Thursday, February 20, 2025

 *🥰🌺|| జై శ్రీ హరే కృష్ణ ||🌺🥰*

*పిల్లలకు నేర్పవలిసిన విషయాలు 🥰*

*🌼శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్బంగా కొన్ని విశేషాలు*

*శివాజీ మహారాజ్ మహానుభావుడు. ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు.*
🌺🪷🌺 🙂🕉️🙂 🌺🪷🌺

*ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు. గోవధ యధేఛ్ఛగా జరుగుతున్న రోజుల్లో, గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది స్త్రీలను రక్షించి, వారికి నమస్కరించటం. ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే, ఆ స్త్రీలను రక్షించి, కనపడిన ప్రతీ స్త్రీనీ అమ్మవారిగా చూసి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి, నమస్కరించినటువంటి ఘనత శివాజిదే*
🌺🍃🌺 🙂🕉️🙂 🌺🍃🌺

*యుధ్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే, ఖైదీలుగా బంధించకుండా, వాళ్ళు పెట్టుకొకపోయినా వాళ్ళకీ ఐదోతనపు చిహ్నాలుగా వారికి చీరా, పసుపు, కుంకుమ ఇచ్చి, వారిని తన తల్లిగా భావించి, నమస్కరించి, పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటివాడు శివాజీ మహారాజ్. మహానుభావుడు. సమర్థ రామదాసు గారు ఆయన గురువు.*
🍃🌺🍃 🙂🕉️🙂 🍃🌺🍃

*శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కోటలు నిర్మించి, హైందవ సామ్రాజ్య ఏర్పాటుకి ఆయనకు కార్యసిధ్ధి కొరకు శక్తి యొక్క అండ, అంటే అమ్మవారి అండ కావలసివచ్చింది. శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది - అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో శివాజీ అమ్మవారి అనుగ్రహానికై ధ్యానమగ్నులయ్యారు.*
🌺🍃🍃 🌺🕉️🌺 🍃🍃🌺

*మంత్రులు, సేనాధిపతులు "ఇదేమిటి, శివాజీ మహారాజ్ ఇంత ప్రౌఢమైన వయస్సులో, ఇంత యుధ్ధ సమయములో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానం లో కూర్చుంటున్నారు, అసలు బయటికి రావట్లేద"ని హడిలిపోయారు. భ్రమరాంబికా అమ్మవారిని ధ్యానం చేస్తూ శివాజీ మహారాజ్ కూర్చుంటే, అమ్మవారు ప్రత్యక్షమై, "నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను. ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక యుధ్ధంలో నీకు ఎదురు లేదు. ఈ ఖడ్గాన్ని పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించ"మని కటాక్షించింది.*
🍃🌺🍃 🙂🕉️🙂 🍃🌺🍃

*ఆ భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, ఎడమ పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లుఎక్కితే వీర శైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కార‌‌ములు కనబడతాయి. అక్కడే కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే, శివాజీ మహారాజ్ మోకాలు మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనికి ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశం చెక్కబడిన శిల్పము కనిపిస్తుంది. 🌺🍃*

*ఓం శ్రీ దుర్గా భవానీ దేవ్యై నమః🌺*
@everyone @highlight 
🌹🚩🌹 🙏🕉️🙏 🌹🚩🌹

No comments:

Post a Comment