రకాల మనుషుల్లో ముక్తికి దగ్గరగా ఉండేవారెవరు? | 9 Types of Human Beings | Muralidhar | Dhyana Dasara
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HetSPqIolI8
Title: రకాల మనుషుల్లో ముక్తికి దగ్గరగా ఉండేవారెవరు? | 9 Types of Human Beings | Muralidhar | Dhyana Dasara
Author Name: PMC Telugu
Description: Which of the following types of people are closest to salvation? | 9 Types of Human Beings | Muralidhar | Dhyana Dasara
#MuraliMaster #Patriji #PSSM #PMCTelugu #9TypesOfPeople #HumanNature #PyramidMeditation #Meditation #Dhyanam #SpiritualKnowledge #SpiritualAwakening #SelfRealization #SpiritualGrowth #Moksha #Karma #Reincarnation #BuddhaWisdom #BhagavadGita #MeditationBenefits #Anapanasati #InnerPeace #LifeLessons #TeluguSpirituality #PatrijiTeachings #VasishtaGautami #DhyanaGnanaMahayagnam #MeditationTelugu #PyramidSpiritualSocieties
"Praktikshanam - Satyadarshanam" - Brahmarshi Pitamah Patriji
PMC Telugu Contact Number: +91 92814 39371
040-29880145
Email: pmcithead@gmail.com
PMC Telugu — Meditation, Self-knowledge, Spiritual knowledge and Bliss A universal Telugu spiritual platform dedicated to life.
With the divine inspiration of Brahmarshi Patriji, our main goal is to bring meditation closer to every human being, provide self-knowledge, and introduce a healthy-joyful-enlightened way of life. It also stands as a bridge to all spiritual institutions and Guru Paramparas that are working tirelessly in this great yagna.
Watch "PMC Telugu" on TV on these cable operators:
Rekha Cable Network - 47
Sivabalaji Cable T.V. - 45
SLNS Digital - 93
Ali Cable Networks - 93
AJ Digital Networks - 25
Mahesh Cable Network - 52
Srinivasa Cable Network - 80
Tanuku Communications Network (TCN) - 85
ACN cable pvt ltd - 89
ACT cable pvt ltd VIZAG - 89
Machilipatnam communications pvt ltd - 81
The Bhimavaram Community Network - bhimavaram (BCN) - 75
Divya Cable Network - 49
YMS Cable Network - 53
Master Cable Network - 48
SLNS Networks - 52
MR Networks - 44
SKY Vision Digital - 117
Siva Cable Network - 68
SRR Cable Network - 24
Anjaneya Cable Network - 50
Yodha Group - 15
Manisai Master Cable Network - 95
Sri Rajeshwari Communications - 95
Manair Digital Entertainment Networks - 95
Aaradhya Enterprises - 95
Srisai Cable Broadband - 95
Geetha sai digital - 15
GTPL Durga City cable - 35
Anwar Cable Tv Network - 35
GTPL Rajendar Reddy - 08
Sri Sai Ganesh Media Digital Network - 35
CITI Link digital - 67 -
Sri Laxmi Narasimha Digital Network NXT - 25
Sri Sai Ganesh Media Digital Network - 36
Sai Shakti Digital Network - 08
GTPL Rajendar Reddy - 23
GTPL Rajendar Reddy - 90
YUPP TV OTT - 427
LAXMI Cable Tv Network - 53
Jio APP - 1115
V DIGITAL - 97
Laxmi Ganapathi Cable Network - 50
Sri Venkateshwara Cable Network - 65
U Digital - 191
Chennur Cable TV Network - 15
Sri Laxmi Cable Network & Broadband - 91
Shiva Cable Communications - 62
Smart Play TV OTT - OTT
Sri Veda Media (GTPL) - 82
Friends NXT Digital - 24
Shanmukha Cable Network - 25
Usha Sri Cable Network - 70
Kinnera Cable Network - 43
Pamireddy Cable Network - 25
Bemeshwara Cable Network - 53
Sri Venkateshwara Communications - 90
K Communications - 52
New Vision cable & Broadband services - 90
Vijayaraya Cable - 129
#PMCChannel #Patriji #Spiritual #Devotional #Meditation #Mindfulness #SpiritualAwakening #Peace #InnerPeace #Divine #Inspiration #Consciousness #SpiritualJourney #Soul #LoveAndLight #HolisticHealth #SelfRealization #HigherSelf #Positivity #hinduspirituality #indiantradition #patrijimeditation #patriji #patrijilatestspeeches #pmctelugu
Transcript:
(00:03) ఒక భర్త అడిగాడు. భార్య చాలా కోపంగా బయటికి వెళ్తా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పోలీస్ స్టేషన్ కు అనింది ఆమె. ఎందుకు అన్నాడు. సంతూర్ సోప్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అన్నది ఆమె. ఎందుకు అన్నాడు మళ్ళీ. నేను చాలా సంవత్సరాల నుంచి సంతూర్ సోప్ వాడుతున్నా నన్ను అందరూ బయటికి వెళ్తే మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు ఏ కాలేజీ అని అడగడం లేదు అనింది.
(00:39) అంటే మనకు అడ్వర్టైస్మెంట్ అట్లా ఉంటాయి. తర్వాత ఒక ఆంటీ చపాతీలు ఐదు చపాతీలు ఇంత సేపట్లో చేస్తే ముగ్గురు ఆంటీలు కలిపి ఎంత సేపు చేస్తారు అని ఒక భర్త భార్యకు క్వశ్చన్ వేసాడు. ఆమె వెంటనే 15 అనింది. భర్త చెప్పాడు ముగ్గురు కలిస్తే ఎక్కడైనా సాధ్యమవుతుందా చేయడానికి ముచ్చటలకే సరిపోతాది కదా అని [గొంతు సవరించుకోవడం] నదులన్నీ కలిస్తే ఏమవుతుంది నదులన్నీ కలిస్తే ఏమవుతాయి సముద్రం అవుతాయి.
(01:24) చెట్లన్నీ ఒకచోట కుడితే ఏమవుతుంది అడవి అవుతుంది. ఆడవాళ్ళంతా ఒకచోట చేరితే ఏమవుతుంది ధ్యాన మహిళా చక్రాలు అవుతాయి. కదా సో జీవితంలో హాస్యం ఉండాల్సిందే కానీ జీవితమే హాస్యం కాకూడదు. కదా జీవితంలో హాస్యం ఉండాలి. భార్య, భర్త, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ జీవితాన్ని గడపాలి. సరదాగా గడుపుకుంటూ వెళ్ళాలి.
(01:58) కానీ మన జీవితమే నవ్వుల పాలు సో అలా నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సో ప్రపంచంలో అందరూ ధ్యానమే చేసి జ్ఞానాన్ని పొందుతున్నారా? లేదే. మన చుట్టూ ఎంతోమంది మహాత్ములు ఉంటారు. తొమ్మిది రకాల మంది మనుషులు ఉంటారు మన చుట్టూ కూడా. సుహృత్తులు అంటే మంచి హృదయం గలవారు, గొప్పవారు, గురువులాగా ఉన్నవారు ఉంటారు.
