*నేను శివాజీని మాట్లాడుతున్నా...*
మీరు నా జయంతి చేయడం కాదు
నా ప్రతిబింబమై కదలండి...
*నేను శివాజీని చెబుతున్నా...*
మీరు నా ప్రతిమను పూజించడం కాదు
నా పౌరుషానికి ప్రతీక అవ్వండి...
మీరు నన్ను ఊరేగించడం కాదు
హిందూ ధర్మానికి ఉషోదయమవ్వండి...
మీరు ధర్మం తెలుసుకోవడం కాదు
ధర్మాన్ని నడిపించే చైతన్యమవ్వండి...
స్త్రీలను తూలనాడడం కాదు
స్త్రీల గౌరవ మనుగడకు మార్గమవ్వండి...
మన స్త్రీలను పూజించడం కాదు
పర స్త్రీలకు మర్యాద ఇవ్వండి...
శివాజీని కీర్తించడం కాదు
మీరే మరో శివాజీగా శివాలెత్తండి...
*హిందు ధర్మానికి సంజీవనైనా ఈనాటి*
*మరో శివాజీ మోదీని చూసీ...*
మీరంతా ధర్మ దారికి దరహాసమైన వారికి ఓటు వారధవ్వండి...
కత్తులు
నెత్తుటి ఏరులు
దురాక్రమణలు లేని ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో భరతమాత హృదయాలు అవ్వండి
భావిభారత వీరులవ్వండీ....
*నేను శివాజీని చెబుతున్నా...*
గర్వంగా చెప్పండి
*జై శ్రీ రామ్...*
*జై భవానీ...*
*జై భారత్...*
No comments:
Post a Comment