Tuesday, February 25, 2025

 .            🔔 *శరణాగతి* 🔔

*నా తండ్రి శివయ్య గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను కర్మానుసారం ఎన్నో ఆపదలు నన్ను చుట్టుముట్టకుండా చంటి బిడ్డల చేయి పట్టి కాపాడతాడు ప్రతి క్షణం.*

*గత జన్మల కర్మానుసారం నా జీవన పయనంలో మలుపులెన్నో ప్రతి మలుపులోనూ తన ఉనికిని తెలిపాడు మరుపును వరంగా ఇచ్చాడు. నేనున్నా భయమేల నీకు అని భరోసా ఇస్తాడు.*

*బంధాలను అనుబంధాలను అద్భుతంగా మలిచాడు. ఉన్నతమైన జీవన విధానం వరంగా ఇచ్చాడు. తెలిసీ తెలియక కూడా నా తండ్రికి నచ్చని పని చేయలేదు. కర్మానుసారం చేసిన నా తండ్రికి నేను సమాధానం చెప్పగలను. నా తండ్రి ఆజ్ఞ లేనిదే ఏ ఆలోచన నా దరిచేరదు.*

*నేను నీ బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటున్నాను నీవు నీ బిడ్డ అనుకున్నావు కనుకే నీ గురించి చెప్పే అవకాశం ఇచ్చావు ఇక్కడ ఇలా ఇన్ని ఇచ్చినా ఇన్ని చేసినా నీకు నేను ఏమివ్వగలనయ్య నాది అంటూ ఏముందయ్యా అసలు నీకు ఇవ్వటానికి నీ ఒంటికి రాసుకోవడానికి నా చితాభస్మం తప్ప పరమేశ్వర...👏*

*శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి.*

*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🙏🙏 🔔🕉️🔔 🙏🙏🙏

No comments:

Post a Comment