ఈ రహస్యం తెలిస్తే నిధి మీ సొంతం! | Secret of Finding Ancient Treasures
Author Name:Vishwak Datta
Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Qoow5Tak3Pc
Title: ఈ రహస్యం తెలిస్తే నిధి మీ సొంతం! | Secret of Finding Ancient Treasures
Author Name: Vishwak Datta
Description: ⚠️ DISCLAIMER: This video discusses ancient treasure hunting methods, tantric practices, folklore, and traditional beliefs for educational and informational purposes only. These claims should not be treated as scientifically proven methods or guarantees of finding treasure. Do not attempt dangerous rituals, unauthorized excavations, or activities that damage historical sites. Respect applicable laws, property rights, and archaeological heritage.

How did people in ancient times believe they could locate hidden treasures? What lies behind the mysterious rituals, tantric secrets, and traditional methods associated with finding buried wealth?
In “ఈ రహస్యం తెలిస్తే నిధి మీ సొంతం! | Secret of Finding Ancient Treasures,” we explore ancient treasure hunting methods, hidden treasure legends, and the beliefs surrounding secret riches buried beneath the earth.
Beyond the mystery, this video also discusses the realities, misconceptions, and dangers surrounding treasure hunting. The promise of discovering ancient wealth can be fascinating—but understanding the claims and their consequences is just as essential.
🔎 IN THIS VIDEO:
• Ancient methods traditionally associated with finding hidden treasures
• Stories and beliefs surrounding buried wealth and secret riches
• Tantric practices and rituals linked to treasure hunting traditions
• Warnings about dangerous practices and misleading claims
• The distinction between folklore, belief, and established evidence
If you enjoy Telugu mystery videos, ancient Indian mysteries, hidden treasure stories, and explorations of traditional beliefs, this video takes you into the fascinating world of ancient treasure secrets—with a closer look at the realities behind the legends.
💬 Have you heard a hidden treasure legend from your region? Share the story in the comments without revealing sensitive locations or private information.
👍 Like the video if you found it interesting, share it with someone who loves ancient mysteries, and subscribe for more Telugu explainers exploring history, secrets, and the stories behind popular beliefs.
#AncientTreasures #TreasureHunting #TeluguMysteries
Transcript:
(00:00) ఇది రాత్రి 12 గంటలు అవుతుంది. అక్టోబర్ 9 శుక్రవారం అండ్ బయట చలి బాగా వేస్తూ ఉంది. 9 డిగ్రీల టెంపరేచర్ ఉంది. నేను గత కొన్ని రోజులుగా ఒక శబ్దాన్ని వింటూ ఉన్నాను. ఇది నేను గత తొమ్మిది 10 రోజుల నుంచి రికార్డ్ చేయాలని ప్రయత్నిస్తూఉన్నాను కానీ నాకు కుదరలేదు ఎందుకంటే రికార్డ్ చేయాలని వస్తూ ఉన్న ప్రతిసారి అది నాకు వినిపించకుండా ఉండేది.
(00:35) ఇవాళ కాస్త ఎక్కువగా వినిపిస్తుంది. మీకు ఇంకా కొద్దిగా ఫోకస్ లోనే చూపిస్తున్నాను బహుశా ఇది కెమెరాలో వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేను ఎడిటింగ్ చేసేప్పుడు నాకు తెలుస్తుంది. కాస్త నేరగా చేస్తాను ఎగజాక్ట్ గా ఈ పాయింట్ లో నుంచి సౌండ్ వస్తుంది. నేను కాస్త గమనిస్తూ ఉన్నప్పుడు అది ఇక్కడి నుంచి అక్కడి వరకు ట్రావెల్ అయి వెళ్తుంది.
(01:13) అనంత పద్మనాభ స్వామి నిధి మిస్టరీ గురించి వీడియో చేసినప్పుడు మీలో ఎందరో ఆ నిధుల గురించి ఎంతో ఆసక్తిని చూపించారు. నిధుల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. అవి జీవితాలని మారుస్తాయని కొందరు నాశనం చేస్తాయని మరి కొందరు చెప్తూ ఉంటారు. గుప్తనిధులు, లంక బిందెలు ఇటువంటివి భూమిలో ఉండటం అనేవి సర్వసహజం. సో ఇవి ఉన్నాయా లేవా అన్నదే ప్రశ్నే కాదు.
(01:32) ఇవి ఎందుకింత మిస్టరీగా ఉంటాయి అన్నదే ప్రశ్న. వీటికి కాపలాగా ఉన్న కొన్ని అదృశ్య శక్తుల వలన వీటి మీద ఉన్న ఆశలు, భయాలు మరింత పెరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటివి? ఇటువంటి నిధులు కనుక నిజంగా ఉంటే అవి ఎక్కడ ఉంటాయి? వాటిని ఎలా కనుక్కోవాలి? తాంత్రిక పద్ధతిలో ఎలా కనిపెడతారు? ఎలా బయటికి తీస్తారు? అని దీనికి చెల్లించే మూల్యం ఎంత? రాత్రి నేను రికార్డ్ చేసిన విధంగా ఆ శబ్దాలు అనేవి నేను ఒకప్పుడు పల్లెటూర్లో ఉన్నప్పుడు వినిపిస్తూ ఉండేవి.
(01:55) ఎవరో నడుస్తూ ఉన్నట్టుగా బహుశా మీలో కూడా చాలా వరకు ఈ శబ్దాలను వినే ఉంటారు. ఏం చెప్పేవాళ్ళ అంటే అది రాత్రిలో తిరుగుతూ ఉంటుంది అది ధన పిశాచి అని కానీ ఎవరే కానీ అది ఏంటో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది ఎందుకు తిరుగుతుందో కూడా చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుండి సైన్స్ అంటే చాలా ఇష్టం. కుతూహలం ఎక్కువ ఎవరు కనిపిస్తే వాళ్ళ తల తినేవాడిని అయినప్పటికీ నాకు దీని గురించి ఆన్సర్స్ దొరకలేదు.
(02:15) మరి కొందరైతే ఒక పురుగు చేసే శబ్దం అని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు దాన్ని కన్ఫార్మ్ చేసుకునేందుకు రాత్రి నిద్రలేచి ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. విచిత్రంగా అక్కడ ఒక క్రికెట్ అనే పురుగు కనిపించింది. ఒక మిడత లాంటిది. బహుశా రాత్రి నాకు వినిపించేది కూడా అదే అయి ఉండొచ్చు. కానీ నేను ఆ రోజు సాటిస్ఫై అవ్వలేకపోయాను.
