Tuesday, February 22, 2022

భగవానుడు పంపిన మెయిల్

🍁 “భగవానుడు పంపిన మెయిల్”🍁

✍️ మురళీ మోహన్


🤔నువ్వు ఏదో ఒక రోజు ఈ మెయిల్ చూస్తావని నీకు ఈ మెయిల్ పంపుతున్నాను .
.

.
నువ్వు రోజూ నిద్ర లేచాక నా వేపు చూస్తావనీ , నన్ను పలకరించి రెండు మాటలు మాట్లడతావనీ ఎదురు చూస్తుంటాను .
.
కానీ
.
నువ్వు లేచీ లేవగానే నీ సెల్ ఫోన్ తీస్తావు . అందులో నీకు వచ్చిన మెస్సేజెస్ చూస్తావు .
.
అది అయ్యాక నా వేపు చూస్తావేమో అనుకుంటాను . అపుడు నీకు టైం కనిపిస్తుంది . అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ గబగబా పక్క దిగి బాత్ రూం లోకి వెళ్లి పోతావు .
.

అక్కడనుండి వచ్చాక నేను ఉన్న చోటికి వచ్చి ఒక సారి నా వేపు చూసి పలకరిస్తావు అని చూస్తుంటాను
.
కానీ
.
. డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి టిఫెన్ తింటూ పేపర్ చూస్తూ టి వి ఆన్ చేసి వార్తలు చూస్తుంటావు .
.
టిఫిన్ అయ్యాక గబగబా డ్రెస్ చేసుకుని ,జుట్టును తీరిగ్గా దువ్వుకుని , సెంటు రాసుకుని , ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని , షూ వేసుకుని బయటకు వెడుతూ నా కేసి చూస్తావేమో అనుకుంటాను .
.
కానీ
.

.
బయటకు ఆదరా బాదరా వెళ్లి పోతావు .
.
అయ్యో నీకు పాపం తీరిక లేదే అని బాధ పడడం తప్ప ఏమి చెయ్యను ?
.

.
పోన్లే !
.

మధ్యాహ్నం లంచ్ టైం లో భోజనం కారియర్ విప్పుతూ కాంటీన్ లో నాలుగు టేబుళ్ళ వెనకాల ఒకాయన కళ్ళు మూసుకుని నన్ను తలచుకుంటుంటే నువ్వు కూడా నన్ను తలచుకుంటావు అని ఎదురు చూస్తున్నాను
.
కానీ
.
నువ్వు నవ్వుకుని నీ స్నేహితుడితో సినిమా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసావు .
.

.
సాయంత్రం ఇంటికి వచ్చాక తీరు బడిగా నాతో మాట్లాదతావేమో అని అనుకున్నాను .
.
కానీ
.

సాయంత్రం ఇంటికి వస్తూ దారిలో రెండు మూరల మల్లె పూలు కొన్నావు . నా కోసం కూడా పూలు కొంటున్నావు అనుకున్నాను .
.
కానీ
.
నీకు అవి కనిపించ లేదనుకుంటాను .
.
పోన్లే !
పూలెందుకు ? నువ్వు నాతో మాట్లాడితే చాలు . నా కేసి చూస్తే చాలు .
.

.
ఇంటికి వచ్చావు .
.

సోఫాలో కూల బడి టి వి చానల్ మార్చి మార్చి చూస్తూ కాఫీ తాగావు . బాత్ రూం కి వెళ్లి స్నానం చెసి వచ్చి తెల్లటి బట్టలు కట్టుకున్నావు . అప్పుడు కూడా నా కేసి వస్తావనీ , నాతో మాట్లాదతావనీ ఎదురు చూశాను .
.
కానీ
.

.
నీ లాప్ టాప్ ముందుకు వెళ్లావు . అందులో నీకు ఇష్టమైన వన్నీ చూస్తూ రాత్రి 11 గంటల వరకూ గడిపావు . ఇక నీకు నిద్ర వస్తోంది . అపుడు నా దగ్గరకు వస్తావు అని అనుకున్నాను . నీ ఎదురుగా నే ఉన్నాను .
.
కానీ
.
నువ్వు నన్ను చూడలేదు .
.

.
ఇంకో అరగంట తర్వాత నా కేసి చూస్తావు అనుకున్నాను . నువ్వు అలిసిపోయావు . నీ భార్య తో గుడ్ నైట్ చెప్పి పడుకుండి పోయావు . నాకూ చెబుతావు అనుకున్నాను . చెప్పలేదు
.
పోన్లే !
.
నాకు ఓపిక ఉంది . నేను ఎదురు చూస్తుంటాను . నీకు కూడా ఇతరులతో ఎలా ఉండాలో నేర్పాలన్నదే నా తపన .
.

.
నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను . . కానీ ... కానీ ... నాకు కూడా నీవు నా వేపు చూడాలనీ , ఒక్క సారి నా ముందు తల వంచి నన్ను పలకరించాలనీ ఉంటుంది .
.
నీ గుండెలో ఉన్న నన్ను నువ్వు చూడడానికి నీ ప్రయత్నం ఏమీ చెయ్యక పోతే ఎలా ?
.
ఒకవైపు నుండే సంభాషణ ఎలా ?
.
.
ఇదిగో ఈ మెయిల్ చూశాక అయినా నీవు నా వేపు చూస్తావనీ , నాతో రోజులో కొన్ని సెకనులు అయినా గడుపుతావనీ ఎదురుచూస్తుంటా !
నీ లోనే నీతోనే ఉన్న " నేను

::::::::::::::::::::::::::::::::::::::::::::::

సేకరణ

🍁రమణ మహర్షి దివ్య బోధ:-*🍁 *ఎవరు నువ్వు ?* *ఎందుకు బాధపడు తున్నావు ?* *అసలు బాధపడడానికి ఎవరు నీవు ?* *నీవు బాదపడడానికి గల కారణం ఏమిటి ?*

🍁రమణ మహర్షి దివ్య బోధ:-🍁

ఎవరు నువ్వు ?

ఎందుకు బాధపడు తున్నావు ?

అసలు బాధపడడానికి ఎవరు నీవు ?

నీవు బాదపడడానికి గల కారణం ఏమిటి ?

📚✍️ మురళీ మోహన్

👉అసలు నీవు శరీరానివి అను కుంటున్నావు ,

నీ మనస్సు నిన్ను ఏమరుస్తుంది..చూడు.. .

నిన్ను శరీరానికి పరిమితంగా నిన్ను చేస్తుంది .

కాని నీ మనస్సుకు లొంగ కుండా నీవు ఆత్మస్వరూపానివని నిరంతరం నమ్ము ...

ఆత్మకు బాదరాదు ,
అగ్నిలో కాలదు ,
నీటిలో తడవదు .

అసలు ఆత్మకు చావులేదు..

ఎందు కంటె ఆత్మకు చావు పుట్టుకలు లేవు..

శరీరాలను మార్చుకుంటూ పోతూ ఒక్కొక్క జన్మలో ...
ఒక పాఠం నేర్చుకోడానికి వస్తూ... ఉంటుంది.

ఈ జన్మలొ డాక్టరుగా ,

ఏరొక జన్మలొ ఏక్టరుగా ,
ఒక జన్మలొ దొంగగా ,

ఏరొక జన్మలొ వేరొక విధంగా జన్మ తీసు కుంటుంది .

మరి ఈ జన్మలో ఎందుకు నీవు బాధపడు తున్నావు ?

ఏమి తెచ్చావని బాదపడు తున్నావు ,--
ఏమి పోతున్నదని ?,

ఏమి పోతున్నదని... బాదపడు తున్నావు. పట్టికెళ్లడానికి ,
ఎక్కడికి పట్టికెడతావు ?

అన్నీ ఇక్కడే వదిలి వెడతావు .

అంత మాత్రానికి ఎందుకు బాదపడు తున్నావు ?

ఎవరు నీవు ? ఎప్పుడైనా ప్రశ్నించు కున్నావా ?

నేను ఎవరు?
అని ఈ రోజు ప్రశ్నించుకో ఇప్పుడే ప్రశ్నించుకో ,
ఆలోచించకు... ప్రశ్నించు కో నేను ఎవరు ? అని ,
జవాబు దొరికే వరకు విశ్రమించకు ,
ప్రశ్నిస్తూనే ఉండు నేనుఎవరు ? అని..

"ఎవరు నేను" అని ,..అదే... జీవిత లక్ష్యంగా పెట్టుకో...
అంతే గాని భార్యకొరకో ,

భర్తకొరకో ,
బిడ్డ కొరకు కాదు ...
నీవు వచ్చింది .. సరదాగా...న ...

ఆనందంగా జీవిత పాటాలు నేర్చుకోడానికి ,
వాటిని అనుభ వించ డానికి వచ్చావు.
అంతే కాని బాదపడ డానికి...

ఏడవ డానికి రాలెదు...

గుర్తుంచుకో...
నీవు ఆత్మ పదార్దానివని ,
శరీరాన్ని దాల్చి నిన్ను నీవు చూసు కోవడానికి పుట్టావు .

మరచిపొయి బాదపడుతున్నావు .

నీవు నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకుంటే,

బాధ భయంతో పారి పోతుంద...

నిజం నేను చెప్పేది. నిజం నన్ను నమ్ము ,

నేను చెప్పేది విశ్వసించు...

నిన్ను నివు నమ్ముకో ,

ఎవరిని నమ్మకు నిరంతరం ఆనందముగా... ఉండడం నేర్చుకో...

ఎలాంటి పరిస్థితులు ఎదు రయినా సున్నితంగా చూడడం నేర్చుకో ,

నిన్ను ఏ పరిస్థితి ఏమి చేయలేదు...

ఎందుకంటె నేను చెప్పానుగా నీవు ఆత్మ పదార్దానివని..

ఇది గుర్తు పెట్టు కుంటే
చాలు .

నీవు ఆనందముగా ఉండడానికి .

ఒక సమస్య వచ్చింది. అంటే నీవు పరిష్కరించు కోలేని సమస్య నీ వద్దకు రాదు .

,ఇది నిజం..*

ఏ సమస్యనైనా నీవు ఛేదించ గలవు .

నన్ను నమ్ము నేను చెప్పేది పూర్తిగా... విశ్వసించు...

ఏసమస్య నైనా నీవే పరిష్కరించ గలవు

అది నీ వల్లే అవుతుంది...

ఇక నుంచి నన్ను కాకుండ నిన్ను నీవు విశ్వసించడం నెర్చుకో ,
ఎమైనా నేను చేయగలను,

ఎమైనా నేను పరిష్కరించు కోగలను ,

ఎమైనా సాదించగలను ,
ఎందు కంటే నేనుపుట్టింది .

ఇది చేయ డానికే అని నిన్ను నివు విశ్వసించు...👍

సేకరణ

వినమ్రత

🍁వినమ్రత🍁

📚✍️ మురళీ మోహన్

👌ఒకానొకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధుల మధ్య పాత తాళాలు బాగుచేసే దుకాణం ఉండేది.

అక్కడికి తాళం కప్పలు, తాళాలు కొనేందుకు జనం వచ్చేవారు. కొన్నిసార్లు, తాళాలు పోగొట్టుకున్నవారు నకిలీ తాళాలను కూడా అక్కడ చేయించుకునే వారు.

దుకాణం తాళాలు పగులగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడ ఉండేది.

’చిటికెలో ఎంతటి బలమైన తాళాలైనా తెరవగలిగే ఈ చిన్న తాళాలలో ఏముంది, నేను మాత్రం ఆ తాళంకప్ప మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది', అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోయేది.

ఓ రోజు తట్టుకోలేక దుకాణం మూసేశాక సుత్తి, ఓ చిన్న తాళం చెవిని అడిగాడు, “అక్కా, ఇంత బలంగా ఉన్న నేనే తెరవలేని మొండి తాళంకప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు?"

తాళంచెవి చిరునవ్వుతో ఇలా అంది, "నిజానికి, మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు, ఆ క్రమంలో వాటిని పగులగొడతారు.

నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను, దాని లోపల నా స్థానాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా నేను దాని హృదయాన్ని తాకుతాను. ఆ తర్వాత, తెరవమని అభ్యర్థిస్తాను, అది వెంటనే తెరుచుకుంటుంది."

మిత్రులారా, మానవ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం నిజంగా ఎవరినైనా గెలవాలంటే, వారిని మన సొంతం చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించగలం.

ఎవరితోనైనా బలవంతంగా పని చేయించడం సాధ్యమే, కానీ ఆ విధంగా, మనం తాళాన్ని తెరవం, బదులుగా దానిని పగలగొడతాం.

అంటే, మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని, సహజమైన ప్రతిభను నాశనం చేస్తాం. అయితే, ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా, మనం వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకుంటాం. వారి ఉపయోగాన్ని, సమర్ధతను అనేక రెట్లు పెంచుతాం.

బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు, కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ బలంతో సాధించలేము.

♾️♾♾♾♾♾♾♾

స్వభావంలో తీవ్రమైన వినమ్రతను సృష్టించుకోండి, తద్వారా ఎవరి హృదయానికి ఎటువంటి హాని కలిగించడానికి మొగ్గు చూపనంతగా ప్రేమ భావనతో అది నిండిపోతుంది

🌷🙏🌷


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

నేటి ఆణిముత్యాలు.

నేటి ఆణిముత్యాలు.

కోట్లు కూడబెట్టి
కడుపునిండా తినలేని వారికంటే
కష్టాన్ని నమ్ముకుని
కడుపు నిండా తినేవారే
ఎంతో అదృష్టవంతులు..

ఇష్టం లేని చోట ఇంద్ర భవనం కూడా
ఇరుకుగానే ఉంటుంది.
మనసు పడిన చోట మట్టిళ్లు కూడా
తాజ్ మహల్ గా ఉంటుంది.

సంపదలెన్ని వున్నా..
తృప్తి లేని జీవితం వ్యర్థం,

పూరి గుడిసె బ్రతుకైనా
కంటి నిండా నిదుర పోయే
మనిషి జీవితం ధన్యం.

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట. ధ్యానం అంటే ఏమిటి?

నేటి మంచిమాట.

ధ్యానం అంటే ఏమిటి? ఆ స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి?’ అనే ప్రశ్న ఒక బాలుణ్ణి వేధిస్తూ ఉండేది. తల్లితండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను అడిగి తన సందేహం తీర్చుకోవడానికి అతను ప్రయత్నించాడు. కానీ సంతృప్తికరమైన సమాధానం ఎక్కడా దొరకలేదు.
చివరకు అతను తల్లితండ్రులతో కలిసి అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. స్వామిని దర్శించుకున్నాక... తన సందేహాన్ని ఆయన ముందు ఉంచాడు. ఆ ప్రశ్న విని శ్రీరమణులు నవ్వారు. అతణ్ణి తనకు దగ్గరగా కూర్చోమన్నారు. తన భక్త బృందంలో ఒకరిని పిలిచి... ‘‘వంట గది నుంచి ఒక దోశె తీసుకువచ్చి ఈ కుర్రాడికి ఇవ్వు’’ అని చెప్పారు.ఆ భక్తుడు అరిటాకులో దోశె తీసుకువచ్చి, ఆ బాలుడి ముందు ఉంచాడు.
‘‘నేను ఒకసారి ‘ఊ...!’ అంటాను. అప్పుడు మాత్రమే నువ్వు తినడం మొదలుపెట్టాలి. ఆ తరువాత మళ్ళీ ‘ఊ...’ అనే లోగా దోశె పూర్తిగా తినెయ్యకూడదు. కానీ నేను రెండోసారి ‘ఊ...’ అన్న తరువాత ఆకులో దోశె మిగలకూడదు’’ అని చెప్పారు.
ఆ కుర్రాడు అలాగేనని తల ఊపాడు.చుట్టూ ఉన్నవారు ఇదంతా ఆసక్తిగా చూస్తున్నారు. ‘స్వామి ‘ఊ...’ అని ఎప్పుడు అంటారా?’ అని ఆ కుర్రాడు ఆత్రుతగా నిరీక్షిస్తున్నాడు. రమణ మహర్షి ‘ఊ...’ అన్నారు. అతను తినడం మొదలుపెట్టాడు. ఒకవైపు దోశె తింటూనే, మళ్ళీ ఆయన నుంచి సంకేతం ఎప్పుడు వస్తుందా? అని శ్రీరమణులను గమనిస్తున్నాడు. ఆయన మరోసారి ‘ఊ...’ అనేలోగా దోశెను దాదాపు పూర్తి చెయ్యడానికి హడావిడి పడుతున్నాడు. పెద్ద పెద్ద ముక్కలు విరిచి తింటున్నాడు. చేతులు ఆ పని చేస్తున్నా, అతని దృష్టంతా రమణుల మీదే ఉంది.
ఆకులో దోశె ఓ చిన్న ముక్క మాత్రమే మిగిలింది. రెండోసారి స్వామి నుంచి సంకేతం రాగానే, ఆ దోశె ముక్కను నోట్లో పెట్టేసుకున్నాడు.‘‘నీ దృష్టి ఎక్కడుంది? నా మీదా? దోశె మీదా? అని అడిగారు శ్రీరమణులు.‘‘రెండిటి మీదా’’ అన్నాడు కుర్రవాడు.
‘‘అవును. నువ్వు దోశెను పూర్తి చెయ్యడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నావు. అదే సమయంలో నా మీద నీ దృష్టి నిలిపి ఉంచావు. ఇప్పుడు నువ్వు చేసింది ధ్యాన ప్రక్రియే. నీ దృష్టిని దేవుడి మీద ఏకాగ్రతతో నిలిపి ఉంచాలి. అదే సమయంలో నీ రోజువారీ కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉండాలి. అంటే... నడవడం, తినడం, మాట్లాడడం లాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ పనులన్నీ చేస్తున్నప్పటికీ... అన్ని సమయాల్లో మన మనసు మాత్రం దేవుడి మీదే లగ్నమై ఉండాలి. అదే ధ్యానం’’ అని చెప్పారు శ్రీ రమణులు.
మనిషి జీవితంలో అనేక ఒడుదొడుకులు, కష్టాలు, బాధలు, సంతోషాలు, సుఖాలు... ఇవన్నీ కలగలుపుగా ఉంటాయనేది సత్యం. ఒక్కొక్కసారి దైవం నిష్కళంకులైన భక్తులపై కరుణ కురిపిస్తాడు. అలాగే కష్టాలు, ఆందోళనలు కూడా వర్షింపజేస్తాడు. ‘‘ఓ దేవాది దేవా శ్రికృష్ణ నీవు నీ భక్తులైన వారికే అనేక కష్టాలు కలిగిస్తావు. వారినే ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నావు. నీకు నమ్మకమైన భక్తులు అన్నిటికీ నీమీదే ఆధారపడతారు. అలాంటివారిని ఎందుకు కష్టాలపాలు చేస్తున్నావు?’’ అని కుచేలుడు ఒకసారి శ్రీకృష్ణుడిని అడిగారు.
దానికి కృష్ణుడి బదులిస్తూ ‘‘నా ప్రియ భక్తులు ఈ లోకంలో కష్టాలను అనుభవించి... విశ్రాంతి కోసం మార్గాన్ని సులభతరం చేసుకుంటున్నారు. తద్వారా పరలోకంలో వారికి అన్ని విధాలా శుభాలు సమకూరుతాయి. మరణించిన తరువాత పవిత్రంగా, ఎలాంటి మచ్చా లేకుండా, పాపాల నుంచి విముక్తి పొంది నా వద్దకు రాగలరు. అందుకోసమే నా ప్రియభక్తులను కష్టాలకూ ఆందోళనలకూ గురి చేస్తున్నాను’’ అని చెప్పాడు.
ఈ ప్రపంచంలో ప్రవక్తలకన్నా దైవానికి అత్యంత ప్రియమైనవారు, ప్రేమాస్పదులు ఎవరుంటారు? వారు దేవునికి ఎంతో ఆప్తులు. వారితో ఆయనకు దగ్గర సంబంధం ఉంటుంది. దేవుడి సందేశాన్ని ప్రజలకు అందజేసేవారు మహర్షులే . కానీ, దైవానికి ఎంత దగ్గరవారైతే... అంత అధికంగా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రమణ మహర్షి ఆయనను ఎన్నో కష్టాలు, అనంతమైన బాధలు, అంతులేని ఆవేదనలు చుట్టుముట్టాయి. ఇటువంటివన్నీ తట్టుకున్నవారే దైవ సుఖాన్ని పొందుతారు. కాబట్టి వాటిని తట్టుకుంటూ, ఓర్పే ఆయుధంగా ముందుకు సాగడమే ఉత్తమం.

ఒకసారి రమణ మహర్షి వారి సన్నిధికి ఒక మహిళ వచ్చింది. ‘‘నాకుమూర్ఛ వ్యాధి ఉంది. అది తలెత్తినప్పుడు నా ఒంటి మీద ఆచ్ఛాదన తొలగిపోతోంది. ఆ వ్యాధి నయం కావాలని నా కోసం సహాయం చెయ్యండి’’ అని విన్నవించుకుంది.
అప్పుడు రమణ మహర్షి ‘‘ఈ బాధలో సహనం వహిస్తేనీకు స్వర్గం లభిస్తుంది. లేదా నువ్వు కోరితే ఈ వ్యాధి నుంచి నీకు ఉపశమనం కలిగించాలని దేవుణ్ణి కోరుతూ అన్నారు.
అందుకు ఆమె బదులిస్తూ ‘‘సరే! అలాగైతే ఓర్పు వహిస్తాను. కానీ మూర్ఛ వచ్చినప్పుడు నా ఒంటిపై ఆచ్ఛాదన తొలగిపోకుండా ఉండాలని మాత్రం దైవాన్ని ప్రార్థించండి’’ అంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. మాటతీరే మన ప్రవర్తనకు అద్దం.

నేటి జీవిత సత్యం.

ఎంతటి జటిలమైన విషయాన్నయినా... ఎంతటి పామరుడికైనా అర్థం అయ్యేలా చెప్పగల నేర్పరి గౌతమ బుద్ధుడు. పండితులకు పండితుల స్థాయిలో, పామరులకు పామరుల స్థాయిలో చెప్పగల మహా ప్రబోధకుడు. విషయాన్ని పూర్తిగా అవగతం చేయడం కోసం నిత్యజీవితంలోని ఎన్నో సంఘటనలను ఆయన ఉపమానాలుగా చెప్పేవాడు. ఆ ఉపమానంతో వినగానే విషయం హృదయానికి చేరేది. మనసుపై ముద్ర వేసేది.
ఒక రోజు బుద్ధుడు జేతవన విహారంలో ఉన్నప్పుడు, జైన మతానికి చెందిన ఒక సాధువు వచ్చాడు. బుద్ధుడికి వినయంగా నమస్కరించి- ‘‘భగవాన్‌! నేను ఇంతకాలం అజ్ఞానంలో గడిపాను. నా గురువులు అజ్ఞానులు, స్వార్థపరులు’’ అంటూ తన గురువులను నిందించడం మొదలుపెట్టాడు. చివరకు వారిని ఏకవచనంతో సంబోధించాడు. ‘‘అందరిలో నేను మాత్రమే సుగుణశీలిని’’ అని గొప్పలు చెప్పుకొని... ‘‘భగవాన్‌! తమరు అనుమతిస్తే నేను మీ శిష్యుడిగా ఉండగలను’’ అని వేడుకున్నాడు.
‘‘ముందుగా నీవు నీ పూర్వ గురువులను గౌరవించడం నేర్చుకో. వారు చెప్పేది నీకు ఇప్పుడు నచ్చినా, నచ్చకపోయినా... ఒకప్పుడు వారు నీకు గురువులే! వారిపట్ల సంస్కారంతో జీవించు. ఆ తరువాత నా దగ్గరకు రా’’ అని చెప్పి పంపాడు.
అతను వెళ్ళిపోయాక అక్కడున్న భిక్షువులతో- ‘‘భిక్షువులారా! గురువు పట్ల ప్రతి వారికీ అణకువ చాలా అవసరం. గురువు పట్లే కాదు... మనతో ఉండే ప్రతివారి పట్లా ఆ అణకువ ఉండాలి. మన మాటతీరే మన ప్రవర్తనకు అద్దం. మన నిజ స్వరూపాన్ని చక్కగా చూపిస్తుంది. ఎదుటివారి దోషాలను అడగకపోయినా ఎవరు చెబుతారో వారు చెడ్డవారు. అలాగే ఎదుటివారి సుగుణాలను మనం అడిగినా చెప్పకుండా ఎవరు దాస్తారో వారూ అలాంటివారే! మనం అడగకపోయినా తమ గొప్పలు చెప్పుకొని, తప్పులు చెప్పరో వారూ చెడ్డబుద్ధి కలవారే! మనం అడగకపోయినా ఎదుటివారి సుగుణాలను చెప్పి, దోషాల గురించి చెప్పనివారు మంచివారు. తమ గొప్పలు తాను చెప్పుకోకుండా... తమ తప్పులను తాము గుర్తించి ఎవరు చెప్పగలరో వారే సజ్జనులు. అలాంటివారు నిరంతరం అణకువగా ఉంటారు. ఒక వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త పదవి స్వీకరించినప్పుడు... మొదట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. పెళ్ళయి అత్తవారింటికి కొత్తగా వచ్చిన అమ్మాయి... అత్తమామల పట్లా, భర్త విషయంలోనే కాదు... పనివారి పట్లా, ఇరుగుపొరుగుల పట్లా బిడియాన్ని ప్రదర్శిస్తుంది. అందరితో నెమ్మదిగా, మంచిగా నడచుకుంటుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు... ‘‘అవతలకు వెళ్ళండి! మీకేం తెలుసు?’’ అంటుంది. అలాగే మీలో కూడా కొందరు మీ గురువుల పట్లా, మీ తోటివారి పట్లా, మీకన్నా చిన్నవారి పట్లా మొదట్లో నెమ్మదిగానే ఉంటారు. రానురానూ రాటుదేలిపోతారు. అదే మీ పతనానికి ప్రథమ సోపానం. ఎవరు నిరంతరం నవ వధువులా నైతిక బిడియాన్ని పాటిస్తారో, వారే యోగ్యులవుతారు. భిక్షువులారా! మరువకండి. మీరు నవవధువు మనసులాంటి మనసుతో ఉండాలి’’ అని చెప్పాడు.
ఈ ప్రబోధం ఈనాటికీ అందరికీ పనికివచ్చేదే! ఒక విద్యార్థి, రాజకీయ నాయకుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉద్యోగి... అందరూ ఈ మనసుతో ఉంటే -అందరి కర్తవ్య పాలన సక్రమంగా ఉంటుంది. అలక్షం, అరాచకం, అవినీతి మటుమాయమవుతాయి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

మనసు మాటల ముత్యాలు

🌹మనసు మాటల ముత్యాలు🌹

🌹 చినుకంత అనుమానం
ఏ బంధానికైనా ప్రమాదం
సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ
ద్వేషానికి ,దూరానికి....
అదే మూలకారణం....!!

