Monday, October 12, 2026

కోపం పెట్టుకున్నావా ,జేబులో బాంబ్ పెట్టుకున్నట్టే🌹కోప్పడు కానీ కోపంపెట్టుకోకు,మీకు దండం పెడతారీసా

కోపం పెట్టుకున్నావా ,జేబులో బాంబ్ పెట్టుకున్నట్టే🌹కోప్పడు కానీ కోపంపెట్టుకోకు,మీకు దండం పెడతారీసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gyxYv_Y1lhU





Title: కోపం పెట్టుకున్నావా ,జేబులో బాంబ్ పెట్టుకున్నట్టే🌹కోప్పడు కానీ కోపంపెట్టుకోకు,మీకు దండం పెడతారీసా

Author Name: kanthrisa trending

Description: కోపాన్ని మనసులో పెట్టుకొని మురిగిపోకు కోపాన్ని మనసులో పెట్టుకొని ముడిగిపోకు! వదిలేసేయ్… కానీ కోపం వద్దు!! వదిలేసేయ్… కానీ కోపం వద్దు!

మనల్ని బాధపెట్టినవాళ్లను ద్వేషిస్తూ మనశ్శాంతిని ఎందుకు కోల్పోవాలి? మనకు ఇబ్బంది కలిగించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అవసరమైతే సంబంధాలను తెంచుకోండి. కానీ వాళ్ల మీద కోపాన్ని, పగను మాత్రం మనసులో మోసుకెళ్లకండి.

కోపం మన జేబులో ఉన్న బాంబు లాంటిది—ఎప్పుడు పేలుతుందో తెలియదు! అది ఎదుటివారికంటే ముందుగా మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

శ్రీకృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ద్వారా కోపం నుంచి ఎలా విముక్తి పొందాలో, ప్రశాంతంగా ఎలా జీవించాలో తెలుసుకుందాం.

వ్యక్తులను వదిలేయండి… ద్వేషాన్ని కాదు, కోపాన్ని కూడా వదిలేయండి. మీ మనశ్శాంతికి మీరే బాధ్యత వహించండి!

ఈ సందేశం మీకు నచ్చితే, కోపంతో బాధపడుతున్న మరొకరికి కూడా షేర్ చేయండి. మీ చిన్న ప్రయత్నం మరొకరి జీవితంలో ప్రశాంతతను తీసుకురావచ్చు.

#AngerManagement #InnerPeace #Spirituality #LetGoOfAnger #PeaceOfMind #TeluguMotivation #TeluguPodcast #జీవితసత్యాలు #కోపం #మనశ్శాంతి #ఆధ్యాత్మికత #క్షమాగుణం #జీవితపాఠాలు #ద్వేషం #శ్రీకృష్ణదేవరాయలు #తెలుగుకథలు #EmotionalFreedom #LifeLessons #Mindfulness #ChoosePeace
#కోపం #మనశ్శాంతి #ఆధ్యాత్మికత #శ్రీకృష్ణదేవరాయలు #తెలుగుకథలు #AngerManagement #InnerPeace #Spirituality #LifeLessons #TeluguPodcast #కోపం #కోపంనియంత్రించడం #మనశ్శాంతి #ఆధ్యాత్మికత #జీవితసత్యాలు #శ్రీకృష్ణదేవరాయలు #తెలుగుకథలు #అద్భుతమైనకథ #కోపంనుండివిముక్తి #ద్వేషం #పగ #క్షమాగుణం #ప్రశాంతమైనజీవితం #మానసికప్రశాంతత #జీవితపాఠాలు #తెలుగుపాడ్కాస్ట్ #తెలుగుస్పిరిచువాలిటీ #Spirituality #AngerManagement #InnerPeace #PeaceOfMind #LetGoOfAnger #EmotionalFreedom #EmotionalIntelligence #SelfAwareness #Mindfulness #SpiritualWisdom #LifeLessons #LifeWisdom #Forgiveness #LetGoAndMoveOn #StopOverthinking #MentalPeace #PositiveMindset #HealthyBoundaries #PersonalGrowth #InnerFreedom #SelfRealization #ConsciousLiving #Wisdom #TeluguPodcast #TeluguStories #TeluguMotivation #TeluguSpirituality #Krishnadevaraya #AncientWisdom #HumanPsychology #AngerControl #ChoosePeace #livepeacefully

Transcript:
(00:00) హలో ఆ హలో బావ ఆ ఆ మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా ఏమని కోప్పడు కానీ కోపం పెట్టుకోకని అవును అది అంటే అసలు కోప్పడం ఏంటి కోపం పెట్టుకోకపోవడం అది ఒకసారి చెప్తారా పెట్టుకోకపోవడం కాదు పెట్టుకోవడం పెట్టుకోవడం ఆ అది అంటే కోప్పడు కానీ కోపం పెట్టుకోకని కరెక్టే అంటే మనిషికి కోపం వస్తుంది తప్పులేదు ఓకే దానికి సవ లక్ష కారణాలు ఉన్నాయి కామన్ సెన్స్ నీకు నచ్చిన వస్తువు ఎవరో కింద వేశారు బస్సులో ఎవరో మన కాళ్ళు తొక్కుతారు.