(02:33) ఎందుకంటే మరుసటి రోజు వచ్చిన శబ్దాలు చాలా డిఫరెంట్ [సంగీతం] గా ఉన్నాయి. అది మిడత చేసే శబ్దం లాంటిదే కానీ కాదు. అప్పటికీ ఇంటర్నెట్ యాక్సెస్ అంతగా లేదు. చాలా రేర్ గా ఉండేది. అయినా సరే నేను ఇంటర్నెట్ లో మొత్తం వెతికాను. ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్న వాళ్ళ పోస్ట్లని ఫారమ్స్ ని చదివాను. వాళ్ళలో ఎందరో ఒక విషయాన్ని చెప్పి ఉన్నారు.
(02:50) అదేంటంటే ఈ గజ్జల శబ్దాలు రెండు రకాలుగా ఉంటాయి అని. ఒకటి మెడత చేసే శబ్దం మరొకటి ఆ మెడత కాదు అని స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఆ టైం లో ఒక విషయం తెలిసింది. అదేంటంటే కొన్ని శబ్దాలకి ఈనాటికి కూడా సైంటిస్ట్ల దగ్గర ఎక్స్ప్లనేషన్స్ లేవు అని. అంతెందుకు ఈ కొండను చూసారా ఎగ్జాక్ట్ గా ఇదే స్పాట్. నైట్ ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఒక రౌండ్ షేప్ లో వైట్ బాల్ లాంటి ఒక ఫ్లాష్ వచ్చింది. కొన్ని సెకండ్ల పాటే ఉంది.
(03:12) సాధారణంగా ఆ కొండ నుండి పడే ఏ లైట్ ఇక్కడి వరకు చేరుకోదు. అలాంటిది ఆ ఫ్లాష్ అనేది డైరెక్ట్ గా నా ఫేస్ మీద పడింది. నా పక్కనే ఎవరో కూర్చొని ఒక ఫోన్ లో టార్చ్ లైట్ ని వేశారు అనేంత ఎక్కువ లైట్ వచ్చింది. దీనికి కూడా ఏవేవో సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి. కానీ క్లియర్ గా లేవు. అంటే నేను ఉన్న ఈ ప్రాంతాలని దేవభూమి అని పిలుస్తారు.
(03:32) దేవతలు తిరిగిన ప్రదేశం తిరుగుతూ ఉన్న ప్రదేశం. సరే ఈ పెంత శబ్దాల గురించి కొందరి గురువులని అడిగాను. తెలిసిన విషయం ఏంటంటే ఇది నిధులకి పాతి పెట్టిన బంగారానికి సంబంధించినది [సంగీతం] అని కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి శబ్దం వచ్చిన ప్రతి చోట బంగారం ఉంటుందని అర్థం కాదు. నాకు ఈ విషయం తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది.
(03:50) ఇది ఏంటో తెలుసుకోవాలని మొదలు పెట్టాను. ఇదంతా మన కోవిడ్ లాక్ డౌన్ టైం లో మొదలైన సంఘటన. నేను తెలుసుకున్నవి అన్వేషించినవి ఇవాళ ఈ ఎపిసోడ్ లో మీకు చెప్పబోతున్నాను. ఇంతవరకు నిధుల గురించి ఎవ్వరు చెప్పని కొన్ని నిగూడ రహస్యాలు ఈ ఎపిసోడ్ లో ఉన్నాయి. ఎపిసోడ్ చివరి వరకు చూస్తే మీకు ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. విశ్వక్ దత్త YouTube ఛానల్ కి మీకు స్వాగతం.
(04:19) కోవిడ్ లాక్ డౌన్ టైం లో నాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి నిధులకు సంబంధించిన కలలు వస్తూ ఉండేవి. ఒక ప్రదేశం అక్కడ నిధి ఉండటం దానిని తవ్వి తీయమని ప్రేరేపణ జరగడం లాంటివి వస్తూ ఉండేవి. నేను అతని కలలో వచ్చిన కొన్ని విషయాలని రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ తో క్రాస్ చెక్ చేసి చూశాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎన్నో విషయాలు అతని కలలో వచ్చినవి నిజ జీవితంలోకి మ్యాచ్ అవుతూ ఉన్నాయి.
(04:39) చాలా రోజుల తర్వాత అతడు నిజమే చెప్తున్నాడని అర్థమైంది. సరిగ్గా అప్పుడే నేను ఈ నిధుల గురించి చదవడం మొదలుపెట్టాను. నిధులు మొత్తం రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది దేవాలయాలకు సంబంధించినవి. యాక్చువల్ గా వీటినే నిధులు అని పిలవాలి. ఐ మీన్ దేవాలయాలకు సమర్పించి భూమిలో పాతిపెట్టిన బంగార సంపదని నిధి అని పిలుస్తారు. ఎన్నో కారణాల చేత విలువైన బంగారాన్ని వజ్రాలని ఒక దేవుడికి సమర్పించి అది ఏ మనిషికి దక్కకుండా కొన్ని బంధనాలు చేస్తారు.
(05:04) బంధనం అంటే ఒక సంకల్పం లాంటిది. నేను ఈ పనిని చేసి తీరుతాను అని చెప్పినప్పుడు మన మనసు శరీరం ఎలాగైతే ఆ మాటకి కట్టుబడతాయో అదేవిధంగా ఒక శక్తికి ఐ మీన్ ఎనర్జీకి ఒక సంకల్పాన్ని ఇస్తే అది దానికోసమే కట్టుబడి ఉంటుంది. వీటి కోసం కొన్ని యక్షిణీయులని, యక్షులని, బేతాలులని ఆవాహన చేసి ఐ మీన్ ఇన్వైట్ చేసి వాటిని మెప్పించి ఒక మాట తీసుకుంటారు.
(05:27) నువ్వు ఈ నిధులని కాపాడి తీరాలి అని. వీళ్ళు వాటిని తృప్తి పరుస్తూ ఉండడం చేత అవి తీసుకున్న మాటకి కట్టుబడి ఉంటాయి. ఈ సమస్త [సంగీతం] విశ్వం కేవలం మనుషులదే కాదు ఎన్నో రకాలైన ప్రాణులు ఇక్కడ ఉంటాయి. ఎన్నో మండలాలు ఉంటాయి, ఎన్నో గెలాక్సీలు ఉంటాయి, ఎన్నో లోకాలు ఉంటాయి, ఎన్నో జాతులు కూడా ఉంటాయి. వాటిలో ఒకటే ఈ యక్ష జాతి, బేతాళ జాతి ఎక్సెట్రా మనం త్రీ డైమెన్షన్ లో ఉంటే అవి కాస్త హైయర్ డైమెన్షన్ లో ఉంటాయి.
(05:49) ఒక ఆకుని కట్ చేసినప్పుడు దాని యొక్క ఆకారం ఇంకా ఒక ఎనర్జీ ఫార్మాట్ లో అలానే ఉంటుందని ఈ మధ్య సైన్స్ నిరూపించింది. అంటే ఒక లైఫ్ అనేది కేవలం భౌతిక శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎక్సాక్ట్లీ ఇదే విధంగా దేవ యక్ష నాగ గంధర్వ కిన్నర కింపురుష గరుడ అలాగే భూత ప్రేత పిశాచ రాక్షస అసుర ఇలా ఎన్నో జాతులు ఉంటాయి.
