Saturday, November 14, 2026

మంచి ఉద్యోగం చేస్తున్నా.. లోలోపల నలిగిపోతున్నా! || ఆచార్య ప్రశాంత్

మంచి ఉద్యోగం చేస్తున్నా.. లోలోపల నలిగిపోతున్నా! || ఆచార్య ప్రశాంత్

Author Name:Acharya Prashant Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H_6caFe5o1M





Title: మంచి ఉద్యోగం చేస్తున్నా.. లోలోపల నలిగిపోతున్నా! || ఆచార్య ప్రశాంత్

Author Name: Acharya Prashant Telugu

Description: ఉద్యోగం అనేది మీ జీవితానికి కేవలం ఒక సాధనం మాత్రమే, అది మీ జీవితం కాదని ఈ వీడియోలో ఆచార్య ప్రశాంత్ వివరిస్తున్నారు.

వృత్తిపరమైన బాధ్యతలు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో, అసలైన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ చర్చలో తెలుసుకోండి.

🔗Original Video:    • अच्छी नौकरी करती हूँ, फिर भी घुटन में जीती...  

✨ ముఖ్యమైన లింకులు (Important Links):
🧔🏻‍♂ ఆచార్య ప్రశాంత్ గారితో గీత మరియు వేదాంతాల లోతైన సారాన్ని అర్థం చేసుకోవడానికి, లైవ్ ఆన్‌లైన్ సెషన్‌లలో చేరండి:
https://acharyaprashant.org/hi/live-s...
📚 ఆచార్య ప్రశాంత్ గారి పుస్తకాలు చదవాలనుకుంటున్నారా? ఉచిత డెలివరీతో ఇప్పుడే పొందండి:
https://acharyaprashant.org/hi/books?...

👤 ఆచార్య ప్రశాంత్ గురించి (About Acharya Prashant):
ఆచార్య ప్రశాంత్ (IIT-D, IIM-A, ఎక్స్-సివిల్ సర్వెంట్) నేటి తరానికి అసలైన వేదాంతాన్ని అత్యంత స్పష్టంగా, ధైర్యంగా బోధిస్తున్న ఆధ్యాత్మిక గురువు.
ఆయన బోధనలు కేవలం మాటలు కావు; అవి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, సమాజం మనపై రుద్దిన కట్టుబాట్లను ఛేదించే ఆయుధాలు. సోషల్ మీడియాలో 10 కోట్లకు పైగా ఫాలోవర్లతో, భగవద్గీత మరియు ఉపనిషత్తుల లోతైన సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆయన చేరవేస్తున్నారు. మహిళా సాధికారత, జంతు సంరక్షణ మరియు మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన ఒక ప్రపంచస్థాయి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అబద్ధాల బానిసత్వం నుంచి బయటపడి, నిజమైన స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఆయన మాటలు ఒక మేలుకొలుపు.

📱Follow Us:
Instagram: https://www.instagram.com/acharya_pra...
Facebook:   / 16youotcmh  

#acharyaprashant #acharyaprashanttelugu #prashantadvaitfoundation #vedantatelugu #bhagavadgitatelugu #spiritualitytelugu

