Saturday, September 12, 2026

ఎంత చెడ్డది ప్రపంచం.. స్వామి యోగానంద జీవితంలో జరిగిన ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టాలు#viral#trending#video

ఎంత చెడ్డది ప్రపంచం.. స్వామి యోగానంద జీవితంలో జరిగిన ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టాలు#viral#trending#video

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MfhGpkgHJRs





Title: ఎంత చెడ్డది ప్రపంచం.. స్వామి యోగానంద జీవితంలో జరిగిన ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టాలు#viral#trending#video

Author Name: ajju-baipalli

Description: • వర్తమానంలో జీవించండి#viralvideo#viral#tren...  
ఎంత చెడ్డది ప్రపంచం.. స్వామి యోగానంద జీవితంలో జరిగిన ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టాలు#viral#trending#video

Transcript:
(00:01) అరుణాచల శివ దైవంతో సహజీవనం అనే ఒక పుస్తకం ఈరోజు చదువుతూ రామకృష్ణ పరమహంసకి అతని యొక్క శిష్యులకి మధ్య జరిగిన సంభాషణలు సన్నివేశాలు చదువుతుండగా మరీ ముఖ్యంగా స్వామి యోగానందకి రామకృష్ణ పరమహంసకి మధ్య జరిగిన సంభాషణలు, సన్నివేశాలు చదువుతూ ఉంటే చివరాఖరికి ఒక మాట మెదిలింది. ఏంటది అంటే ఎంత చెడ్డదిరా ప్రపంచం అని నేను అనడం కాదు స్వామి యోగానందే అంటాడు.
(00:39) కాబట్టి స్వామి యోగానంద పుట్టిన దగ్గర నుండి ఆయన రామకృష్ణ పరమహంసని కలిసి రామకృష్ణ పరమహంస మరణాంతరం వరకు ఆయన ఉంటూ ఎందుకు ఎంత చెడ్డది ప్రపంచం అని ఈ ప్రపంచాన్ని అన్నాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి యోగానంద యొక్క పుట్టి పేరు అంటే అసలు పేరు యోగేంద్రనాథ్ రాయ్ చౌదరి పుట్టుకతో వీళ్ళది బ్రాహ్మణ కుటుంబం కలకత్తాలోనే పుట్టాడు రామకృష్ణ పరమహంస యొక్క మటానికి అంటే దక్షిణేశ్వరానికి కాస్త దగ్గరలోనే యోగేంద్రనాథ్ రాయ్ చౌదరి అంటే స్వామి
(01:24) యోగానంద యొక్క తల్లిదండ్రుల యొక్క నివాసస్థలం ప్రతి వారం కూడా స్వామి యోగానంద యొక్క తల్లిదండ్రులు రామకృష్ణ పరమహంస దగ్గరికి చిన్నప్పటి నుండి తీసుకొని వెళ్ళేవాళ్ళు స్వామి యోగానందని చిన్నప్పుడు తీసుక వెళ్ళేటప్పుడు రామకృష్ణ పరమహంస స్వామి యోగానందాన్ని చూసి పసిబిడ్డగా ఉన్నప్పుడు చూసి ఓహో బిడ్డ చాలా ఆకర్షతుడిగా ఉన్నాడు చాలా తేజోవంతుడిగా ఉన్నాడు.
(01:54) రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి ఒక దిక్షూచి అవుతాడమ్మ అని ఆశీర్వదించి పంపుతారు. అలా చిన్నప్పటి నుండి రామకృష్ణ పరమహంస మటానికి దక్షిణేశ్వరం వెళ్లడం ఒక అలవాటుగా మారింది స్వామి యోగానందకి ఐదు సంవత్సరాల వరకు నిరంతరం వెళ్లడం ప్రతి వారం వెళ్లడం రామకృష్ణ పరమహంస పాడే పాటలు కీర్తనలు భజనలు ఆయన వేసే నాటకాలు అవన్నీ చూడడం రామకృష్ణ పరమహంస పట్ల విపరీతమైన ఆకర్షితం రావడం ఇదంతా కూడా ప్రారబ్ధం ప్రకారం జరిగింది.