(02:35) మిత్రులు ఉంటారు. మిత్రుల్లో చెడ్డ మిత్రులు ఉంటారు, మంచి మిత్రులు ఉంటారు. సమాజంలో అన్నాక అన్ని రకాల వారు ఉంటారు. అరులు అంటే ఈర్ష్య పడేవారు ఉంటారు, శత్రువులు ఉంటారు సమాజంలో. ద్వేషులు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు మనలను. మనము ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం. మధ్యస్థులు ఉంటారు. తటస్తులు ఉంటారు. పాపులు ఉంటారు. హితం చెప్పేవారు ఉంటారు.
(03:16) ఇలా మన చుట్టూ తొమ్మిది రకాల మనుషులు ఉంటారు. మరి వాళ్లలో మనం ఎవరం? ఎలాంటి వారం? గొప్పవారమా, మంచి హృదయం గలవారమా, గురు స్థానంలో ఉన్నామా, మంచి మిత్రులుగా ఉన్నామా, దేన్ని పట్టించుకోకుండా తటస్థంగా ఉన్నామా, లేదా మధ్యవర్తిత్వం చేస్తున్నామా, ద్వేషంలో ఉన్నామా, ఇతరులను ద్వేషిస్తున్నామా, అసూయ పడుతున్నామా, ఈర్ష్య పడుతున్నామా? పోనీ పాపులుగా ఉన్నామా? సో ఈ తొమ్మిది రకాల వాళ్లలో మనము ఉండొచ్చు లేదా ఆ తొమ్మిది రకాలు మనలో ఉండొచ్చు.
(03:58) కానీ ఈ తొమ్మిది రకాల్లో సహృదయంతో ఉన్న వాళ్లలో ఉండాలి మిత్రులుగా ఉండాలి. మిగతా దేంట్లో మనం ఉండడానికి లేదు ఇంకా. ఎందుకంటే ఈ స్థాయి తర్వాతనే ముక్తి అనేది వస్తుంది. మనం ఈ ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అని పత్రి గారు పదే పదే పదే చెప్తూ వచ్చారు. మరి దాన్ని ఆలంబనగా చేసుకొని మనం ఏ స్థాయిలో ఉంటే నెక్స్ట్ స్థితికి వెళ్తాము అన్నది మనం తెలుసుకోవాలి.
(04:27) సో ఈ జ్ఞానం అన్నది అనంతం. ప్రజ్ఞానం బ్రహ్మ. నాకు తెలిసినంత [గొంతు సవరించుకోవడం] ఇంకెవరికీ తెలియదు అన్నది ఒక భ్రమ. తెలుసుకున్నది కొంతే అని అనుకుంటే మనం ముందుకు వెళ్తాం. నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడం కూడా ఒక గొప్ప విషయం. చాలా మంది నామోష పడుతుంటారు నాకేం తెలియదండి చెప్పడానికి. కానీ ఆ విషయం తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం.
(04:59) మనకు ఏదైతే తెలిసిందో అదే మాట్లాడాలి, ఏదైతే తెలియదో దాని గురించి మాట్లాడకూడదు. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో మన చుట్టూ ఉన్న సమాజం కూడా చాలా చక్కగా మనం స్వీకరిస్తుంది. అహంభావం ఎక్కువ అయింది అనుకో, గర్వం ఎక్కువ అయింది అనుకో నాకంటే గొప్పవారు లేరు, నాకంటే అన్ని విషయాలు తెలుసు అని అనుకున్నారనుకో ప్రమాదం వస్తుంది. చిన్నప్పటి నుంచి మనం శ్రవణం ద్వారా బాగా వింటూ ఉంటాం జ్ఞానం.
(05:32) శ్రవణం ద్వారా తల్లి గర్భం నుంచే మొదలవుతుంది వినడం. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో గర్భవతులు ఉంటే మాట గాని చేతలు గాని చాలా బాగుండాలి. మంచి మాటలే మాట్లాడుతుండాలి. మంచి విషయాలు వింటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే గర్భంలో ఉన్న బిడ్డ కూడా వింటూ ఉంటుంది కాబట్టి. సో శ్రవణం అన్నది చిన్నప్పటి నుంచి మొదలవుతుంది, గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది.
(06:03) ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ గొంతులు చాలా త్వరగా గుర్తుపడతారు పిల్లలు. కారణం ఏంటంటే ఆ గొంతులు విని విని విని వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అందుకే తల్లి స్పర్శ తగిలిన తండ్రి స్పర్శ తగిలిన ఇంట్లో వాళ్ళ ఎవరైనా సరే మాటలు వింటే ఏడ్చే వాళ్ళు కూడా ఆగిపోతారు. అంటే వాళ్ళకి స్వాతంత్రం తెలుస్తుంది అక్కడ. ఆహా నా వాళ్ళు అన్నది.
(06:27) అందుకే మాట ఎప్పుడు కూడా ఇంట్లో మంచిగా ఉండాలి. సో ఇది శ్రవణం ద్వారా ఎంత గొప్పగా ఉంది అంటే మనం ఏదంటే అది వినకూడదు. ఎంతో మంది మహాత్ములు ఉన్నారు మహానుభావులు ఉన్నారు. వారి యొక్క జీవితాలంతా కూడా త్యాగం చేసి మనకు పుస్తకాల ద్వారా YouTube ల ద్వారా ఆకాశవాణి ద్వారా అనేక రకాలు ఆకాశవాణి అంటే పై నుంచి కాదండి రేడియోలు. సో వాటి ద్వారా మనం వినగలుగుతున్నాం.
(06:56) అందుకే శ్రవణం అన్నది శ్రవణం ద్వారా జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంత విన్నాలో అంతే వినాలి. అంతకంటే ఎక్కువ వింటే నష్టం అవుతుంది. సో విన్నదంతా కూడా నువ్వు మననం చేసుకోవాలి. ఎప్పుడైతే మననం చేసుకుంటామో అది మన నిధి లాగా లోపల ఉండిపోతుంది. శ్రవణం అయిపోయింది కదా ఇంకేముంది ఈరోజు విన్నాం కదా అనుకుంటే లాభం లేదు.
(07:23) ఎందుకంటే మనకు అంత మెమరీ లేదు. మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అనుకుంటేనే అది మన లోపల ముద్రలుగా ఏర్పడుతుంది. లేదంటే ఉపయోగం ఉండదు. ఏక సంధా గృహులు అయితే అది మనకు లోపల ఉంటుంది మంచిదే. సో ధ్యానం బాగా చేస్తూ ఉంటే మన మెమరీ కూడా బాగా డెవలప్ అవుతుంది. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానం నేర్పించాలి అని చెప్పారు. వాళ్ళు ఒక్కసారి విన్నా సరే చదువుకున్న సరే గుర్తుండిపోతుంది.
(07:51) మిగతా వాళ్ళ సమయం అంతా కూడా చక్కగా ఆటపాటలతో గడిపేయొచ్చు. కానీ మనం ధ్యానం అనేది ఇంట్లో చెప్పడం లేదు మన పిల్లలతో చేయించడం లేదు మనం చేస్తున్నాం. మన పిల్లలతో చేయించడం లే. మన కొడుకులతో, కూతుర్లతో, మనవళ్లతో, మనవరాళ్లతో చేయించడం లేదు. వాళ్ళు వినరండి అంటున్నాం. సెల్ఫోన్ ఇచ్చేస్తున్నాం. ధ్యానం చెయ్యి. చేయించు. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు అడిగింది ఇవ్వండి.