సంగీతం: మిలింద్ దాతె
~~~~~

Transcript:
(00:00) 2015 నుండి ఇప్పటివరకు అంటే జాబ్ చేయడం మొదలుపెట్టి పదేళ్లు అవుతుంది. ఇప్పుడు ఆ జాబ్ చేసే చోట నాకు చాలా సఫోకేషన్గా నలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. 25 లో చేరావు. 35 ఏళ్ల పాటు అదే పని చేస్తూ ఉంటావు. నిద్ర, స్నానం లాంటి పనులు పక్కన పెడితే నీ 70 నుండి 80 శాతం సమయం దానికే ఇచ్చేస్తున్నావు. జీవితాంతం ఏం చేశావు? జాబ్ చేశాను.
(00:26) బక్ నౌకరు ఇది కూడా ఒక సమాధానమేనా? ఆలోచించు నువ్వు చనిపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగారనుకో లేదా మేనక, రంభ లాంటి వాళ్ళు వచ్చారనుకో నువ్వు చనిపోతున్న సమయంలో వాళ్ళు వచ్చి సో డ్యూడ్ హౌ వాస్ లైఫ్ అని అడిగితే నువ్వేమో నేను ఒక నౌకరిని అంటావా? ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకూడదు మన డబ్బు మన దగ్గరే ఉండాలి అదంతా సరే కానీ జాబ్ మాత్రమే జీవితం కాదు.
(00:52) ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ స్టేబుల్ అయిపోయిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ నాదొక ప్రశ్న. ఆచార్య జీ నమస్తే. ఈరోజు సెషన్లో మీరు చెప్పిన మొదటి మాట జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏది అని. అది వినగానే నా మనసులోకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. నేను పుస్తకంలో కూడా రాసుకున్న ఆ మాట ఉద్యోగం. నాకు తెలిసొచ్చినప్పటి నుండి అంటే చదువు అంటే ఏంటో తెలిసే వయసు వచ్చి ఎనిమిదవ తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల నుంచే అప్పటి నుంచే ఇంట్లో కూడా వాతావరణం అలాగే ఉండేది.
(01:34) అంటే నా చదువుకున్న ఏకైక ఉద్దేశం ఎలాగైనా ఒక ఉద్యోగం సాధించాలనేది. మా అమ్మతో కూడా ఎప్పుడూ చెప్పేదాన్ని నరకంలోనైనా సరే నాకు ఉద్యోగం కావాలి అని. ఆ చుట్టుపక్కల వాతావరణం వల్ల నాకు గవర్నమెంట్ జాబ్ కావాలనే ఉండేది. అలా తొమ్మిది 10 11 12 తరగతులు పూర్తి చేశాను. ఆ తర్వాత 12 వ లో మంచి మార్కులే వచ్చాయి కానీ ఉన్నత చదువుల కోసం ఏదైనా పెద్ద కాలేజీలో చేరడం గాని అడ్మిషన్ తీసుకోలేదు.
(01:59) అమ్మాయిలకి టీచింగ్ జాబ్స్ త్వరగా వస్తాయి అని వెంటనే ఆ కోర్సులో చేరిపోయాను. అలా రెండేళ్ల రెండేళ్ల కోర్సు పూర్తి చేసి 2015లో నాకు మొదటిసారిగా జాబ్ వచ్చింది. ఈ రోజుకి ఏదైనా కాలేజ్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు నేను కూడా పై చదువులు చదువుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఉద్యోగం వచ్చేసిందని కాలేజీ చదువులు ఆపేశాను. 2015 నుంచి చూస్తే ఇప్పటికి ఉద్యోగం చేస్తూ 10 ఏళ్లు గడిచిపోయాయి.
(02:23) కానీ ఇప్పుడు ఆఫీసులో ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఏదో నలిగిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది. 10 ఏళ్ల ఉద్యోగం నాకు స్వతంత్రతని ఇచ్చింది. మనుషుల ఒత్తిడి కాస్త తగ్గింది అనిపించింది. ఇంట్లో వాళ్ళ బలవంతం లేకుండా పోయింది. ఒక భద్రత దొరికింది. ఉద్యోగం అంటే నాకు నచ్చిన పని అని కాదు. నెల చివరికి వచ్చే జీతం ఆ రకమైన ధైర్యాన్ని, సెక్యూరిటీని ఇచ్చింది.
