Tuesday, February 25, 2025

****శ్రీ వేంకటేశ్వరస్వామి సందేశం.

శ్రీ వేంకటేశ్వరస్వామి సందేశం.  ( మీరు ఎలా వచ్చారోనన్న ఎరుక మీకున్న ఎన్నో అర్ధం కాని ప్రశ్నలలో ఒక భాగానికి సమాధానం మాత్రమే. మీరు పరిష్కరించాల్సినవి ఎన్నో అద్భుతమైనవి, ఆసక్తికరమైనవి ఉన్నాయి. కానీ మీ అందరికి కూడా సహజావబోధన లేదు. మీ “సహజావ బోధనలు" అంటే మీ శారీరక అవసరాలు కాదు. మీరు స్విచ్ లు ఆపేసి కూర్చున్న మీ ఆధ్యాత్మిక సందేశాలు అవి ఏమిటి?                                                                                                                            ఇవి మీ సహజావబోధనలు ----> ఎందుకో అలా అనిపించడాలూ, అతీంద్రియ చెప్పడాలూ, మీ కలలూ ఇవన్నీ మీరు పట్టించుకోకుండా వదిలేసిన మీ అద్భుతమైన ఆయుధాలు. ఇక్కడిలా మీరు వికలాంగులై పోయారు - కాలు, చెయ్యి ఆడనివారైపోయారు. దారి తప్పిపోయారు. మీరు అసలు ఎందుకు బ్రతుకున్నారో మీకు తెలీకుండా పోయింది. అన్ని రకాల సమస్యలతో హింసకు గురి అవుతున్నారు. “శరీరం” అని పిలువబడే గుడి అనారోగ్యంపాలై నాశనమైపోయింది. అది అలా ఎందుకయిందో మీకు తెలీదు.                             అవును, మీరు పరిగెత్తిపోవటం మొదలు పెట్టారు. మీ నుంచి మీరు పారిపోయే గొప్ప నాటకాన్ని బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇవాళ మీరింత దుర్భర పరిస్థితులలో ఉండడానికి కారణం అదే. నేను ఆరాటంగా కోరుకునేది ఏమిటంటే ప్రాఠకులలో ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోవాలి. "నా మంచి కోసం నేను ఏదన్నా ఒక్క పని చేశానా? నాతో నేను నిశ్శబ్దంగా ఎప్పుడన్నా కూర్చున్నానా?” అని ఆలోచించాలి.                                                                                                                 “లేదు” , “ఎప్పుడన్నా” లాంటి సమాధానాలు వస్తే నేను ఆశ్చర్యపోను! ఎందుకంటే మీరు అంతా చిన్నతనం నుంచీ ఇతరులు మీకు ఏది మంచిదంటే అలా ఉండటానికే అలవాటు పడ్డారు. మీకు మాట్లాడ్డం వచ్చిన క్షణం నుంచి మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని గడిపే స్వేచ్ఛను మీరు చాలా కృత్రిమంగా లోపల ఒక రకంగా బయటికి ఇంకో రకంగా జీవిస్తూ ఎప్పుడు చూసినా మీ నుంచి మీరు దూరంగా పరిగెత్తిపోతున్నారు. వంటరిగా కొన్ని నిమిషాల పాటైనా నిశ్శబ్దంగా కూర్చోవడానికి మీరు భయపడిపోతున్నారు. అలా ఉండటం సమయాన్ని వృధా చేసుకోవటమేనని మీరు భావిస్తున్నారు. మీరు ఎప్పుడూ ఏదో ఒక “పని” చేస్తూ ఉండాలనీ, అప్పుడే మీ వల్ల “ఉపయోగం” అనీ మీరు అనుకుంటున్నారు. ఇలాగనే మీకు చిన్నప్పటి నుంచీ నేర్పించారు.

Reference - https://youtube.com/watch?v=Rhh8HvCAF9A&lc=UgwTgzpy7ky_7GdO1p14AaABAg&si=DooMQtzr8NalRi07

No comments:

Post a Comment