Thursday, February 27, 2025

 *25వ రోజు విషయం నరక లోక శిక్షలు* 

*🌺🔥||నరక లోక శిక్షలు||🔥🌺*

*"గురుదేవా! పాపం చేసినవారంతా నరకానికి పోతారు. అక్కడ అనేక రకాలుగా శిక్షింపబడతారు అంటారు కదా! ఏ ఏ పాపం చేసిన వాళ్ళు ఏ నరకానికి పోతారు. ఏ రకమైన శిక్ష అనుభవిస్తారో వివరించండి" అన్నాడు కృష్ణశర్మ. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు.*

*మనోవాక్కాయ కర్మల చేత చేసిన తప్పుల వల్ల పాపం కలుగుతుంది. ఆ పాపాలకు మరణానంతరము మానవులు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. మొత్తం ఇరవై ఎనిమిది రకాల నరకాలున్నాయి.*

1. *'తామిస్ర' నరకము గాడాంధకారముగా ఉంటుంది. ఇతరులను హేళన చేసేవారు. ఇతరుల ధనాన్ని అపహరించేవారు ఇక్కడ రకరకాలుగా శిక్షింపడతారు.*

2. *భర్తలను ప్రలోభపెట్టి, లేదా మోసపుచ్చి వారి భార్యలను అనుభవించేవారు 'అంధతామిస్ర' నరకంలో ఘోరంగా శిక్షింపబడతారు.*

3. *కుటుంబ పోషణ కోసము ఇతరులను మోసం చేసేవారు 'గౌరవ' నరకంలో విషజంతువులచే పీడించబడతారు.* 

4. *దయ దాక్షిణ్యము లేకుండా ధనార్జన చేసేవారు 'మహారౌరవ నరకంలో పీడించబడతారు.*

5. *ఎలుకలను, ఉడతలను చంపి తినేవాళ్ళ 'కుంభీపాక' నరకంలో సలసలా కాగే నూనెలో త్రోయబడతారు.*

6. *పెద్దలను, పండితులను దూషించేవారు 'కాలసూత్ర' నరకంలో మాడిపోయే ఇసుకలో పడవేయబడతారు.*

7. *వేద విరుద్ధమైన పనులు చేసేవారు. 'అసిపత్రవ్రతము' అనే నరకంలో కత్తుల బోనులో పడేసి, ఇనుప కొరడాలతో కొట్టబడతారు.*

8. *అమాయకులను దండించిన న్యాయాధికారులు 'సూకర ముఖము' అనే నరకంలో శరీరము నుగ్గునుగ్గు అయ్యేటట్లు కొట్టబడతారు.*

9. *జంతుజాలాన్ని హింసించేవారు 'అంధకూప' నరకంలో శిక్షించబడతారు. తేళ్ళు, జెర్రులు, నల్లులు, దోమలు, వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేస్తాయి.*

10. *సంపద కలిగి కూడా ఇతరులను ఆదరించనివారు 'క్రిభోజనము' అనే నరకంలో క్రిమి కీటకాలతో బాధించబడతారు.*

11. *బ్రాహ్మణ ద్రవ్యము, విలువైన వస్తువులు దొంగతనం చేసేవారికి 'సందళన' నరకములో ఎర్రగా కాల్చిన కడ్డీలచే పొడిచి, చర్మము వలచబడుతుంది.*

12. *వావివరుసలు లేకుండా చరించినవారిని 'తప్తసూర్మి' నరకంలో ఎర్రగా కాల్చిన లోహపు విగ్రహాలను కౌగిలించుకోమంటారు.* 

13. *మదంతో పశువులతో రమించేవారిని 'వజ్రకంటక' నరకంలో ముళ్ళ పాదలలో పడదోస్తారు.*

14. *అధర్మపరులైన ఉద్యోగులను, వేదబాహ్యులైన బ్రాహ్మణులను వైతరిణి నదిలో తోస్తారు. అది చీము, నెత్తురులతో, క్రిమికీటకాదులతో నిండి ఉంటుంది.*