(08:17) ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి ధ్యానం వల్ల. మనకందరికీ తెలుసు. తెలిసినా సరే మన ఇంట్లో మన పిల్లలకు చెప్పడం లేదు. అంతెందుకండి ఇక్కడ ఇంత మంది వస్తున్నాం కదా యూత్ ఎక్కడుంది? యూత్ ఎక్కడ? 30 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారా ఇక్కడ? లేరు. కారణం కారణం వాళ్ళు కాదు. మందే కారణం. మనం చెప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇన్సిస్ట్ చేయాలి. చదువుకి ఇన్సిస్ట్ చేస్తున్నాం కదా మనము నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి.
(08:51) మరి దీన్ని ఎందుకు ఇన్సిస్ట్ చేయడం లేదు మనం? చెయ్యాలి. చేయకుంటే నష్టపోయేది ఎవరు? మనకంటే వాళ్లే ఎక్కువ నష్టపోతారు. సో ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా మనం ప్రేమను వాళ్ళకి ఇవ్వాలి అంటే మనం ధ్యానం గురించే చెప్పాలి, చేయించాలి. అది నిజమైన ప్రేమ మనం ఇవ్వడం. నిజమైన ఆస్తి అంటే అదే ఇవ్వాల్సింది వాళ్లకు. ఇంకా మనకు వేరే అక్కర్లేదు ఇంకా.
(09:12) సో ఈ శ్రవణం అన్నది ఇలాంటి విషయాలు వింటూ వింటూ, మహాత్ముల విషయాలు వింటూ ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉండాల్సిందే. ఇది నిరంతర ప్రవాహం లాగా జరిగేదే. ఏ ఒక్కసారిగానో ఏ ధ్యాన యజ్ఞానికి వచ్చేస్తే అయిపోయింది లేదు. ఇది ఉదయం లేస్తూనే ఒక గంట సేపు మంచి యూట్యూబ్ ద్వారా, పత్రీగారి సందేశాల్లో, ఆయన చెప్పిన విషయాల్లో మనం వింటూ ఉండాలి.
(09:32) అనేకమంది గొప్పవారు అనేక విషయాలు చెప్పారు. అదంతా వినాలి మనం. ఒక గంట సేపు ఒక గంట సేపు పుస్తకాలు చదవండి. ఒక రెండు గంటలు ధ్యానం చేయండి. సో అన్నీ ఒకేసారి కాదు. మన వీలును బట్టి మన సంసారంలో ఉంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకుంటూ మన స్వధర్మాన్ని మనం సాగించుకోవాలి. పరధర్మము, స్వధర్మము ఈ రెండు ఇంపార్టెంట్ ఏ. స్వధర్మానివే ఫస్ట్ ఇంపార్టెంట్.
(09:56) ఆ తర్వాత పరధర్మం. నిన్ను నువ్వు చూసుకో. ఆ తర్వాత కుటుంబాన్ని చూసుకో. ఆ తర్వాత సమాజాన్ని చూసుకో. సో ఇవన్నీ క్షేమాలే. కేవలం శారీరక ఆరోగ్యం ఒక్కటే ఆరోగ్యం కాదు. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, బుద్ధిపర సంఘపర ఆరోగ్యము, ఆత్మపర ఆరోగ్యము. ఈ ఐదు ఉండాల్సిందే. ఈ ఐదు ఉన్నవాళ్ళకి ఆరోగ్యం అంటాం. బుద్ధ భగవానుడు చెప్పాడు ఆరోగ్యమే పరమ లాభం అన్నాడు.
(10:21) ఎటువంటి ఆరోగ్యము ఈ ఐదు కలిపితేనే లాభం. సో నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అన్నది లేదు ఇంకా. కోట్లు ఉండవచ్చు బట్ నీ దగ్గర ఆరోగ్యం లేదు అంటే నువ్వు నష్టంలో ఉన్నావు అని. ఆరోగ్యమే పరమ లాభం. సంతృప్తియే పరమ ధనం. ఎంత సంపాదించావు అన్నది కాదు నీకు ఉన్న దాంట్లో నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు అన్నదే ఇంపార్టెంట్. సంతృప్తియే పరమ ధనం. డబ్బుతో పుడుతున్నావా, డబ్బుతో చస్తున్నావా, డబ్బే నీ మానమా, డబ్బే నీ ప్రాణమా? డబ్బు లేని నాడు నువ్వు లేనే లేవా? అజ్ఞానాన్ని చేదించి సత్యాన్ని తెలుసుకో.
(10:55) విశ్వాసమే పరమ బంధువు. నీ పైన నువ్వు విశ్వాసం పెట్టుకో. పక్కవాడి పైన, వాడి పైన, వీడి పైన ఆ గురువు ఇది చెప్పాడండి, ఈ గురువు ఇది చెప్పాడండి వద్దు. నీకు నీవే గురువు అని చెప్పాడు. నీ శ్వాసే గురువు అని చెప్పాడు పత్రి గారు. ఎందుకు చెప్పారు? గురువు ఈరోజు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన వాక్యమే సత్యం. వాక్కే గురువు.
(11:20) వేదాలు ఉన్నాయి మనుషులు ఉన్నారా, చెప్పిన రుషులు ఉన్నారా? మహాభారతం రాయబడ్డది ఆయన ఉన్నారు వేదవ్యాసులు ఉన్నారా లేరే. పోతను రాశారు మహాభాగవతం రాశారు మరి ఉన్నారా లేరే. సో వారు ఏమి చెప్పారో అది మనకు ప్రాముఖ్యత. వ్యక్తిత్వం కాదు ఇక్కడ వ్యక్తి ఆరాధన పనికిరాదు. వారు చెప్పిన వాక్కులే మనకి ఇంపార్టెంట్. అంటే ఏంటి ఆ వాక్కులు అంటే శ్రవణం చేస్తూ ఉండాల్సిందే నిరంతర శ్రవణం.
(11:49) అది మనల్ని చాలా ఉన్నతంగా తీసుకెళ్తది. ఆ శ్రవణం చేయలేకపోతే జ్ఞానం రాదు ఇంకా. చాలా తక్కువ చాలా చాలా తక్కువ వస్తుంది. ఎంతో మంది మహాత్ములు లక్షల మంది మహాత్ములు ఉన్నారు. వారి జీవితాన్ని అంతా పణంగా పెట్టి మనకు చక్కగా అందిస్తున్నారు. వినడమే మనం చేయాల్సింది ఇంకా అంతకంటే ఏం లేదు ఇక్కడ. సో శ్రవణం ద్వారా బాహ్యం శ్రవణం అంటాం అంతర శ్రవణం అన్నది కూడా ఇంకొకటి ఉంది.