(02:35) అయితే ఒకరోజు ఐదవ ఏట స్వామి యోగానంద స్కూల్లో ఉన్నప్పుడు ఉపనయనం జరిగిన తర్వాత స్కూల్ కి వెళ్ళాడన్నమాట మొట్టమొదటిసారి స్కూల్లో అందరితో కూడా సాయంత్రం పూట ప్రదోష కాలంలో ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉండగా ఉన్న ఫలంగా ఒక్కసారి భావావేశానికి లోనైపోయాడు. ఉన్నఫలంగా స్కూల్లో ఉన్న పిల్లలందరి నుండి దూరంగా వెళ్ళిపోయి గోడకి తలాంచి ఆకాశం వైపు చూస్తూ రాత్రి వరకు అలా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు.
(03:06) తల్లిదండ్రులు వచ్చారు ఉపాధ్యాయులు వచ్చారు ఏమైందిరా అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నా స్నేహితులు కాదు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా నా బంధువులు కాదు అదిగో నా బంధువులు అందరూ కూడా ఆకాశంలో ఉన్నారు నక్షత్ర రూపంలో నేను అక్కడ నుండి వచ్చాను అంటాడు. ఉపాధ్యాయులు కంగారుపడతారు తల్లిదండ్రులు కంగారుపడతారు ఏమైందిరా ఆకాశంలో నక్షత్రాలను చూపించి వాళ్ళు నా బంధువులు అంటున్నావ ఏంటి అంటే అదే నిజం వాళ్లే నా బంధువులు అక్కడి నుంచే నేను వచ్చాను కానీ అక్కడ నా యొక్క స్థానం ఏంటో సరిగ్గా నాకు అర్థం కావడం లేదు అంటాడు అనేసరికి తల్లిదండ్రులు కంగారు పడతారు
(03:41) అయ్యో నా కొడుకుకి ఏమైనా అయ్యిందేమో అని కంగారుపడి రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకు వెళ్తుండడం వల్లే వీడు ఇలా తయారయ్యాడేమో ఆయన యొక్క స్పర్శ ద్వారా ఆయన యొక్క ఆశీర్వచనం ద్వారా వీడికి ఇలాంటి అనుభూతులు కలుగుతున్నాయేమో నా కొడుకు ఇలా సన్యాసం వైపు వెళ్ళకూడదని పిల్లాడిని అటు పక్కకు పంపించడం మానేశారు. అంటే స్వామి యోగానంద రామకృష్ణ పరమహంస మటం వైపు వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులు చేశారు.
(04:12) అక్కడి నుండి వేరొక స్కూల్ వైపు తీసుకువెళ్ళారు అంటే ఊరు మార్చారు స్కూలు మార్చారు. ఊరు మారిస్తే స్కూలు మారిస్తే మనసు మారుతుందా ఆలోచన మారుతుందా మారదు కదా అది ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్ అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయం కదండీ క్రైస్తవ మిషనరీ స్కూల్స్ ఎక్కువగా ఏర్పాటు చేశారు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అటువంటి ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో స్వామి యోగానందని చేర్పించారు తల్లిదండ్రులు యోగ యోగానంద చాలా రోజులు రామకృష్ణ పరమహంస దర్శనం చేసుకుండా దర్శనం చేసుకోకుండా ఉన్నాడు.
(04:55) కానీ నిరంతరం బాధ అయ్యో నా గురుదేవుని నేను కలిస్తే బాగుండు అని చెప్పి అనుకోకుండా ఒక వ్యక్తి రామకృష్ణ మటం నుండి స్వామి యోగానందని కలిస్తే యోగానంద అంటాడు నన్ను ఒక్కసారి తీసుకెళ్తావా మా అమ్మా నాన్నలకు తెలియకుండా అని అంటే స్వామి యోగానందను దొంగతనంగా తీసుకెళ్తారు వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకుండా తీసుకెళ్ళిన తర్వాత స్వామి యోగానంద రామకృష్ణ పరమహంస చూసి తెగ ఆనంద పడిపోయి వెళ్లి రామకృష్ణ పరహంస కాళ్ళ మీద పడతాడు పడుతూ ఒక ప్రశ్న అడుగుతాడు గురుదేవా చదువుతున్నప్పుడు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి.