15. *కులాచారములు పాటించనివారిని 'పూయాదన' అనే మలమూత్రములతో నిండిన సముద్రంలో తోస్తారు.*

16. *కుక్కలను పెంచి వేటయే వృత్తిగా గల బ్రాహ్మణులను 'ప్రాణరోధ' నరకంలో కత్తులతో పొడుస్తారు.*

17. *జంతువులను పశువులను చంపి తినేవాళ్ళు 'వైశస' నరకంలో పడరాని పాట్లు పడతారు.*

18. *కామాంధుడై, భార్య నోటియందు వీర్యమును వదిలినవాడికి 'లాలాభక్షణ' నరకంలో వీర్యాన్నే తినిపిస్తారు.*

19. *ఇళ్ళకు నిప్పు పెట్టేవారు, విషం పెట్టేవారు. దారిదోపిడీ చేసేవారిని 'సారమేయోదన' నరకంలో పదునైన కోరకలు గల కుక్కలు చీల్చి వారి రక్తం త్రాగుతాయి.*

20. *దొంగ సాక్ష్యాలు చెప్పేవారు. వ్యాపారంలో మోసం చేసేవారు. 'అవిచింతమనే నరకంలో కొండలమించి తలక్రిందులుగా క్రిందికి త్రోయబడ్డారు.*

21. *దీక్షలు పూని మద్యపానం చేసే బ్రాహ్మణుని 'ఆయు:పాన' నరకములో సలసలాకాచిన ఇనుముని త్రాగిస్తారు.*

22. *తమకన్నా పెద్దవారిని నిర్లక్ష్యంగా చూసేవారిని 'క్షారకర్ణ' నరకంలో తలక్రిందులుగా వ్రేలాడదీసి బాధిస్తారు,*

23. *మనుష్యులను, పశువులను చంపేవారిని 'రక్షోగణ భోజన' నరకంలో పదునైన కత్తులతో ముక్కలు ముక్కలుగా నరుకుతారు.*

24. *అడవి జంతువులను, ఊర జంతువులను చంపేవారిని 'శూలప్రోత' నరకంలో శూలాలతో పొడిచి ఉరి వేస్తారు.*

25. *సాటి మానవులను హింసించేవారిని 'దండసూకర' నరకములో హింసిస్తారు.*

26. *మనుషులను చెరబట్టేవారిని, బంధించేవారిని 'అవధ నిరోధనీ' నరకములో పొగలో పడేస్తారు.*

27. *భోజన సమయంలో వచ్చిన అతిధులను దూషించిన వారిని 'పర్యావర్తన' నరకంలో కళ్ళు కాకులతో పొడిపిస్తారు.*

28. *ధనగర్వముతో ఇతరులను దూషించేవారిని 'సూచేముఖ' నరకంలో సూదులతో గ్రుచ్చి హింసిస్తారు.*

*నరకములో ఎన్ని బాధలు పడినా పాపి చావడు. ఎత్తైన కొండ నుండి క్రిందికి*

*సినప్పుడు అతడి శరీరము ముక్కలు ముక్కలవుతుంది. అతడు ఆ బాధ అనుభవిస్తాడు. కాని ఆ ముక్కలన్నీ మళ్ళీ అతుక్కుని. తరువాత శిక్షకు సిద్ధమవుతుంది. అంటూ నరకలోక శిక్షలను వివరించి ఎనిమిదవ అశ్వాసము పూర్తి చేశాడు రత్నాకరుడు.*

*రేపటి శీర్షికలో 🌺 వైవస్వత మనువు🌺 విషయము గురించి తెలుసుకుందాం...*

*┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🕉️🌺🕉️ 🌺🙏🌺 🕉️🌺🕉️

No comments:

Post a Comment