(00:37) ఆ లిప్స్టిక్ వేసుకోవడానికి పోతే హెయిర్ కట్ చేస్తారు. తర్వాత ఏమంటారు ఆస్తమా వచ్చిందంటే మనకు మత్తు మందిచ్చి మూత్ర పిండలు తీసేస్తారు. కోపం రాని కోపం వస్తుంది మనకి మూడు పదాలు ఉన్నాయి విసుగు చిరాకు కోపం అని అవును సో ఈ మూడు కూడా వర్తమానంలోనే వస్తాయి. అర్థమైందా ఇది అర్థమైంది వస్తాయి ఆ సో ప్రెజెంట్ లో వచ్చేవి ఏదైనా మంచిదే ఓకే మురగపెట్టుకున్నది ఏదైనా మంచిది కాదు సో కోపం రావడం అంటే వర్తమానంలో వస్తుంది
(01:22) మరి కోపం పెట్టుకోవడం అంటే ఎప్పుడో ఏదో జరిగింది. అది మనసులో పెట్టుకున్నాం ఇప్పుడు. ఓకే అక్కడి నుంచి వాడిని తలుచుకుంటే కోపం వస్తుంది ఛి వాడి పేరు ఎత్తకు దరిద్రపు ఉన్నవాడు సో వాడిని నేను ఎప్పటికీ క్షమించను అంటే ఒక వ్యక్తిని క్యారీ చేస్తా ఉంటారు అన్నమాట ఇక ఆ వ్యక్తిని తలుచుకున్న ప్రతిసారి ఎక్కడనా కోపం వస్తుంది నా ఎదురుగా ఉంటే నలిపి చంపేస్తా వాడిని అంటారు.
(01:48) అవును ఒకవేళ సడన్ గా వచ్చారనుకో బాగున్నారా అని అంటారు. వత్తదే అట్లా సో లోపట మాత్రం మనకి పాత సినిమాలు చూపిస్తారు ఇట్లా కూర్చుంటే ఒక మనిషి లోపట నుంచి ఇంకో మనిషి వచ్చి వాడిని కొట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి కూర్చుంటాడు. సో అట్లా నా అబ్సర్వేషన్ ఇది అసలు కోపమే వద్దా అంటే నేనుంటా అసలు కోపం వద్దే వద్దు నటిస్తే చాలు అయినప్పటికిని కోపం వస్తుంది ఒక్కొక్కసారి వర్తమానంలో కరెక్ట్ గా బయలుదేరే సమయానికి ఎవరో ఫోన్ మర్చిపోతారు కోపం వస్తుంది సో కోపం రాని కానీ కోపం పెట్టుకోవద్దు.
(02:29) ఇప్పుడు నేను ఉన్నాను అనుకోని నాకు ఎవరి మీద కోపం పెట్టుకోలేదు నేను కోపం వస్తుంది నాకు ఒక్కసారి ఓకే సో ఓషో ఒకానొక టాక్ లో ఏం చెప్పాడంటే ద మాస్టర్ డంట్ హేట్ ఎనీబడీ ఎట్ ద మోస్ట్ హిమే స్క్రీమ్ ఎట్ పీపుల్ అరౌండ్ హిim ఎట్ ద మోస్ట్ హి హెసిటేట్స్ అంటాడఅన్నమాట అంటే కొంచెం అబ్బా బా ఇంత ఏందిరా ఇంత చెప్పిన ఎట్లా చేస్తావ్ అసలు అడుపో పోయి నా ముఖం నుంచి పక్క వెళ్ళిపో సో ఇది ఉంటుంది.
(03:00) ఎందుకంటే నువ్వు మనుషులతో ఉంటే ఏదో ఒక చర్చ వస్తుంది ఏదో సంఘటన జరుగుతుంది. కొత్త బట్టలు వేసుకొని పోతున్నావ్ ఎవరో టీ తగిలిస్తే దాని మీద పడ్డది. కోపం వస్తుంది. కోపం వచ్చింది వాడు చేసిన పని మీద గాని వాడి మీద కాదు కోపం పెట్టుకోవడం అన్నది వాడి మీద వాడు చేసిన పని మీద కాదు. తేడా ఉందా లేదా తేడా ఉంది కానీ నాకు ఒక డౌట్ మ్ ఇప్పుడు టీ వడేయడం ఇవన్నీ చిన్న చిన్నవే కానీ ఆ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు అట్లాంటి కారణాల వల్ల కోపం వస్తది ఎగ్జాంపుల్ చెప్పు ఫర్ ఎగజాంపుల్ నేనే ఒక మంచి అపర్చునిటీ
(03:44) వచ్చింది అనుకున్నాను జాబ్ అపర్చునిటీ 10 లాక్ పర్ ఆనం ఎంతో కొంత అనుకున్నాం సో మా మమ్మీ వాళ్ళు ఫర్ అది వద్దు జాబ్ వద్దు ఏమ వద్దు మంచి సంబంధం ఉంది బెట నీ లైఫ్ సెట్ అయితది అని చెప్పేసి నన్ను జాబ్ కి అలో లో చేయకుండా చేసేస్తారు. వాళ్ళ మీద నేను కోపం పెట్టుకోవడం సహజమే కదా నేను అంటుంది పెట్టుకోవద్దు. సీ నిర్ణయాలు తీసుకో కోపం పెట్టుకోవడం అనవసరం.
(04:09) వాళ్ళు ఎందుకు అట్లా చేశారో నీకుఎందుకు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంటో నీకు భాష ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చెయ్. సో బుద్ధిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళు పర్సుడ్ చేస్తారన్నమాట. ఈ పదం తెలుసా పర్సువేడ్ అంటారు ఓకే వేరే రిలీజన్స్ లో పర్సుేషన్ లేదు ఓన్లీ అటాక్ే ఉంటుంది. ఓకే ఒక మాట చెప్తారు వినకపోతే తల నరికేస్తారు. ఇప్పుడు సినిమాలో అంతే కదా వీళ్ళకి హీరోలకి విపరీతమైన ఇంపేషన్స్ ఉంటుంది ఉత్తైన కోపాలు వచ్చేస్తాయి.