(05:35) ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కావడం లేదు ఆకాశం వైపు చూస్తున్నాను ఎక్కడి నుండో అక్కడి నుండి కదా నేను వచ్చాను వీళ్ళఎవరో నాకు సంబంధించిన వాళ్ళు కాదు కదా అని అనిపిస్తుంది. బుర్ర బద్దలైపోతుంది అంత దారుణంగా వస్తున్నాయి ఆలోచనలు ఏం చేయాలో అర్థం కావట్లేదు గురుదేవా అని రామకృష్ణ పరమహంసని స్వామి యోగానంద అడిగితే దానికి రామకృష్ణ పరమహంస అంటాడు యోగానంద నిరంతరం హరినామ స్మరణ చేయి నమో నారాయణాయ నమః అనే ఒక మంత్రాన్ని పట్టుకో నిరంతరం నామస్మరణ స్కూల్లో ఉన్న స్కూల్లో లేకపోయినా ఇంట్లో ఉన్న ఇంట్లో లేకపోయినా చదువుతున్న చదువుకోకపోయినా ఆటలు
(06:17) ఆడుకుంటున్న ఆటలు ఆడుకోకపోయినా నిరంతరం హరినామ స్మరణ చెయ్ అని చెప్తే నిరంతరం అదే పనిగా హరినామ స్మరణ చేశాడు. చేస్తూ ఇంటిక వస్తున్న సందర్భంలో ఒకరోజు ఇంట్లో అప్పుల గోల విన్నాడు అంటే ఇంటి నిండ అప్పులు ఉన్నాయి. అప్పులను చూసి తండ్రి బాధపడుతున్నాడు. ఆ తండ్రి బాధను చూసి స్వామి యోగానంద ఉండలేకపోయాడు. తండ్రి నేను ఇక స్కూల్లో చదవలేను ఈ స్కూల్ కి వెళ్ళలేను ఈ చదువులు నేను చదవలేను.
(06:51) నేను మనకు కాన్పూర్లో అంటే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ ఉంది కదా ఆ కాన్పూర్లో మనకి మేనమామ ఉన్నాడు. ఆ మేనమామ దగ్గరికి వెళ్లి నేను పని చేసుకుంటాను. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం చేసుకుంటాను. అని చెప్పి తండ్రి యొక్క అనుమతి తీసుకొని కాన్పూర్ వెళ్లి మేనమామ ఇంటి దగ్గర పని చేసుకుంటాడు. కాన్పూర్లో ఉద్యోగంలో అయితే చేరాడు గానీ స్వామి యోగానంద ఉద్యోగం ఏరోజు కూడా సరిగ్గా చేయలేకపోయేవాడు ఉద్యోగం చేస్తుండగా అనుకోకుండా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు.
(07:26) పోనీ మెలుకు స్థితిలో ఉన్నంతసేపు హరినామ స్మరణ చేసేవాడు ఎవరి మాట వినేవాడు కాదు నిరంతరం హరినామ స్మరణ అయితే హరినామ స్మరణ చేయడం లేదంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం ఉద్యోగం చేసే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వాళ్ళు కూడా చూసి చూసి స్వామి యోగానందని బయటికి పంపించేశారు. బయటికి పంపించేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చాడు గానీ తల్లిదండ్రులు విపరీతంగా తిట్టడం మొదలు పెట్టారు.
(07:54) ఇలా తయారయ్యావ ఏంట్రా ధ్యానం అంటావు సమాధి స్థితి అంటావు హరినామ స్మరణ అంటావు ఏంట్రా ఇది రామకృష్ణ పరమహంసలా నువ్వు కూడా తయారవుతావా మాకున్న ఒకే ఒక కొడుకురా నువ్వు నువ్వు ఇలా తయారైతే ఏంట్రా ఇందుకోసమా మేము కన్నది ఇందుకోసమా మేము నవమాసాలు మోసింది అని తల్లిదండ్రులు చివాట్లు పెడుతున్న సరే స్వామి యోగానందకి కనీసం మనసు కరగను కూడా కరగలేదు అంత బండరా అయిపోయింది లౌకిక ప్రపంచం నుంచి అలా చూస్తూ ఉన్న తండ్రి వీడికి పెళ్లి చేస్తే గాని వీడు మారడని అనేక సంబంధాలు తీసుకొచ్చాడు.