🌹 మనం మన జీవితాన్ని ఒక ముక్కలో
వివరించలేము......
పక్కవారి జీవితాన్ని అరముక్కలో
వివరిస్తాం.....
ఇదే మన సమాజం....!!

🌹 ఇతరుల మనోభావాలతో
ఎప్పుడూ ఆడుకోకండి
ఎందుకంటే
మీరు ఆట గెలవవచ్చు కానీ
మీరు ఖచ్చితంగా జీవితకాలం పాటు
ఆ వ్యక్తిని కోల్పోతారు.

🌹 విజయం నిన్ను జీవితంలో
ఉన్నత స్థితికి చేరిస్తే....
మంచి ప్రవర్తన నిన్ను అందరి
హృదయాల్లో ఉన్నత స్థితికి
చేరుస్తుంది......!!

🌹 పైకి కనిపించినంత అందంగా
ఏ ఒక్కరి జీవితమూ ఉండదు
కొందరు.....నటిస్తారు....
కొందరు నెట్టుకొస్తారు....అంతే....!!

🌹 మనిషి భూమిపై తన ధనాన్ని
లెక్కిస్తూ ఉంటాడు....
నిన్నటికి...ఈరోజుకి.....
నా ధనమింత పెరిగిందని...
పై నుండి దేవుడు నవ్వుతూ...
మనిషి ఆయుష్షు లెక్కిస్తూ ఉంటాడు
నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్షు
ఇంత తరిగిందని......!!✍️

సేకరణ

Monday, February 21, 2022

💎మనసు మాటల 💦 ముత్యాలు 📝

💎మనసు మాటల 💦 ముత్యాలు 📝


🌹 నీ గమ్యం చేరే దారిలో
ఈర్ష్య పడే కళ్ళుంటాయి.
ఎత్తి చూపే వేళ్ళుంటాయి.
వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి.
బెదిరావో..నీ గమ్యం చేరలేవు...
పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు.
కష్టం ఎప్పుడూ వృధా పోదు.

🌹 ధర్మం అనేది
మనిషి పుట్టించింది కాదు.
దైవం సృష్టించింది.
అందుకే మనిషి ఉన్నా...లేకున్నా
సృష్టి ఉన్నంత వరకూ
ధర్మం ఉంటుంది.

🌹 పువ్వులతో నిండిన తోట ఎంత
అందంగా ఉంటుందో.
మంచి ఆలోచనలతో నిండిన
మనసు కూడా అంతే
అందంగా ఉంటుంది.

🏵️వివేకానందుడు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు......
తలపొగరుతో తిరిగినవాడిని తలదించుకునేలా చేస్తుంది......
తలదించుకుని బ్రతికినవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది......
నవ్విన వాడిని ఏడ్చేలా చేస్తుంది......
ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది......
కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే.

🌹 స్నేహం చేసిన వారికోసం ప్రాణాలు
ఇవ్వాల్సిన అవసరం లేదు.
నమ్మి స్నేహం చేసినందుకు ప్రాణం
ఉన్నంత వరకు వాళ్ళకు నమ్మక
ద్రోహం చేయకుంటే చాలు!!

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

యవ్వనం & ముసలితనం

యవ్వనం & ముసలితనం ++++++++++

నేను యవ్వనంలో ఉన్నప్పుడు "మొటిమల్ని" గురించి బాధపడే వాడిని...
నాకు ముసలితనం వచ్చినప్పుడు "ముడతల్ని" గురించి బాధపడుతున్నాను.

నేను యవ్వనంలో ఉన్నప్పుడు "ఆమె" చెయ్యి పట్టుకోవాలని ఎదురుచూసే వాడిని....
నాకు ముసలితనం వచ్చినప్పుడు ఆమె వచ్చి "నా చేయి" పట్టుకోవాలని ఎదురు చూస్తున్నాను.

నేను యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను "ఒంటరిగా" వదిలేస్తే బాగుండును అనుకునేవాణ్ణి...
నాకు ముసలితనం వచ్చినప్పుడు పిల్లలు నన్ను "ఒంటరిగా" వదిలేసారే అని బాధపడుతున్నాను.

నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే "చికాకు" పడేవాడిని..
నాకు ముసలితనం వచ్చినప్పుడు నాకు ఎవరూ 'సలహాలు ' ఇవ్వడం లేదే అని బాధపడుతున్నాను.

నేను యవ్వనంలో ఉన్నప్పుడు "అందాన్ని" ఆస్వాదించే వాడిని...
నాకు ముసలితనం వచ్చినప్పుడు " భందాన్ని " ఆస్వాదిస్తున్నాను

నేను యవ్వనంలో ఉన్నప్పుడు "నిద్రలేవడం" కష్టంగా ఉండేది......
నాకు ముసలితనం వచ్చినప్పుడు "నిద్రపట్టడం" కష్టంగా ఉంది.

నేను యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా నా "గుండెల మీద పెద్ద శబ్దంతో " గుద్దుకునే వాడిని....
నాకు ముసలితనం వచ్చినప్పుడు " చిన్న శబ్దానికే
గుండె ఆగి పోతుందేమోనని " అని భయపడుతున్నాను.

జీవితంలో రకరకాల "ఆటు పోట్లు" వస్తుంటాయి.
దేనికీ భయపడ కూడదు.

ధైర్యంగా ఎదుర్కోవడమే అది "యవ్వనంలో" నైనా.. "ముసలితనంలో" నైనా..అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా "ప్రశాంతంగా" ఉంటుంది.

🙏💐💐


అందరికి జీవితంలో తప్పనివి

సేకరణ

ధ్యానం యొక్క అభివ్యక్తీకరణలు - ధ్యాన ఫలాలు

ధ్యానం యొక్క అభివ్యక్తీకరణలు - ధ్యాన ఫలాలు


📚🖊️ : భట్టాచార్య



🛕 గాఢమైన మూడు నిముషాల ధ్యానం, సాధకుని విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థలపై గణనీయమైన, ధనాత్మక ప్రభావాన్ని చూపుతుంది.

🛕 గాఢమైన ఏడు నిముషాల ధ్యానం, మెదడు పని చేసే తీరును మెరుగు పరుస్తుంది. ధ్యానం చేసే సాధకుని విద్యుదయస్కాంత క్షేత్రాన్ని / ఆరా ( Aura) ను శక్తివంతం చేస్తుంది.

🛕 పదకొండు నిముషాల గాఢ ధ్యానం, శరీరం యొక్క నాడీ వ్యవస్థను, వినాళ గ్రంథి వ్యవస్థలను ధనాత్మకంగా ప్రభావితం చేస్తుంది.

🛕ఇరవై రెండు నిముషాల సమాధికి దారి తీసే గాఢ ధ్యానం...చేతన, ఉప చేతన, అచేతన (Conscious, Sub - Conscious, Un - Conscious ) మనస్సులను సమన్వయం చేస్తుంది. ఈ మూడు స్థితులు పరస్పర పరి పూరకంగా పనిచేసే పరిస్థితులు కల్పిస్తుంది.

🛕 31 నిముషాల గాఢ ధ్యానం, శరీరంలో గ్రంథుల, శ్వాస క్రియల, భౌతిక శరీర లయను మారుస్తుంది. వినాళ గ్రంథుల స్రావం, సమత్వంతో ఉండేటట్లు చేస్తుంది. ఆ విధంగా, చక్ర వ్యవస్థ కూడా సమతులత్వంతో ఉండేటట్లు చేస్తుంది.

🛕 62 నిముషాల గాఢ ధ్యానం...మెదడులోని Grey Matter పై ధనాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడు యొక్క Frontal Lobe, Pituitary Gland మరియూ Pineal Glands ఉద్దీపన చెందుతాయి. మీ భౌతిక శరీరం, మీ భావాత్మక శరీరం, మీ మానసిక శరీరం...దివ్యత్వపు పరిణామం వైపు పయనిస్తాయి.

సేకరణ

సప్త సూక్తులు

......🌹 సప్త సూక్తులు🌹......
🙏🙏🙏🙏🙏శ్రీనివాసరావు వేమూరి💐💐💐💐💐

🌹 గాలి, వెలుతురు అన్ని గదుల్లోనికి రానిస్తేనే ఇల్లు సుందరంగా,
శుభప్రదంగా,
నివాస యోగ్యంగా ఉంటుంది..
అలాగే ...
మనసులోకి ఆనందాన్ని,
అందరిమేలు కోరే
ప్రశాంతమైన ఆలోచనల్ని
రానిచ్చినప్పుడే...
ఆరోగ్యమైన శరీరం,
కాంతివంతమైన ముఖవర్చస్సు
కలుగుతాయి .

🌹నిన్ను విమర్శించే వారందరూ
నీకన్నా తక్కువ స్థాయి,
తక్కువ సామర్థ్యం, ఉండేవారేనని,గుర్తుంచుకో...
ఎక్కువ స్థాయి,
ఎక్కువ సామర్థ్యం,
కలవారు మందలిస్తారు ,
సలహాలిస్తారు

🌹నీవు చేసిన పూజలకు
ప్రతిఫలం ఇచ్చే దేవుడు!
నీవు చేసిన పాపాలకు గూడా
ఫలితం ఇచ్చే తీరతాడు!!

🌹బొగ్గుని మండుతున్నపుడు
ముట్టుకుంటే...
చెయ్యి కాలుతుంది!
అలాగే చల్లగా ఉన్నప్పుడు
పట్టుకున్నా...
చేతికి మసి అంటుతుంది!!
చెడ్డవానితో స్నేహం గూడా అలాంటిదే.
ఎలా ఉన్నా ముప్పే.

🌹 ఆశయం లేని జీవితం,
విశ్వాసం లేని మాటలు.
పట్టుదల లేని పనులు,
నిరూపయోగం !!

🌹మనసు బాగోలేదు
నీతో మళ్ళీ మాట్లాడుతా... అనే బంధం కంటే -
మనసు బాగోలేదు
నీతో కాసేపు మాట్లాడాలి... అనే బంధమే -
నిజమైన అనుబంధం!

🌹స్నేహితులైనా, బంధువులైనా
మొక్కలులాంటి వారు.
వాటికి సరైన సంరక్షణ,
జాగ్రత్తలు పాటిస్తే...
మహా వృక్షాలై,
మంచి ఫలితాలను ఇస్తాయి. 🙏🙏🙏🙏🙏 శ్రీనివాసరావు వేమూరి 💐💐💐💐💐

సేకరణ

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ?