(04:41) అవును దానితోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇనుక సో పర్సియేషన్ అంటే ఏంటంటే ఎవరనా చెప్తే వినకపోతే మళ్ళీ చెప్తారు. అవును మళ్ళీ చెప్తారు. కోపపడతారు మళ్ళీ చెప్తారు సో ఆ పర్స్యేషన్ లో ఎదుటి వ్యక్తికి మెలుకు వస్తుంది ఓహో వాళ్ళక ఒక మానసిక పరిపక్వత వచ్చిన తర్వాత హటాతగా అర్థంఅవుతుంది. ఓకే అందుకని పేరెంట్స్ కి హటాతగా ఏది చెప్పొద్దు నువ్వు ఒక సంవత్సరం తర్వాత జరగబోయేవి పేరెంట్స్ కి ఇప్పటి నుంచే చెప్తా ఉండాలి.
(05:12) ఓకే డైరెక్ట్ గా చెప్పకూడదు డైరెక్ట్ గా చెప్తే ఎవరికీ అర్థం కాదు నీ పిల్లలు చెప్పిన అర్థం చేసుకోలేవు. అవును సో పేరెంట్స్ కి ఏం చెప్పాలి నేను చదివే చదువుకి ఏదో ఉద్యోగం వచ్చేటట్టు ఉంది ఉద్యోగం వస్తే మన ఆర్థిక పరిస్థితి మంచిగా అయతది. నాయనకు నేను అది వేరే ఎక్స్ట్రా కాలు పెట్టిస్తా అంటే ఆల్రెడీ రెండు కాళ్ళు ఉన్నాయి కదా నాయన కంటే ఒకళ్ళు ఇరగొట్టేనా పెట్టిస్తా అట్లే అట చెప్పాలి.
(05:38) అన్నకు మళ్ళీ పెళ్లి చేయాలమ్మా మనం అరే మంచిదే ఉన్నారు కదండీ లేదు గొడవలు పెట్టినా సరే అంటే నాకు వచ్చిన డబ్బులు ఏం చేయాలో తెలియదు అప్పుడు అవును సో ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. మెల్లగా ప్రిపేర్ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే అప్పుడు ఒకరోజు వస్తే ఆ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది మాకు తెలుసు అంటది వాళ్ళ మైండ్ అవును హటాతగా వెళ్లి మమ్మీ జాబ్ వచ్చింది వెళ్ళిపోతున్నా మమ్మీ నాకు ఒక అబ్బాయి తగిలాడు లేచిపోతున్నా షాక్ తినరా అసలు వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి.
(06:09) ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు విమాన హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కున్నప్పుడు రోషయ్య మాటి మాటికి వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతా ఉన్నాడు అది నేను మొత్తం విన్నా ఓకే రోషయ్య గారు ఫస్ట్ చెప్పినప్పుడే నాకు అనిపించింది రాజశేఖర్ రెడ్డి గారు ఇక లేరని నేను అన్నాను. లేదురా ఆయన దొరుకుతాడని ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందట.
(06:31) అంటే హటాతగా చెప్తే రాష్ట్రం అల్లకొలలం అయిపోతది. ప్రాబబ్లీ ఇట్ మైట్ బి ఏ స్ట్రాటజీ అవును మెల్లగా చెప్తున్నారు. అప్పటికి గంట అయింది టూ హవర్స్ అయింది ఏం భయపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి మన ప్రియత నాయకుడు మనకు దొరుకుతారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ వచ్చి చెప్తాం. సో ఓవరాల్ గా లాస్ట్ కి ప్రజలందరికీ అర్థమయింది.
(06:52) ఏమో పోయి ఉంటాడేమో అని అప్పుడు వచ్చి మరణ వార్త చెప్పారన్నమాట. అయినప్పటికిని చాలామంది ఏమంటారు వైఎస్సార్ ని నిజంగా ప్రేమించే వాళ్ళందరూ మరణించారని అప్పుడు ఎవరు అన్నారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరు పోలేదే అన్నారు అంటే వాళ్ళు ఎవరు ప్రేమించలేదాని అది వేరే కాంటెక్స్ట్ సో జీవితంలో ఎవరైనా అనుకుంటారు కదా ఆనందంగా ఉండా అని అవును ఆనందంగా ఉండాలంటే కోపం పెట్టుకోవద్దు సో కోపం పెట్టుకోవడం అన్నది ఎటువంటిది అంటే జోబులో వంకాయ బాంబు పెట్టుకొని తినడం లాంటిదే ఎప్పుడన్నా పేలు వచ్చేది ఎప్పుడు నెప్పు దొరుకుతుందో అప్పుడు బాం పేలుతుంది. అంటే ఇప్పుడు నువ్వు
(07:31) ప్రశాంతంగా ఉండాలంటే వాడు నీ కంటగర్పన కనబడకూడదు ఇంకా ఇ చూసుకో ఎంత పెద్ద కండిషనాలిటీ లోకి ఎంటర్ అయిపోయినావ్ ఇ కనిపిస్తే కనిపిస్తే యుద్ధమే అంటే బయట చేసిన చేయపోయింది లోబట నడుస్తా ఉంటది. గులుక్కుంటారు అలుగుతారు మొహాలు మాడుస్తారు ఆ తిని కంచాన్ని ఆ కిచెన్ లో ఇసిరేస్తారు వాడిని ఏం చేయలేక ఇక్కడంత చేస్తారు. అందుకని చిన్న చిన్న విషయాలైనా పెద్దవిష పెద్ద పెద్ద విషయాల్లో కోప్పడం కాదు ఎక్స్ప్లెయిన్ చేయడం మన డ్యూటీ అంటా నేను అది హటార్తుగా ఏది చెప్పకూడదు.