(08:33) సంబంధాలు తీసుకొస్తే వీడికి ఎక్కడైతే మళ్ళీ సంబంధాలు చూస్తున్నానని తెలిసిపోయి మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడేమో అని ఒక గదిలో పెట్టి తాళం వేశరు స్వామి యోగానందని ఇంట్లో పెట్టి పెళ్లి సంబంధాలు ఎన్ని తీసుకు వచ్చినా సరే స్వామి యోగానంద ఒప్పుకోలేదు పెళ్లికి చివర ఆఖరికి బ్రహ్మాస్త్రం వాడవలసి వచ్చింది. కన్న తల్లి వెళ్లి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఒరేయ్ నాన్న మాకు ఉన్నది నువ్వు ఒక్కడివేరా మీ నాన్నకి నాకు నువ్వు కాకుండా మాకు ఇంకే ప్రపంచం ఉందో చెప్పు మేము సంపాదించినా సంపాదించకపోయినా అంతా నీకే కదా నిన్ను పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటివాడిగా చేసి హాయిగా కన్ను మూయాలని
(09:15) ఉందిరా పెళ్లి చేసుకోరా నాన్న ఈరోజు నువ్వు ఏ రామకృష్ణ పరమహంస అంటున్నావో ఆ రామకృష్ణ పరమహంస కూడా పెళ్లి చేసుకున్నాడు కదా నాన్న అని అంటే దాని దానికి స్వామి యోగానంద అంటాడు అమ్మ నాకు యోగం నేర్చుకోవాలని ఉంది అష్టాంగ యోగం నేర్చుకోవాలని ఉంది. సమాధి స్థితిని పొందాలని ఉంది. నిరంతరం ఆ హరినామం యందు నిరంతరం ఆ హరి యొక్క పాదాల యందు నిరంతరం కాళికామాత యొక్క పాదాల యందు రమించాలని ఉందమ్మ కాబట్టి పెళ్లి నాకు అడ్డు రాకూడదు దయచేసి నాకు పెళ్లి చేయొద్దంటే తల్లి గుండెలు పాదుకొని ఏడవడం మొదలు పెడుతుంది.
(09:49) ఇంకా అంతకంటే బ్రహ్మాస్త్రం ఏముందండి బ్లాక్ మెయిల్ చేయడానికి కొడుకు ఎన్ని చెప్తున్నా వినలేదు అలాంటి కొడుకు దొరికాడని ఆనంద పడాల్సిందే గాని ఏడిస్తే ఏం చెప్తాం ప్రారబ్ధం అంటే అదే కదా ఆ పిల్లాడు ఏమైనా మర్డర్లు చేస్తాను అన్నాడా హత్యలు చేస్తాను అన్నాడా ఆత్మహత్య చేస్తాను అనుకున్నాడా దొంగతనాలు చేస్తాను అన్నాడా మానబంధం చేస్తాను అన్నాడా సన్యాసం వైపు వెళ్తాను అన్నాడు యోగం నేర్చుకుంటాను అన్నాడు అష్టాంగ యోగం నేర్చుకుంటాను అన్నాడు అయినా సరే తల్లిదండ్రులు కన్నీళ్లు కన్నీళ్లు కారుస్తూ పెళ్లి ఒప్పించారు. తల్లి విపరీతంగా ఏడుస్తూ
(10:25) ఒరేయ్ ముందైతే పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్లి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లి యోగం నేర్చుకుందువు గానీ ముందైతే పెళ్లి చేసుకో అని బలవంతంగా ఒప్పించింది. తల్లి యొక్క కన్నీటితో మనసైతే కరగలేదు కానీ స్వామి యోగానంద అది పెళ్లియన తరువాత రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లి యోగం నేర్చుకోవచ్చు అనే ఒక మాట వినడంతో పెళ్లి చేసుకున్నాడు తల్లి యొక్క మాటను అనుసరించి పెళ్లి అయితే చేసుకున్నాడు కానీ ఆ బంధం నుంచి బయట పడలేకపోయాడు ఎందుకంటే పెళ్లి జరిగిన మొదటి రాత్రే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు.