(12:15) అంతర శ్రవణం అంటే నువ్వు ఎవరు అంటే నీ ఆలోచనలే నువ్వు. నువ్వు ఎవరు అంటే నీ ఆలోచనలే నువ్వు ఈ పైన ఉన్న రూపం కాదు. నీలో ఉన్న ఆలోచనలే మంచి ఆలోచనలా, చెడ్డ ఆలోచనలా, వినాశకరమైన ఆలోచనలా ఏదైనా నువ్వు తెలియాలి. నీకే తెలిసేది పక్కవాడికి తెలియదు. నువ్వు మంచిగా కనబడుతుంటావు, మంచిగా మాట్లాడుతుంటావు కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏంటి నీ నోటి నుంచి వచ్చే వాక్యమే నువ్వు ఏంటో తెలిసిపోతుంది.
(12:48) సో నువ్వు జాగ్రత్తగా మంచి మాట మాట్లాడిన నీవు ఎవరని గుర్తించడానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ చేష్టలే నీకు తెలుస్తుంది. నీ యొక్క ప్రవర్తన తెలుస్తుంది నువ్వు మంచోడా చెడ్డోడా అని చెప్పడానికి వాడు సరైన గురువు కాదా అని చెప్పడానికి నీ యొక్క చేష్టలు, నీ యొక్క పరివర్తన, నీ నడవడిక అని తెలుస్తుంది. సో అందుకే మనిషిని ఎప్పుడు కూడా వెంటనే నమ్మొద్దు అని బుద్ధుడు చెప్పాడు.
(13:08) చానా క్లియర్ గా చెప్పాడు. వాళ్ళని నమ్మామండి నమ్మి మోసపోయాము అన్నారు. చాలా తప్పు అది. వాడు చాలా జాగ్రత్తగా నిన్ను మోసం చేయడానికి వచ్చాడు. మోసపోవడం నీ తప్పు. సో ఇది ఎట్లా తెలుస్తుంది? జ్ఞానం అన్నది వస్తేనే మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానం అన్నది తెలియకుండా నువ్వు ఉన్నావనుకో నీకు ఎలా తెలుస్తుంది ఇదంతా కూడా? ఇక్కడికి వచ్చాము ఈ విషయాలు వింటున్నాము మనకు తెలుస్తోంది.
(13:33) సపోజ్ ఇక్కడ రాలేదు అనుకో పిఎంసి అనేది ఒక పెద్ద అవకాశం మనకు. ఈరోజు వీలు కాకపోతే రేపైనా వింటాం, మర్నాడైనా వింటాం, 10 రోజుల తర్వాతయినా వింటాం. సపోజ్ అదే మనకు పిఎంసి అన్నది లేకపోయింది అనుకో మనకు రేపు పొద్దున ఏం వినగలుగుతాం? ఇక్కడికి వచ్చినోళ్ళు మాత్రమే వినగలుగుతారు. లేదంటే ఇక్కడ ఎవరైనా యూట్యూబ్ లో ఉంటే వాళ్ళు గ్రూపుల్లో పెడితేనే మనకు అర్థమవుతుంది.
(13:53) కానీ పిఎంసి ద్వారా ఎంత జ్ఞానం ప్రపంచానికి వెళ్తా ఉంది. ప్రపంచాన్ని అంతా నీ ముందుకు తీసుకొస్తుంది పిఎంసి. నీవు ఎవరో ప్రపంచానికి చూపిస్తా ఉంది. సో అలాంటి పిఎంసి కి మనం ధన్యవాదాలు చెప్దాం ఒక్కసారి. ఇదంతా శ్రవణ జ్ఞానమే. ఇప్పుడు చెప్తున్నా మాట్లాడుతున్నది అంతా కూడా శ్రవణ జ్ఞానమే. అంతర శ్రవణం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్.
(14:17) ఎటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి? ఎటువంటి భావాలు కలుగుతున్నాయి? ఎటువంటి మెసేజ్లు నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు? ఇదంతా కూడా మనకు శ్రవణ జ్ఞానమే. ఆ తర్వాత అనుసరణ జ్ఞానం. అనుకరణ కాదు అనుసరణ. ఆ డిఫరెన్స్ చూసుకోండి మీరు ఎప్పుడైనా సరే. చాలా మంది అనుకరణ చేస్తారు. ఇప్పుడు పత్రిగారు ఉన్నారు పత్రిగారిని మనం ఫాలో అవ్వాలి. కానీ పత్రి లాగా మనం యాక్షన్ చేయకూడదు.
(14:44) సో జెరాక్స్ కాపీ అవుతాం. సో ఆయన ఏం చెప్పారు ఆయనను అనుసరిస్తూ మనం అర్థం చేసుకొని మనం ఫాలో అవుతూ ఉండాలి. మన జీవితాల్లో మన బుద్ధి ఏ రకంగా చెప్పిందో దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. అలా కాకుండా కేవలం పత్రిగారిని దృష్టిలో పెట్టుకొని అలా చేస్తే బాగుంటుందని నువ్వు అనుకరణ చేశావు అనుకో యు ఆర్ కాపీ అంతే. కాపీ దగ్గర నువ్వు ఇక్కడ లేదు నీ ఒరిజినల్ కాదు అది జెరాక్స్ కాపీ తీశారు.
(15:07) ఒరిజినల్ కి వాల్యూ ఉంది జెరాక్స్ కాపీకి వాల్యూ లేదు. సో అనుసరణ ఉండాలి ఫాలోయింగ్ ఉండాలి అంతే. నువ్వు ఫాలో అప్ లో ఉండాలి. అంటే పెద్దవారు ఏం చెప్పారు ఎలా చేశారు చెప్పిందే చేశారా లేదంటే ఊరికే చెప్తూ ఉన్నారా చేయకుండా ఉన్నారా? వక్తలా ప్రవక్తలా? వక్త అంటే ఏంటి చక్కగా చెప్పగలుగుతాడు. మరి ప్రవక్త అంటే ఏంటి ఏది చెప్పాడో అదే చేస్తాడు ఏమి చేశాడో అదే చెప్తాడు.
(15:33) సో వక్తలా ప్రవక్తలా ఎవరిని మనం ఫాలో అవ్వాలి? ప్రవక్తలను ఫాలో అవ్వాలి వక్తలను ఫాలో కావద్దండి బాగా చెప్పగలుగుతారు. మంచి మాటలు మాట్లాడగలుగుతారు వజ్రాల లాంటి పదాలు బయటికి వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు వక్తలుగా ఉన్నారా ప్రవక్తలుగా ఉన్నారా మీరు గమనించాలి. మంచి మాటలు తీసుకోండి అక్కడ ఎవరు చెప్పినా మంచిదే. కానీ గుడ్డిగా ఫాలో అవ్వద్దు మీ స్వబుద్ధిని చూసుకో.
(15:59) ఎక్కడైనా ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి మన స్వబుద్ధినే ఉపయోగించాలి. స్వబుద్ధినే ఉపయోగించుకోకుండా వాళ్ళు సీనియర్ మాస్టర్స్ ఏ గ్రేట్ మాస్టర్స్ ఏ గ్రేట్ మాస్టర్స్ కావచ్చు సీనియర్ మాస్టర్స్ కావచ్చు జీవితం నీది. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఒకరి చేతుల్లో పెట్టవద్దు నీ జీవితాన్ని. నీ చేతుల్లో పెట్టుకో. నీ ఆధీనంలో ఉంచుకో నీ జీవితాన్ని.