(08:08) చెప్తే ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు నేను కూడా హటార్తుగా మీకు ఒక విషయం చెప్పాలి కూర్చోండి ఏమైందంటే ఆరు కోట్లు అప్ప అయింది అని చెప్పకూడదు. అర్థం కాకపోవచ్చు ఆ టైం లో కొంచం షాక్ తినొచ్చు మూడ్చపోవచ్చు అట్లాగ సో మనుషులకి పరిచయం ఉన్న వాటికే షాకులు తింటా ఉన్నారు. అసలు ఏ మాత్రం పరిచయం విషయం చెప్తే ఆబవియస్ గా సో మనం ఏదనా చేస్తా అంటే వాళ్ళు వద్దున్నారు అంటే నిజంగా ఇంపార్టెంట్ అనుకో ఎవరు వద్దన్నా చేసేయ్ వాళ్ళ ఏమనుకున్నా మనం టేక్ లైఫ్ ఇంటు యువర్ హ్యాండ్స్ ఒక మూడు నాలుగుేళ్లలో ఆ నీ లైఫ్ నిజంగా బాగుందనుకో ఉద్యోగం చేయడం వల్ల నెలకు సంవత్సరానికి 10 లక్షలు రావడం
(08:51) వల్ల ఒక కార్ తీసుకొచ్చి ఇప్పటి నుంచి ఈ కార్లో తిరగండి అని ఇస్తే అన్ని కోపాలు పోతాయి అవును ఎవడికీ ఏది గుర్తుండదు గుర్తుండాలంటే వాత పెట్టాలి బిర్ర మీద అది గుర్తుంటది. అన్ని మర్చిపోతారు మనుషులు మాట ఇస్తారు మర్చిపోతారు తిడతారు మర్చిపోతారు సారీ చెప్తే కరిగిపోతారు ఏందో ఇదంతా నాన్సెన్స్ అవును అసలు ఒక సారి చెప్తే కోపం ఎట్లా పోతుంది నాకు అర్థమే కాదు ఉంటే ఎప్పటికి ఉంటది అది మ్ ఇది ఎలా ఉంటదంటే నాకు తెలిసిన ఒకాయన వాళ్ళ చెల్లెల కొడుకుని పెంచుకుంటున్నాడు.
(09:27) ఓకే హటాత్గా ఏం చేశడు వీళ్ళకు ఒక ఒక కుటుంబం పడదు మ్ వాళ్ళ ఇంటి అమ్మాయిని ప్రేమించింది. ఓకే ఇంకా చూసుకో ఈ విషయం తెలిసింది ఆయనకు తెలిసినాక అడిగిండు ఏమిరా తెలుసు కదరా వాళ్ళకు మనకు పడదని నువ్వు పోయిపోయి ఆ ఇంటి పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తావురా అని అడిగాడు. ఆయన కొంచెం తెలివఉన్న వ్యక్తి క్రియేటివ్ పర్సన్ ఓకే అట్లా కాదు మామ్మ ఇ నాకు చూడగానే లవ్ అయిపోయింది.
(09:59) కెవ్వు కేక అనిపించింది అని చెప్పాడు. అప్పుడు వాడు ఏం చేసాడంటే బ్యాగ్ తీసుకొని బయలుదేరు అన్నాడు. వాడు ఆశ్చర్య వాడికి షాక్ తిన్నాడు అంటే నీతో గొడవపడి అసలు నీవు నీవు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు ఇంకా నువ్వు నన్ను అడకుం నిర్ణయం నువ్వు తీసుకున్నావు కదా నిన్న అడగకుండా నేను నిర్ణయం తీసుకుంటున్నా నువ్వు బయలుదేరి ఇంట్లో అని బ్యాగ అంతా బయట ఇసరేశడు.
(10:25) ఓకే తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఏం జరిగిందని కనుక్కోవడానికి వస్తారు కదా అవును వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు ఇంట్లో అబ్బాయి ఫోటో ఉండి దండం ఉంది. అయ్యో అదేందంటే మా మా చెల్లెల కొడుకే చచ్చిపోయాడు ఈ మధ్యన అని చెప్పాడు. లేదండి హైదరాబాద్ నాకు తెలియదు నా మనసులో అయితే చచ్చిపోయాడు ఇదన్నా చేయాలి. వాడి గురించి ఏ ఎమోషన్ లేదు ఎక్కడన్నా పెళ్లిలో కలిసినా ఊరికే చూసి వెళ్ళిపోతారు అంతే కోపం పెట్టుకోండి డిలీటెడ్ అదన్నా చేయాలి ఇది ఎట్లా ఉందంటే కోపం పెట్టుకోవడం అంటే ఒక పుండుని మాననీయకుండా ఉంచుకోవడం అది అది ముక్కుకో చేయక ముడ్డికి అయింది అనుకో దేర్ ఇస్ ఏ బిగ్ ప్రాబ్లం
(11:10) అది పెరుగుతా ఉంటది. అందుకని ఏది ఏమైనా కోప్పడు వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చెయి ఆ వర్తమానపు సంఘటనని అక్కడక్కడే ముగించు సో ఇందులో మూడు అంశాలు ఉన్నాయి. నాలుగు అంశాలు ఎవరనా ఏదనా చేస్తే కోపం రావడం సహజం ఒకటి కొంచెం చిన్నదయితేనేమో మనకు విసుగు వస్తది. కొంచెం డిస్టర్బెన్స్ అయితే చిరాగ వస్తది కొంత డామేజ్ అయితే కోపం వస్తది.