(06:10) వాటిని ఎలా ఆవాహన చేయాలో తంత్ర విద్యల్లో ఉన్నాయి. ఎంతో శక్తివంతమైన తాంత్రికుడు అయి ఉంటే తప్ప వీటిని ఆవాహన చేయడం అసాధ్యం. పొరపాటున కూడా ఈ గుడికి సంబంధించిన నిధుల మీద కనీసం ఆశ కలిగిన చాలు. వాటి ప్రభావం మన మీద కనిపించడం మొదలవుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక అప్పోలోస్ వీటికి సరైన ఆధారాలు లేవు కదా అని అందరూ అడుగుతూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పాలి నేను చిన్నప్పటి నుండి నా కల్లారా ఒక విషయాన్ని చూశాను.
(06:31) మా ఊర్లో అమ్మవారి జాత్ర జరిగిన ప్రతిసారి అది ఎంత ఎండాకాలం అయినా సరే మరుసటి రోజు వర్షం పడుతుంది. దానితో అమ్మవారు సంతోషించింది అని అందరూ నమ్ముతారు. ఇది నేను కల్లార చూస్తూనే పెరిగాను. దీనికి ఎటువంటి సైంటిఫిక్ వివరణ లేదు కానీ అది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది కూడా ఒక ఫోక్ లోరే. ఫోక్లో అయినంత మాత్రాన కొట్టి పారాయాలని అర్థం కాదు.
(06:51) అలా వీటి జోలికి వెళ్లకూడదని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ కొందరు ఈ నిధులు వెంటపడుతూ ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా వెంటపడుతూ ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే ఆ వెంటపడుతూ ఉన్న ఆ నిధి ఒక గుడికి సంబంధించిన దేవనిధా కాదా అనేది ఎలా తెలుసుకోవాలో కాసేపట్లో చెప్తాను. ఇకపోతే రెండవది నికిత నిధులు. వీటినే కొందరు పాతులు అని పిలుస్తారు.
(07:11) ఎవరైనా రాజులు వాళ్ళు సంపాదించిన ధనం వాళ్ళ కుటుంబానికే చెందాలని కోరికతో దాచిపెట్టి ఉన్న నిధులు. కేవలం రాజులే కాదు ఎవరైనా సరే వాళ్ళ సంపద వాళ్లే అనుభవించాలని ఆశతో లేదా వాళ్ళ కుటుంబంలో రాబోయే తరాలు వాళ్ళు వాడుకోవాలి అనే కోరికతో మరికొందరు వచ్చే జన్మలో కూడా నా సంపద నేనే అనుభవించాలి అనే కోరికతో దాచిపెడుతూ ఉంటారు.
(07:31) వీటినే పాతులు అని అంటారు. వీటికి ఎటువంటి యక్షుణులు కాపలకాయ కానీ వీటి దగ్గర కొన్ని ఆత్మలని లేదా పిశాచులని ఆవాహన చేసి కొన్ని బలులని సమర్పించి అక్కడే స్థిరంగా ఉండే విధంగా కొన్ని తంత్రాలతో బంధిస్తారు. ఆ యజమాని బ్రతికున్నంత కాలం ప్రతి అమావాస్యకి లేదా కొన్ని ప్రత్యేక రోజుల్లో వాటికి ఇలా బలులని సమర్పిస్తూ తృప్తి పరుస్తూ ఉంటారు. అలా అవి అక్కడే స్థిరపడిపోతాయి.
(07:52) ఈ గజ్జల శబ్దాలు అని ఏవైతే చెప్పానో అవి ఈ పిశాచులు చేసే పనే అని నేను తెలుసుకున్నాను. ప్రతి గజ్జల శబ్దం పిశాచులవి కావు. కానీ కొన్ని సందర్భాల్లో అలా పాతి పెట్టిన నిధి మీద విపరీతమైన ఆలోచనతో కోరికలతో ఆ యజమాని చనిపోతే ఆ యజమాని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళకుండా ఆ ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానినే ధన పిశాచి అని అంటారు.
(08:13) ఉన్న ఆస్తుల మీద కోరికలు ఏమాత్రం తగ్గకుండా చనిపోయిన యజమాని ఆ ఆస్తులనే పట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళనే ధన పిశాచి అంటారు. ఈ బంధించిన పిశాచులు లేదా ధన పిశాచులు వాళ్లు దాచిపెట్టిన ఈ సంపద వాళ్ళ తర్వాతి తరానికి తెలియజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాల్లో భాగమే ఈ కలలు రావటం కలలో ప్రేరేపణ జరగటం శబ్దాలు వినిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు కొన్నిసార్లు అదే పనిగా మన ఇంట్లో ఉండే జీవాన్ని కోల్పోయే విధంగా చేసి బాధలకు గురి చేసి అప్పుడు కలలో సంకేతాలు ఇస్తూ ఉంటాయి.
(08:43) అప్పుడైనా సరే నువ్వు ఈ నిధిని బయటికి తీసే ప్రయత్నం చేస్తావు అని ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారని కొందరు గురువులు చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ ఎందరో ఈ నిధులని పట్టాలి జీవితాలని మార్చుకోవాలి అని చూస్తూ ఉన్నారు. వీటిని [సంగీతం] ఎలా గుర్తించాలి ఎన్నో విషయాల గురించి గ్రంథాల్లో పురాతన పుస్తకాల్లో రాసి ఉన్నారు కదా అలాంటప్పుడు ఈ నిధుల గురించి కూడా ఏదో ఒక పుస్తకంలో ఉండే ఉంటుంది అని దానికోసం వెతికాను ఎంత వెతికినా నిధులకు సంబంధించిన ఒక్క డెడికేటెడ్ పుస్తకం కూడా దొరకలేదు కొన్ని పుస్తకాలు కనిపించినప్పటికీ వాటిలో ఇన్ఫర్మేషన్ అంత స్పష్టంగా లేవు కానీ విచిత్రంగా 500
(09:15) శతాబ్దం యొక్క ప్రాంతంలో అందరి మతులను పోగొట్టిన ఒక సైంటిస్ట్ రాసిన పుస్తకం నాకు కనిపించింది. అది నిధులకు సంబంధించినది కాదు కానీ అందులో వాటికి సంబంధించిన కొన్ని ఆనవాలు నాకు కనిపించాయి. ఆ సైంటిస్ట్ పేరు వరాహ మెహరుడు. వరాహ మేరుడు ఎన్నో విషయాల గురించి లోతైన అన్వేషణ చేసి ఉన్నాడు. ఈ ప్రకృతిలో జరిగే కొన్ని పాటర్న్స్ ని ఎంతో లోతుగా పరిశీలించి ఉన్నాడు.