(16:22) ఎవరిని బ్లేమ్ చేయవద్దు. పత్రి గారు చెప్పారు గ్రేట్ స్టేట్మెంట్స్ అవి. ఎంతో గొప్ప స్టేట్మెంట్స్ అవి. మరి అటువంటి స్టేట్మెంట్స్ ను మనం ఏం చేస్తున్నాం? ఎలా ఉపయోగిస్తున్నాం దాన్నే మనం చూసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ తో ఎక్కడా పోవద్దు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ వచ్చిందో జడ్జిమెంట్ వస్తుంది. నాన్ ఎక్స్పెక్టేషన్ లో ఉండాలి.
(16:49) ఎప్పుడూ, ఎక్కడ, ఏది ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయవద్దు. నాన్ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నావు అనుకో ఇంకా అంతకంటే గొప్పది లేదు. ఆ తర్వాతది అపరిగ్రహ. అపరిగ్రహ అంటే నీకు అవసరం లేనిది ఎవరు ఏమి ఇచ్చిన తీసుకోవద్దు. నీకు అవసరం లేనిది ఎవరు ఏమి ఇచ్చిన తీసుకోవద్దు. అవసరం ఉంటే తీసుకో. తీసుకున్న తర్వాత పదింతలు రిటర్న్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో తీసుకో.
(17:10) ఇది చాలా గొప్పది. జన్మలు జన్మలు తగ్గిపోతాయి. వాళ్ళు ఇస్తున్నారు కదా నేను తీసుకున్నాను అంటావు. నీకు అవసరం లేనిది తీసుకున్నావు. రుణపడి పోతున్నావు అక్కడ. రుణం అంటే మళ్ళీ జన్మకు. మళ్ళీ మళ్ళీ జన్మలు. ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు అంటే ఈ జన్మలో మనం ఏమి చేశామో అవే మన ముద్రలు అవుతాయి. అవే మన కర్మ ఫలితాలు అవుతాయి.
(17:31) మళ్ళీ జన్మలు అక్కడి నుంచే మొదలవుతాయి. ఏదైతే పదే పదే పదే పదే చేస్తున్నామో అదే మళ్ళీ జన్మల్లో రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ జన్మలో ధ్యానం బాగా చేశాము, ధ్యానం బాగా తెలుసుకున్నాము. సో మళ్ళీ జన్మల్లో ఈ జన్మలో మనం ఎక్కడైతే ఆగిపోయామో మళ్ళీ జన్మలో అక్కడి నుంచే మొదలవుతుంది మన జీవితం. యోగ భ్రష్టత్వం అని చాలా క్లియర్ గా చెప్పారు కృష్ణ పరమాత్మ.
(17:57) చాలా క్లియర్ గా ఉంది. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని పత్రి గారు ప్రతి మీటింగ్ లో చెప్తారు కారణం అదే. నీ ఇష్టం, నీ సమయం నీ జీవితం. ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. ఉన్నన్ని రోజులు, ఉన్నంత కాలం ఈ రోజుకి ఈ రోజు నువ్వు జీవించడానికి ప్రయత్నం చెయ్యి. రేపు ఉంటే ఓకే, రేపు లేదనుకో ఈ రోజు ఇప్పటికి ఈ క్షణానికి అయిపోయింది కదా టేక్ ఇట్.
(18:20) హ్యాపీగా వెళ్ళిపో. టిక్కు పడిపోయింది వెళ్ళిపో అంతే ఇంకా ఇంకేం ఆలోచన అక్కర్లేదు. అందుకే ప్రతి సమయం ప్రతి క్షణం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ యువర్ టైం. అనవసరంగా ఏది వినవద్దు అవసరం ఉంటేనే విను ఆల్రెడీ నీకు ఆ విషయం తెలిసిందనుకో ఇంకా వినవద్దు చక్కగా కళ్ళు మూసుకో మళ్ళీ తెలియని విషయం వచ్చినప్పుడు కళ్ళు తెరుచు చక్కగా విను.
(18:45) సో దీన్ని ఎప్పుడు తెరవాలి ఎప్పుడు మూయాలి అనేది మన కంట్రోల్ లో ఉండాలి ఈ చెవులు. ఎప్పుడు చూడాలి ఏమి చూడాలి అనేది కంట్రోల్ లో ఉండాలి మనకు మన ఆధీనంలో ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలి అన్నది మన ఆధీనంలో ఉండాలి. అనవసరంగా ఒక మాట రానివ్వద్దు. అరే పక్కన ఉన్నారు కదా మాట్లాడుకుంటే ఏమవుతారు అని లేదు చక్కటి చిరునవ్వు ఒక మంచి చిరునవ్వు ఓకే బాగున్నారా రైట్ టిఫిన్ చేశారా ఓకే దట్స్ ఆల్ మీ ఇంటికి వస్తే అవి అడగాలి ఇక్కడికి వస్తే అడిగే పనులా ఇక్కడికి వస్తే ఎవరు అడగాలి మనలను ఇక్కడున్న ఆహ్వానితులు అడుగుతారు.
(19:18) మనల్ని ఆహ్వానించారు కదా వీళ్ళు అడుగుతారు మనం వాళ్ళని అడిగే పని లేదు. సో ఎక్కడ ఎప్పుడు ఏది మాట్లాడాలి అన్నది మన ఇంద్రియాల నిగ్రహం మీద ఆధారపడి దాన్నే మదము అన్నారు. మదాన్ని తిప్పేస్తే ధమ్మం అవుతుంది గర్వం పెరిగిందనుకో మదాలు పెరిగిపోతాయి. అలా కాకుండా ఈ ఐదు సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చూపును వినడము మాట్లాడడము అన్నీ కూడా మన కంట్రోల్ లో వస్తాయి.
(19:43) ఇదంతా ఎట్లా తెలుస్తుంది మనకు అనుసరణ ద్వారా మహాత్ములు ఏం చేశారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు ఎలాంటి సహాయం చేస్తున్నారు అనేది మనం చూసి గమనించి నేర్చుకోవాలి. ఒకసారి మన ఆనంద ప్రకాశగిరి స్వామి వారి గురువుగారైన మలయాళ స్వామి దగ్గరికి వెళ్లారు. వెళుతూ వెళ్ళిన తర్వాత గురూజీ నాకు ఒక రెండు రోజులు పర్మిషన్ కావాలి ఊరికి వెళ్లి రావాలి అన్నాడు.
(20:09) ఓకే వెళ్ళు అన్నాడు. మరి నీ బ్యాగ్ ఏది అన్నాడు. వాళ్ళకి బ్యాగ్ అంటే ఏముంటుంది ఇంకో డ్రెస్ ఉంటది అంతే ఇంకా ఇంక అంతకంటే ఏముండదు అక్కడ. పక్కన ఫ్రెండ్ చేతికి ఇచ్చాడు అది. ఆయన చూశాడు నీ బ్యాగ్ ఏది అన్నాడు ఫ్రెండ్ ని చూపించాడు ఆయన దగ్గర దగ్గర అన్నాడు. చాలా మంచిది నువ్వు చాలా బరువు ఏమో ఉందేమో అది అందుకే పక్కన ఇచ్చావు కదా మోయలేక అని అన్నాడు.