(11:38) లేయర్స్ ఆఫ్ యాంగ్రీ అన్నమాట. అయితే కోపం ఎంతసేపు ఉండాలన్నది నీ ఇంటెలిజెన్స్. జనరల్ గా ఎంతసేపు ఉండాలి మీరైతే ఎంతసేపు ఉండాలి దీనికి ఒక గురువుని అడిగారు ఈ మాట కోపం ఎంతసేపు ఉండాలంటే నీటిలో ఒక వేలు అద్దితే తీస్తే ఎంతసేపు అలలు వస్తాయో అంతసేపు ఉండని అన్నాడు. ఓకే సో ఇప్పుడే వెళ్లి నీళ్ళలో వేలు పెట్టి చూడు ఇట్లా కదిలి తీయగానే వచ్చేస్తది అంటే అంతసేపు ఉంటే చాలు అదే చాలా ఎక్కువ ఇక్కడ మన జీవితంలో మన జీవితాన్ని దేనికోసం ఖర్చు చేస్తున్నామ అనేది మన చేతిలో ఉంది కదా సో ఈ కోపాల్లో తాపాల్లో అర్థం పడతలేని ఆవేశాల్లో ఖర్చు చేయడం వల్ల నేను స్వయంగా
(12:22) చూసిన ఎవరైతే కోపాలు పెట్టుకొని ఆ వ్యక్తి వస్తే ఆ నా కొడుకుని నరికేస్తా వాళ్ళ ఇంటికి వెళ్లి మొహం మీద కడిగేస్తాన్న వాళ్ళంతా అలిసిపోయి మూలకపడి చచ్చిపోయారు నేను చూసినా అట్లాంటి అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు ఆ మరణ సమయంలో నాతో చెప్పిన మాటలు చాలా ఎన్లైటనింగ్ గా ఉన్నాయి. ఓకే ఇంక ఈ పీక్లాటల్లో అంతా అయిపోయింది అయ్యగారు ఏం చేసినం లైఫ్ లో పశ్చాత్తాపంలో పడి చచ్చిపోయారుఅన్నమాట వన్ షుడ్ లివ్ హ్యాపీలీ వన్ షుడ్ డై హ్యాపీలీ ఒకవేళ అదే పర్పస్ ఆఫ్ లైఫ్ అయితే అన్ని పనులు చేయవలసింది ఉద్యోగం చేయవలసిందే డబ్బు సంపాదించవలసిందే మానవ సంబంధాలు
(13:02) ఉంచుకోవలసిందే అప్పుడప్పుడు కోపాలు వస్తాయి కానీ కోపం పెట్టుకోవద్దు అనేది నేను రియలైజ్ అయిన చాలా ఏళ్ల క్రితం ఓకే ఎందుకంటే అంటే ఈ అవగాహన వచ్చే కంటే ముందు నాకు ఒక వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది ఆ తర్వాత కోపాన్ని పెట్టుకున్నా నేను నాకు తింటుంటే గుర్తొస్తే అన్నం వదిలేసిపోయేంత కోపం వచ్చింది. ఓకే తర్వాత అనుకున్నా వాడేదో అన్నాడుఏదో చేస్తా అని చేశడు అదేదో అయిపోయింది వై ఐ యమ డూయింగ్ ఆల్ దిస్ కానీ మనసు శాంతిస్తలేదు చూసిన నేను ఓకే ఇదంతా అనవసరం అని తెలిసినా కూడా అది చేస్తా ఉన్నా అనిపించి నా కొడుకులాగా ఆ తర్వాత నేను చదివిన పుస్తకాల వల్లనో
(13:43) ఎక్కడెక్కడో ఉన్న దూరంగా ఉన్న గురువులు చెప్పిన మంచి మాటల వల్లనో సంథింగ్ హాపెన్డ్ ఐ బికమ్ వెరీ ప్లెజెంట్ ఆ తర్వాత రోజుల్లో నేను ఆ వ్యక్తిని కలిసిన చెక్ చేసుకున్నా నాలో ఏ కోపం రాలేదు ఆ గతాన్ని మేము తీసుకొచ్చి ముందలో వేసుకొని మాట్లాడుకోలేదు. ఓకే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు అంత సీరియస్ గా తీసుకోలేదు దాన్ని నేనే గంభీరంగా తీసుకున్నాను.
(14:05) అట్లా కానీ బాబు కొంతమంది ఇట్లా ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి సో అండ్సో పర్సన్స్ అంటే కోపం నచ్చదు చిరాకు అన్ని ఇప్పుడు వాళ్ళకు నచ్చదని మనం వాళ్ళతో కలవకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు ఇట్లా ఇట్లా కూడా బిహేవ్ చేస్తారు అప్పటిదాకా మనతో బాగుంటారు సమాజంలో కొన్ని విషయాలు కుటుంబ కుటుంబంలో వ్యక్తిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.
(14:29) మ్ వ్యక్తిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే మెల్లగా కుటుంబం నుంచి నువ్వు బయటికి వచ్చేసేయాలి సైకలాజికల్గా అందుకే పెళ్లి చేసుకుని బయటికి పోతే అప్పుడు కుటుంబం నుంచి బయటికి వచ్చేస్తావ అన్నట్టు అప్పుడు యు హావ్ ఏ సపరేట్ ఫ్యామిలీ ఇప్పుడు నేను కూడా చెప్తాను నువ్వు నాతో పాటు పని చేస్తే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదంట ఓకే నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు నీకు వెయి ఉన్నాయి అక్కడ నీ యొక్క ఇంటెలిజెన్స్ ఉపయోగించుకో వెన్ యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ యు హవ్ టు వర్క్ ఫర్ మీ యు హవ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై అండర్స్టాండింగ్
(15:00) సో కుటుంబానికి ఇంకో కుటుంబంతో పడినప్పుడు నువ్వు వెళ్లి గెలకడానికి వీలు లేదు. ఓకే ఇది పై పైన లోపట వాళ్ళు కలిసినప్పుడు ఇట్లా మా అమ్మలో కోపం వస్తుంది నీతో మాట్లాడతా మీరు చెప్పబాకండి అని చెప్పు వాళ్ళకి అర్థం చేసుకునే అవగాహన ఉంటే కంటిన్యూ చెయి. ఓకే వాళ్ళు వ్యాపారత చేసుకుంటున్నారు అనుకో వదిలేయ్ ఆ కుటుంబాన్ని ఈ కుటుంబం రెండిటిని వదిలేయ్.