(02:46) ఇలా 10 ఏళ్లుగా పని చేస్తున్నాను. అంతా బానే ఉంది కానీ ఇప్పుడు ఆ ఉద్యోగంలో నేను తీవ్రమైన అణచివేతకు గురవుతున్నట్లు అనిపిస్తోంది. అదో పూర్తి సిస్టం. పైన ఒక హెడ్ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ వినాల్సిందే. టీచింగ్ లో పిల్లలతో గడపడం చాలా బాగుంటుంది. కానీ దాంతో పాటే ఉండే పేపర్ వర్క్, అక్కడ నచ్చినట్టుగా ఓపెన్ గా ఉండలేకపోవడం, నా వ్యక్తిత్వంలో బలహీనత, భయం, ఏదో తెలియని నిస్సహాయత ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
(03:16) ఉద్యోగం మన కోసమే కదా ఉండేది. ఉద్యోగం మన కోసం ఉంటుంది అంతే గాని మనం ఉద్యోగం కోసం బతకం కదా. మీ జీవితంలో కొంత స్పష్టత ఉండేది. దాంతో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. అసలు ఉద్యోగం ఎందుకు కావాలి? ఆర్థికంగా ఆధారపడితే మానసికంగా కూడా ఆధారపడాల్సి వస్తుందని మీకు అర్థమైంది. అందుకే ఆర్థికంగా ఆధారపడకూడదు. మన డబ్బు మన దగ్గరే ఉండాలి.
(03:43) నెలాఖరికి జీతం వచ్చేస్తుంది అనుకున్నావ్ అదంతా సరే. దీనివల్ల నాకోసం నాకేం దక్కుతోంది అన్నది గుర్తుంచుకున్నంత వరకు పర్లేదు. నేను ముందు నేను మొదట ఉద్యోగం నాకో సాధనం మాత్రమే. ఉద్యోగమే జీవితం కాదు ఉద్యోగం జీవితం కోసం మాత్రమే. మరి ఉద్యోగం వల్ల జీవితానికి ఉపయోగం తగ్గినా లేదా పూర్తిగా ఆగిపోయినా ఇక ఆ ఉద్యోగంలో కొనసాగడంలో ఏ అర్థము ఉండదు.
(04:12) లేదా ఉందా? ఇంట్లో మీకు ఆ ఏదైనా అవసరం రావచ్చు. ప్లంబింగ్ పని కావచ్చు, కరెంటు పని ఏదైనా కావచ్చు. ఇలాంటి పనులు సహజమే అప్పుడు ఎవరినైనా పిలుస్తారు. టెక్నీషియన్ వచ్చాడు. ఏదో రిపేర్ పని ఉంది, ఎక్కడో నీళ్లు కారుతున్నాయి, వైరింగ్ తేడా వచ్చింది. అప్పుడు మీరు ఎలక్ట్రీషియన్ ని పిలిచారు. టాప్ లీక్ అవుతుంటే ప్లంబర్ ని పిలిచారు.
(04:45) అంతే గాని వచ్చిన ప్లంబర్ ని ఇంట్లోనే ఉంచుకొని కుటుంబ సభ్యుడిని చేసేసుకుంటారా? లేక ఎలక్ట్రీషియన్ వస్తే అతని ఇంటి మనిషిని చేసేసుకుంటారా? వాళ్ళు ఇంటి పని కోసం వచ్చారు అంతే గాని ఇంటి యజమాని అవ్వడానికి రాలేదు కదా. ఇలాంటి మాట వింటేనే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. కామెడీలా అనిపించదు. ఎలట్రీషియన్ వచ్చాడు వచ్చి కాసేపటికి ఏమైపోయాడు? నువ్వే నా జీవితానికి వెలుగు వి అన్నట్టు జీవితమే అయిపోయాడా? మరి ప్లంబర్ వస్తే ఏమంటారు? నువ్వే నా జీవితపు అమృత వర్షానివి అంటారా? ఎవరో ఒకరు వస్తుంటారు ఏదో ఒకటి అనేస్తుంటారు.
(05:27) అతను ఇల్లు రిపేర్ చేయడానికి వచ్చాడు రిపేర్ చేసేవాడు అంతే. అంతే గాని ఇంటి మనిషిని చేసుకోలేం కదా. ఉద్యోగం కూడా ఇలాంటిదే. జీవితం ఒక ఇల్లు అయితే ఇంట్లో వీటన్నిటికీ కొంత అవసరం మాత్రమే ఉంటుంది. వైరింగ్ లో ఏదైనా తేడా వస్తే ఫోన్ చేస్తారు అయ్యా వచ్చి వైరింగ్ బాగు చెయ్యి అని. అతను వచ్చాడు వైరింగ్ బాగు చేశాడు ఇంక బయలుదేరు అంటాం.