(20:27) లేదు స్వామి ఒక జత బాటిల్ ఉన్నాయి అన్నాడు. నీకు మోయగల శక్తి ఉన్నప్పుడు నీకు చేత నైనప్పుడు పక్క వాడికి ఎందుకు ఇచ్చావు? దీని వల్ల జన్మలు పెరుగుతాయి. మనమేంటో మనకు ఆ విషయం తెలియదు చాలా సూక్ష్మమైన విషయాలు. అందుకే నీకు అవసరం అంటే చాలా అత్యవసరం అయితేనే ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకోవాలి లేదంటే తీసుకోకూడదు. తీసుకున్నా దానికి పదింతలు నువ్వు సిద్ధపడి తీసుకో సహాయం చేస్తానని సిద్ధపడి తీసుకో మరి వారికే చేయాలనా పక్క వారికి చేయాలనా అనేది దాన్ని బట్టి డిపెండ్ ఉంటది.
(21:01) సో ఇక్కడ ఈ విషయాలని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే పెద్దలు ఎటువంటి అనుసరణ చేశారు, ఏ మార్గంలో వెళ్లారు, మనం ఆ మార్గంలో వెళ్లాలి అన్నది దానికి చెప్పడానికి ఈ జ్ఞానమంతా మనకు అవసరం అవుతుంది. అంటే ఏంటి చిన్న బ్యాగ్ ను పక్కా స్నేహితుడికి ఇస్తేనే ఆయన ఆ మాట అన్నాడు మలయాళ స్వామి గారు విద్యానంద ప్రకాశ గిరి స్వామి సో ఆ మహాత్ములకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం.
(21:27) సో ఈ అనుసరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మహాత్ములు చూస్తున్నాం మన పత్రిక ని చూస్తున్నాం. పత్రిక ద్వారా ఎంతో మనం నేర్చుకున్నాం. వారి మాటలు గాని, చేష్టలు గాని, తినే విధానం గాని, మాట్లాడే విధానం గాని, రాసిన విధానం గాని ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని మనం అనుసరించాలి, ఫాలో చేయాలి. ఫాలో చేస్తూ ఉండాలి.
(21:47) ఫాలో చేయడం అంటే గుడ్డిగా కాదు. మన స్వబుద్ధి తామినే చూసుకోవాలి. ఆయన ఎప్పుడూ చెప్పలేదు నువ్వు నన్ను ఫాలో అవమని లేదు. నేను గురువు అని చెప్పలేదు ఎక్కడ కూడా. మనం గురువుగా భావిస్తున్నాం గొప్పవారు మనకు మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి మనం భావిస్తున్నాం. బట్ ఎక్కడ కూడా ఆయన గురువు అన్న పదం తనకు ఆపాదించుకోలేదు. సో అలాగా మనల్ని కూడా సీనియర్స్ అయ్యే కొద్దీ ఎవరైనా సరే ఆ మా గురువు గారు అని చెప్పుకున్నారంటే మీరు జాగ్రత్తగా ఉండండి.
(22:16) ఆ స్థాయి ఉందా లేదా ఆ స్థాయి ఉన్నా కూడా నువ్వు గురువు అని చెప్పుకోవడానికి లేదు. [గొంతు సవరించుకోవడం] కృష్ణ పరమాత్మ ఒక్కడే చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకోలేదు ప్రజలు చెప్పారు. మహాత్ములు చెప్పారు. జగద్గురువు అన్నారు ఆయన. శంకరాచార్యులు కూడా జగద్గురు అంటారు. సో గురు బాధ్యతలు తీసుకున్నాక వారి యొక్క ప్రతి చర్య కూడా ఎంత గొప్పగా ఉంటది అంటే నన్ను వెనకల చాలామంది గమనిస్తూ ఉంటారు.
(22:41) అందువల్ల నేను చాలా జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళు దాన్ని ఫాలో అయిపోయి వాళ్ళ జీవితాలను సరిదిద్దుకుంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉంటారు. అందుకే మనం కూడా మన ఇంట్లో ఎలా ఉండాలి అంటే మన పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు వస్తారు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి మన ప్రతి మాట ప్రతి నడక అన్నీ కూడా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అనే ఉద్దేశంతోనే నీ మాట సరిగా ఉండాలి.
(23:06) అలా లేకపోతే ఏమవుతుంది అంటే నువ్వు ఏం చేసావో అదే చేస్తారు. తండ్రికి గోతి తవ్వుతున్నాడు. వాడి కొడుకు వాడి వెనకల ఉండి వాడి కూడా చిన్నగా తవ్వుతున్నాడు. అడిగాడు ఎందుకు నాన్న నువ్వు గోతి తవ్వుతున్నావు అన్నాడు. నువ్వు ఎందుకు తవ్వుతున్నావు నాన్న నేను అందుకే తవ్వుతున్నాను అన్నాడు. నేను మా నాన్న కోసము అన్నాడు.
(23:27) నేను నీ కోసము అన్నాడు. సింపుల్ ఫాలో చేస్తుంటారు అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మాట గాని పిల్లలతో అబద్ధాలు చెప్పవద్దు అండి. దేనికోసం అయితే వెళ్తున్నామో అదే పేరు చెప్పండి. బయటికి వెళ్తూ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అంటాం మనం చిన్నప్పుడు వాళ్ళకు బయటికి రాకుండా పిలుచుకుపోకుండా ఉండడానికి కొన్ని సందర్భాల్లో. వాడికి అర్థమవుతుంది ఎందుకంటే ప్యూర్ సోల్స్ వాళ్ళు.
(23:50) మన భావాన్ని తీసుకుంటారు మన మాటలు కాదు మన భావము ఏముందో వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఆశక్తత వల్ల మనకి ఏం చెప్పరు వాళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఓకే అంటారు. పెద్దయిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత మమ్మీ నాకు స్పెషల్ క్లాస్ ఉందని వెళ్లి మ్యాట్నీకి వెళ్తాడు. చిన్నప్పుడు మనం ఏం చేసామో వాళ్ళకోసం వాళ్ళు అదే చేస్తారు పెద్దయిన తర్వాత.
(24:11) సో అనుసరిస్తున్నారు అనే దృష్టిలో పెట్టుకొని మన ప్రతి మాట ప్రతి చేష్ట చాలా కరెక్ట్ గా ఉండాలి. సో ఇదంతా కూడా జ్ఞానపరంగానే మనం చూసుకుంటూ ఉండాలి. అట్లాగే అక్షర జ్ఞానం. యాక్చువల్ గా అయితే మనం ఈ అక్షరాలను చూసుకుంటూ దీన్ని అక్షర జ్ఞానం అంటున్నాం కానీ ఇది క్షర జ్ఞానమే. అక్షర జ్ఞానం అంటే అక్షయమైనది నశించని దాన్ని అక్షయం అంటారు.