 *🙏మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ???🙏*


*https://chat.whatsapp.com/EpEL0cdzmc0JacPdIcRJe3*


*అయితే తస్మాత్ జాగ్రత్త!*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*ఈ మధ్యకాలం లో సమాజం లో ఓ "వింత పోకడ" మనం గమనిస్తున్నాము.  అదే మిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ ఇది ఎంత తప్పో మీకు తెలుసా ?*


*సనాతన హైందవ గ్రంధాల ప్రకారము ఇది తప్పు!*


*అవును ఈ విధంగాఅర్ధరాత్రి వేడుక ఎంత  తప్పో మీకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను*


*ఈ మధ్య కాలములో నేటి సమాజములో ఎవరిదైనా  పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ప్యాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.*


*కానీ సనాతన హైందవ గ్రంధాలూ రాత్రి 12 గంటల సమయమును "నిషిద్ధ " కాలంగా అభివర్ణించాయి.*


*అవును మధ్య రాత్రి 12 గంటల నుంచి జాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారము "నిషిద్ధ గడియలు".*


*అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయములో జరిగే సంబరాలు మనము నిషిద్ధ కాలములో జరుపుకొంటున్నాము.  కానీ హైందవ గ్రంథల ప్రకారము ఈ నిషిద్ధ సమయములో మానవ నేత్రాలకు కనబడిని ఎన్నో దుష్ట శక్తులు, దెయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్తుంటాయి . ఈ  నిషిద్ధ సమయములో వాటి శక్తులు కూడా పెరుగుతాయి.*


*మనము జీవించే ఈ భూమండలంలో అలంటి శక్తులు చాలానే ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు, కానీ వాటి వలన మానవ జీవితాలకు ఎన్నో భయానక మరియు చెడు ఫలితములు గోచరిస్తాయి. వీటి చెడు  ప్రభావములచే మానవ జీవితం అపసవ్య మార్గములో పయనించును.*


*ఈ నిషిద్ధ కాలములో జరుపు కొనే వేడుకల వలన ఈ దుష్టశక్తులు మన ఆయువుని హరిస్తాయి. అంతేగాక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి, దురదృష్టం ఇంటి తలుపు తడుతుంది. సనాతన ధర్మ గ్రంథాలలో కేవలం ఒక సంవత్సరంలో 4 పండుగలు  అవి దీపావళి, నవరాత్రులు, జన్మాష్టమి మరియు శివరాత్రి రోజులలో మాత్రమే ఈ నిషిద్ధ కాలము పుణ్య ఫలితాలను ఇస్తుంది, అది ఎందు  చేతనంటే ఈ సమయాలలో నిషిద్ధ కాలము, మహా నిషిద్ధ కాలంగా గోచరించబడుతుంది .*


*పైన తెలిపిన నాలుగు పండుగలు మినహా అన్ని రోజులు నిషిద్ధ కాలములే .*


*హైందవ గ్రంధాల ప్రకారము సూర్యోదయము తోనే రోజు మొదలవుతుంది. అంతే గాక ఎందరో ఋషులు మరియు మునులు / సన్యాసులు ప్రకారం సూర్యోదయం పుణ్యకాలం.*


*ఈ సమయములో వాతావరణం చాల శుద్ధిగా, ప్రతికూలతలు లేనిదియై ఉండును . హైందవ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాత మాత్రమే పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మధ్య రాత్రి లో "రజో" మరియు "తమో" గుణాలు వాతావర్ణములో మెండుగా ఉండి, ఆ సమయంలో తెలియజేయు అభినందనలు శుభ ఫలములు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితములు ఇచ్చును. ఏదిఏమైనా  హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రేండు మూడురోజుల ముందు తయారు చేసిన కేకులు కోయడం మన సంప్రదాయం కాదు.*


*మన హిందూ ధర్మం ఏంటో శాస్త్రీయతతో కూడుకున్నది.*


*కావున హిందూ ధర్మాలలో పొందుపరిచిన మార్గాలనే  మనము  ఎంచుకొందాం/ఆచరణలో పెడదాం.*


*ఈ వ్యాసాన్ని/ సారాన్ని ప్రతి హైందవునితో పంచుకోగలరు.*


*https://www.facebook.com/groups/638078683192004*

ఉద్ధరేదాత్మ నాత్మానం* ఎవరి మంచి చెడులకు వారే కారణం*

ఉద్ధరేదాత్మ నాత్మానం
➖➖➖

ఎవరి మంచి చెడులకు వారే కారణం

ఉద్ధరేదాత్మ నాత్మానం
ఆత్మానమవసాదయేత్‌
ఆత్మైవ హ్యాత్మోనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః
(ఆరో అధ్యాయంలో ఐదవ శ్లోకం)

మన మనసుకున్న శక్తితో మనలను మనమే ఉద్ధరించుకోవాలి. అంతే తప్ప నాశనం చేసుకో కూడదు. మన మనసే మనకు చుట్టం. అదే మనకు శత్రువు కూడా అవుతుందని అంటుంది భగవద్గీత.

అర్థమయ్యేలా చెప్పు కోవాలంటే...తల్లి దండ్రులైనా, గురువులైనా, శ్రేయోభిలాషులైనా.. మన మంచి కోరి, మంచి మాటలు చెబుతారు. మిత్రులుగా పక్కనుంటూ మన చెడు కోరుకునేవారు చెడ్డ దారులు పట్టిస్తారు.

మంచి మాటలు వినాలా చెడుమార్గంలో సాగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనం మాత్రమే.

మన ఇంద్రియాలు తరచుగా మనల్ని తప్పు దోవల్లోకి లాక్కుపోతాయి. వాటికి లొంగి పోయామా.. పతనం తప్పదు!

వాటిని మన అదుపులో పెట్టుకుంటేనే మనం జయిస్తాం. ఇది జీవిత రహస్యం.

విజయం సాధించడానికైనా, ఓడిపోవడానికైనా మూల కారణం మనమే. చాలా మంది తమ ఓటములకు, తాము జీవితంలో ఎదగక పోవడానికి ఇతరులే కారణమని చెబుతుంటారు.

మరికొందరేమో..పరిస్థితుల ప్రభావం అంటుంటారు.

తరచిచూస్తే.. చాలా మంది విజేతల కుటుంబ పరిస్థితులు మన కంటే ప్రతికూలంగా ఉంటాయి. కానీ వారు ప్రతీ దాన్నీ తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతి ఓటమిని, ప్రతికూల పరిస్థితులను కూడా సోపానాలుగా మార్చుకుంటారు. దీనికి కారణం.. వారికి ఉండే వివేక జ్ఞానం!

ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఎన్నో అద్భుతాలు గోచరిస్తాయి.

అచేతనాలుగా పరిగణించబడే రాళ్లు, రప్పలు మొదలుకొని ప్రాణమున్న జీవుల్లో గొప్పవాడనిపించుకున్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్లు, రప్పలకు అసలు ప్రాణమే ఉండదు. పశుపక్ష్యాదులకు ప్రాణం, జ్ఞానం ఉన్నా.. ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే కానీ, వివేకం ఉండదు. వివేకంతో కూడిన జ్ఞానం ఉండేది ఒక్క మనుషులకే. అంత గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి ఎప్పుడూ నిరాశ చెందకూడదు. చిన్నచిన్న వైఫల్యాలకు కుంగిపోకూడదు.

ఆ వైఫల్యాలకు ఇతరులను, పరిస్థితులను కారణంగా చూపకూడదు. ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టినందుకు.. వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం.

పంచభూతాలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎన్నో రకాల ప్రాణులు మన జీవనాన్ని సుఖమయం చేస్తున్నాయి.

ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్న మనిషి స్వశక్తిని నమ్ముకుని మనసా, వాచా, కర్మణా కృషి చేస్తే సాధించ లేనిది ఏదీ లేదు. ఆధ్యాత్మిక ఉన్నతికైనా.. జీవితంలో పురోగతికైనా అదే ముఖ్యం!
.

సేకరణ

సందర్బవోచ్చితంగా సరైన పనులు చేయడం వల్లే విజయవంతులు అవుతారు..

ఎప్పుడైతే నువ్వు చేసే ఏ పనినైనా ప్రేమిస్తావో నీవు ఎప్పటికి అలసిపోవు అది నిన్ను పెంచుతుంది, శక్తిని ఇస్తుంది, జీవ చైతన్యం కలిగిస్తుంది అప్పుడు నీకు ప్రతిరోజు సెలవే.. మనకు ఉన్నదానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడమే అజ్ఞానం. ఒక మనిషి ఏ పొరపాటు చేయలేదంటే అతడు ఏ ప్రయత్నం చేయలేదని అర్ధం. రాత్రి వేళ సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారుస్తుంటే నక్షత్రల్ని కూడా చూడలేం. ఒక చెడ్డ గుణం వంద సమస్యలకి కారణం అవుతుంది. కానీ ఒక మంచి గుణం వంద సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఒక చిరునవ్వు అనుబంధాన్ని రక్షిస్తుంది, ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది.. మనిషి ని చెడు ఆకర్శించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలపాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది.. ఏడుపు వచ్చినప్పుడు ఒంటరిగా ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే "నాటకం " అంటారు, ఒంటరిగా నవ్వితే " పిచ్చి " అంటారు.. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త. నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త... పిరికివాడికి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశన్ని ఆయుధంగా మార్చుకొని జీవిత ప్రయాణం ఉత్సాహం గా ముందుకు సాగేవారే విజయం సాధిస్తారు.. కొన్ని నెలల్లో సాధించే మార్గం ఉన్నప్పుడు లక్ష్యాలను సాధించే క్రమం లో ఏళ్లకు ఏళ్ళు గడపడం అనేది వృధా.. బంగారం ఎంత విలువైనదో కాలం అంతకన్నా విలువైనది. మనుషులు విజయవంతులు కావడానికి ఎక్కువ శ్రమించడమే కారణం కానక్కర్లేదు. సందర్బవోచ్చితంగా సరైన పనులు చేయడం వల్లే విజయవంతులు అవుతారు..
The most valuable real estate is, the space we occupy in other people's Heart..
Good morning.. Have a beautiful n joyful day..

సేకరణ

మనసా...వాచా...కర్మణా... అంటే!!!

050222K1645. 060222-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


మనసా...వాచా...కర్మణా!
➖➖➖✍️

మనసా...వాచా...కర్మణా... అంటే!!!
ఒకసారి శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు...
గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట...
" నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షమించండి ” అని ప్రాధేయ పడ్డారు...

ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారో ప్రాయశ్చిత్త పడుతున్నారు?” అని అనుకున్నారు.

ఒక శిష్యుడు, ఏమిటి ఆపాపము నేను తెలుసుకోవాలి అని, ఆచార్యుల వారిని అడిగాడు.
దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు...

1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను, సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను..."
అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను, అది నా నేను చేసిన మొదటి దోషము అని సమాధానమిచ్చారు.

2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశీవిశ్వనాధ అష్టకం వ్రాశాను.”ఇది నేను చేసిన రెండవ తప్పు!

3. నిర్వాణ శతకం లో
“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను
అర్థము :
నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము , భోజనము , భోక్త ( భుజించేవాడు) నేను కాదు! నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!

ఇంత వ్రాసికూడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను... అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడవ తప్పు...!

ఈ తప్పులని మన్నించమని , ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.” అన్నారు...

నీతి :
మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి సంభాషణ మనకి తెలియజేస్తోంది...

బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది, భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.

“మనస్ ఏకం, వచస్ ఏకం , కర్మణ్యేకం!”
ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము...✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

మంచి మాట.లు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. అది దంపతులు పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.... ఓం నమఃశివాయ 🙏
సోమ వారం --: 21-02-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.లు
ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి
నిర్విరామంగా పనిచేయి బాధ్యత తీసుకో అది నిజంగా నిన్ను ఎప్పటికైనా యజమాని గా చేస్తుంది.

నిల బడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరంగా శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది , ఒక్క రోజు దాటితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవ్వని నెయ్యి దాగి ఉంటుంది అలాగే లోపాలు ఉన్న వ్యకి లోనూ మంచి గుణాలుంటాయి వాటిని మనం గుర్తించగలిగితే అది ఒక అద్భుతమే .

నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు
అలాగే ఈ రోజు ఉన్న కష్టం
రేపటికి ఉండకపోవచ్చు
కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం
కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి అసూయ ద్వేషాలు మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి సంతోషం , సహనం , శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి .

సేకరణ ✒️
మీ .AVB సుబ్బారావు .

సేకరణ

సమాజం లో అప్రమత్తంగా వుండాలి...

🌝🌺"ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట.

రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ "అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసి మురిసిపోయేదట".

"కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట"

తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట"

ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ ని తీసుకొచ్చి చూపించిందట.

"డాక్టర్ ఇలా చెప్పాడు "

దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు. తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరాయించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకొంటోంది.

నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది "అని చెప్పాడట...

ఇలాంటి వ్యక్తులు మనకి కూడా తారసపడుతుంటారు... ఎప్పటికప్పుడు సమాజం లో అప్రమత్తంగా వుండాలి... తప్పదు...

