Sunday, October 11, 2026

 దండ కట్టేటప్పుడు దారం అనుకుంటుంది... ఈ పువ్వులకు నేనే ఆధారం అని.
కానీ పువ్వులేమో... ఆ ఆధారాన్నే సంకెళ్లుగా చూస్తాయట.
ఒకరికి ఆధారం అనిపించేది మరొకరికి బంధనంగా అనిపిస్తుంది.
ఎంత అందమైన బంధమైనా... చివరికి వాడిపోయిన దండే అవుతుంది.
బంధం నిలవాలంటే ఆధారం ఉండాలి... అంతకంటే ముందు అర్థం చేసుకునే మనసుండాలి.
            😊శుభరాత్రి 🙏🏻

No comments:

Post a Comment