(09:38) ఆకాశంలో ఉండే స్టార్ పాటర్న్స్ ని వాటి అర్థాలని వివరించాడు. ఆనాడే చంద్రుడు ఎలా కాంతిని ఇస్తున్నాడని లైట్ రేస్ గురించి వివరించి ఉన్నాడు. గ్రహణాలు ఛాయా గ్రహాలు గురించి చెప్పి ఉన్నాడు. అంతే కాదు భూమి పైన కనిపించే కొన్ని సంకేతాలని ఆధారంగా తీసుకొని భూమి లోపల ఎంత లోతులో ఎంత దూరంలో నీటి జాడలు ఉన్నాయో వివరించి ఉన్నాడు. మేఘాలని, గాలులని, ఉరుములని, మెరుపులని ఆధారంగా తీసుకొని, పశువులని, పక్షులని, చెట్టుకు కాసే పండు యొక్క బిహేవియర్ పాటర్న్స్ ని ఆధారంగా తీసుకొని రాబోయే ఎన్ని రోజుల్లో వర్షం పడబోతుందో అన్నది స్పష్టంగా వివరించి ఉన్నాడు. కొన్ని లిక్విడ్స్ ని
(10:11) ఎంత మోతాదులో దేనితో కలిపితే ఒక అద్భుతమైన పర్ఫ్యూమ్ తయారవుతుందో కూడా చెప్పి ఉన్నాడు. అతడు వాస్తు శాస్త్రంలో నిపుణుడు. అదేవిధంగా అతడు రాసిన బృహత్ సంహిత అనే గ్రంథంలో ఈ నిధుల యొక్క జాడలు ఉన్నాయి. నిజానికి అతని లక్ష్యం ఈ నిధులు కాదు. ఈ నీటి జాడలని వర్షాలని పక్షుల బిహేవియర్ ని అనలైజ్ చేసే ప్రక్రియలో అతడు కొన్ని విషయాలను కనుక్కున్నాడు.
(10:31) మొదటిగా నీటి యొక్క జాడలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒకప్పుడు మనుషులు జీవించేవారు అనేది ఒక అంచన. ఒకప్పుడు మనుషులు జీవించి ఆ తర్వాత కాలంలో ఆ ప్రదేశం నిర్మానుషంగా మారితే అక్కడ కచ్చితంగా నిధులు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పాడు. [సంగీతం] ఎంతో కాలం నుండి ఒక పాముల పుట్ట ఒక నిర్మానుష్య ప్రదేశంలో కనుక ఉంటే దాని అర్థం ఆ ప్రదేశం యొక్క భూగర్భంలో నీటి జాడలు ఉన్నాయని పాముల పుట్ట పాములు కట్టుకున్నవి కావు అవి చీమల చేత కట్టబడినవి చీమలు ఎప్పుడూ చల్లని ప్రదేశాల కోసం అన్వేషిస్తూ ఉంటాయి అంతేకాదు ఈ నిధులకు దారి చూపిస్తూ ఉంటాయని కూడా చెప్పాడు కాబట్టి ఇటువంటి
(11:04) ప్రదేశాల్లో మనకు నిధులు కనపడే అవకాశాలు ఉంటాయి 2012 14 మధ్యకాలంలో జరిగిన కొన్ని స్టడీస్ ప్రకారం చీమలు భూగర్భంలో ఉన్న గోల్డ్ డిపాజిట్స్ కి ఒక ఇండికేటర్ లాంటివి అని నిరూపణ చేశారు. అవి ఈ బంగారాన్ని చిన్న మోతాదులో బయటకి కూడా తీసుకు వస్తూ ఉంటాయి అని చెప్పారు. ఇకపోతే బాగా గడ్డి మొలిచే చోట ఒక స్క్వేర్ షేప్ లో నాచురల్ గా గడ్డి మొలవకపోతే లేదా ఎటువంటి చెట్లు లేని ఒక ప్రదేశంలో ఒక షేప్ లో గడ్డి మొలిచి ఉంటే ఆ ప్రదేశాన్ని గమనించమని చెప్పి ఉన్నాడు.
(11:32) కొన్ని బాగా బలంగా పెరగాల్సిన చెట్లు ఐ మీన్ మర్రి చెట్లు, కొబ్బరి, రావి, చింత చెట్లు [సంగీతం] ఇటువంటివి కనుక విచిత్రంగా పెరగడం జరుగుతూ ఉంటే వాటి కింద బంగారం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. నిధుల మీద చెట్లు పెరగడం మొదలైతే ఆ చెట్లు మెటల్ స్ట్రెస్ [సంగీతం] కి గురయ్యి సరిగ్గా పోషకాలు అందవు. కొన్నిసార్లు మరీ ఎక్కువగా పోషకాలు అందుతాయి.
(11:51) దానితో అది బలహీనపడిపోతుంది కొన్నిసార్లు మరింత బలంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు తలలు ఉన్న కొబ్బరి చెట్లు. మర్రి చెట్టు యొక్క కాండం ఎంతైతే ఉంటుందో దాని ఊడలు కూడా అంతే సైజులో కనుక భూమిలో దిగబడి ఉంటే అది కూడా ఒక సంకేతమే. ఎక్కువ ఛాన్సెస్ లో అంత బలమైన చెట్లు బలహీనపడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మరింత బలంగా మారుతూ ఉంటాయి.
(12:09) ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇందులో ఒక రహస్యం ఉంది. ఇకపోతే మరొక విషయం నన్ను చాలా ఆశ్చర్యం కలిగించింది. ముళ్ళున్న చెట్లు బాగా పెరిగిన ప్రదేశంలో ఒకే ఒక చెట్టు కనుక ముళ్ళు లేకుండా పెరిగితే లేదా ముల్లులు లేని చెట్ల జాతి గుంపులో ఒక చెట్టు ముళ్ళతో పెరిగితే ఆ ప్రదేశాన్ని మార్క్ చేసుకొని అక్కడి నుండి ఎగజాక్ట్ గా మూడు కరముల పడమరి దిక్కులో 3.
(12:30) 3 పురుషాల లోతుకి తవ్వితే అక్కడ కచ్చితంగా ఏదో ఒక నిధి ఉంటుందని చెప్పాడు. కరములు అంటే ఒక క్యూబిట్ ఐ మీన్ ఒక మూరడు అని అర్థం. అలాగే ఒక పురుషం అంటే 24 అంగుళాలు అని అర్థం. ఒక అంగులం అంటే ఒక బొటన వేలంత సైజు అనుకుందాం. సో ఒక పురుషాన్ని అడుగుల్లో చెప్పాలంటే దగ్గరగా ఆరు అడుగులు ఇలాగ 3.3 పురుషాలు అంటే దగ్గరగా 20 అడుగుల లోతు.