🌷సర్వేజనా సుఖినోభవంతు🌷
🌻🌻🔅🔅🌝🔅🔅🌻🌻

సేకరణ

ఈ రోజు మంచిమాట

ఎ. తగ్గించవలసిన మూడు విషయాలు:

(1) ఉప్పు
(2) చక్కెర
(3) పాలపొడి


బి. పెంచవలసిన మూడు అంశాలు:

(1) ఆకుకూరలు
(2) కూరగాయలు
(3) పండ్లు


C. మర్చిపోవలసిన మూడు విషయాలు:

(1) మీ వయస్సు
(2) మీ గతం
(3) మీ ద్వేషం

D. మూడు విషయాలు కలిగి ఉండాలి:

(1) నిజమైన స్నేహితులు
(2) ప్రేమగల కుటుంబం
(3) సానుకూల ఆలోచనలు

E. ఆరోగ్యంగా ఉండటానికి నాలుగు చర్యలు:

(1) ఉపవాసము
(2) నవ్వడం
(3) వ్యాయామం
(4) బరువు తగ్గించడం

F. వేచి ఉండకూడని నాలుగు విషయాలు:

(1) మీరు నిద్రించడానికి నిద్ర వచ్చే వరకు వేచి ఉండకండి.

(2) మీరు విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు వేచి ఉండకండి.

(3) స్నేహితులను సందర్శించడానికి మీ స్నేహితుడు అనారోగ్యానికి గురయ్యే వరకు వేచి ఉండకండి.

(4) దేవుణ్ణి ప్రార్థించడానికి ఇబ్బంది తలెత్తే వరకు వేచి ఉండకండి.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి... యవ్వనంగా ఉండండి ...!!

5. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మనం ఆలోచించకూడదు!

6. నేరుగా ప్రభావితం కాని ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకండి!

7. మీకు నచ్చని వ్యక్తుల గురించి ఆలోచించకూడదు,

8. నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఇలాగే సాగిపోతుందని గ్రహించు!

9. ప్రియమైన వారి ఇష్టాలను కనుగొనండి. నేరాల వెంట పడొద్దు!

10. క్షమించడానికి ప్రయత్నించండి!

11. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఈ స్థలాన్ని విడిచి వెళ్లాలని ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు మీ చుట్టూ ఉన్నవారు ప్రేమిస్తున్నారని భావిస్తారు!

12. పిల్లలతో మాట్లాడే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి!

13. నవ్వే అవకాశం, ఏడ్చే అవకాశం అదృష్టమని గుర్తించండి!

14. ప్రేమ విలువను అర్థం చేసుకోండి మరియు మనల్ని ప్రేమించే వారిని తిరిగి ప్రేమించండి!

జీవితం అనేది చిన్న ఏడుపు మరియు గొప్ప నిశ్శబ్దం మధ్య పోరాటం !!!

సమస్త లోకా సుఖినోభవంతు
🙏🙏🌹🌹❤‍🔥🌹🌹🙏🙏

సేకరణ

మన వాగ్ధోరణే...

అకారణంగా ఒక్కొక్కసారి మిత్రులు కూడా శత్రువులు అవుతారు.
అంతకుముందు వరకూ మనల్ని గౌరవిస్తూ వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోతారు. సహోద్యోగులు, బంధువులు కూడా దూరదూరంగా తప్పించుకుని తిరగాలనుకుంటారు.
ఎందుకిలా జరుగుతోంది అని ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అనేక సందర్భాలలో సులభంగా అర్థమవుతుంది. మన వాగ్ధోరణే మన మానవ సంబంధాల్ని దెబ్బతీస్తోందని.
మాట్లాడడం అనేది జీవన కళలో ప్రధానమైనది. భావవ్యక్తీకరణ సాధనం వాక్కు – అన్నది నిజమే అయినా, సందర్భానుగుణంగా దానిని వినియోగించడంలోనే జీవితంలోని మానవసంబంధాలు, కార్యసాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నయి.
‘వాగ్ఘి సర్వస్వ కార్యణమ్’ అంటోంది శాస్త్రం.
ఒకేభావాన్ని రకరకాల మాటలతో చెప్పవచ్చు. కుండబద్దలు కొట్టినట్లో, బుజ్జగింపు ధోరణిలోనో, నచ్చజెప్పే విధంగానో, కఠినంగానో, కోమలంగానో ఒకే భావాన్ని పలురీతులలో వ్యక్తపరచవచ్చు.
వాక్కు మన సంస్కారాన్ని చాటి చెబుతుంది.
వాల్మీకి తన రామాయణ కావ్యంలో ఆదినుండి వాక్సంస్కారంపై ఎన్నో మంచి విషయాలను పేర్కొన్నాడు.
‘వాగ్విదాం వరః’, ‘వాక్య కోవిదః’, ‘మృదుభాషీ’, ‘మధురభాషీ’, ‘పూర్వభాషీ’, ‘స్మితభాషీ’, అంటూ ఉత్తమ వాగ్లక్షణాలను చక్కగా తెలియజేశారు.
మాటలో స్పష్టత, నిష్కపటత్వం ప్రధానం. ఒక్కొక్కసారి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, మాట్లాడడం మన స్వభావం అని గొప్పగా చెప్పుకుంటూంటాం. కానీ అవతలివారు అదే నిక్కచ్చితనం మనపట్ల చూపిస్తే సహించగలమా?
బాధించే విధంగా సత్యాన్ని కూడా పలుకరాదు. ప్రయోజనం ప్రధానం. అలాగని అబద్ధం చెప్పనవసరం లేదు. నిజం చెబితే ప్రమాదమనే చోట తటస్థవైఖరి క్షేమం.
మాట్లాడే నైపుణ్యం గురించి మన శాస్త్రాల ఆధారంగా గమనిస్తే ఈ క్రింది విషయాలు స్పష్టమౌతాయి.
మాట అవతలి వారికి ఉద్వేగం కలిగించకూడదు.
అవతలి వారి పేరును పలికి సంభాషిస్తే, వారికి ఆదరంగా వుంటుంది.
మనమే ముందు మాట కలపడం స్నేహానికి, కార్యసాఫల్యానికి ముఖ్యం.
ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడడం ‘మధుర’వాక్కు అనిపించుకుంటుంది.
కసిరికొట్టినట్లుగాను, వెకిలితనంతోను మాట్లాడడం శత్రువులను పెంచుతుంది.
అతి సంక్షిప్తమూ, అతి విస్తారమూ – రెండూ పనికిరావు.
ఉచ్చారణ తేటగా ఉండాలి.
చిరునవ్వుతో మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం అవతలి వారిని వినేటట్లు చేస్తుంది.
వడివడిగా పలకడం, అతి నెమ్మదిగా నాన్చడం – రెండూ రాణించవు.
సద్గ్రంథపఠనం, మంత్రజపం, మౌనం – ఇవి మాటకి శక్తినిస్తాయి.
ఎప్పుడూ సకారాత్మకంగా (Positive) మాట్లాడడం శ్రేష్ఠం.
మన గురించి మనమే ప్రశంసించుకుంటూనో, అలాగని అతి వినయంతో హీనపరుచుకుంటూనో మాట్లాడడం నిరాదరణకు గురిచేస్తుంది.
ఒక విషయంపై మాట్లాడేటప్పుడు దానిపై అవగాహన కలిగి ప్రారంభించాలి.
తక్కువ సమయంలో విషయాన్ని స్పష్టంగా, సానుకూలంగా చెప్పగలిగే రీతిని అలవరచుకోవాలి.
ప్రతికూల పరిస్థితుల్లో భీతి, ఉద్వేగం, శత్రుత్వం లాంటివి మాటల్లో ప్రకటిస్తే అది ప్రమాదహేతువౌతుంది. మనం దుర్బలత్వాన్ని చూపిస్తే, అది ఎదుటివాడిలో తెగింపును పెంచుతుంది.
అవతలి వారిని పొగడడంలో కూడా కొన్ని మెలకువలున్నాయి. పొగడ్త మంచిదే. కానీ అందులో స్వాభావికత, సముచిత వైఖరి అవసరం. స్వార్థం, మితిమీరినతనం – రెండూ ప్రశంసలో లేకుండా జాగ్రత్తపడాలి.
ప్రశంసతో కూడిన మాటలు, ఎదుటివారిలోని మంచినో, గొప్పతనాన్నో గుర్తించామన్న భావాన్ని కలిగిస్తాయి. దానితో వారు మన పట్ల సానుకూలంగా స్పందిస్తారు.
శరీరంలో బాణాలు గుచ్చుకుంటే మెలకువతో వాటిని తొలగించి చికిత్స చేయవచ్చుగానీ, మనసులో గుచ్చుకొనే నిష్ఠూరవాక్కుల స్వభావాన్ని నివారించడం మాత్రం అసాధ్యం – అంటోంది మహాభారతం. గాయపడే విధంగా సంభాషించడం ఒక హింసాత్మక పాతకం.
మనసా, వాచా, కర్మణా – ఈ త్రికరణాలలో రెండవదైన ‘వాక్కు’ అనే ఉపకరణం ఎంతో ముఖ్యం. మనస్సుకీ, కర్మకీ వంతెన వంటిది మాట.
శ్రీరామ హనుమంతుల సంభాషణలో ఆంజనేయుని వాగ్వైఖరిని వాల్మీకి ఎంత అద్భుతంగా తెలియజేశాడో సుప్రసిద్ధం.
మాటలు సంబోధనలకి ప్రాధాన్యం ఉంది. గాఢ పరిచయం ఉన్న వారితో సంబోధించే వైఖరి వేరు. ఎంతో ప్రగాఢ పరిచయస్థులైనా ఏకాంతంలో సంబోధనలకీ, పదిమంది మధ్యలో సంబోధనలకీ మార్పులుంటాయి.
ఒక ప్రసిద్ధ వ్యక్తిని మనం కలుసుకోవచ్చు. అతడు బాల్యంలో స్నేహితుడు కావచ్చు. అది కూడా ‘ఒరేయ్’, ‘ఏమిరా’ అనేటంత చనువు కలిగిన మిత్రత్వం కావచ్చు. కానీ సంఘంలో అతడో ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు, నలుగురి నడుమ అటువంటి సంబోధనలు చేయడం స్నేహాన్ని పెంచదు సరికదా, ఆత్మీయతను తుంచుతుంది.
అదేవిధంగా – కొందరితో ప్రేమతో చేసే సంబోధనలు, మాటతీరు బహిరంగంగా ప్రదర్శించడం చుట్టూ వున్న వారికీ, వారికీ కూడా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.
ఎంత దగ్గరివారినైనా సవరించదలచుకుంటే ఏకాంతంలో మృదువుగా చెప్పాలి గానీ, “నీ మేలుకోరి చెబుతున్నాను” అంటూ పదిమందిలో విమర్శించడం, మందలించడం తగదు.
తీవ్రమైన కోపం, అసహనం కలిగినప్పుడు హఠాత్తుగా అనుచిత కఠినభాషణ రావడం సహజం. కానీ అటువంటి ఉద్వేగాలు కలిగినప్పుడు నిగ్రహించుకొని మౌనాన్ని వహించడమో, ఆ సంఘటననుండి దూరంగా వెళ్ళడమో మంచిది.

