చూసుకున్నంత కాలం ఈ సమాజపు మాటలు
(25:37) నిన్ను గాయపరుస్తూనే ఉంటాయి. నీలోని అనంతమైన ఆత్మతత్వాన్ని గుర్తించిననాడు ప్రపంచం విసిరే ఏ రాయి నిన్ను తాకదు. అష్టావక్రుడి ఆత్మతత్వ బోధనతో జనక మహారాజు అంతరంగంలో సరికొత్త కాంతి పుట్టింది. అయినప్పటికీ మానవ సహజమైన మరొక తీవ్రమైన చిక్కుముడి ఆయనను వేధించసాగింది. జనకుడు చేతులు జోడించి వినమ్రంగా ఇలా అన్నాడు.
(26:08) గురుదేవా వివేకంతో ఎదుటివారిని క్షమించడం సాధ్యమే అనిపిస్తోంది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి ఎప్పుడో పదఏళ్ల క్రితం ఎవరో అన్న కఠినమైన మాటలు చేసిన అవమానాలు అకస్మాత్తుగా గుర్తొచ్చి మనసును మెలిపెట్టేస్తాయి. నేను పైకి వారిని క్షమించినా లోలోపల ఆ సంఘటనలు నన్ను ఎందుకు వీటడం లేదు ఆ పాత గాయాల బాధ నుంచి విముక్తి ఎలా పొండాలి? అష్టావక్రుడు మౌనంగా నవ్వి ఆశ్రమం అరుగుపై ఉన్న ఒక మట్టి కుండ వైపు నడిచాడు.
(26:42) అందులో స్వచ్ఛమైన నిర్మలమైన నీరు ఉంది. ఆ కుండ పక్కనే పుయ్య నుండి తెచ్చిన గుప్పెడు నల్లటి బూడిద ఉంది. అష్టావక్రుడు ఆ బూడిదను తీసుకొని ఒక్కసారిగా ఆ స్వచ్ఛమైన నీటిలో వేసి తన చేతితో గట్టిగా కలపడం మొదలు పెట్టారు. క్షణాల్లో ఆ కుండలోని నీరంతా నల్లగా బురదమయంగా మారిపోయింది. అష్టావక్రుడు జనకుడి వైపు తిరిగి ఇలా అడిగాడు.
(27:11) రాజా ఈ నీరు పూర్వంలా మళ్ళీ స్వచ్ఛంగా నిర్మలంగా మారాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం నేను ఈ నీటిని నిరంతరం నా చేతితో వేగంగా కలుపుతూనే ఉంటే ఇది ఎప్పటికైనా తేరుకుంటుందా? జనకుడు ఆశ్చర్యంగా చూస్తూ అదెలా సాధ్యం గురుదేవా మీరు ఆ నీటిని పదే పదే కలుపుతున్నంత కాలం ఆ బూడిద కణాలు పైపైనే తిరుగుతూ నీటిని మరింత మురికిగా మారుస్తాయి తప్ప అది ఎప్పటికీ శుభ్రపడదు.
(27:38) ఆ కుండను ఎవరూ తాకకుండా నిశ్చలంగా కొంతసేపు వదిలేస్తేనే ఆ బూడిదంతా నెమ్మదిగా అడుగుకు చేరుకుంటుంది. అప్పుడు పైనున్న [సంగీతం] నీరు దానంతరా అదే స్వచ్ఛంగా మారుతుంది అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడి గొంతులో ఒక దివ్యమైన సత్యం ప్రతిధ్వనించింది. సరిగ్గా ఇదే మనసు యొక్క రహస్యం రాజా ఆ కుండలోని మీరే నీ మనసు ఆ బూడిదే ఇతరులు చేసిన అవమానం నువ్వు ఆ అవమానాన్ని మరిచిపోవాలని [సంగీతం] అనుకోవట్లేదు.