(05:52) లేదా ఇక్కడే ఉండాలనుకుంటే సరే బయట చోటు ఉంది పర్మనెంట్ గా అక్కడ ఒక ప్లేస్ ఇచ్చాం అక్కడే ఉండు అంటాం. అంతే కానీ ఇంటి మధ్యలో కూర్చోలేవు కదా. ఇంటి పూజ గదిలో కూర్చోబెట్టలేం కదా. కానీ ఈ విషయాన్నే మర్చిపోతుంటాం. ఇంట్లోకి ఎవరు వచ్చినా సొంత మనిషిని చేసేసుకుంటాం అంటే నువ్వు లేకపోతే ఇంకా ఇల్లే లేదన్నట్టుగా. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ అందులో పూర్తిగా స్థిరపడిపోయి స్టేబుల్ అయిపోయిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ నాదొక ప్రశ్న.
(06:37) మీ ఉద్యోగం ఇప్పుడు మీకు ఆకాశంలా మారిందా లేక బోనులా మారిందా? అది మీకు రెక్కలిచ్చి ఎగరమంటోందా డబ్బులు వస్తున్నాయి అనుభవం వస్తుంది కాబట్టి ఎగరండి అది మీకు రెక్కలిస్తోందా లేక హద్దులు గీస్తోందా? ఇది అందరికీ నా ప్రశ్న. జీవితంలో ఏ విషయమైనా సరే అది ఉద్యోగమైనా ఆలోచనలైనా వస్తువైనా లేక వ్యక్తైనా సరే వాటితో మనకున్న బంధాన్ని అంచనా వేయడానికి ఇంతకన్నా వేరే ప్రశ్నే ఉండదు.
(07:09) దీనివల్ల నాకు ఆకాశం దక్కుతుందా లేక బోను దక్కుతుందా? ఎవరినైనా జీవితంలోకి ఎందుకు తీసుకొస్తామంటే వాళ్ళు రావడం వల్ల కలిగే ఉపయోగం సార్థకత ఏంటంటే మన రెక్కలు విచ్చుకోవాలి. ఆ రెక్కలు ఎప్పుడో ఒకప్పుడు పిచ్చుకునే ఉంటాయి. ఆ ఉద్యోగం నుంచి వచ్చే డబ్బు మీకు చాలా అవసరమైన రోజులు ఉండే ఉంటాయి. వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండటానికి అది అవసరమైంది.
(07:34) ఇంట్లో ఒక్కోసారి డాక్టర్ అవసరం పడినట్టే అప్పుడు మీ రెక్కలు విచ్చుకున్నాయి. ఒక్కోసారి ఇంట్లో ప్లంబర్ అవసరం కూడా వస్తుంది. కానీ డాక్టర్ ని ఇంటికి పిలిచినంత మాత్రాన ఇంట్లోనే ఉంచేసుకోలేం కదా. డాక్టర్ ఎంత ఉపయోగపడిన ఇంటికి పిలిచాక ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పలేం కదా. నేను చెప్పేది అర్థమవుతుందా? అందరికంటే పైన ఉన్నది మీరే ప్రతిదీ మీకోసమే ఉంది.
(08:08) మీరంటే అహంకారం. ఆ అహంకారానికి ఉండే సమయం చాలా తక్కువ. అది తన ప్రతి విషయాన్ని ఎంతో సరిచూసుకుని ఎంచుకోవాలి. నాకున్న కాస్త సమయంలో ఈ విషయానికి సమయం ఇవ్వాలా వద్దా అని ఆలోచించాలి. ఉద్యోగానికి మనం ఇచ్చేది కొద్దిపాటి సమయం కాదు కదా. గవర్నమెంట్ జాబ్ 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. 25 కి ఉద్యోగం. 35 ఏళ్ళు అందులోనే పనిచేస్తారు. నిద్ర, స్నానాలు లాంటివన్నీ తీసేస్తే మీ టైంలో 70 నుంచి 80 శాతం దానికే ఇస్తున్నారు.
(08:51) ఇస్తున్నారా లేదా చెప్పండి. ముప్పావు వంతనుకుందాం. మరి 35 ఏళ్ళలో ముప్పావు వంతూ అంటే ఎంతో తెలుసా? దాదాపుగా 25 ఏళ్ళు అనుకోండి. 25 ఏళ్ళు అది కూడా మెళకువతో ఉండే 25 ఏళ్ళు. నిద్ర లాంటివన్నీ ముందే తీసేసాం. ఆ విషయం అంత ముఖ్యమైనదా? సరే మీరు 80 ఏళ్ళు బతుకుతారు అనుకుందాం. అందులో నిద్ర ఇవన్నీ తీసేస్తే మిగిలేది ఎంత? 50 కరెక్ట్ 50 ఏళ్ళే మిగులుతాయి. మిగతాదంతా