(11:09) పెళ్లికూతురు పెళ్లికూతురు ఫస్ట్ నైట్ రూమ్లోకి వస్తే బెడ్ మీద కూర్చొని మంచం పై కూర్చొని హరినామ సంకీర్తన చేసేవాడు నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః అని సంకీర్తన చేస్తుంటే ఆ పెళ్లికూతురు కూడా కంగారుపడిపోయింది ఇదేంటిది నా భర్త మొదటి రాత్రి నా భర్త మొదటి రాత్రి భార్యతో సంగమించకుండా హరినామ సంకీర్తన చేస్తున్నాడు ఏంటి అని చెప్పి చెప్పి మొదట భయపడ్డా తర్వాత ఆనంద పడింది నా భర్త మిగిలిన వాళ్ళలా కాదు నా భర్తకి భగవంతుడు అంటే ఇష్టం అని చెప్పి తర్వాత ఆనంద పడింది కానీ ఆ ఆనందాన్ని పిల్లలు అర్థం చేసుకున్న ఆ స్థితిని పిల్లలు అర్థం చేసుకున్న ఆ అనుభవాన్ని
(11:54) తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోయారండి. అమ్మ వాడు అలానే అంటాడఅమ్మ నీ అందంతో నువ్వే లొంగ తీసుకోవాలి అని తల్లిదండ్రులు మళ్ళీ ఆ పాపకు చెప్తే ఆ పెళ్లికూతురికి అక్కడి నుండి పరిగెత్తడం మొదలు పెట్టాడు స్వామి యోగానంద అంటే భార్య దగ్గరికి వస్తుంటే చాలు పరిగెత్తడం మొదలు పెట్టేవాడు పోనీ పుట్టింట్లో అవ్వడం లేదు కదా అత్తారి ఇంట్లో ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి అత్తారి ఇంటికి పంపించినా సరే అక్కడి నుండి కూడా పరిగెత్తడం మొదలు పెట్టేవాడు పరిగెట్టుకుంటూ ఊరు అవతలకు వెళ్లి అక్కడ నిలబడి కీకలు వేసేవాడు ఏమైంది అని అడిగితే ఏమీ సమాధానం చెప్పేవాడు కాదు ఆకాశం వైపు
(12:30) చూస్తూ హరినామ సంకీర్తన చేసేవాడు. అంటే ఒక బోనులో బంధించిన ఒక సింహాన్ని అది బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నమ చేశాడండి ఆ పెళ్లి బంధంలో నుంచి బయటికి రావడ బయటకి రావడానికి భార్య నుంచి బయటికి రావడానికి చివరాకరికి రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి ఒక వ్యక్తి అటుగా వస్తూ స్వామి యోగానందని గుర్తుపట్టి ఏమయ్యా నీ గురించి రామకృష్ణ పరమహంస పదే పదే అడుగుతున్నాడు.
(13:00) ఒక్కసారి వచ్చి కలవచ్చు కదా గురువుగారిని అని అంటే అయ్యో గురువుగారు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి రామకృష్ణ పరమహంసలు వెళ్లి కలుస్తాడు. కలిసి ఏడవడం మొదలు పెడతాడు గురుదేవా మా అమ్మ నాన్నలు నాకు పెళ్లి చేశారు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంటే వెంటనే రామకృష్ణ పరమహంస అంటాడు ఎందుకయ్యా కంగారుపడతావ్ వెళ్లి నీ భార్యని తీసుకురా నీ భార్యకి నేను సర్ది చెప్తాను చక్కగా ఇద్దరూ కూడా భగవంతుని యందు రమిస్తూ ముక్తులు కండి లౌకిక బంధంలో ఎందుకు ఇరుక్కుంటారు నీ భార్యను వెళ్లి తీసుకురా నేను మాట్లాడతాను అని చెప్తే స్వామి యోగానంద ఆనందంతో ఇంటికి
(13:44) వెళ్లి రామకృష్ణ పరమహంస దగ్గరకు తన భార్యను తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస స్వామి యోగానందని అతని భార్యని ఇద్దరిని కూడా కాళికామాత ఆలయంలోకి తీసుకొని వెళ్లి ఇద్దరిని కూడా ఆశీర్వదించి స్వామి యోగానంద యొక్క భార్య తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత వీళ్ళద్దరూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత స్వామి యోగానందని తన యొక్క భార్యని కూడా చూసిన తల్లిదండ్రులు చాలా కోపపడతారు.
(14:19) స్వామి యోగానందని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు ఏరా నువ్వు పాడైపోతే పాడైపోయావు ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తావా ఆ అమ్మాయిని ఎందుకురా రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకువెళ్ళావు ఆ అమ్మాయిని కూడా సన్యాసంలోకి మారుద్దాం అనుకుంటున్నావా ఏంటి అని తిట్టడం మొదలు పెడతారు. అయినా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను సాకాలి కదరా భార్య కోసం ఉద్యోగం చేయాలి కదరా నాలుగు రాళ్లుు సంపాదించి భార్యకి ఒక చీర కొనిపెట్టాలి కదరా నాలుగు మెతుకులు పెట్టాలి కదరా ఎందుకురా నీకు ఈ బ్రతుకు అని తల్లిదండ్రులు అనేసరికి తల్లి అనేసరికి కంగారుపడిపోతాడు స్వామి యోగానంద ఇలా మాట్లాడుతున్నావ
(14:53) ఏంటమ్మా నాకు పెళ్లి అంటే ఇష్టం లేదని నేను నీకు ముందే చెప్పాను కదా పెళ్లి చేసుకోనని నేను ముందే చెప్పాను కదా నువ్వే కదా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ పెళ్లి చేసు కోరా నాన్న అన్నావు పెళ్లి చేసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లొచ్చు అని అన్నావు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతావు ఏంటమ్మా అని అంటే వెంటనే తల్లి అంటుంది ఒక మాట అంటుందండి ఆ మాటతో స్వామి యోగానందలో పరిపూర్ణమైన వైరాగ్యం వచ్చేస్తుంది.
