Thursday, February 27, 2025

 *_నీకు నీవే గొప్ప అనుకుంటే... నీ అంత మూర్ఖుడు ఈ జగతిలో లేడు. గొప్పలు చెప్పుకునే గొప్ప వాళ్లంతా కూడా భూగర్భం లో కలిసిపోయారు. అందులో నువ్వెంత.?_*

*_మనిషికి అహంకారం ఉండొచ్చు, అది మనిషి సహజ లక్షణం కూడా తప్పులేదు కానీ, అతీ అహంకారం మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పతనానికి చేరుకుంటాడు._*

*_నాకు నేనే గొప్ప నాకు ఎవ్వడి అవసరం లేదు, నాకు ఎవడి అవసరం రాదు  అని విర్రవీగకు. కాలము చాలా శక్తివంతమైంది కాలానికి అతిథులు ఎవరు కారు._*

*_అవతారపురుషుడు, పురుషోత్తముడు రాముడంతటివారే 14 సంవత్సరాలు వనవాసమేగాడు. మహా భక్తుడు రామదాసు అంతటివారే చెరసాల్లో బంధించబడి కొరడా దెబ్బలను భరించాడు. కాలం అతి శక్తివంతమైనది._*

*_లంకాదీశుడు రావణుడు మరణమే లేని వరం కోరుకుని, ఈ సృష్టికి నేనే కర్తను నా అంతటి వాడు ఈ లోకంలో ఎవడు లేడు అనే అహంకారంతో విర్రవీగీ... సీతామాతను చెరబడితే చివరికి రామ బాణానికి బలైయ్యాడు. మృత్యుగర్భములో వాలిపోయాడు._*

*_అహంకారంతో విర్రవీగి నేనే దేవున్ని, నేనే మిమ్ములను నడిపిస్తున్నాను. నేనే మిమ్ములను పోషిస్తున్నాను. నన్నే మీరు పూజించాలి, సేవించాలి అని అహంకరించిన హిరణ్యకశ్పుడు. చివరికి పొట్ట చీల్చి చంపబడ్డాడు._*

*_మిత్రమా... ఆఖరిగా ఒక్క మాట... రేపటికి రూపం లేని జీవితాలు మనవి. ఏ సమయము ఎలా మారునో జీవితం ఏది చెప్పి, తెలిసి రాదు. చివరికి ఉంటామో... పోతామో. తెలియని క్షణిక కాల జీవితం మనది._*

*_అందుకే సాధ్యమైనంతవరకు ప్రేమించు, ప్రేమను పంచు. అహంకారముతో విర్రవీగకు... అహంకారంతో విర్రవీగిన వాళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ముందు గతిని తెలుసుకొని నీ గతిమార్చుకో.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🙏🙏🙏 🌷🙇🌷 🙏🙏🙏

No comments:

Post a Comment