(24:35) సో అక్షరం అంటే మనం దీన్నే అక్షరం కదా తీసుకుంటున్నాం అయినా పర్వాలేదు. అలాగే మాట్లాడుకుందాం. ఈ చుట్టూ ఉన్న ప్రాపంచిక చదువులంతా కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవసరమే మనకు. ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చదువుతూ ఉండాల్సిందే. సో అందుకే ఈ అక్షర జ్ఞానానికి ఎంత ఇంపార్టెంట్ ఉంది అంటే ఒక సూఫీ మాస్టర్ చెప్తారు. [గొంతు సవరించుకోవడం] ప్రజలు 30 సంవత్సరాల వరకు జీవిస్తున్నారు ఆ తర్వాత 60 సంవత్సరాల్లో 70 సంవత్సరాల వరకు జీవత్సవంలా బతుకుతున్నారు అన్నాడు ఆయన.
(25:09) జీవత్సవంలా బతుకుతున్నారు. ఎందుకన్నాడు అంటే ఆయన మనిషి నేర్చుకోవడం అనేది 30 వ సంవత్సరానికి ఆగిపోతుంది. ఇంకా ఫర్దర్ లేదు. ఒక డిగ్రీనో, ఒక పీజీనో, ఒక జాబో ఏదో వస్తే అక్కడికి అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకేం అవసరం అనుకుంటున్నారు నేర్చుకోవడం అన్నది. సో ఆయన చెప్పింది ఏంటి [గొంతు సవరించుకోవడం] [గొంతు సవరించుకోవడం] ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోయిందో [గొంతు సవరించుకోవడం] అక్కడ చనిపోయినట్టే లెక్క.
(25:54) ఆ తర్వాత జీవితం అంతా కూడా బతుకుతున్నాం అంతే జీవించడం లేదు. సో జీవించడం అంటే నిరంతరము నువ్వు సత్య శోధనలో నేర్చుకోవడం ఎప్పుడైతే ఉంటావో అప్పుడే జీవిస్తున్నట్టు లెక్క. లేదంటే అక్కడికి ఆగిపోయినట్టే ఇంకా. ఆ సూఫీ మాస్టర్ చెప్తారు సో ఈ అక్షర జ్ఞానం వల్ల ఈరోజు మనం ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నాం. ఎంతోమంది మహాత్ములు రాసిన గ్రంథాలన్నీ చదవగలుగుతున్నాం.
(26:22) అందువల్ల స్వాధ్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పత్రి గారు ఏం చెప్పారు ధ్యానము, స్వాధ్యాయనము రెండో పెద్ద పీట వేశారు దానికి స్వాధ్యాయానికి. ఆయన అందుకే నిరంతరం పుస్తకాలు చదువుతూ ఉంటారు. దాదాపు ఆయన జీవిత కాలంలో లక్ష పైబడి పుస్తకాలు చదివారు. మరి ఆ జ్ఞానంతో మనకు అందించారు వారు. మనం కూడా నిరంతరం పుస్తకాలు చదువుతూ ఉండాల్సిందే.
(26:44) అయ్యా మాకు చదువు రాదండి అన్నారనుకో మంచిది ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళతో చదివించు ఇద్దరికీ లాభమే కదా. పిల్లలకు చదవడం అలవాటు అవుతుంది మంచి విషయాలు వింటారు. మనం విన్నట్టు అవుతది అందుకే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. మనం ఆ సొల్యూషన్ పక్కన పెట్టేసి తప్పించుకోవడానికి మనంతకు మనమే అనేక దారులు వెతుక్కుంటూ ఉంటాం. నిజంగా నీకు తెలుసుకోవాలి చదువుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి.
(27:07) కానీ మనమే మనకు తెలియకనే దాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాం. నేను బోర్ కొట్టిస్తున్నానా? బోర్ కొట్టిస్తున్నానా? మరి ఏది? ఎందుకోసం మధ్యలో బ్రేక్ చేశానంటే కంటిన్యూగా వింటూ ఉంటే మన లోపలికి పోయినట్టే ఉంటుంది కానీ ఇక్కడికి చేరదు అది. అందుకే మధ్య మధ్యలో కొద్దిగా అలా బ్రేక్ పడాలి. ఆ బ్రేక్ పడడానికే పత్రి గారు ఏం చేశారంటే చప్పట్లు కొట్టిస్తూ ఉంటారు మధ్య మధ్యలో బాగుందా పాయింట్ అంటే చప్పట్లు కొడతారు.
(27:40) బాగుందా పాయింట్? సో ఈ అక్షర జ్ఞానం ఈ అక్షర జ్ఞానం వల్లనే సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. దాని వల్ల అనేక సుఖాలు మన ముంగిటికి చేరాయి. ఈరోజు ఇక్కడ మైక్ లో మాట్లాడుతున్న మరి హాల్ అంతా వినబడుతా ఉంది. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న పిఎంసి ద్వారా ప్రపంచానికి చేరుతా ఉంది. మనందరం కనబడుతున్నాం ప్రపంచానికి. ప్రపంచం మనకు కనబడడం లేదు కానీ మనమంతా ప్రపంచానికి కనబడుతున్నాం.
(28:12) ఇదంతా ఎలా సాధ్యమైంది? శాస్త్రీయత. అందుకే శాస్త్రీయత కూడా ఉండాల్సిందే సైన్స్ ఉండాల్సిందే. సైన్స్ వల్ల మనం స్పిరిచువాలిటీని ఇంకా ఇంకా ఇంకా గొప్పగా ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ సైన్స్ ఏ గొప్పదని చెప్పడం లేదు. సైన్స్ ద్వారా అనేక సుఖాలు మన ముంగిటికి చేరుతున్నాయి. వాటిని ఎంజాయ్ చేయాల్సిందే తీసుకుందాం.
(28:33) ముందర కాలినడక బండ్లు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, బస్సులు వచ్చాయి, రైళ్లు వచ్చాయి, విమానాలు వచ్చాయి. అన్నిటిని అనుభవిస్తున్నాం కదా. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే త్రూ సైన్స్ ఓన్లీ. అక్షర జ్ఞానం వల్లనే సాధ్యమైంది. శాస్త్రజ్ఞానం వల్లనే సాధ్యమైంది ఇది. సో ఎవరు ఈ సృష్టిలో ఉన్నారు అంటే ఎవరు తక్కువ వారు కాదు.
(28:51) అట్లనే ఎక్కువ వారు కాదు. అందువల్ల ఈ అక్షర జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత మనము తీసుకుంటూ ఉండాల్సిందే. చదువుతూ ఉండాల్సిందే. రోజు ఒక 10 పేజీలు, 20 పేజీలు, 30 పేజీలు మన ఇష్టం. బట్ దానికంటూ కొంత సమయం కేటాయించాల్సిందే. ధ్యానము, స్వాధ్యాయము. సజ్జన సాంగత్యము. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సజ్జనులతో మనం గడుపుతుండాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ సజ్జన సాంగత్యము అంటే ఇప్పుడు నేను ఒక 100 పుస్తకాలు చదివాను అండి.