సేకరణ

Saturday, February 19, 2022

కృతజ్ఞత

కృతజ్ఞత

నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి.అయితే నీకు ఉద్యోగము వచ్చింది....!
ఇతరులకు రాలేదు... .!
కృతజ్ఞత కలిగి ఉండు

నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...
అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....!
జవాబు రాలేదు....!
కృతజ్ఞత కలిగి ఉండు

ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం
చేస్తున్నావో....అదే దారిలో...
అనేకులు మరణించారు...!
కృతజ్ఞత కలిగి ఉండు

ఏ స్థలంలో అయితే దేవుడు
నిన్ను దీవించాడో,అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు,ఇంకా దీవెన రాలేదు..!
కృతజ్ఞత కలిగి ఉండు

ఆసుపత్రిలో ఏ పడక మీద ఉండి నీవు బాగుపడి
ఇంటికెళ్ళావో......
అదే పడకపై ఉండి అనేకులు
మరణించారు....!
కృతజ్ఞత కలిగి ఉండు

ఏ వర్షమైతే నీ పొలానికి మంచి
పంటలనిచ్చిందో...
అదే వర్షం,ఇతరుల పొలాలను
నాశనం చేసింది.
కృతజ్ఞత కలిగి ఉండు

కృతజ్ఞత కలిగి ఉండు ....
ఎందుకంటే
నీవేదైతే కలిగి ఉన్నావో
అది నీ శక్తి కాదు,
నీ బలం కాదు,
నీ అర్హతలు కాదు.
కేవలం దేవుని అనుగ్రహం అని
గుర్తుంచుకో...
నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు
ఆయనే
ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి.
సేకరణ AVB సుబ్బారావు
🌻🌻🙏🙏🙏🙏🙏🌻🌻

సేకరణ

చరిత్ర పుస్తకల్లో లేని ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర

*🚩🕉చరిత్ర పుస్తకల్లో లేని ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర🕉🚩*


*https://chat.whatsapp.com/HYYqSjq34yH5YudxhpqU7F*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*ఛత్రపతి శీవాజీ ఈ మహా యోధుడి గురించి తెలియని వారు ఉండరు. శీవాజీ లేని భారతన్ని మనం ఊహించాలేము. హిందూ దేశాన్ని , ధర్మన్ని కాపాడిన మహాయోధుడి గురించి మన చరిత్ర పుస్తకల్లో లేని విషయాలను మనం తెలుసుకుందాం..!*


*ఛత్రపతి శివాజీ జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ). మరణం – 04.04.1680 (చైత్ర పౌర్ణమి). హిందూదేశంలో ఎందరో రాజులు అధికారంకోసం, రాజ్యం కోసం యుద్ధాలు చేశారు. రాజ్యాలను స్థాపించారు. హిందూ దేశాన్ని విదేశీయుల దాడులనుండి కాపాడి అమరులైనారు. వారి మరణానంతరం అయా రాజ్యాలు కూడా అంతరించాయి. అయితే శివాజీ కూడా అలాంటి వాడేనా లేక ఆయన చేసిన పోరాటం మొత్తం దేశానికి సంబంధిం చిందా? ఆయన సాగించిన సమరం ఆయన తోనే ఆగిపోయిందా? లేక ఆ తర్వాత వచ్చిన తరానికి ఉపయోగపడిరదా లేదా? ఆలోచించాలి. శివాజీ గనుక ఈ దేశంలో జన్మించకపోతే ఏమి జరిగేదో ఆయనతోపాటు యుద్ధక్షేత్రంలో యుద్ధం చేసిన యోద్ధకవి, పండితుడు శివాజీ గురించి ఒక కావ్యంలో ఈవిధంగా వర్ణిస్తాడు.*


*కాశీజీకీ కళా జాతి, మథురా మసీద్‌ హోతి*

*యది శివాజి న హోతా తో సబకీ సున్నత్‌ హోతి*

*(కాశీ యొక్క కళ పోయేది, మథురా మసీ దయ్యేది. ఒకవేళ శివాజే లేకుంటే, అందరికి సుంతీ లయ్యేవి.)*


*శివాజీ రాజకీయ రంగప్రవేశం చేసేనాటి వరకు ఆసేతుహిమాచల పర్యంతం హిందూవీరులు ప్రాణా లను ఫణంగా పెట్టి మహమ్మదీయ బలాన్ని ఎదురిం చారు. కాని విజయాన్ని సాధించలేక పోయారు. ఈ చేదు నిజాన్ని దాహిర్‌ గతి, జయపాలుని యుద్ధాలు, అనంగపాలుని స్థైర్యం, పృథ్విరాజు పతనం, కళింగ పతనం, దేవగిరి పతనం, తాళికోట దుర్దినాలు ఋజువు చేయగలవు. కాని శివాజీ రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత హిందూజాతిని జాగృత పరిచి విదేశీయ మహమ్మదీయ పాలకుల ముందు ఏనాడూ తలవంచలేదు, హిందూవీరులను తల వంచనీయలేదు. ఎదురించి నిలిచారు. హిందూ పతాకాన్ని హిందూదేశ గగన తలంలో స్వాభి మానంతో రెపరెపలాడించాడు.*


*శివాజీ 1627లో జన్మించాడు. వయస్సు పెరిగే కొద్దీ అతనిలో హిందూజాతి రాజకీయ బానిసత్వం గురించిన ఆవేదన కూడా పెరుగుతూ పోయింది. మన గుళ్ళూ-గోపురాలు, గోమాతలు మ్లేచ్ఛుల పాదాల క్రింద నలిగి పోతుంటే తన హృదయం అగ్నిగోళమయింది. ఇందుకు కారణం వీరమాత జీజీయబాయి శ్రీకృష్ణ, శ్రీరామ, అర్జున, భీమ, అభిమన్యు, హరిశ్చంద్ర మొదలగు మహా పురుషుల తేజో మయ జీవితాలతో శివాజీలో తరుణ శక్తిని, ధార్మిక భక్తిని పెంచి పోషించడమే.*


*1645లో మొదటిసారిగా యువ శివాజీ విప్లవ పతాకాన్ని ఎత్తాడు. బీజాపూర్‌ నవాబు పట్ల తాను అవిశ్వాసాన్ని చూపినాడన్న అపవాదును తీవ్రంగా ఖండిస్తూ ‘‘నావిశ్వాసము ఏ శాహకో, ఏ నవాబుకో ఏ వ్యక్తి కో కాదు; కేవలం దేవునికి మాత్రమే అర్పింప బడిన’’దని ఉత్తరంవ్రాశాడు. తనను పెంచి పెద్ద చేసిన దాదాజీ కొండదేవుని సాక్షిగా తన అనుచరులతో గూడి మొదట తోరణ దుర్గంపై భగవత్‌ పతాకాన్ని ఎగరేశాడు. అప్పటికాయన వయస్సు పదహారేళ్ళే. అలా మొదలయింది విజయప్రస్థానం. సహ్యాద్రి శిఖరాల పైన దైవసమక్షంలో చివరి రక్తపు బొట్టు వరకు పోరి ‘‘హైందవ స్వరాజ్యం’’ను హిందు స్థానంలో ‘‘హిందూ – పద-పాద షాహి’’ని స్థాపించు టకు ప్రమాణముచేసి ప్రతిజ్ఞా కంకణం ధరించాడు. శివాజీ 1674లో జూన్‌ మాసంలో జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు సింహాసనస్థుడై ‘హిందూ-పద-పాదషాహి’ని స్థాపించి ప్రత్ఞిను నిలబెట్టుకున్నాడు. శివాజీ వంద ఏళ్ళకు సరిపోయే వ్యవస్థ చేశాడు.*


*ఛత్రపతి శీవాజీ గళం నుండి వెలువడిన ‘‘హిందవీ స్వరాజ్‌’’ అనే ఈ మాటలే ఒక వంద సంవత్సరాల పాటు మహారాష్ట్ర వీరుల ఆశయాలను, సాధించ డానికి ప్రేరేపించాయి. శివాజీ ప్రారంభించిన ఉద్య మము స్థానిక ఉద్యమంగా, వ్యక్తిగత ఉద్యమంగా నడవలేదు, ముఖ్యంగా అది హిందూ ధర్మ రక్షణ కొరకు, విదేశీయ, విజాతీయ మహమ్మ దీయ అధికార ఆగడాల నిర్మూలన కొరకు, స్వతంత్ర హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు ప్రారంభించబడిన అఖిల హిందూ ఉద్యమమిది.*


*విదేశీ బానిసత్వం నుండి హిందూజాతిని రక్షించే నాయకుడు ఒక్క శివాజేనని దేశప్రజలందరూ గుర్తిం చారు. సావనూరు ప్రజలు శివాజీకి పంపిన లేఖలో ‘‘విదేశీయుల క్రూర నిరంకుశ పాలన క్రింద నలుగు తున్నాం. పవిత్ర హిందూధర్మం కాలిక్రింద త్రొక్కి వేయబడుచున్నది. మహమ్మదీయ సేనాని యూసఫ్‌ దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాం, రండి, మమ్ములను కర్తవ్యోన్ముఖులను చేయండి.’’ అని ప్రార్థిం చారు. ప్రజల ఆవేదనను ఆర్తనాదాన్ని అందు కున్న శివాజీ షయిస్థఖాన్‌ను పరుగుతీ యించాడు, అఫ్జల్‌ఖాన్‌ను అంతమొందించాడు. ఒక్కొక్క దుర్గాన్ని జయించుకుంటూ ముందుకు సాగిపోయాడు. హిందూ విజయకేతనాన్ని హిందూ గగనతలంలో రెపరెపలాడిరచాడు. సుస్థిరమైన రాజ్యవ్యవస్థను ఏర్పాటుచేశాడు. హిందూ విమోచ నోద్యమం శివాజీ, రామదాసుల కాలంలో పునః ప్రారంభింపబడి నప్పటికీ అది వారితో ఆగలేదు. ఆ మహాపురుషుల సంతతివారు,అనుయాయులు దానిని విజయ పీఠంపై కూర్చోబెట్టడానికి నిరంతర పోరాటం సాగించారు.*


*ఛత్రపతి శీవాజీ మరణంతో మరాఠా రాజ్యం అనాథ అయిందని కొందరు భావించారు. ఔరంగజేబు ఆయన తాబేదార్లు సంతోషించారు.శివాజీ నిర్మించిన శివశక్తి అనాథ కాలేదు. శివాజీ లక్ష్యాన్ని పోరాట పటిమను ముందుకు తీసుకొని పోయింది. శంభాజీ తాను పాలించిన తొమ్మిది సంవత్సరాల్లో విరామ మెరుగక పోరాటం సాగిస్తూ. చివరకు ఔరంగజేబు సైన్యాలకు చిక్కాడు. ఔరంగజేబు శంభాజీని మతం మార్చుకొమ్మని అనేక చిత్ర హింసలకు గురి చేశాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించనందుకు శంభాజీ నాలుకను కోశారు. అయినా శంభాజీ ఒప్పుకోలేదు. చివరకు చిత్రహింసలకు గురిచేశారు.*


*అతని కళ్ళు పొడిచారు. నాలుక కోశారు.. ‘‘ముస్లిములను చంపి, బంధించి, అగౌరవ పరిచినం దుకు, ఇస్లాం నగరాలను కొల్లగొట్టినందుకు’’ శంభాజీని చంపాలని మహమ్మదీయ న్యాయవేత్తలు డిక్రీ ప్రకటించారు. శరీరంలోని ఒక్కొక్క అంగాన్ని నరికి ఆ మాంసాన్ని కుక్కలకు వేసి క్రూరంగా శంభాజీని హింసించి చంపారు. నరికిన ఆయన తలలో గడ్డి కూరి డోలు, సన్నాయిలు వాయిస్తూ దక్కన్‌ లోని ముఖ్య పట్టణాలన్నింటిలో ప్రదర్శించారు. శంభాజీ బలిదానం సంగతి తెలియగానే మహా రాష్ట్రుల గుండెలు మండి ఉవ్వెత్తునలేచి కదన రంగానికి పరుగులు తీశారు. బ్రతికి వున్నప్పటికంటే అమరుడయ్యాకనే శంభాజీ తన జాతిని ఉత్తేజ పరిచాడు. ప్రతి మరాఠా వీరుడు సర్వస్వం త్యాగం చేసే వీర సైనికుడయ్యాడు. ఆయుధాలతో యుద్ధ రంగంలో దుమికారు.*


*అధికారం కాదు- హిందూ సమాజ రక్షణే ముఖ్యం*


*శంభాజీ మరణం తర్వాత శివాజీ కోడలు, శంభాజీ భార్య యశూబాయి కూడా తన మామగారు ఆచరించిన రీతికి నీతికి మచ్చ రానీయకుండా అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి ఏడేళ్ళ కుమారుడు సాహు ఉన్నప్పటికి సమాజ రక్షణ ముఖ్యమని భావించి యుక్త వయస్కుడైన తన మరిది రాజారాంకు పట్టం కట్టింది. శివాజీ మార్గానికి దారి చూపింది. శంభాజీ బలిదానం, యశూబాయి త్యాగంతో హిందూధర్మ రక్షణఆవశ్యకతను హిందూ ప్రజానీకమంతా గుర్తించి నది. హిందూ సమాజ రక్షణకు పూనుకున్నది.*


*https://www.facebook.com/groups/638078683192004*

Friday, February 18, 2022

భ క్తి

130122C1110. 180222-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


భ క్తి
➖➖➖✍️

మనలో అన్ని భావాలు ఉన్నట్లు, ‘భక్తి’ కూడా ఉంటుంది. వర్షాకాలంలో వరదొచ్చినట్లు భక్తి పొంగుకు రావాలి. రాదు. భక్తి పారవశ్యం అందరికీ తెలియదు. కొందరికి మాత్రమే తెలిసి, అందరికీ తెలియని ఆ భక్తి గురించి ఆధ్యాత్మిక చరిత్ర చాలా గొప్పగా చెబుతుంది. మనకు అనుభవంలోకి రానిది ఎంత గొప్పదైనా దాని విలువ ఓ పట్టాన అర్థం కాదు.

ఎంతోమంది భక్తులున్నారు. ఎన్నో విషయాలు చెప్పారు. వారు వారి దేవుళ్లకు, గురువులకు అంకితమై పోయారు. భక్తులే భక్తికి పరమ ప్రమాణాలు.

