Sunday, October 11, 2026

 [10/7, 10:12] +91 92478 36995: ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏🏻

       ఒక భక్తుడు : 
   భగవాన్ ! మోక్షం పొందే ముందు మంత్రదీక్ష తీసుకుని సాధన చేయడం, సాంప్రదాయ గురు పరంపరలను అనుసరించడం అవసరమా?

      మహర్షి: 
    ఒక జన్మలోనే మోక్షం పొందినవారు, గత జన్మలలోనే అవసరమైన దీక్షలు, సాధనలు పూర్తి చేసి ఉంటారు.

ప్ర: నాకు భక్తి కావాలి. ఈ తపన ఇంకా ఎక్కువ కావాలి. ఆత్మ సాక్షాత్కారం నాకంత ప్రధానం కాదు. నాకీ కోర్కె బాగా దృఢపడితే చాలు.

ఆ తపనే ఉంటే, సాక్షాత్కారం నీకు వద్దన్నా లభిస్తుంది. మనస్సు భక్తిలో కరిగిపోయేటంత తీవ్రంగా దానిని కాంక్షించు. కర్పూరం కాలిపోయిన తరువాత ఏమీ మిగలదు. మనస్సు కర్పూరం వంటిది. అది ఏ ఆచూకినీ విడవకుండా ఆత్మలో లీనమై పోవటమే ఆత్మ సాక్షాత్కారమంటే.

భక్తుడు : భగవాన్! భగవంతుడు జీవులపై అనుగ్రహము చూపునా! చూపడా!

మహర్షి :
నీవు భగవంతుని ఎంతగా స్మరిస్తావో, అంతకంటే ఎక్కువగానే భగవంతుడు నిన్ను స్మరించును.
[10/7, 10:12] +91 92478 36995: 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) శుద్ధ పరబ్రహ్మంలో వ్యక్తుల ప్రసక్తి లేదు.
అత్యంత శుద్ధమైన ఆ ప్రజ్ఞానసాగరంలో పాపమూ లేదు, పుణ్యమూ లేదు.

2) నేను ఉన్నాను' అన్నది మాత్రమే ఖచ్చితమైన సత్యం. 'నేను ఫలానా వాడిగా ఉన్నాను' అనేది మాత్రం కాదు.

3) క్షణాల వరుసే కాలం. ఏమీ లేని శూన్యం నుంచి ప్రతిక్షణమూ ప్రత్యక్షమై మళ్లీ శూన్యంలోకే మాయమౌతుంది.

4) సత్యం అనేది అతి సరళం. అవాస్తవమే నిజానికి క్లిష్టమైనది.

5) సకలమూ ఏకమే. సమస్తమూ 'నేను'లోనే ఉంది.

No comments:

Post a Comment