(15:21) అందుకే అందరితో ఈయని ఉండాలి అంతే ఏం మాట్లాడొద్దు. ఉత్తుత్తగానే ఆ మా ఇంటులకు పడదు నేను కూడా మాట్లాడను అనాలి. అట్లా అంటూనే మళ్ళ మధ్య మధ్యన ఆ జ్ఞానానికి సంబంధించిన గుళలికలు ఇంట్లో విసిరేస్తా ఉండాలి. ఓకే స నేను ఒక చెప్పే విషయం చాలామంది చేస్తే బాగుంటుందని కోరుకుంటారు ఖాళీగా ఉంటారు కదా ఏదో ఒక వ్యక్తి పేరు మీద ఒక సంఘటన చెప్పి అంటే ఇల్లు బాగుంటే అక్కర్లే ఒకరిని మార్చాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా కాకుండా సో వేరే వేరే దిక్కుల నుంచి చెప్పాలి మాటలు ఎందుకంటే డైరెక్ట్ గా చెప్తే కోపపడుతున్నారు కదా కోపపడతారు అవును ఉదాహరణకి ఒక వ్యక్తి ఊరికే
(15:58) కోప్పడుతున్నాడు అనుకో నేను అన్ని చూసినా అని వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా ఫ్రెండ్ తో చెప్తున్నాను కోప్పడి కోప్పడం వల్ల ల తన శరీరంలో ఏదో రసాయనిక క్రియ జరిగి ఏదో వ్యాధి వచ్చిందట అసలు కోపడితే కూడా వ్యాధులు వస్తాయా అనితే భలే ఆశ్చర్యపోతున్నా అతనికి చెప్పట్లేదు నువ్వు అతను వింటే విన్నా లేకపోతే లేదు బట్ యు ఆర్ పాసింగ్ అవుట్ సం ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ నీ యొక్క ఇంటెన్షన్ మంచిది.
(16:21) అంతే తప్ప కుటుంబం విషయంలో కోపాలు అవన్నీ ఒకటో రెండో ఇష్యూస్ ఉండొచ్చు. అది పక్కన పెడితే ఇన్ జనరల్ డే టు డే లైఫ్ లో ఏవో సంఘటన వస్తుంది ఏదో సమస్య వస్తుంది ఏదో సందర్భం వస్తుంది ఎవడో ఏదో అంటాడు ఎవడో కాలు తొక్కుతాడు ఆ ఎవడో జుట్టు పీకుతాడు ఎవడో డ్రెస్ ఖరాబ్ చేస్తాడు ఎవడో నీ సీట్లు ఎక్కి ముందే కూర్చుంటాడు ఎవడో నీ ఫోన్ మీద టీ వలక పోస్తాడు ఎవడో నీ చెప్పులు రెండు చెప్పులు ఒకటి తీసుకొని వెళ్ళిపోతాడు.
(16:51) చిన్న సరదా కథ చెప్పనా చెప్పు తెనాలి రామకృష్ణుని టైంలో అందరూ చెప్పులు బయట ఒక దగ్గర వదిలి ఆ మహల్లోకి పోయేవాళ్ళు రాజు దగ్గరికి ఓకే ఈ అష్ట దిక్పాలకులు ఇట్లా ఉంటారు కదా మ్ బయటికి వచ్చేసరికి చెప్పులు ఉండట్లే ఎవరు వెతకపోతున్నారు. మ్ దాంతో అందరికీ కోపం వచ్చింది. మ్ తినాలి రామకృష్ణ మాత్రం రిలాక్స్ గా ఉన్నాడు. ఓకే అదేంది రామకృష్ణ నీ ఒక్కడికి కోపం రావట్లేదు నీ చెప్పులు ఎట్లా వచ్చాయి అంటే ఏదో అదృష్టం బాగుండి అన్నాడు ఇట్లా వారం రోజుల తర్వాత వీళ్ళ చెప్పులు పోతా ఉన్నాయి తినాలి రామకృష్ణుడి చెప్పులు మాత్రం ఉంటున్నాయి వాళ్ళందరూ అక్కడ అసెంబ్లీలో
(17:34) కూర్చుంటుందా రాజువారి దర్బార్లో మొత్తం ధ్యాసంతా చెప్పుల మీదే ఎవడు ఎత్తుకపోతాడేమో అని సో మళ్ళీ వచ్చి చూస్తే చెప్పులు ఉన్నట్లే దాంతో విపరీతంగా అసలు ఎవడు వాడు అని అందరూ అరుస్తున్నారు పిచ్చోడిలాగా ప్రశాంతంగా రామకృష్ణుడు ఉన్నాడు అంటే అతను తెలుసుకున్నాడు ఒక చెప్పు చాలు మనిషిని అశాంతి గుడి చేయడానికి అతను ఆశ్చర్యపోయి అనుకున్నాడంట చెప్పు వెతకపోతేనే ఇంత ఆందోళన పడుతున్నారు వీళ్ళ ఉద్యోగం వీళ్ళ ఆస్తి పోతే ఉంటారా అసలు వీళ్ళు అంతలో ఎవరో పెద్దాయన అడిగాడు రామకృష్ణ ఏదైనా సలహా ఇయ్యవయ్యా ఏముందండి ఒక చెప్పు ఇక్కడ వదలండి ఇంకో చెప్పు
(18:13) ఇంకెక్కడో వదలండి ఒక చెప్పుతో వాడు ఏం చేసుకుంటాడు కరెక్ట్ అందుకని ఒక చెప్పు ఉంది కాబట్టి వదిలేసిపోతాడు. సో నిమ్మలంగా నెక్స్ట్ డే వచ్చి ఒక చెప్పు ఇక్కడ ఒక కిలోమీటర్ ఉన్న తర్వాత ఇంకో చెప్పు వదిలి మళ్ళీ అందరూ అసెంబ్లీ కి పోయారు ఫస్ట్ టైం హాయిగా ఉన్నారు కృష్ణదేవరాయలు ఏదో చెప్తున్నారు అంత బాగానే ఉంది.