(09:38) నిద్ర, స్నానాలకే సరిపోయింది. మరి ఆ 50 ఏళ్ళలో 25 ఏళ్ళు దేనికి ఇచ్చేసారో? అంటే అది చాలా విలువైనదై ఉండాలి. సగం జీవితం దానికే ఇచ్చేసారు. సగం జీవితాన్ని అంకితం చేసేంత సత్తా దానికి ఉందా? నేను అడుగుతున్నాను. అడుగుతున్నాను. చెప్పండి. అంత విలువే ఉంటే సగం కాదు రెట్టింపు జీవితాన్ని ఇచ్చేయండి. 50 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళ కాలాన్ని ఇచ్చేయండి.
(10:11) కానీ అంత సత్తా ఉండాలి కదా. అలాంటి సత్తా కూడా ఎప్పుడూ కాన్స్టెంట్ గా ఉండదు. వేరియబుల్ గా మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఒక విషయం చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు దాన్ని నెత్తిన పెట్టుకొని గౌరవించండి. కానీ దాని ఉపయోగం అయిపోయాక ఇక అయిపోయినట్టే. పారేయమని నేను అనట్లేదు. దాన్ని సరిగ్గా ఎక్కడ ఉంచాలో అక్కడే గౌరవించండి. ఉద్యోగం అనేది మనిషి కాదు కదా ఫీల్ అవ్వడానికి.
(10:43) నన్ను ఎందుకు వదిలేశారు అని అడగడానికి. గుర్తే ఉండదు. ఆఫీసులో ఎనిమిది 10 గంటల ఆవింతలు తీసి ఇంటికి వచ్చేశారు. గుర్తుండదు అసలు ఈరోజు మళ్ళీ ఎప్పటికీ. తిరిగి రాదని. చావుకి మరో రోజు దగ్గర అయ్యాం. మృత్యువు వైపు ఇంకో రోజు అడుగు వేసాం. గుర్తే ఉండదు. ఛా ఈరోజు ఇలాగే వేస్ట్ అయిపోయింది. పెద్దగా ప్రొడక్టివ్ విధంగా గడవలేదు అనుకుంటారు అంతే.
(11:23) ఇది ఏదో ఒక రోజు ప్రొడక్టివిటీ గురించిన విషయం కాదు. ఒక జన్మ మొత్తం బూడిద పాలవుతున్న విషయం. అసలు మరణం ఎప్పుడు గుర్తు వస్తుంది? 50 దాటాక. అప్పుడు గుర్తొచ్చి మాత్రం ఏం లాభం? ఆ టైంలో జ్ఞాపకశక్తి ఎలా ఉంటుందంటే చావు గుర్తొస్తూ గుర్తొస్తూనే మర్చిపోతారు. ఏదో గుర్తొచ్చింది ఏదో గుర్తొచ్చింది ఏంటది? మర్చిపోయాను. పళ్ళన్నీ ఊడిపోయాయి. గొంతు వణుకుతోంది.
(12:08) చావు అందామంటే నోరు తిరగడం లేదు. ఇక అప్పుడు చావుని తలుచుకొని మాత్రం ఏం ప్రయోజనం? మాట నత్తిగా మారిపోతుంది. అంత మాట్లాడే సరికి రెండు మూడు పళ్ళు రాలి కింద పడతాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే పేగులే నోట్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. చావు కనపడినప్పుడే దాన్ని గుర్తు చేసుకోవాలి. హ్మ్. ఇదేమి నిహిలిస్ట్ ఆలోచన కాదు. అర్థమవుతోందా? ఇదేమి నిరాశావాదపు ఆలోచన కాదు.
(12:48) మేమేమో పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్లమండి. మేము మంచిగా ఆలోచిస్తాం, గొప్పగా ఆలోచిస్తాం, మాది పాజిటివ్ మైండ్ సెట్. ఇలాంటి చావులను గట్రా గుర్తు చేసుకోవడం మూర్ఖత్వానికి, నిరాశకి నిదర్శనం అనుకుంటారు. కాదు. ఎవరికైతే మృత్యువు గుర్తుండదో వాళ్ళు ఇంకేం లేదు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అంతే. చాలా విషయాలు మళ్ళీ తిరిగి వస్తాయి.