భక్తి ఏ స్థాయిలోనైనా ఉంటుంది. రెండు చేతులూ కలిపి జోడించిన దగ్గర నుంచి ‘ఇందుగలడందు లేడని చక్రి సర్వోపగతుండు...’ అని ప్రహ్లాదుడు తండ్రికి బోధించే స్థాయి వరకు ఉంటుంది.

ఇవ్వనిది భగవంతుడు భక్తుడి దగ్గర నుంచి ఆశించడం లేదు. అతడి హృదయంలో ముందుగా నిక్షిప్తం చేసి, భూమ్మీదకు పంపించి, ఆ తరవాత నీ భక్తి ఎంత అని అడుగుతున్నాడు.

అదేదో తనకు తెలియని విషయం లాగా మనిషి తెల్లమొహం వేసి చూస్తున్నాడు.

భక్తి మనిషికి సహజ వస్తువు. ప్రేమ మనిషిని నడిపించే ఇంధనం. ప్రేమ పెరుగుతూ పోతుంటే అది భక్తిగా మారుతుంది. ప్రేమ లేకుండా భక్తి ఉండదు. భక్తి ప్రేమను ఆధారం చేసుకుని బతుకుతుంది.

భయమో, భక్తో ఏదో ఒకటి ఉండాలంటారు పెద్దలు. భయం కారణంగా భక్తి అలవాటుగా మారవచ్చు. ఆ తరవాత భయం పోయి ఆ స్థానంలో ప్రేమ ప్రవేశిస్తుంది.

భక్తిని అలవాటు చేయాలి. భక్తిని పలక మీద బలపంతో అక్షరాలు దిద్దించినట్లు నేర్పాలి.

భక్తి పుట్టుకతో రాదు- కారణజన్ములకు తప్ప!

మనసులో భక్తి ఉంటుంది. అది మనుషులకు తెలియకుండా ఉంటుంది. భక్తిని రగిలించే ప్రేమజ్యోతి హృదయంలో జ్ఞానం రూపంలో ప్రవేశించాలి. జ్ఞానం తాళం తెరిస్తేనే గానీ భక్తి కనిపించదు.

ఇదంతా ఆసమయం వచ్చినప్పుడు దైవానుగ్రహం వల్ల జరుగుతుంది. చేసిందంతా చేసి, ‘నువ్వు నాకు భక్తితో మొక్కు. నీకు అన్నీ నేను చేస్తాను.’ అన్నాడు శ్రీకృష్ణుడు.

శరణాగతి చెంది, పాదాల మీద పడ్డాడు అర్జునుడు.

జ్ఞానం కలిగిన తరవాతే అతడిలో నిజమైన భక్తి, ప్రేమ పొంగుకొచ్చాయి. ‘నువ్వేం చెబితే, అది నేను చేస్తాను’ అని ఉత్సాహంతో కదనరంగంలోకి దూకాడు.

మన లోపల ఉన్న భక్తిని, సరైన సమయంలో భగవంతుడే చూపిస్తాడు.

అప్పుడు అన్నమయ్యను, త్యాగరాజును, ఆంజనేయుణ్ని తలచుకుని తలచుకుని మురిసిపోతాం.

భక్తికి ప్రయోగశాల భక్తుడి శరీరమే. నవవిధ భక్తుల గురించి నారద మహర్షి భక్తి సూత్రాలు రచించారు. అందులో ఏ ఒక్కటి ఒంటబట్టినా దైవదర్శనం సాధ్యపడు తుందంటారు.

భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు అన్నారు. అన్నంలో భక్తిని కలుపుకోవాలి. అంటే భక్తితో జీవించాలి. భక్తిని శ్వాసించాలి. భక్తి శరీరంలో రక్తంగా ప్రవహించాలి. మనసులో మహా భావమై పొంగిపొరలాలి. ఆత్మను శుద్ధిచెయ్యాలి.

ఎన్ని జన్మలెత్తినా, ఒకసారి భక్తుడిగా పుడితే, కథ ముగింపునకు వస్తుంది. తప్పకుండా దైవ దర్బారులో ఆసనం దొరుకుతుంది అంటారు పెద్దలు.

భక్తికి భావం ప్రధానం. అందరికీ కనిపించని రూపం భక్తుడికి కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఎవ్వరూ లేకుండా ఏవో మాటలు మాట్లాడుతున్న పిచ్చివాడిలా కనిపిస్తాడు నిజమైన భక్తుడు. అలా ఎందరో కనిపించారు. లోకం వాళ్ళను పట్టించుకోలేదు. కాని, అతడి హృదయంలో భక్తిని నాటిన ఈశ్వరుడు మాత్రం వాళ్ళ వెంటే ఉన్నాడు, ఉంటాడు. కాయ లాంటి భక్తుడే ఒక రోజున పండు లాంటి భగవంతుడిగా మారతాడు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

నిత్య సత్యాలు

🍃🥀మనం ఏమి చేసినా సమర్థించే వాళ్ళు స్వార్థపరులు నీవు ఏమైన తప్పు చేసినపుడు తప్పు అని తెలియజేసే వాళ్ళే నీ అసలైనా శ్రేయోభిలాషులు మంచిని చెడుని రెంటినీ తెలియజేసే వాళ్ళు నిజమైన స్నేహితులు..

🍃🥀ఒకరి గురించి వేరొకరి దగ్గర మాట్లాడితే దూరాలు పెరుగుతాయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి..

🍃🥀నేడు మంచిని విమర్శించేవారు మనకు అడుగడుగునా ఉంటారు వెనక్కి లాగే వారు మన వెన్నంటే ఉంటారు . నీ మేలు కోరేవారు ఎక్కడో ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటి స్నేహన్ని నీ మాటలతో నీ చేతులతో ఎన్నడూ దూరం చేసుకోకు..

🍃🥀మనం ఏర్పాటు చేసుకున్న సంబంధాలు ఎప్పుడు మాములుగా చేడిపోవు ఒకరి నిర్లక్ట్యం , ప్రవర్తన , అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చేడిపోతాయి ఒకరితో స్నేహం చెయ్యడానికి కారణాలు ఉండవు కానీ శత్రుత్వానికి మాత్రం ఇదమిద్దమైన కారణాలు తప్పనిసరిగా ఉంటాయి..

🍃🥀మీరు చేసే మంచిపని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్ముల్నీ తప్పకుండా వచ్చి చేరుతుంది మంచి పనులే చేద్దాం మంచి వారిగానే పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుందాం,మంచిగానే బతుకుదాం..

. 🍃🥀శుభ సాయంత్రం🥀🍃

సేకరణ

ఓ టీచర్ కన్నీటి వ్యధ* వి.న్యూస్ ప్రత్యెక కధనం:(లెటర్ ను డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నాను)

ఓ టీచర్ కన్నీటి వ్యధ
వి.న్యూస్ ప్రత్యెక కధనం:(లెటర్ ను డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నాను)

తానొక టీచర్ !
తన వృత్తి అంటే తనకు ఎంతో ఇష్టం !

తన పిల్లలు అంటే తనకు ఎంతో ప్రేమ !!

తన పిల్లలకు తనంటే ఎంతో గౌరవం !

కానీ ఇప్పుడదంతా గతం !

ప్రతి రోజు తనకిప్పుడు భయం భయం !

టీవీ లు, ఇంటర్నెట్ , బిజీ లైఫ్ తల్లితండ్రులు ,అంత కలిసి తెలిసో తెలియకో పిల్లల మనసు కల్మషం చేసేసారు !

ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు !
పాఠం చెబుతుంటే నా నడుము వైపు హై స్కూల్ పిల్లాడి చూపు !
డస్టర్ కోసం వంగి తీసే లోపే ఏదో పది కళ్ళు నన్ను తినేసేలా చూశాయని ఫీలింగ్!

క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో లోకంలో వుంటారు !
ఆరవ తరగతి నుంచే జంటలు జంటలు !
మొన్న బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు ముద్దులాడుకొన్నారని మా సోషల్ టీచర్ చెబితే మనకెందుకు తెలిస్తే గొడవలవుతాయని ప్రిన్సిపాల్ దాపరికం !

15 ఏళ్ళలో నా పాఠాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు !ఇప్పుడు పరిస్థితి వేరు.లెసన్ ఎంత ఇంటరెస్టింగ్ గా చెప్పినా వినని పిల్లలు !హోమ్ వర్క్ గా కనీసం పాఠం చదువుకొని రమ్మంటే పట్టించుకోని పిల్లలు !
అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడిన వారు , నీలి చిత్రాలు చూసిన వారు..చాటింగ్ చేసిన వారు ..
క్లాస్ రూమ్ లో అధిక శాతం పిల్లలు అదో లోకంలో ఉంటున్నారు.అదేమని అడిగితే నువ్వు తిడుతున్నావని మా నాన్నకు చెబుతా
ఆయన మీడియాకు చెబుతాడు అని పిల్లాడి బెదిరింపు !
మొన్న పక్క స్కూల్ లో ఇదే జరిగింది ! పిల్లల ప్రవర్తన శృతి మించితే టీచర్ కాస్త గట్టిగా కోప్పడి కాసేపు నిల్చోమంటే !మరుసటి రోజు టీవీ లో బ్రేకింగ్ వార్తలు ! టీచర్ ను రాక్షసుడిగా చిత్రీకరణ !
ఒక రోజు జైలులో గడిపిన ఆ టీచర్. రెండు నెలల జీతం ఖర్చు పెడితే కష్టం మీద బెయిల్
మరో పక్క ప్రిన్సిపాల్ ను స్కూల్ లోనే చంపిన వార్తలు !
నా భవిష్యత్తు తలచుకొంటే నాకే భయం !
నాకు ఒక కుటుంబం వుంది !
ఇంట్లో భర్త పిల్లలు వున్నారు !
ఇంట్లో నుంచి స్కూల్ కు వచ్చినప్పుడు ఇంటికి క్షేమంగా తిరిగి పోతానని గారెంటీ లేదు !
జైలుకే పోతానో .. నా శవమే తిరిగి పోతుందో ..

బాలలోకాన్ని అందరు కల్మషం చేసారు
బాగు చెయ్యాల్సింది టీచర్ లే నట !
ఈ ముళ్ళ కిరీటం మాకెందుకు !
పరీక్ష వస్తే తల్లితండ్రులకు మార్కులు కావాలి .
లేదంటే PTA మీటింగ్ లో పిల్లల ముందే బూతులు.
పిల్లాడు చదువుపై శ్రద్ధ చూపడం లేదంటే
నీకేం చేత కాదు అని అవహేళన .
సపోర్ట్ కోసం ప్రిన్సిపాల్ వైపు చూస్తే తలదించుకొని ఆయన!
తరగతి గదుల్లోనే దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది
ఇది నాటి నానుడి.
కాని నేటి విధ్యార్థుల తీరుతో ఓటీచర్ అంతఃర్మదనం.
నేడు ఈ వృత్తికి గౌరవం లేదు .
నేడు ఈ వృత్తికి ఆదరణ లేదు
బతికుంటే బలుసాకు తినొచ్చు
బతక లేక పోయినా బడి పంతులుగా
రావొద్దు !

సేకరణ

నేటి మంచిమాట. క్రోధం, కోరికలు అధికమైనపుడు క్రోధం తీవ్రరూపం దాలుస్తుంది.

నేటి మంచిమాట.

మనిషి పతనానికి కారణమైన వాటిలో మొదటిది క్రోధం. కోరికలు అధికమైనపుడు క్రోధం తీవ్రరూపం దాలుస్తుంది.

మనిషి ఒక్కసారి కోపమునకు గురయ్యాడంటే మూడు మాసముల పాటు తినడంవలన లభించే శక్తిని కోల్పోతాడు!

కోపం వలన విచక్షణ నశిస్తుంది. ఏమి చేస్తున్నాడో వానికే తెలియకుండా చేస్తుంటాడు. ఫలితంగా జీవితం నాశనంలోకి కూరుకుపోతుంది.

కోపం ఉండకూడదా అంటే ఉండొచ్చు. అయితే మాటలలో మాత్రమే ఉండాలి తప్ప మనసులో ఉండకూడదు.

అవతల వ్యక్తిలో మంచి జరుగుతుందంటే కోపం పడినా పర్వాలేదు.

అయితే కోపం పదిహేను క్షణాల కన్నా ఎక్కువసేపు ఉండకూడదు.

మన కోపం మనలోని ప్రశాంతతను భంగపరచకుండా ఉండేలా చూసుకోవాలి.

చివరిగా కోపం ఒక నటన మాత్రమే తప్ప నష్టం కాకూడదు అని గ్రహించి పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

వశిష్టుడు - విశ్వామిత్రుడు, వేయి సంవత్సరాల తపోశక్తి vs అర్ధ గంటకాలం మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం

వశిష్టుడు - విశ్వామిత్రుడు

ఒక రోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి విచ్చేసాడు. ఇద్దరూ అనేక విషయాలను చర్చించారు. వశిష్టుడు వీడుకోలు చెప్పినప్పుడు విశ్వామిత్రుడు , వశిష్టునికి కలకాలం జ్ఞాపకం వుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని తన వేయి సంవత్సరాల తపశ్శక్తిని ధారపోశాడు.