(18:32) బయటికి వచ్చి చూస్తే ఆ ఒక్క చెప్పు కూడా లేదు. అవును మళ్లా కోపం వచ్చింది. ఇంకా ఆ రెండో చెప్పు ఏం చేసుకోవాలి ఒక చెప్పు వెతుకపోయిన తర్వాత దాంతో రెండో చెప్పు వదిలేశారు. నెక్స్ట్ డే చూస్తే ఆ రెండో చెప్పు కూడా లేవు వాడు వెతికి తీసుకెళ్ళిపోయాడు. అసలు ఇప్పుడు ఒకడికి డౌట్ వచ్చింది ఇవన్నీ నువ్వు సలహాలు ఇయడం సరే నీ చెప్పులు ఎందుకు పోతలేవు అవును అది చెప్పు నాకు అంటే నేను మీకు రహస్యం చెబుతా నేను మీరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లేట్ గా వస్తున్నా నా చెప్పులు నా తలపాగలో దాచుకొని వస్తాను.
(19:08) నెత్తిన పెట్టుకొని తలపాగ పెట్టుకుంటా అంతే ఏముంది అందులో అక్కడ పోయిన తర్వాత ఎలాగో తలపాగలు తీసేది లేదు చెప్పులు లోబడి ఉంటాయి. అరే ఈ ఐడియా మాకు చెప్పలేదు అన్న తర్వాత అందరు నెక్స్ట్ డే చెప్పులు ఇప్పడం నెత్తన పెట్టుకోవడం తలపాగలు కట్టుకోవడం రాజుగారి దర్బార్కి వెళ్ళడం తీరా వెళ్ళిన తర్వాత ఇక ఏ ఆందోళన లేకుండా హాయిగా ఉన్నారు.
(19:32) ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది. ఏదో విషయం లోపట తినాలి రామకృష్ణుడు ఏదో అంటే వీళ్ళందరూ రామకృష్ణుడిదే తప్పు అన్నారంట. ఓకే అప్పుడు రామకృష్ణుడికి కోపం వచ్చింది ఈ నా కొడుకులకి చెప్పుల విషయం హెల్ప్ చేస్తే వీళ్ళు నన్ను అంటారా వీళ్ళ సంగతి చెప్తా అని నెక్స్ట్ డే వచ్చి లేట్ గా వచ్చాడు అసెంబ్లీకి చెప్పుల దండ మెళలో వేసుకొని వచ్చాడు ఇప్పుడు రామకృష్ణుడు కాతే రాజుగారికి నవరాంద్రాలలోను కాలింది.
(20:02) రామకృష్ణ ఎందుకు ఇట్లా చేసినావ్ అంటే నేనేం చేశనండి నా చెప్పులు బయట ఉంటే ఎత్తుకపోతున్నారుని మెళలో వేసుకొచ్చాను. నేను ఇంకా మెళలోనే వేసుకొచ్చాను వీళ్ళందరూ నెత్తి మీద పెట్టుకొని వచ్చారు దాంతో ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చింది చూడు ఒక చెప్పుల చుట్టూ ఎందరికీ కోపాలు వస్తుంది ఒక చెప్పే ఇన్ని రకాల కోపాలు తెప్పిస్తే మనిషి అనే మాట కోపం తెప్పిడంలో తప్పేమ లేదు.
(20:27) మనిషి చేసే చేష్ట వల్ల కోపం వస్తే తప్పులేదు కానీ కోపం పెట్టుకోవడం తప్పు రామకృష్ణుడి వల్ల మాకు ఇన్సల్ట్ జరిగిందని కోపం పెట్టుకున్నాడు అనుకో దెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం సో ఈ మొత్తం అష్టదిక్పాలకుల్లో ఒక వ్యక్తి కోపం పెట్టుకున్నాడంట ఓకే ఒక వ్యక్తి కోపం పెట్టుకొని రామకృష్ణునికి ఎట్లైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మ్ నిర్ణయించుకున్న తర్వాత ఒకసారి ఈ దర్బార్ లోపటికి రామకృష్ణుడు ఆ చిన్న బురద తొక్క వచ్చాడు.
(21:01) ఓకే అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు కాక కోపం పెట్టుకున్నాడు ఇప్పుడు ఫస్ట్ కథనేమో కోపం గురించి అవును సెకండ్ కథ అందరూ మర్చిపోయారు ఏదోలే రామకృష్ణ అయింది ఏదో అయిపోయింది కానీ ఒక్కడు మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. తాతాజీ గుర్తుపెట్టుకున్నాడు. ఈ బురదతో వస్తే ఏంటి రాజుగారి చెవులో చెప్పాడంట నీ రాజ దర్బారు చాలా గొప్పది దానికి బురదకాళ్ళతో వస్తాడా రామకృష్ణ బురదకాళ్ళతో ఎందుకు వచ్చావ్ దీనికి ఏదనా పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ తాతాజీ మీరే చెప్పండి అన్నాడంట అప్పుడు తాతాజీ అన్నాడంట ఎక్కడి వరకు బురద ఉందో అక్కడి వరకు కాలు కొట్టేయవలసిందే అన్నాడు
(21:39) దాంతో రామకృష్ణునికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి కాళ్ళకి బురద వస్తే ఎవడనా నీళ్లతో కడుక్కోమని చెప్తాడు కానీ క్షమించండి రాజా ఏమ అనుకోవద్దు సో మొదటి తప్పు కాబట్టి క్షమిస్తున్నా అన్నాడు ఆ తర్వాత ఒకానొక తోటలోపట ఆ ఒక గుంత తీసి ఆ గుంతలోపట బుడదంతా నింపి దాని మీద గడ్డ వేసాడంట ఓకే ఎవరు రామకృష్ణ ఆ వేస్తే ఈ తాతాజీ పోతూ పోతూ ఉంటే స్లిప్ అయి అందులో లో పడిపోయిండు.