(13:35) కానీ సమయం రాదు. ఎంత తలడిల్లినా ఏం చేయగలం? రానిది ఇక రానట్టే. ఒక్కసారి వెళ్ళిపోయినది మళ్ళీ తిరిగి రాదు కదా. నువ్వు కూడా గడిచిపోతూనే ఉన్నావు. మరి నువ్వు ఎలా తిరిగి వస్తావు? ఎంతో మంది మనసులో బాధ ఉంటుంది ఎవరో ఒకరు వెళ్ళిపోయారని, ఇక తిరిగి రారని. జీవితం నుండి అయినా, ఈ లోకం నుండి అయినా ఎంత మందిలో ఈ బాధ ఉంది. ఎదుటి వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ కోసం అంతలా బాధపడతారు.
(14:16) ఇక తిరిగి రారని. మరి గురించి నువ్వు ఎందుకు బాధ పడటం లేదు? నువ్వు కూడా ప్రతి రోజు గడిచి పోతూనే ఉన్నావు కదా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు బాధ పడి కూడా ఉపయోగం లేదు. నువ్వు బాధ పడినంత మాత్రాన వాళ్ళు తిరిగి రారు. కానీ ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించుకో. బహుశా మిగిలిన ఈ రోజులైనా వృథా కాకుండా కాపాడుకోగలవు.
(14:43) ఈ ఉద్యోగం కూడా భలే విచిత్రమైన టాపిక్. లైఫ్ అంతా ఏం చేసావు? జాబ్ చేశాను. భక్ నౌకరు. ఇదేం సమాధానం అసలు? ఎంత విడ్డూరం ఆలోచించండి. మీరు చనిపోతున్నారు ఎవరో వచ్చి అడుగుతారు. అంటే మనం జీవాత్మను నమ్ముతాం కాబట్టి ఇంకా నమ్ముతాం. ఇప్పుడు మేనక, రంభ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి మీరు చనిపోతున్నారు వాళ్ళు వచ్చి అని అడుగుతున్నారు.
(15:20) మీరేమో నేను నౌకరుగా ఉండేవాడిని అని చెప్తున్నారు. ఇందులో అసలు ఏ మాత్రం సెక్సీనెస్ లేదు. వాళ్ళు కనీసం పట్టించుకోరు కూడా. [నవ్వు] దేవ్ జీవాత్మ ఈ కూడా పరువు పోయింది. జీవాత్మ ఈ కూడా ఏమి దక్కలేదు. అడిగితే సంతులు ఎందుకని ఇంతగా సాధోరే అన్నారు.
(16:06) కారణం ఉండాలిగా. వాళ్ళ ఏమీ జీవితం ఒక పండుగ ఊరేగింపులు తీయండి అని పాడట్లేదు. ఇది శవాల ఊరు అని మీతో చెబుతున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. అలాగే వాళ్ళ లాగా ఎవరు బతకలేదు. వాళ్ళ కంటే ఎక్కువగా ఎవరు చావు గురించి పాడలేదు. ఈ రెండు విషయాలు కలిసే సాగుతాయి. ఎవరైతే మరణాన్ని గుర్తుపెట్టుకుంటారో చావు గురించి పాడుకుంటారో నిర్భయంగా ఉంటారు.
(16:40) ఉమ్ కూర్చోండి. ధన్యవాదాలు సార్. మన గీత మరియు ఇతర కార్యక్రమాలు నడిచే మన సొంత యాప్ గురించి మీకు తెలిస్తే సంతోషిస్తారు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు, అష్టావక్రుడు ఉన్నారు. ఇవి నాకు దొరికాయి నా జీవితం మారింది. ఇవి మీకు దొరికితే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా కనీసం వేల జీవితాలైనా పూర్తిగా మారాయి.
(17:12) రెండు లక్షల మందికి పైగా గీత సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్ లో. మొదటి నెల గీత మిషన్ కి ఉచిత ప్రవేశం. యాప్ లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్ గీత కమ్యూనిటీ, గీత ఎగ్జామ్స్, ఆడియో బుక్స్, కోట్స్ ఇంకా మరెన్నో. Google ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
(17:46) [సంగీతం]

No comments:

Post a Comment