(15:19) తల్లి ఏమంటుందంటే ఓహో తప్పు నా మీద తోసావా సరే నేను అడిగానని పెళ్లి చేసుకుంటున్నా అంటున్నావ్ సరేరా బలవంతంగా ఎవరైనా చేసుకుంటారఏంటిరా నీ మనసులో కూడా ఎక్కడో దగ్గర పెళ్లి చేసుకోవాలని ఒక కోరిక లేకపోతే నువ్వు ఎందుకు చేసుకుంటావు బలవంతంగా నేను చేసుకోమన్నంత మాత్రాన చేసుకుంటావా నీకు కూడా ఎక్కడో కోరిక ఉండబట్టే కదా నువ్వు చేసుకున్నావ్ అని అనేసరికి స్వామి యోగానంద నిచ్చేష్టుడు అయిపోతాడు ఏమీ అర్ధం కాదు ఏంటిది నాలో కోరిక ఉండడం ఏంటి నాలో ఏ కోరిక లేదు కదా ప్రపంచం ఏంటి ఇంత మోసం ప్రపంచం ఏంటి ఇంత అబద్ధం అని చెప్పి పక్కనున్న పూజా మందిరంలో ఉన్న ఒక పరమేశ్వరుడి యొక్క చిత్రపటాన్ని చూస్తూ
(16:00) పరమేశ్వర ఎంత చెడ్డదయ్యా ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో ఉండే మనుష్యులకి ఆ మనుష్యుల యొక్క మాటలకి ఆ మనుషులు మాట్లాడే మాటలకి వాళ్ళు చేసే చేష్టలకి అసలు సంబంధమే లేదయ్యా మనుషులు మాట్లాడే మాటలు చేసే చేష్టలు ఈ రెండూ ఒకేలా ఉన్నవి నా యొక్క గురుదేవులైనటువంటి రామకృష్ణ పరమహంస దగ్గర మాత్రమే నా తల్లి దగ్గర లేదు నా తండ్రి దగ్గర లేదు కాబట్టి నేను వీళ్లందరినీ వదిలేసి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా గురువు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇకపై నా తల్లిదండ్రుల బాధ్యత నా యొక్క భార్య బాధ్యత అంతా కూడా నీదే అని చెప్పి పరమేశ్వరుడికి నమస్కారం
(16:39) పెట్టి గురుదేవుల దగ్గరికి వెళ్ళిపోతాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లి చెప్తాడు గురుదేవా ఈ ప్రపంచ ప్రపంచం చాలా చెడ్డది గురుదేవా వాళ్ళు మాట్లాడే మాటలు వేరు వాళ్ళు చేసే చేష్టలు వేరు అటువంటి ప్రపంచంలో నేను ఉండదలుచుకోలేదు అటువంటి కొడుకుగా అటువంటి భర్తగా నేను ఏమాత్రం నేను ఉండదలుచుకోలేదు నేను నిరంతరం మీ యొక్క శిష్యుడిగా ఉంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ కాళికా మాత పాదాల యొద్ద సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను ఇక్కడే తరించిపోవాలి అనుకుంటున్నాను అన్న తర్వాత రామకృష్ణ పరమహంస ఎంతో ఆనంద పడతాడు అంటే ఒక్కసారి పరిశీలన చేయండి
(17:16) ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే ఉంటారు.నకి 99 మంది వాళ్ళు మాట్లాడే మాట ఒక విధంగా ఉంటుంది చేసే చేష్ట ఒక విధంగా ఉంటుంది. తల్లిదండ్రుల పిల్లలతో ఉండే సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేద్దాం తర్వాత వాడు ఏదో దారిలోకి వస్తాడు అని వాడికి కనీసం ఆసక్తి పెళ్లి మీద ఆసక్తి ఉందా లేదా వాడు వచ్చిన భార్యను పోషించుకోగలడా పోషించుకోలేడా అన్న విషయం కూడా ఆలోచించారు.