(12:50) సో దీని అర్థం ఆ వింతగా కనిపించిన చెట్టు నుండి మూడు మూరాల పడమరి దిక్కులో 20 అడుగుల లోతుని తవ్వితే నిధులు కానీ లంక బిందులు కానీ వండే అవకాశాలు ఎంతో ఉన్నాయని అతను వివరించి ఉన్నాడు. మీరు ఎప్పుడైనా వ్యాక్ టైల్ అనే పక్షి గురించి విన్నారా కాటుక పిట్ట అని కంజిరేటం అని జిట్టలు అని లేదా జెట్టంగి [సంగీతం] అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక హైపర్ సెన్సిటివ్ పక్షి.
(13:09) తన తోకని ఒక ఇండికేటర్ లాగా ఆడుస్తూనే ఉంటుంది. ఇది మనుషులకి అర్థం కాని సూక్ష్మమైన [సంగీతం] వైబ్రేషన్స్ ని అన్ని జంతువుల కంటే కూడా ముందుగా పసికడుతుందని సైన్స్ చెబుతుంది. రాబోయే ప్రమాదాలని వెదర్ చేంజెస్ ని కూడా పసికడుతుంది. వరాహ వీరుడు తను ఈ పక్షిని లోతుగా అన్వేషించి చెప్పిన ఒక విషయం ఏంటంటే రెండు [సంగీతం] కాటుక పిట్టలు సంభోగం చేసుకున్నట్టు కనుక నువ్వు గమనిస్తే ఆ ఎగజాక్ట్ స్పాట్ లో బంగారం దాచిపెట్టబడి ఉంటుందని చెప్పాడు.
(13:34) అలాగే ఆ పక్షి వామిట్ చేసుకున్న ప్రదేశాన్ని కనుక నువ్వు గమనిస్తే అక్కడ రత్నాలు డైమండ్ బీడ్స్ లాంటివి ఉంటాయని చెప్పాడు. అలాగే ఆ పక్షి మల విసర్జన చేసే చోటులో బొగ్గు గణులు ఉంటాయని చెప్పాడు. వీటి గురించి ఇంతవరకే చెప్పి ఉన్నాడు కానీ మరింత లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే ఇంకొక విచిత్రమైన అబ్జర్వేషన్ ని చెప్పి ఉన్నాడు.
(13:52) మీరు ఒక ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఏదో ఒక పక్షి సూర్యుడికి ఆపోజిట్ డైరెక్షన్ లో తలను తిప్పి చాలా హాయిగా ప్రశాంతంగా తియ్యగా పాట పాడుతూ ఉన్నట్టు గమనిస్తే అదే సమయంలో ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఎక్కడ నిలబడి ఉన్నాడు అండ్ ఆ సమయంలో ఏం చేస్తున్నాడు అని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సో అప్పుడు సూర్యుడు వెస్ట్ డైరెక్షన్ లో ఉంటాడు.
(14:13) దానికి ఆపోజిట్ గా ఒక పక్షి తన తలను తిప్పి ప్రశాంతంగా పాట పాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఆ ఇంటి యజమాని తన మోకాలని తాకుతూ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మనం వాస్తు పురుషుడి చార్ట్ ని ఓపెన్ చేయాలి. ఇది వాస్తుకు సంబంధించిన ఒక డయాగ్రామ్. ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఇమేజ్ నే వాస్తు పురుషుడు అని అంటారు. యజమాని ఆ టైంలో మోకాలిని పట్టుకున్నాడు కాబట్టి వాస్తు పురుషుడి మోకాలి ప్రాంతంలో ఉన్న గదిలో తవ్వటం చేత ఇక్కడ నిధులు ఉంటాయని చెప్పాడు.
(14:37) విచిత్రంగా ఉంది కదా కానీ ఎంత లోతుకి తవ్వాలో ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈ విధంగా వరాహ మిహిరుడు జియోలాజికల్ పాటర్న్స్ ని బిహేవియర్స్ ని అబ్సర్వ్ చేసి ఎన్నో విషయాలని పొందుపరిచి ఉన్నాడు. ఇవి కాకుండా మరికొన్ని తాంత్రిక పద్ధతుల ప్రకారం నిధులు ఎక్కడఉన్నాయో చూపించే కొన్ని మంత్రాలు ఉన్నాయని ఎక్కడున్నాయో చూపించే అంజనాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు.
(14:56) రావణాసురుడు పరమశివుడిని ఎన్నో కోరికలని అడుగుతాడు. ఆ కోరికల్లో కొన్ని ఈ బంగారం నిదల గురించి కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన యక్షిణీలని దర్శించుకొని వాళ్ళ దగ్గర నుండి ఒక మాయ అంజనాన్ని పొంది ఆ అంజనాన్ని కంటికి కాటుగలాగా రాసుకుంటే చూసిన ప్రదేశంలో నిధులు ఉన్నాయా లేదా అని కనిపిస్తుంది. అటువంటి యక్షిని సాధనలని పరమశివుడి నుండి వరంగా పొందాడు రావణాసురుడు.
(15:19) మరికొన్ని తాంత్రిక పద్ధతుల్లో చెప్పిన దాని ప్రకారం కొన్ని ప్రత్యేకమైన మూలికలతో తయారు చేసిన ఒక గులికని అంటే ఒక టాబ్లెట్ ని వేసుకుంటే ఆ నిధులకి కాపలా కాసే శక్తులకి మనం కనిపించమని మెన్షన్ చేసి ఉన్నారు. ఆ గులికలో మెర్క్యూరీ కూడా కలిసి ఉండటం నేను గమనించాను. మెర్క్యూరీ అనేది చాలా విషపూరితమైనది. అందుకే ఆ పద్ధతిని నేను ఇక్కడ చెప్పటం లేదు.
(15:37) ఇంతే కాదు కేరళ వాళ్ళు ఫాలో అయ్యే అష్టమంగళ ప్రశ్నల ద్వారా నిధులని కనుక్కుంటూ ఉంటారు. అది ఎలా ఉంటుందో బ్రీఫ్ గా చెప్తాను వినండి. ఒక పాత ఇంటి కింద నిధి ఉందని అనుకుందాం. అది ఇంట్లో ఏ వైపు ఉంది? ఎంత మోతాదులో ఉంది. అసలు అక్కడ నిధి ఉందా లేదా అనేది చెప్పడానికి ఈ మెథడ్ ని వాడతారు. కేరళాలోని అష్టమంగళ ప్రశ్న సంప్రదాయంలో ఇలాంటి ప్రశ్నలను పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది.
(16:03) ఈ పద్ధతిలో మనకు కనిపించేవి ఒక దీపం. 12 రాశుల ఒక డయాగ్రమ్. ఒక బంగారు మొక్క, 108 గవ్వలు. వీటిని ఉపయోగించి నిధి గురించి ఎలా వివరిస్తారో మనం ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీ దగ్గర ఒక పాత ఇల్లు ఉంది ఆ ఇంట్లో నిధి ఉందా అనే ప్రశ్నతో మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అనుకుందాం. ముందుగా ఒక ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు.