(28:11) రాత్రి వేళల్లో నిద్రపోకుండా వాడు నన్ను ఎందుకలా అన్నాడు నేను వాడికి ఏం అన్యాయం చేశాను అంటూ నీ ఆలోచనలతో ఆ గాయాన్ని పదే పదే కెలికి కదిలిస్తూనే ఉన్నావు. అందుకే ఆ గాయం ఎప్పటికీ మానకుండా పచ్చిగానే ఉంటోంది. జనకుడు నిశ్చేష్టుడై వింటున్నాడు. అష్టావక్రుడు మరింత లోతుగా విశ్లేషిస్తూ ఇలా అన్నాడు. సమయం గాయాలను మానపదు రాజా మనసు ఆ గాయాన్ని మళ్ళీ మళ్ళీ కెలికి చూడడం ఆపినప్పుడే అది మానుతుంది.
(28:42) ఎదుటివాడు నిన్ను జీవితంలో ఒక్కసారే అవమానించాడు. కానీ ఆ సంఘటనను నీ మనసులో వేలసార్లు నెమరు వేసుకుంటూ నిన్ను నువ్వే వేలసార్లు నిలువున హింసించుకుంటున్నావు. నీ బాధకు మూలం వాడు అన్న ఒక్క మాట కాదు ఆ మాటను పట్టుకొని నీ మనసు నిరంతరం రాసుకుంటున్న సుదీర్ఘమైన కథ. ఈ మాటలు వినగానే జనకుడి భుజాలపై ఉన్న పెద్ద భారం ఒక్కసారిగా దిగిపోయినట్లు అనిపించింది.
(29:12) గతాన్ని నిశ్చలంగా వదిలేయడమే నిజమైన క్షమాపణ అని ఆయనకు సంపూర్ణంగా బోధపడింది. కానీ అంతలోనే జీవితంలో ఎదిగే కొద్దీ సమాజం చేసే ఎగతాళిని ఎలా తట్టుకోవాలి? జనక మహారాజు మనసు కుండలోని తేరుకున్న నీరులా ప్రశాంతంగా మారడం ప్రారంభించింది. కానీ భవిష్యత్తులో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ మార్గాన్ని తెలుసుకోవాలని ఆయన ఆశించాడు.
(29:41) ఆయన అష్టావకృడితో ఇలా అన్నాడు. గురుదేవా గతాన్ని వదిలేయడం తెలిసింది కానీ జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు మనం ఇంకా ఏ విజయము సాధించని ప్రారంభ దశలో ఉన్నప్పుడు సమాజం మన నిస్సహాయతలు చూసి హేళన చేస్తుంది. మన కష్టాన్ని గుర్తించకుండా నువ్వు దేనికి పనికి రావు అని తీర్పులిస్తుంది. ఆ నిరాశను ఎలా అధిగమించాలి? అష్టవక్రుడు చిరునవ్వు నవ్వి జనకుడిని ఆశ్రమం వెనక భాగంలో ఉన్న ఒక పచ్చని తోట వైపు నడిపించాడు.
(30:14) అక్కడ ఒక చిన్న వెదురు మొక్క నేల నుండి అప్పుడే మొలకెత్తుటూ కనిపించింది. అష్టావక్రుడు ఆ మొక్కను చూపిస్తూ ఇలా అడిగాడు. రాజా చైనా వెదురు మొక్క స్వభావం గురించి నీకు తెలుసా దాని విత్తనాన్ని భూమిలో నాటిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాల పాటు నేలపై ఒక్క ఆకు కూడా కనిపించదు. రోజు నీరు పోసి ఎరువు వేసినా అది పైకి ఎదగదు. దారిన పోయేవారు ఈ విత్తనం చచ్చిపోయింది ఈ రైతు శ్రమంతా వృధా అని పరిహసిస్తూ నవ్వుతారు.
(30:43) కానీ ఐదవ సంవత్సరం రాగానే కేవలం ఆరు వారాల వ్యవధిలోనే అది ఏకంగా 90 అడుగుల ఎత్తుకు ఆకాశాన్ని తాకేలా ఎదుగుతుంది. జనకుడు ఆశ్చర్యంగా వింటుండగా అష్టావక్రుడు గంభీర స్వరంతో కొనసాగించాడు. రాజా ఆ మొదటి నాలుగు సంవత్సరాలు వెదురు నిద్రపోలేదు రాజా అది భూమి లోపల తన వేర్లను వందలాది అడుగుల మేర బలంగా విస్తరిస్తూ పునాదిని నిర్మించుకుంది.
