Friday, November 13, 2026

👙"ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి" అంటారు.


PRATIKULA VEDAM
2 hours ago
👙"ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి" అంటారు. Nvidia CEO Jensen Huang వార్త చదివాక నీకు కూడా సరిగ్గా అదే అనిపించింది కదూ? కానీ సామ్రాజ్యాలు కూలిపోయేది ఆడదాని వల్ల కాదు.. ఆ సామ్రాజ్యాన్ని ఏలేవాడిలో ఉన్న "ఖాళీతనం" వల్ల, వాడి కనీస జీవసంబంధమైన కోరికలను అదుపు చేసుకోలేని, వాడి జంతు లక్షణం వల్ల.

🇨🇳Jensen Huang ఎవరనుకుంటున్నావు? ఒక సాధారణ వ్యాపారవేత్త కాదు. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న Artificial Intelligence విప్లవానికి మూలపురుషుడు. 1993లో మొదలైన అతని 33 ఏళ్ల ప్రస్థానం ఒక 4.5 Trillion డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించింది. మట్టిలో కలిసిపోయే Silicon Chips కు "బుద్ధిని" (Intelligence) నేర్పించిన మేధావి అతను. యంత్రాలకు సెకనులో కోట్లాది Calculations చేసే శక్తిని ఇచ్చాడు.

🥵కానీ ఇక్కడ ప్రకృతి ఆడుతున్న విచిత్రమైన మాయని చూడు. ఏ యంత్రాలకైతే తను Intelligence ని ఇచ్చాడో, ఆ యంత్రాలు తమ పనిని తాము నిబద్ధతతో చేస్తున్నాయి. కానీ ఆ యంత్రాలకు ప్రాణం పోసిన ఈ సృష్టికర్తకు మాత్రం తన సొంత మనసు ఎలా పనిచేస్తుందో అన్న కనీస స్పృహ లేదు. ప్రపంచంలో ఉన్న అత్యంత సంక్లిష్టమైన Dataను process చేయగల Chips ని తయారు చేసిన వాడి బుర్ర, తన శరీరంలో పుట్టే ఒక చిన్న Hormone ను Process చేయలేకపోయింది. ఒక Chinese spy గా అనుమానిస్తున్న మహిళ (Alice Huang) వలలో పడి, వివాహేతర సంబంధం పెట్టుకుని, నేడు రోడ్డున పడ్డాడు.

🖥Hackers ఒక System ను hack చేయాలంటే, వాళ్లు కొత్తగా దారులు సృష్టించరు. ఆ Systemలో అప్పటికే ఎక్కడో ఒక Loophole ఉంటుంది, దాన్ని వాడుకుంటారు. ఇక్కడ ఆ మహిళ (Spy) చేసిన పని కూడా అదే. ఆమె వచ్చి Jensen Huang సామ్రాజ్యాన్ని కూల్చలేదు. అతనిలో అప్పటికే పేరుకుపోయి ఉన్న "కామం" అనే Loophole ను ఆమె వాడుకుంది.

💰Forbes జాబితాలో Top కు చేరినంత మాత్రాన, Black leather jacket వేసుకుని ఒక Tech Icon లా ఫోజులు ఇచ్చినంత మాత్రాన లోపల ఉన్న జంతువు మాయమైపోదు. 4.5 Trillion డాలర్ల Market Value ఉంటే ఏం లాభం? లోపల నిన్ను నువ్వు అదుపు చేసుకోలేనప్పుడు నువ్వు కేవలం ఒక బానిసవి మాత్రమే. ఒక క్షణికమైన శారీరక సుఖం కోసం, ఇంద్రియాల తృప్తి కోసం తన జీవితకాల కష్టాన్ని, 33 ఏళ్ల ప్రతిష్ఠను ఒక క్షణంలో నాశనం చేసుకున్నాడు. నిమిషాల వ్యవధిలో వేల కోట్ల రూపాయల Market Value ఆవిరైపోయింది, Investorలు  రోడ్డున పడ్డారు. దీనికి కారణం ఆడది కాదు, మగాడి అజ్ఞానం.

👑మనం విజయాన్ని కొలిచే విధానం ఎంత దారుణంగా ఉందో ఈ Situation చెప్తోంది. ఒక మనిషి Bank balance చూసి, వాడికి ఉన్న కంపెనీల Size చూసి వాడు చాలా గొప్పవాడు అని మనం భ్రమపడతాం. కానీ బాహ్య ప్రపంచంలో ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని జయించినా, తన అంతరంగాన్ని జయించలేని వాడు ఎప్పటికైనా కుప్పకూలాల్సిందే.

👨‍💻Technology మారుతోంది, యుగాలు మారుతున్నాయి, కానీ మనిషి మారలేదు. రామాయణంలో రావణుడు కూలిపోయినా, ట్రాయ్ యుద్ధంలో సామ్రాజ్యాలు తగలబడినా, ఇప్పుడు 2026లో AI దిగ్గజం అట్టడుగుకి పడిపోయినా.. వాటన్నింటి వెనుక ఉన్న మూల కారణం ఒకటే. Unconscious Living, స్పృహ లేని జీవనం.

👰‍♀కాబట్టి, "ఆడదాని వల్ల సామ్రాజ్యాలే కూలిపోతాయి" లాంటి సొల్లు కబుర్లు చెప్పడం కాదు. ఒక మనిషిని ప్రపంచమంతా అపర మేధావి అని కీర్తించినా సరే, లోపల నిజమైన జ్ఞానం లేనప్పుడు, ఆ పునాదులపై నిర్మించిన ఎంతటి సామ్రాజ్యమైనా సరే, పేకమేడలా, గాలి ఏ వైపు నుంచి వీచినా అది కూలిపోక తప్పదు.

- PRATIKULA VEDAM
17


https://youtube.com/post/UgkxNrjqHwA8VH9_WFqAvNjRNM6gdf2CpkO7?si=_YYE7poM9kDp74ro

No comments:

Post a Comment