(16:24) దీపం, పూలు పూజలకు కావలసిన వస్తువులు సిద్ధం చేస్తారు. పూజ నిర్వహించిన తర్వాత ఏ విషయం గురించి ప్రశ్నిస్తున్నారో నిర్ణయించుకుంటారు. మన కథలో ఈ ఇంట్లో నిధి ఉందా లేదా ఉంటే ఏ వైపు ఉంది అనేది ప్రశ్న. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక గుడికి సంబంధించిన విషయాలను పరిశీలించే కార్యక్రమాన్ని అష్టమంగళ దేవ ప్రశ్న అని అంటారు. అందులో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి.
(16:44) ఇది అష్టమంగళ ప్రశ్న. తర్వాత నేల మీద 12 రాశులు ఉండే బొమ్మను గేస్తారు. మేషం, వృషభం, మిధునం ఇలా 12 రాశులకు 12 గదులు ఉంటాయి. ఇప్పుడు జ్యోతిష్యం గురించి ఏమీ తెలియని ఒక చిన్న పిల్లను లేదా పిల్లవాడిని పిలుస్తారు. పూజ చేసిన బంగారం మొక్కను ఆ పిల్లవాడి చేతిలో పెట్టి ఆ రాశుల గదుల్లో ఏదో ఒక గదిలో ఉంచమని అడుగుతారు.
(17:04) ఆ పిల్లవాడు ఏ రాశి గదిలో అయితే ఆ బంగారాన్ని పెడతాడో ఆ రాశిని స్వర్ణ ఆరూఢంగా పిలుస్తారు. ఐ మీన్ ఈ మొత్తం మెథడ్కి ఉపయోగించే ఒక ముఖ్యమైన ప్రారంభ స్థానం అన్నమాట. ఆ రాశిని ఆధారంగా తీసుకొని మిగతా జ్యోతిష్య సూచనలను పరిశీలిస్తారు. అంతే కాదు ఆ పిల్లవాడు ఆ బంగారం ఉంచిన సమయాన్ని కూడా నోట్ చేసుకుంటారు. ఆ సమయంలో ఏ రాశి కంట్రోల్ చేస్తూ ఉంది గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి వాటి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ లెక్కించి ఒక ప్రశ్న జాతకాన్ని తయారు చేస్తారు.
(17:31) అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయానికి జాతకం వేసినట్టుగా ఇక్కడ ఈ ప్రశ్న కార్యక్రమంలో ఆ ఎంచుకోబడ్డ ఆ సమయానికి కూడా జాతకం వేస్తారు. ఆ తర్వాత 108 గవ్వలను మూడు కుప్పలుగా విడగొడతారు. ప్రతి కుప్పలో నుంచి ఎనిమిది వేసి గవ్వలను తీసేస్తూ వెళ్తారు. చివరికి ఎన్ని మిగిలాయో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి కుప్పలో 35 గవ్వలు ఉన్నాయి.
(17:50) ఎనిమిది వేసి తీసేస్తే మూడు మిగులుతాయి. రెండో కుప్పలో 34 ఉన్నాయి. అంటే రెండు మిగులుతాయి. మూడో కుప్పంలో 39 ఉన్నాయి అంటే ఏడు మిగులుతాయి. అప్పుడు వచ్చిన సంఖ్య మూడు రెండు ఏడు ఒకవేళ ఏమి మిగలకపోతే అక్కడ ఎనిమిది అని తీసుకుంటారు. ఈ సంప్రదాయ ప్రకారంగా ఈ మూడు స్థానాలు అనేవి గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించినవి. ఆ సంఖ్యలకు గ్రహాలతో ఇతర సంకేతాలతో కూడా సంబంధాలు కలుపుతారు.
(18:14) వీటితో ఒక రకమైన అనలైసిస్ ని తయారు చేస్తారు. ఇందులో కేవలం ఇంతే కాదు ఆ సమయంలో దీపం ఎలా వెలుగుతోంది? బంగారం మొక్క ఎలా పడి ఉంది, రాశుల బొమ్మలలో గీతలు ఎలా చెరిపి ఉన్నాయి? ఎలా గీయబడి ఉంది సమర్పించిన తమలపాకులు ఎలా ఉన్నాయి ఇలాంటి సూక్ష్మమైన విషయాలను శకున సూచనలుగా పరిశీలిస్తారు. ఐ మీన్ ఒక ఇండికేటర్స్ లాగా తీసుకుంటారు. ఇవన్నీ చూసి నిధి ఉందని ఎలా చెబుతారు ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ఒక ఇంట్లో నిధి ఉందా అనే ప్రశ్నకు ప్రత్యేకమైన జ్యోతిష్య నియమాలు ఉన్నాయి.
(18:41) ఆ నియమాల్లో చెప్పిన స్థానాల్లో అనుకూలమైన గ్రహాలు ఉన్నాయా అని చూస్తారు. ఆ గ్రహాల స్థితిని బట్టి నిధి ఉన్నట్టు సూచన ఉందా లేదా ఉంటే ఎంత ఉంది ఎక్కడ ఉంది అనేది ఒక అంచనాకు వస్తారు. ఈ గ్రహాల దిశలను కూడా ఉపయోగించి ఏ డైరెక్షన్ లో ఉండొచ్చు అనేది చెబుతారు. ఇలా ఎన్నో రకాల పద్దతులు ఉన్నాయి.
(19:01) ఒక రోజు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక గురువు చెప్పిన సూచనల ప్రకారం ఒక చిన్న టెస్ట్ చేసి అక్కడ నిధి ఉందని నిర్ధారించుకున్నాడు. నేను కూడా ఆ ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఒక వింతగా ఉన్న మార్కింగ్స్ ఉన్నాయి నేల మీద నిధి సగం బయటికి వచ్చి ఉంది. ఇంకొన్ని పూజలు మిగిలి ఉన్నాయి. వాటిని చేస్తే మిగతాది కూడా బయటికి వస్తుందని చెప్పాడు. ఆ రోజు ఎందుకో నా మనసు కీడుని శంకిస్తూ ఉంది.
(19:20) నేను అప్పుడు అందులో ఏదో ప్రమాదం ఉందని అనుకున్నాను. అనుకున్నట్లుగానే మరుసటి రోజు ఆ స్వామి ఇక్కడ ఒక నాగశక్తి ఉంది చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్పాడు. ఎందుకంటే లోపల ఉన్నది భారీ స్థాయి నిధి అని చెప్పాడు. దానికి ఏదో గరుడ రాళ్లుు ఉంటాయి వాటిని సేకరించుకొని రావాలి దానితో పూజలు చేస్తే ఈ నాగశక్తి వెళ్ళిపోతుంది ఆ రాళ్లుు తేవడానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు.