(31:10) మనిషి ఎదుగుదల కూడా సరిగ్గా అలాంటిదే నువ్వు కష్టపడుతున్నప్పుడు జనం చేసే ఎగతాళిని చూసి భయపడకు. వారి దృష్టికి నీ ప్రస్తుత నిస్సహాయత మాత్రమే కనిపిస్తుంది కానీ నీ అంతరంగంలో బలపడుతున్న సంకల్పపు వేర్లు కనిపించవు. వారి మాటలు నీ భవిష్యత్తును మార్చలేవు నీ కర్మ నీ సాధన మాత్రమే నీ చరిత్రను రచిస్తాయి. ఆ తర్వాత అష్టావక్రుడు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అవమానాన్నైనా క్షణంలో తుత్తునీయలు చేయగల ఒక అద్భుతమైన మూడు ప్రశ్నల సూత్రాన్ని ఉపదేశించాడు.
(31:44) రాజా ఇకపై జీవితంలో ఏ వ్యక్తి అయినా నిన్ను అవమానించినప్పుడు వెంటనే ఆవేశపడకుండా నీ అంతరంగంలో ఈ మూడు ప్రశ్నలు వేసుకో మొదటి ప్రశ్న వాడన్న మాటల్లో ఏదైనా నిజం ఉందా? ఒకవేళ నిజమే అయితే వాడు నీ శత్రువు కాదు నీలోని లోపాన్ని ఉచితంగా ఎత్తి చూపిన గురువు ఆ తప్పును వెంటనే సరిదిద్దుకో కృతజ్ఞతతో ముందుకు సాగు. రెండవ ప్రశ్న వాడి మాటల్లో ఏమాత్రం నిజం లేదా అది పచ్చి అబద్ధమా ఒకవేళ అది అబద్ధమే అయితే లేని తప్పుకు అవాస్తవానికి నువ్వు ఎందుకు బాధపడాలి నిప్పు లేనిదే పొగరాదు అనేది లోకోక్తి కావచ్చు కానీ అసూయ ఉన్నచోట లేని నిప్పును కూడా సృష్టిస్తారు. ఆ అబద్ధపు మాటలను
(32:26) గాలికి వదిలాయి. మూడవ ప్రశ్న నన్ను నిందించిన ఈ వ్యక్తి నా జీవితానికి ఆదర్శ ప్రాయుడా? నా మార్గదర్శకుడా నా శ్రేయోభిలాష? ఈ ప్రశ్నకు సమాధానం కాదు అని వస్తే నీ బ్రతుకుతో ఏ సంబంధము లేని ఒక పనికిరాని మనిషి మాటలకు నీ అమూల్యమైన మనశశాంతిని ఎందుకు బలి చేస్తావు? ఈ మూడు ప్రశ్నల వివేకం జనకుడి హృదయంలోకి ఒక బాణంలా దిగిపోయింది.
(32:51) అష్టావక్ర మహర్షి చెప్పిన ఆ మూడు ప్రశ్నల సూత్రం జనక మహారాజు అంతరంగాన్ని పూర్తిగా కడిగివేసింది. ఆయన హృదయంలో ఏనాడు లేని ఒక అనిర్వచనీయమైన కాంతి గంభీరమైన నిశ్చలత అలముకున్నాయి. ఆయన నిలబడి ఉన్న నేల ఒక్కటే అయినా ఆయన లోపలి చేతన మాత్రం సమస్త భయాలు సంకోచాలు అవమానాల పరిమితులను దాటి ఆకాశమంత విశాలంగా విస్తరించింది. జనకుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి అష్టావక్రుని పాదాలపై సాష్టాంగ ప్రణామం చేశాడు.