వశిష్టుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.

ఆ తర్వాత మరి కొన్నాళ్ళకు వశిష్ఠుని ఆశ్రమానికి విశ్వామిత్రుడు వచ్చాడు. వశిష్టుడు విశ్వామిత్రుని కి
సకలోపచారాలు చేస్తాడు. పుణ్యమునకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు గురించి మాత్రమే మాట్లడుకున్నారు. వీడ్కోలు సమయాన
వశిష్టుడు ,విశ్వామిత్రుని కి బహుమతిగా అంతవరకు వారు మాట్లాడుకున్న విషయాల పుణ్యఫలాన్ని యిస్తున్నాను అన్నాడు.

ఇది విన్న విశ్వామిత్రుని ముఖం చిన్న బోయింది.
' మీరు నాకిచ్చిన వేయి సంవత్సరాల తపః ఫలం,
యీ అర రోజు మాటల పుణ్యఫలం ఎలా సమమౌతాయని ఆలోచిస్తున్నారా ' అని వశిష్టుడు అడిగాడు.

విశ్వామిత్రుడు అవునని తలవూపాడు. ఈ విషయంగా బ్రహ్మదేవుని అడిగి తెలుసుకుందామని ఇద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళేరు. బ్రహ్మకి జరిగినది
చెప్పేరు. ఈ విషయంగా నేను తీర్పు చెప్పలేను .శ్రీ మహావిష్ణువు ని అడగమని చెప్పాడు బ్రహ్మ. వారు శ్రీ మహావిష్ణువు వద్దకి వెళ్ళి అడిగారు. నా కంటే కూడా తపోబలాన్ని గూ‌ర్చి పరమశివునికి బాగా తెలుసు. పరమశివుని అడిగితే ఆయనే సరిగ్గా జవాబివ్వగలవాడని అని అన్నాడు శ్రీ మహావిష్ణువు.
వారిద్దరూ అక్కడనుండి కైలాసం చేరుకొని తమ సందేహం తీర్చమని వేడుకొన్నారు. పరమశివుడు కూడా మీ సందేహం తీరాలంటే పాతాళలోకంలోని ఆది శేషువే తీర్చాలని చెపుతాడు.

వశిష్టుడు ,విశ్వామిత్రుడు పాతాళలోకానికి వెళ్ళి ఆదిశేషువును తమ సందేహం తీర్చమని అడిగారు. ఆదిశేషువు ఆలోచించి సమాధానం చెప్పడానికి కొంచం వ్యవధి కావలసి వున్నది. నేను బదులు చెప్పేదాకా నేను మోస్తున్న యీ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయ వలసి వుంటుంది. తలమీద పెట్టుకుంటే బరువుగా వుంటుంది, కనుక , ఆకాశం లో నిలబెట్టి వుంచండి అని అన్నాడు. విశ్వామిత్రుడు వెంటనే తన వేయి సంవత్సరాల తపః ఫల శక్తిని ధార పోస్తాను. ఆ తపఃశ్శక్తితో , భూమి ఆకాశంలో నిలబడుతుంది అని అన్నాడు.అయితే, భూమిలో ఏ చలనం రాలేదు. అది ఆదిశేషుని తలపై అలాగే వుంది.
అప్పుడు వశిష్టుడు అన్నాడు. అర్ధగంటసేపు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను, ఆ శక్తితో భూమి
ఆకాశం లో నిలబడాలని కోరుకుంటున్నానని
అన్నాడు. వశిష్టుడు అలా అనగానే ఆదిశేషువుతలమీద వున్న భూమి అంతరాన నిలబడింది.

ఆది శేషువు తిరిగి భూమిని తన తలమీద పెట్టుకొని
యిద్దరు మహర్షులు వెళ్ళవచ్చునని అంటాడు. అడిగినదానికి బదులు యివ్వకుండా వెళ్ళమంటే ? దాని అర్ధం ఏమిటని ఇద్దరు ఋషులు ఒకే సారి అడిగారు. మీ ఎదురుగానే నిరూపణమయింది , చూశారు కదా , యింక వేరే తీర్పు చెప్పడానికి ఏమున్నది?

వేయి సంవత్సరాల తపోశక్తి ధారపోసినపుడు కదలని భూమి ఒక అర్ధ గంటకాలం మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం ధారపోయడం వలన ఆకాశం లో నిలబడడం మీరు గమనించారు.
"సజ్జన సాంగత్యం వలన, సత్చింతన వలన కలిగిన
పుణ్యమే, తపోబలం యిచ్చే ఫలం కన్న మిన్న " అని ఆదిశేషువు తీర్పు.

సస్సంగత్యే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వ నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః

సేకరణ

Management Lesson

Management Lesson

One fine day, a bus driver went to the bus garage, started his bus, and drove off along the route. No problems for the first few stops - a few people got on, a few got off, and things went generally well.

At the next stop, however, a big hulk of a guy got on. Six feet eight, built like a wrestler, arms hanging down to the ground. He glared at the driver and said, "Big John doesn't pay!" and sat down at the back.

Did I mention that the driver was five feet three, thin, and basically meek? Well, he was. Naturally, he didn't argue with Big John, but he wasn't happy about it.

The next day the same thing happened - Big John got on
again, made a show of refusing to pay, and sat down.

And the next day, and the next.

This disturbed on the bus driver, who started losing sleep over the way Big John was taking advantage of him. Finally he could stand it no longer.

He signed up for body building courses, karate, judo, and all that good stuff. By the end of the summer, he had become quite strong; what's more, he felt really good about himself.

So on the next Monday, when Big John once again got on the bus and said, "Big John doesn't pay!"

The driver stood up, glared back at the passenger, and screamed, "And why not?"

With a surprised look on his face, Big John replied, "Big John has a bus pass."

MANAGEMENT LESSON:
Be Sure to Identify the problem clearly before working hard to solve it.
Most solutions are simple, we complicate the issues.

Confront your problems early, don't lose sleep over them & stay blessed forever.

సేకరణ

మంచి మాట..లు

ఆత్మీయ బంధుముమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి పద్మావతి దుర్గా గాయత్రి సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
🔱శుభోదయం🙏
18-02-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట..లు

మీరు చేసిన మంచిని మనుషులు గుర్తించకపోవొచ్చు.. కాని దైవం తప్పక గుర్తిస్తుంది.. మంచికి మంచి.. చెడుకు చెడు తప్పక ఉంటుంది

ప్రాణంతో ఉన్నప్పుడు పలకరింపు లేదు కాని ప్రాణం పోయిన తరువాత మాటలు ఎన్నో.. ఉపయోగం.. అందుకే తెగిపోయినప్పుడే తెలుస్తుంది బంధం విలువ కాని దారం విలువ కాని

మన సంతోషం కోసం పది మంది ని బాధపెట్టడం కంటే, పది మంది సంతోషం కోసం మనం బాధపడటం ఉత్తమం,,


జీవితంలో
ఎవరినైనా క్షమించండి, కానీ,, మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికి క్షమించకూడదు,,_
సేకరణ ✒️AVB సుబ్బారావు 🤝🌹💐

సేకరణ

భగవంతుని దర్శనం!

భగవంతుని దర్శనం!
➖➖➖✍️

”భగవంతుని చూడాలంటే రోజూ ఎంత సమయం పూజ, జపం, చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఏ మంత్రాన్ని ఎంత సాధనచేయాలి” అని కొంతమంది అడుగుతూ ఉంటారు.

మరికొంతమంది దేవుడుంటే చూపించండి, దాని కోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం, చూపించగలరా అనికూడా ప్రశ్నిస్తుంటారు.

ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం గమనిద్దాం…

ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినట్టి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే "దేవుడున్నాడా....?" అని మనకంటే తలతిక్కగా ప్రశ్నించాడు.

దానికి రామకృష్ణ పరమహంస గారు "దేవుడు వున్నాడు!" అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చారు.

దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగపోవటంతో “మీరు చూశారా..?” అంటూ మరొక మొండి ప్రశ్న వేశారు.

అప్పుడు రామకృష్ణ పరమహంస గారు “చిరునవ్వుతో దేవుడిని చూశాను. చూస్తున్నాను. నిన్నెలా చూస్తున్నానో ఆయననూ అలాగే చూస్తున్నాను,”అన్నారు.

దానికి వివేకానంద గారు “మరి నేనూ చూడాలంటే ఏమిచేయాలి?” అని అడిగారు గురుదేవులను.

గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్టి లో ముంచి ఒక నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తరువాత వదలి పెట్టారు.

తర్వాత ప్రశాంతంగా వివేకానంద ను చూస్తూ “నీకు ఇప్పుడేమనిపించింది?”అంటూ అడిగారు.

”గురుదేవా! మీరు నీటి తొట్టిలో నన్ను ముంచినప్పుడు ‘ఇంకొక్క క్షణం గాలి లేకుంటే నేను బ్రతకలేనని భయం వేసింది, ఒక్క శ్వాస తప్ప ఇంకేమీ అవసరం లేదనిపించింది" అన్నారు వివేకానందులు.

వెంటనే గురుదేవులు వివరిస్తూ “శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగి, ‘నీవు లేకుంటే నేను బ్రతకలేన’నే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది.”వివరించారు పరమగురువు.

అంత సాధన చేయాలి భగవద్దర్శనం కోసం! కానీ మనమేమో కొబ్బరికాయ కొట్టగానే ఆయన కనపడాలంటే ఎలా..?

”స్వామీ నేను ఒక ఐదు గంటల పాటు నిన్ను తప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను. మిగతా సమయంలో నాబుద్ధి అలా..అలా.. గాలికి తిరిగి చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది, మరినువ్వు నాకు కనపడతావా, అంటే ఆయన నీకెలా కనపడతారు.

నీకు భగవద్దర్శనం కావాలంటే ప్రతీ క్షణం ఆయన యందే నీ మనసు లగ్నం అయిఉండాలి! నువు భౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా అతని స్మరణలోనే ఉండాలి.

అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతీ క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతిక్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం పూజ చేయనక్కర లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది.

అందుకే …వివేకానందులవారంటారొకచోట…

’నీ పూజలు జపతపాలు, సాధనలూ ఏవీ..ఏవీ.. భగవంతుని దర్శింప జేయలేవు, కేవలం ఆయన కరుణ తప్ప!’అని కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ వుంటే. మన మనస్సు పవిత్రమై, ఆయనను వదలి వుండలేని ఆర్తి మనలో కలుగుతుంది.

అప్పుడు లేగదూడ పిలుపువిన్న గోమాతలా పరుగుపరుగున ఆయనే వస్తాడు మనకేంటి తొంద..
🌷🙏🌷
🙏🙏🌹🍁🕉️🍁🌹🙏🙏

సేకరణ

దేవుడు మన తోటే వుంటాడు

దేవుడు మన తోటే వుంటాడు

ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వస్తారు.

అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు:
నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను,
ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను???

కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు....

తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు, ట్రైన్ ప్లాట్ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు...

"తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు ...! " అన్నాడు బాలుడు కొంచెం అసహనం తో...
రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా:

′ ′ అయ్యా, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు! ......

ట్రైన్ బయలుదేరింది...

ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు, రైలులో కూర్చున్నాడు, తల్లిదండ్రులు లేకుండా, మొదటిసారి ...

అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తాడు ..

అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు... కొంతమంది దిగుతున్నారు..., అటూ ఇటూ చూస్తున్నాడు అన్ని కొత్త మొహలు తెలిసిన మొహం ఒక్కటీ లేదు.... అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వస్తుంది ..

ఒక వ్యక్తి విచారకరమైన మొహం తో తననే చూస్తూన్నాడు...

ఆది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది...

ఇప్పుడు ఒక్క సారిగా భయపడటం ప్రారంభించాడు... రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలవుతుంది మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది....

సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.....

ఆ సమయంలో అతని కి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తు....

వణుకుతున్న చేతితో అతను ఆ కాగితాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు, అందులో ఇలా ఉంది: "భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను ..."

ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యం తో మొహం మెరిసిపోయింది.... గుండె నిండా దైర్యం... చిరునవ్వు తో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు... అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు.

నీతి

అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి...

దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనమందరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు: "నేను మీతో ప్రయాణిస్తున్నాను" అని.

కాబట్టి భయపడవద్దు,
నిరాశ చెందకండి,
ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ప్రస్తుతం ప్రపంచం లో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.*

సేకరణ