(19:43) అప్పుడే నాకు అర్థమయింది అక్కడన్న ప్రమాదం పాము కాదు ఈ గురువు అనే వేషంలో ఉన్న అసలైన పాము అని. చరిత్రలో అక్కడక్కడ దాచిపెట్టి ఉన్న ఇటువంటి నాలెడ్జ్ నంతా వీళ్ళు అన్వేషించి జనాల భయాలని ఆశలని పసిగట్టి వాటితో ప్రస్తుతం ఎన్నో స్కాములు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేల మీద ఒక మార్కింగ్స్ కనిపిస్తాయని వరాహ మిహరుడు చెప్పి ఉంటే ఇప్పుడు స్వామి రూపంలో ఉన్న ఆ దొంగ నేల మీద మార్కింగ్స్ ని తానే గీసి అక్కడ నిధి ఉందని నమ్మిస్తాడు.
(20:11) ఎక్కడి నుండైనా కాటుకు పెట్టని పట్టుకొని వస్తాడు. కావాలని నాగులను తీసి తానే వదులుతాడు. ఆ ప్రత్యేకమైన మూలికలతో చేసిన గులికను వేసుకుంటే యక్షినీలకి కనిపించకుండా నిధిని తీసుకురావచ్చు అని చెప్పి మత్తు ముందు కలిపిన మాత్రని ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నగలు డబ్బులని కాజేస్తారు. ముందుగానే కొన్ని లంక బిందెల లాంటి బిందెలను పూర్చిపెట్టి అందులో ఇనుపు వస్తువులను పెట్టి వాటిని బయటకు తీసి ఇది ఓపెన్ చేయాలంటే మీ ఇంట్లో ఉన్న నిజమైన బంగారాన్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అని చెప్తారు. అలా మోసం చేస్తూ ఉంటారు.
(20:38) ఇలా ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు చేసే ఈ పనులకి జీవితంలో ఇక బ్రతకడం వృధ అని పరిస్థితికి తీసుకువచ్చి పడేస్తారు. చిన్నగా ఉన్న సమస్యని కొండంత చేసి లక్ష రూపాయలు అప్పు ఉన్నవాడిని 5 లక్షల అప్పున్న వాడిగా మార్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. నేను చెప్పేది నిజమా కాదా అనేది మీరే చెప్పాలి. కామెంట్ లో రాయండి.
(20:56) ఈరోజు ఈ వీడియోను చూస్తున్నారంటే మీలో ఎందరో ఇటువంటి వాటిల్లో చిక్కుకొనే ఉంటారు. వాటి నుండి బయటపడి కూడా ఉంటారు. మీ అనుభవాలని కామెంట్స్ లో తెలియజేయండి. ఎందరికో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు వరాహ మిహరుడు చెప్పినవి డబ్బుకి ఆశపడి చెప్పినవి కావు మానవ శ్రేయస్సకి చేసిన కృషి అది. ఈ రోజుల్లో మనం వర్షం పడినప్పుడు వర్షాన్ని మెజర్ చేస్తూ ఉన్నాం.
(21:14) ఇన్ని సెంటీమీటర్ల వర్షం పడింది అని వింటూ ఉంటాం. నిజానికి ఆనాడే వరాహి మిహిరుడు ఈ పద్ధతిని కనుక్కున్నాడు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని క్యాలిక్యులేట్ చేశాడు. ఎంతో లోతుగా అన్వేషించిన వరాహి మిహిరుడు కూడా ఏనాడు నిధి వెంట పడలేదు. కానీ ఈ రోజుల్లో నేను వరాహ మిహిరుడి కంటే గొప్పవాడిని అని చెప్పుకుంటూ ఉన్న కొందరు బురుడి స్వాముల దగ్గర మనుషులు మోసపోతూ ఉన్నారు.
(21:31) నిధులకు సంబంధించి వీడియోలని రీసెంట్ గా నేను YouTube లో సెర్చ్ చేశాను. ఏ వీడియో చూసినా సరే కనీసం ఒక్క కామెంట్ అయినా కనిపిస్తుంది. నిధిని బయటకి తీసే గురువు ఉన్నాడు కాంటాక్ట్ అవ్వండి అని కేరళాలో ఉండే మహా మహా తాంత్రికులే వీటి జోలికి వెళ్ళలేదు. ఆఖరికి మన ఇండియన్ గవర్నమెంటే ఈ విషయాల్లో సైలెంట్ గా అయిపోయింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ ఏ గుడల కింద నిధులు ఉన్నాయో కూడా చెప్పి ఉన్నాడు.
(21:51) మరి ప్రజలు ఎందుకని వెళ్లి తవ్వట్లేదు. నా ప్రశ్న ఏంటంటే ఈ నిధులను సాధించి ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు కానీ మనకున్న బాధలని కష్టాలని భయాలని ఆశరా తీసుకొని మనల్ని ఉచ్చులోకి లాగుతూ ఉంటారు. ఈ నిధుల జోలికి వెళ్ళకూడదు. ఒక నిధి అది నికిత నిధా లేదా దేవ నిధా అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ మీకు ఏదైనా నిధి దొరికితే ఆ పొజిషన్ నుండి ఒక కూత వేటు దూరం వరకు కొలత వేయాలి.
(22:16) అంటే కాంతార మూవీలో ఒక వ్యక్తి గట్టిగా అరుస్తాడు కదా అతని అరుపు ఎంతవరకు వినిపిస్తుందో అంతవరకు స్థలం కావాలని అడుగుతాడు. దానినే కూతవేటు దూరం అని అంటారు. అలా అక్కడి నుండి ఒక కూతవేటు దూరం చుట్టూ ప్రాంతంలో ఏదైనా ఒక గుడి ఉంటే అది కచ్చితంగా ఆ గుడికి సంబంధించినదే అయి ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఆ నిధి దొరికిన చోట ఉండే స్థల పురాణాన్ని కనుక్కుంటే అది గుడికి చెందిందా కాదా అనేది మనకు తెలుస్తుంది.
(22:40) గుడికి చెందిందయితే కచ్చితంగా మనం దాని గురించి కలలో కూడా ఊహించకూడదు. లేకపోతే ఎన్నో అనర్థాలు తలుచుకున్న క్షణం నుంచే మొదలవుతాయి. ఇవి నేను కల్లారా చూశాను. సరే అయితే మేము దేవనిధిని వదిలేసి మామూలు నిధి కోసం వెళ్తాము అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఈ దయ్యాల భూతాల కంటే మనుషులే ఎంతో ప్రమాదకరం. ఒక స్వామి యొక్క ఆధారం లేకుండా మీరు ఎవ్వరే కానీ ఆ నిధుల కోసం వెళ్లరు.