(29:21) ఇప్పుడు మీకు చెప్పిన విషయాల్లో ఆ 100 పుస్తకాల యొక్క సారం మీకు చేరుతా ఉంది. మీరు ఆ 100 పుస్తకాలు చదవాలంటే చాలా టైం పట్టొచ్చు. ఒక పుస్తకంలో ఒక మంచి పాయింట్ చిక్కిన కూడా చాలు మనకు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. [గొంతు సవరించుకోవడం] కోరికలతో అంటూ మనం చనిపోతే దాన్ని మరణము అంటాం. అంతేనండి? కోరికలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక కోరిక లాస్ట్ మూమెంట్ లో కూడా అయ్యో మనవాడిని పెళ్లి చూడలేదే అని అంటాడు లాస్ట్ లో ఇంకా పోయేటప్పుడు కూడా.
(29:51) మనవరాలి పెళ్లి చూడలేదే. ఆ మునిమనవాడికి పేరు పెట్టి ఉంటే చూస్తే పోయేవాడిని కదా అని ఏదో ఒకటి. అంటే ఏంటి అది మరణము. కోరికలతో నువ్వు చనిపోతే దాన్ని మరణము అంటారు. జీవించి ఉండగానే కోరికలను తీసేసావు అనుకో అది ముక్తి అంటార. అంతే సింపుల్. చావుకు ముక్తికి తేడా ఏంటి? కోరికలతో చనిపోయినావు అనుకో అది చావు. నువ్వు జీవించి ఉండగానే కోరికలను చంపేసావు అనుకో తీసేసావు అనుకో అదే ముక్తి.
(30:28) ఇంకా అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఆ సింపుల్ పాయింట్ మనం అర్థం చేసుకోగలిగితే మనలో ఉన్న అరిషడ్వర్గాలను మనం ఈజీగా బయట అరిషడ్వర్గాలు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ ఆరు ఉన్నాయి. ఇవి మనతో పాటే పుట్టాయి. మనతో పాటే పెరుగుతున్నాయి, మనతో పాటే చస్తున్నాయి. ప్రతి జన్మలోనూ ఇవి డబల్, త్రిబుల్ అవుతూ వస్తూ ఉన్నాయి.
(30:52) మనకు అది అర్థం కావడం లేదు. కోరిక సహజం అనుకుంటున్నాం. కోరికలు సహజం కాదు. కోరికలు దుఃఖానికి మూలం అని చెప్పాడు, బుద్ధ భగవాన్ అని చెప్పాడు, వేదాలు చెప్పాయి, శాస్త్రాలు చెప్పాయి. కానీ మనం నిరంతరం కోరికలు కోరుకుంటూ, కోరుకుంటూ, కోరుకుంటూ ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉన్నాయి. దానికి ఎక్కడ ఫుల్ స్టాప్? ఈ కోరికలే కొంపలు ముంచుతున్నాయి.
(31:13) అద్భుതമായ ఈ జీవితాన్ని తీసుకున్నది కేవలం కోరికల కోసమా? ఒకటే పరుగు. దేనికోసం ఆ పరుగు? పుట్టినది మొదలు పరుగులాయే, ఎంత పరుగెడినా గమ్యం రాదాయే, అంతలోనే, అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురా ఈ జన్మనెత్తి? దేనికోసం? డబ్బు కోసమా? నువ్వు ఎందుకోసం వచ్చావు? పుట్టింది ఎక్కడో, గిట్టేది ఎక్కడో, పుట్టక మునుపు ఎక్కడో, గిట్టిన తర్వాత ఎక్కడో, మధ్య ఈ ఆరాట పోరాటాలు ఎందుకో అజ్ఞానాన్ని చేదించి సత్యాన్ని తెలుసుకో.
(31:47) సో నీ యొక్క జన్మ కారణం తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇక్కడ ఉండకుండా మనం ఎక్కడెక్కడో తిరిగేసి ఆ మేము ధ్యాన యజ్ఞానికి పోయి వచ్చామంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, జ్ఞానం పొందడానికి. సో మధ్యలో ఏదన్నా దగ్గర దగ్గర విశేషాలు ఉంటే లీజర్ టైంలో పోయి రావాలి.
(32:11) అలా కాకుండా దిగేసి, టిఫిన్ తినేసి మనం బయటంతా తిరిగి వచ్చామనుకో వాట్ ఇస్ ద పర్పస్? సో అలాగే ఇక్కడ ఈ జీవితంలోకి దేనికోసం అయితే వచ్చామో అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్లిపోవాలి. అలా కాకుండా వేరే ఏం చేసినా కూడా నీ జీవితం వృథా అవుతుంది. నర జన్మ దుర్లభమని శాస్త్రాలు చెప్పాయి, గురువులు చెప్పారు, పెద్దలు చెప్పారు.
(32:36) మరి ఇంత దుర్లభమైన ఈ నర జన్మను తీసుకొని మనం ఏం చేస్తున్నాం, ఏం సాధిస్తున్నాం అనేది మనకు మనం ప్రశ్న వేసుకోవాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక ఐదు ప్రశ్నలు వేసుకోవాలి లోపల. నేను ఈ జీవితంలోకి ఎందుకోసం వచ్చాను? నా సమయాన్ని దేనికోసం కేటాయించాను? నేను నా సమయాన్ని ధనం కోసం ధర్మబద్ధంగా సంపాదించడానికి ఉపయోగించానా? దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాను? జీవితాన్ని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగానే జీవించుతున్నానా లేదా అన్నది మనకు మనమే ప్రశ్న వేసుకోవాల్సిందే.
(33:20) ఇక్కడ ఎవరు నిన్ను క్వశ్చన్ చెయ్యరు. పైకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ అప్పుడు వస్తుంది మన ముందరికి. సో ఆన్సర్ ఇవ్వాల్సింది మనమే. అంటే ఏంటి? తీసుకున్న ఈ జీవితంలో చక్కగా అనుకున్న విధంగా అనుకున్నట్లుగా జీవించామా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్. ఏండీ అర్థమవుతుందా? అర్థమైందా? మీకు అర్థమైందని నాకెట్లా అర్థం కావాలి? ఇంకా గట్టిగా.
(33:57) సో జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొద్దిగా తెలుసుకోగలిగాము. ఇది అనంతం. ఎక్కడితో ఆగేది కాదు. తరతరతర ఎంతో ఉంది. బుద్ధుడు వెళ్ళాడు. శిష్యులు కూడా వెళ్ళారు. భగవాన్ మీకు అంతా తెలుసా అన్నారు. ఆయన కింద అడవిలో ఉన్న ఆకులు గుప్పెట్లో తీసుకొని నాకు ఇంత ఇంత మాత్రమే తెలుసు అన్నాడు. అంటే ఏంటి? అడవిలోని ఆకులన్నీ ఎన్ని ఉంటాయి? చెట్ల మీద ఆకులు ఎన్ని ఉంటాయి? తాను చెప్పింది ఎంత? నాకు ఇంత తెలుసు అన్నాడు అంతే.
(34:28) అందువల్ల తెలుసుకున్నది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్న దృక్పథంతో మనం ముందుకు వెళ్తుంటే మన జీవితాన్ని వచ్చిన జీవితాన్ని, తీసుకున్న జీవితాన్ని చక్కగా నడుపుకుంటూ పరిసమాప్తం చేసుకోవచ్చు. పత్రిక గారికి ధన్యవాదాలు. [బెల్] [సంగీతం]

No comments:
Post a Comment