(17:46) అమ్మాయి విషయంలోనైనా అంతే అమ్మాయికి పెళ్లి మీద ఆసక్తి ఉందా లేదా వచ్చిన తరువాత పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తతో చక్కగా ఉంటుందా లేదా అనే ఒక దృష్టికోణం కూడా లేకుండా ఆలోచించకుండా పెళ్లి చేసేస్తారు. తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటాయి. కానీ వాటన్నిటిని కూడా అంత కృతనిచ్చయంతో వదిలి వచ్చాడు స్వామి యోగానంద. వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నాళ్ళు కూడా ఏ రోజు కూడా కామానికి లొంగిపోలేదు.
(18:17) అంత కృతనిశ్చయంతో అంత స్థిరంగా అంత దృఢంగా నిలబడ్డాడు. ఒకానొక రోజు స్వామి వివేకానంద అక్కడ ఉన్న సన్యాసుల అందరినీ కూర్చోబెట్టి ఒక మాట అంటాడండి ఏమంటాడంటే రామకృష్ణ పరమహంస దగ్గర మన గురుదేవుల దగ్గర ఉన్న శిష్యులందరిలో శిష్య పరివారం అందరిలో కామాన్ని పరిపూర్ణంగా జయించింది ఎవరైనా ఉన్నారా అంటే అది స్వామి యోగానంద ఒక్కరే అంటాడు అంటే స్వామి యోగానంద పట్ల వివేకానందుడికి రామకృష్ణ పరమహంసకి శారదా మాతకి మధ్య ఎంత అభిప్రాయం ఉందో ఎంత ఎంత గొప్ప ఉన్నత స్థితి ఉందో చూడండి అంటే వాళ్ళందరి పట్ల వాళ్ళందరికీ స్వామి యోగానంద పట్ల ఎంత గొప్ప అభిప్రాయం ఉందో చూడండి అంటే అలా
(19:00) జయించాడు ఏరోజు కూడా కామాన్ని తన ఆలోచనలో కూడా రానివ్వలేదు అంత స్థిరంగా నిలబడ్డాడు ఇదంతా ప్రారబ్ధం అని చివరాకరణ స్వామి యోగానంద ఒక మాట అంటాడు. ఎప్పుడో ఐదో ఏట ఆకాశంలోకి చూసి ఆకాశంలో నా బంధువులు ఉన్నారో అక్కడ నుండి నేను వచ్చాను అని అనడం ఏంటి కాన్పూర్లో ఉద్యోగానికి వెళ్ళడం ఏంటి అది కూడా స్కూల్ మానేసి ఉద్యోగానికి వెళ్లి అక్కడ నేను సమాధి స్థితిలోకి వెళ్ళడం ఏంటి హరినామ స్మరణ చేయడం ఏంటి అక్కడి నుండి నేను రామకృష్ణ పరమహంసని కలవడం ఏంటి చిన్నప్పటి నుంచే కలవడం ఏంటి ఆయన నాకు ఆశీర్వాదం చేయడం ఏంటి పెళ్లి చేసుకోనని నేను అంటే పెళ్లి
(19:40) జరిపించడం ఏంటి బలవంతంగా జరిపించిన తర్వాత భార్య నాతో గొడవ పెట్టకుండా నన్ను అనుగమించడం ఏంటి గొడవ పెట్టుకొని రామకృష్ణ పరమహంస దగ్గరికి భార్యను తీసుకురావడం ఏంటి మా గురువుగారు ఇద్దరిని ఆశీర్వదించడం ఏంటి మళ్ళీ నేను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తల్లితో గొడవ అవ్వడం ఏంటి తల్లిని తల్లిని తండ్రిని భార్యని అందరిని వదిలేసి మళ్ళీ నేను రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేయడం ఏంటి ఇదంతా కూడా కాళికామాత జగజ్జనని యొక్క ప్రారబ్ధం అంటాడు స్వామి యోగానంద అందుకే నేను పదే పదే పదే పదే చెప్తూ ఉంటాను ఈ జీవితం నువ్వు అనుభవిస్తున్న జీవితం అంతా ప్రారబ్ధం ఇక్కడ నువ్వు కర్తగా ఉండడం
(20:17) మానేసి సాక్షిగా ఉంటే నువ్వు నువ్వు కూడా రమణ స్థితిని పొందుతావు, నువ్వు కూడా రామకృష్ణ పరమహంస స్థితిని పొందుతావు, నువ్వు కూడా ఒక శిరిడై సాయి బాబా స్థితిని పొందుతావు. అది అందరిలో ఉన్నదే కొత్తగా నువ్వు పొందాల్సింది ఏం కాదు. అడ్డుగా ఉన్నదాన్ని జస్ట్ పక్కకు తొలగిస్తే చాలు. నేను కర్తను అన్న భావనను, నేను కర్తను అన్న స్థితిని పక్కకు జరిపి, నువ్వు బ్రతికితే అదే సాక్షి భావన.