(22:14) పడిపోయిన తర్వాత తాతాజీ అన్నాంట అక్కడన్న రాజుగారితోటి నా గొంతు వరకు బురద అంటింది ఏం చేయాలంటే మీరు చెప్పిందే గొంతు వరకు తీసేస్తే అయిపోతుంది అన్నాడు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద కోపం కలిగింది దాన్ని ఎక్స్ప్రెస్ చేశవు ఆ తర్వాత నువ్వు పూర్తిగా మర్చిపోయినట్టు నువ్వు ప్రవర్తిస్తేనే మానవ సంబంధాలు బాగుంటాయి.
(22:36) దాన్ని దృష్టిలో పెట్టుకొని మాటి మాటికి అన్నం తింటున్నప్పుడు గొలగడము ఇంకేదో చేస్తున్నప్పుడు ఆరోజు అట్టనే చేసిన అనడం అట్లా చేసామ అనుకో మెల్లమెల్లగా బ్రేక్ అయిపోయి మనిషి ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయే ఒక పెను ప్రమాదం ఉన్నది ఎందుకంటే నువ్వు నిరంతరం కొత్త వ్యక్తులని కలుస్తూ పోవడం అనేది వెరీ టైరింగ్ జాబ్ అది. రాను రాను నువ్వు కలవడం ఆపేస్తావ్. ఇంటర్మీడియట్ లో ఎక్కువ మందిని కలుస్తావ్ అందరికీ హాయ్ చెప్తావ్ హలో చెప్తావ్ సంకల నొప్పి లేసింత చెయ్యి లేపుతావ్ రాను రాను రాను నీకు తల్లెత్తి చూడడం కూడా ఇష్టం ఉండదు.
(23:03) అప్పుడు నీ చుట్టూ ఐదుగురో ఆరుగురో ఇలాంటి ఇబ్బంది లేని మానవ సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉండాలి. అది మన కనీస బాధ్యత ఉన్న ప్రతిఒక్కరితో బిట్టర్గా మారి ప్రతిఒక్కరితో గొడవపడి కొందరిని వదిలేయాల్సి వస్తే వదిలేయాలి కోపం పెట్టుకో అక్కర్లేదు ఒక వంకాయ గాడు ఉన్నాడు వాడి మీద కోపం ఏమ లేదు వదిలేసాను అంతే అట్లా అంటే అసలు నేను చూడను తల తిప్పి కూడా అవసరం లేదు కోపం ఏమి లేదు అది నాకు అవసరం లేదు కొందరు కాశీలో వంకాయలని వదిలేస్తారు నేను ఇంకో చోట ఒక వంకాయని వదిలేసాను అట్లే ఇది ఓన్లీ మాట వరసకు మాత్రమే చెప్తున్నాను అంటే మనం మనుషులతో ఉండాలని కంపల్సరీ ఏమీ లేదు కానీ ఎవరో కొందరు మనుషుల మధ్యన మాత్రం మన
(23:39) జీవితం వెళ్లదీయవలసిందే ఎందుకంటే ముసలిగ అయిన తర్వాత నువ్వు తగ్గితే నీళ్లుయడానికో నీకుఏదనా ప్రాబ్లం వస్తే ఎవరన్నా క్విక్ గా ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికోక మనుషులు ఉపయోగపడతారు. మనిషి సాయము మాట సాయము ఖచ్చితంగా ఉంటుంది. అది అది లేకుండా అసలు జీవితం ముందుకు వెళ్ళదు నరక ప్రాయంగా ఉంటుంది. అట్లీస్ట్ నా అవగాహనలో అది ఈవెన్ రమణ మహర్షి ఎవరితో సంబ బంధాలు లేకపోయినా మనుషులతో ఉన్నాడు ఆయన నిరంతరం ఆయన చుట్టూ మనుషులు ఆయనక ఎవరితో బంధాలు లేవు కానీ మనుషులతో ఉన్నాడు అట్లా మనం బంధం పెట్టుకోకలి మనుషులతో ఉండాలి చిన్న చితకా వస్తే కోపం
(24:16) ప్రదర్శించాలి ఆ కోపాన్ని ఎక్స్టెండ్ చేయకూడదు ఇప్పుడని మళ్ళ మధ్యాహ్నం అని రాత్రిఅని బంధువులు వస్తే వాళ్ళ ముందు వీడు చూసావు ఏం చేశడు అని చెప్పి మళ్ళీ ఎక్కడో పెళ్లికి వెళ్తే వీడు చూసావు ఏం చే అప్పుడు అప్పుడు అద్వేషంగా మారుతుంది. కోపం వస్తే వెంటనే వ్యక్తపరచాలి రెండు నిమిషాల్లో సరే అయింది ఏదో అయింది ఇంకోసారి చేయొద్దు అనాలి.
(24:34) నెక్స్ట్ నివేదన విషయంలో ఎదుటి వ్యక్తి కోపం చెప్పిస్తే వాళ్ళు అట్లా అంటే ఒప్పుకోవాలి. ఆ కోపం వచ్చే రైట్ మనందరికి ఉంది సో ఇది నేను చెప్పాలనుకున్నా సో కోప్పడు సహజం ఎంతసేపు కోప్పడాలన్నది నీ యొక్క వివేకము జీవితం పట్ల నీకున్న అవగాహన వల్ల తెలుస్తుంది. కోపం పెట్టుకోవద్దు అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అనేది నేను చెప్పాలనుకుంటున్నా సరేనా మరి ఓకే సరే మరి ఉంటాను ఫోన్ పెట్టేస్తున్నా కోపం పెట్టుకోకు పెట్టుకోను

No comments:

Post a Comment