(22:59) కానీ ఈ ప్రపంచంలో స్వామి అనే రూపంలో తిరుగుతున్న పిశాచులే ఎక్కువగా ఉన్నాయి. అవి చాలా ప్రమాదకరం. ఇకపోతే పాతులు మనకు దొరికినా సరే వాటికి ఎన్నో ప్రమాదాలు జోడించి ఉంటాయి. ఈ అదృశ్య శక్తులని పక్కన పెడితే ఆ పాతుల్లో ఎన్నో విషవాయువులు ఉంటాయి. పాతి పెట్టిన వాడు వాటిని కావాలని అక్కడ ఉంచేవాడు. దానితో రక్తం కక్కుకొని చనిపోయారు అనే కథనాలు మనం కొన్ని సందర్భాల్లో వినే ఉంటాం.
(23:21) ఈ ఎపిసోడ్ ని చేయడానికి కారణం ఏంటంటే ఎంతో మంది నాకు తెలిసి ఈ నిధుల వెంటపడి జీవితాలని కోల్పోయారు. కోల్పోతూ ఉన్నారు కూడా. నేను చెప్పిన ఏదో ఒక సందర్భం మీ ఇంటి తలుపులలో కూడా తట్టే ఉంటుంది. ఇటువంటి వాటిల్లోకి అడుగు పెట్టిన రోజు నుండి ఇప్పటివరకు చూసుకుంటే మీరు మొదటిగా ఉన్న స్థాయి కంటే దిగజారే ఉంటారు. కానీ మీరు వీటి నుండి బయటకి రాలేక అందులోనే ఉండలేక ఒక ఆశతో ఒక భయంతో జీవిస్తూ ఉంటారు.
(23:44) అప్పులు చేసేసి ఉంటారు. మరికొన్ని సార్లు అయితే మన బంధువులో మన స్నేహితులు మనకు తెలిసిన వాళ్ళ ఇందులోకి మనల్ని లాగి ఉంటారు. అలా లాగిన వాళ్ళు కొందరు తెలిసి చేసి ఉంటారు మరికొందరు తెలియక చేసి ఉంటారు. ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదివి యusఎస్ఏ లో సంవత్సరానికిమూడు కోట్ల శాలరీని తీసుకుంటున్నాడు. అది నిధి కాదంటారా? డాక్టర్ చదవడానికి ఇంజనీర్ అవ్వడానికి ఎన్నో ఏళ్లు కష్టపడాలి ఎంతో త్యాగం చేయాలి ఎంతో క్వాలిఫికేషన్ ఉండాలి.
(24:06) కానీ ఇటువంటి నిధులను తవ్వడానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అందుకే వాటి పైన మనకు ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. కేవలం ఈ నిధులే కాదు పాత బంగారాన్ని కొత్త బంగారంగా మార్చడం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం రెడ్ మెర్క్యూరీ కోసం వెతకడం సంజీవని మొక్క చిన్న చిన్న లెల్లి పుట్లు ఆకాశంలో నుంచి డబ్బు ఉన్నట్లు కురిపించే బారిష్ ఇటువంటివి ఎన్నో ఉన్నాయి.
(24:25) ఎవరైతే వీటిలో అడుగు వేసి ఉన్నారో ఏదో వస్తే నా జీవితం మారుతుంది అని చెప్పుకుంటూ నాకు కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను నిధిని తవ్వచ్చు నేను పేదవాడిని నాకు ఇంతకంటే దారేముంది అని పదే పదే పదే పదే చెప్పుకుంటూ నీ జీవితాన్ని ఒక పేదవాడిగా నువ్వే నిర్మించుకుంటున్నావ్. మనసులో భగవంతుడిని పిలిస్తే రక్షిస్తాడు అని నమ్ముతాం.
(24:44) అదే మనసు నిండా నేను దేనికి పనికి రాను అని కోటిసార్లు జపిస్తాం. మనసు కోరినది కాకుండా ఇంకేం జరుగుతుంది మరి. ఇంతకీ ఈ అదృశ్య శక్తులు ఇవన్నీ ఉన్నాయా అని అడిగితే ఉన్నాయని చెబుతాను అవి ఉన్నాయి నిధులు ఉన్నాయి భూమిలోనూ ఉన్నాయి సముద్ర గర్భంలోనూ ఉన్నాయి. దాని అర్థం అవి మన సొంతం అని కాదు. నాకు నిధి దొరుకుతుంది అని నువ్వు పదే పదే తలుచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా ఇలా అనుకుంటూ ఉంటే మేనిఫెస్ట్ అవుతుంది అని మనం అనుకుంటాం. మూర్ఖులం.
(25:09) నిజానికి ఇలా తలుచుకోవడం వలన ఆ నిధే చాలా గొప్పది నేను పనికిరాని వాడిని అని పదే పదే తపించి తపస్సు చేసి నీ శక్తులని సామర్థ్యాలని ఆ నిధికి దారపోసి నువ్వు బలహీనుడవైి ఒట్టివాడిగా మిగులుతావు. ఇదే నిజం. ఈ నిధి ఎవరిని వరిస్తుందంటే ఈ నిధి కన్నా గొప్ప గుణాలు ఉన్నవాడిని వరిస్తుంది. ఆ గుణాల ముందు ఆ వ్యక్తి యొక్క ధర్మాల ముందు ఈ నిధులు సైతం తలవంచి తనకి దాసోహం అవుతుంది.
(25:32) మహాభారతంలో ధర్మరాజు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లు తుడవడానికి వర్షమే పడేది. మన ధర్మాలు ఏం నేర్పిస్తాయి అంటే ఈ నిధులనేవి లక్ష్మీదేవికి ఒక రూపం మాత్రమే. ఆ తల్లి సకల ఐశ్వర్యాలకు ప్రతిరూపం. ఆ లక్ష్మి ఎవరిని వరిస్తుందంటే ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వాటిని దాటడానికి అడుగులు ముందుకు వేసిన వాడిని వరిస్తుంది.
(25:53) అందుకే చెబుతూ ఉంటారు ధైర్యే సాహసే లక్ష్మి అని. ఈ బూటకపు నిధుల వెంటపడేవాడే అసలైన పిరికివాడు. ఎప్పుడైతే నీ కళ్ళ ముందు జీవితం మొత్తం వ్యతిరేకంగా నిలబడి ఉంటుందో ఆ క్షణంలో ముందడుగు వేసిన ఆ వ్యక్తినే ఆ ముందడుగు వేసిన ఆ క్షణాన్నే దుర్గా అని అంటారు. ఇక్కడే దుర్గమ్మ జన్మిస్తుంది. దానినే దశమి అని అంటారు. ఈరోజు దుర్గా నవరాత్రుల ప్రారంభం రోజు.
(26:13) మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోవడానికి ఏదైనా ధైర్యం చేసి అడుగు వేయడానికి ఎంతకంటే మంచి సమయం ఉండదు. ఈ బూటకపు మాయా నిధుల బదులు అసలైన నిధులని మీరు పొందాలని కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.

No comments:
Post a Comment