(20:40) అది అందరూ ప్రతిరోజు తురీయంలో పొందేదే, కేవలం మెలుకువలో పొందితే చాలు. తురీయంలో ఉన్న ఎనిమిది గంటలు ప్రతి ఒక్కరు పొందేదే మిగిలిన 16 గంటలు మెలుకువలో పొందితే చాలు ప్రతి ఒక్కడు రమణ మహర్షే ప్రతి ఒక్కడు పరమేశ్వరుడే ప్రతి ఒక్కడు కాళికామాతే ప్రతి ఒక్కడు రామకృష్ణ పరమహంసే నేను ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటానండి మీరు ఎప్పుడైనా ఒక థియేటర్ కి వెళ్ళండి సినిమా చూస్తూ సినిమా చూడడానికి వెళ్ళండి థియేటర్లో మీరు చూసే సినిమా ఆ సినిమా అది గతం ఎందుకంటే అది ఆల్రెడీ ఎప్పుడో గతంలో లో షూట్ చేసి రికార్డ్ చేసి ప్రస్తుతం వర్తమానంలో మీకు ప్లే చేస్తుంటారు. అంటే
(21:20) ఎంత మాయో చూడండి మీరు ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను అంటుంటారు కదా అది ఇప్పుడు చూడడం లేదు ఆల్రెడీ గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే గతాన్ని చూస్తున్నారు మీరు గతంలో షూట్ చేసిన సినిమాని గతంలో రికార్డ్ చేసిన సినిమాని ప్రెజెంట్ వర్తమానంలో మీరు ఎలా చూస్తున్నారో దాన్ని వర్తమానంలో నేను చూస్తున్నాను అని ఎలా బ్రమపడుతున్నారో అలాగే మీ యొక్క జీవితం కూడా ఆల్రెడీ గతంలో తీసిన సినిమా ఇప్పుడు ప్లే అవుతుంది.
(21:49) దాన్ని సాక్షిగా నువ్వు చూస్తే చాలు కర్తగా ఉంటే బాధ ఉంటుంది. సాక్షిగా ఉంటే సాక్షి భావన ఉంటుంది. ఇంతకుమించి ఏమీ లేదు జీవితం నాకు అర్థమైన జీవితం ఇదే నేను అనుభవిస్తున్న స్థితి ఇదే ఎలా అయితే సినిమా రికార్డు చేసి ఇప్పుడు ప్లే చేస్తారో థియేటర్ లో మన జీవితాన్ని కూడా ఆల్రెడీ రికార్డు చేసి ఈ భూమి మీదకి పంపించేశారు.
(22:08) ఇది జస్ట్ నువ్వు అనుభవిస్తే చాలు సినిమా ప్లే అవుతూ ఉంటుంది. వచ్చే క్యారెక్టర్లు వస్తుంటాయి. పోయే క్యారెక్టర్లు పోతుంటాయి వచ్చే పాత్రలు వస్తుంటాయి. పోయే పాత్రలు పోతుంటాయి. కోపం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోదం ఉంటుంది, నృత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది. చావు డప్పులు ఉంటాయి, పెళ్లి బాజాలు ఉంటాయి అన్ని ఉంటాయి. నువ్వు జస్ట్ సాక్షిగా ఉంటే చాలు నిరంతరం అది ఒక గొప్ప సినిమాగా నువ్వు ఆస్వాదించొచ్చు.
(22:30) కాబట్టి అలా సాక్షిగా ఉండాలని రామకృష్ణ పరమహంస స్థితిని ప్రతి ఒక్కరూ పొందాలని ఆ స్వామి యోగానంద యొక్క స్థితిని ప్రతి ఒక్కరు పొందాలని కోరుకుంటూ ఇట్లు మీ అజ్జు బైపల్లి

No comments:

Post a Comment