(33:28) అష్టావక్రుడు వాత్సల్యంతో జనకుడిని లేవనెత్తి ఆయన కళ్ళలోకి చూస్తూ చివరి దివ్య సందేశాన్ని అందించాడు. రాజా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ మనసును ఒక స్వచ్ఛమైన అద్దంలా మలచుకో అద్దం ముందు అందమైన రూపం నిలబడినా అది ప్రతిబింబిస్తుంది. వికారమైన రూపం నిలబడినా అలాగే చూపిస్తుంది. కానీ వారు అక్కడి నుండి వెళ్ళిపోగానే అద్దం మళ్ళీ శూన్యంగా నిర్మలంగా మారిపోతుంది.
(33:57) అది ఎవరిని పట్టుకొని వేలాడదు దేనితోనూ బంధించబడదు. నీ అంతరంగం కూడా అంతే ప్రశంస వచ్చినా నింద వచ్చినా దాన్ని నీ ఆత్మకు అంటనివ్వకు అప్పుడు అష్టావక్రుడు తన చేతిని ఆకాశం వైపు చూపిస్తూ గంభీరంగా ఇలా అన్నాడు. గుర్తుంచుకో రాజా ఒక వ్యక్తి విశాలమైన నీలాకాశం పైకి రాళ్లుు విసిరితే ఏమవుతుంది? ఆ రాళ్ళు ఏనాటికీ ఆకాశాన్ని గాయపరచలేవు.
(34:27) పైగా గురుత్వాకర్షణ వల్ల ఆ రాళ్ళు తిరిగి విసిరిన వాడి తలపైనే పడతాయి. నీ మనసు కూడా ఆకాశంలా మారిన రోజున ఈ ప్రపంచం నీపై విసిరే ఏ నిందారాయి కూడా నిన్ను తాకలేదు. అవి నిందించిన వారి అంతరంగాన్నే నాశనం చేస్తాయి. అసలైన విజయం అంటే శత్రువును సంహరించడం కాదు అసలు ఏ శత్రువు నిన్ను తాకలేని ఆత్మస్థితిని సాధించడమే జనకుడి ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది.
(34:54) పగటిపూట సభలో ఎదురైన అవమానాలు రాత్రంతా వేధించిన ఓవర్ థింకింగ్ మంటలు అన్నీ కర్పూరంలా కరిగిపోయాయి. ఆయన ఒక సాధారణ రాజుగా ఆశ్రమానికి వెళ్ళారు. కానీ తిరిగి వెళ్లేటప్పుడు జీవితపు సమస్త బంధనాల నుండి విముక్తుడైన ఒక రాజర్షిగా వెనుదిరిగారు. ఈ కథను విన్న మిత్రులారా ఒక్క క్షణం మీ గుండెపై చెయ్యి వేసుకొని ఆలోచించండి. ఎక్కడో ఎప్పుడో ఏ అర్హత లేని ఎవరో ఒక చిన్న మాటను పట్టుకొని మీ అమూల్యమైన జీవితాన్ని మనశశాంతిని ఎన్ని రాత్రులు బలిపెట్టారు వారు విసిరిన చెత్తను మీ మనసులో ఎందుకు భద్రపరుచుకుంటున్నారు ఈ క్షణమే ఆ చేదు జ్ఞాపకాల సంకెళ్లను
(35:38) తెంచేయండి. మిమ్మల్ని ద్వేషించే వారి పట్ల కోపం పెంచుకోకండి. వారి లోపలి అశాంతిని చూసి జాలిపడండి. మీ విలువను నిర్ణయించే అధికారాన్ని ఈ సృష్టిలో ఏ మనిషికి ఇవ్వకండి. మీ ఆనందం మీ గౌరవం మీ ప్రశాంతత మీ ఆత్మలోనే దాగి ఉన్నాయి. గతాన్ని నిశ్చలంగా వదిలేసి వర్తమానంలో ఎరుకతో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో జీవించండి. అష్టావక్రుడి ఈ దివ్యమైన జ్ఞానం మీ జీవితాల్లోని అశాంతిని తొలగించి చెదరని ప్రశాంతతను నింపాలని మనసారా ఆశిస్తూ మీలోని పరమాత్మ తత్వానికి నమస్కరిస్తున్నాను.
(36:18) సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిఃి

No comments:

Post a Comment