🕉️🦚🌻🌹💎💜🌈
*🍁మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తీ ఒక్కో విధంగా స్పందిస్తారు.అది వారి మనస్తత్వాల మీద,ఆలోచనా విధానాల మీద ఆధారపడి ఉంటుంది.లోకంలో ఎంత మంది మనుషులున్నారో అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి.*
*మంచి చేయకపోయినా సాటివాడికి చెడుచేయకు అంటారు కొందరు కానీ మన బాగు మాత్రమే మనం చూసుకుంటే చుట్టూ ఉన్న మీ కుటుంబాలలో సమస్యల్లో వుంటే వాళ్ళనెవరు చూసుకుంటారు? వారికి నీకు తోచిన సాయం చేయడం మన ధర్మం కాదా! మనకెందుకులే అనుకుంటామా!*
*అది మానవత్వం అనిపించుకుంటుందా??*
*భగవంతుడు మానవజన్మ అనే గొప్ప వరాన్ని ఎందుకు ప్రసాదించాడు? ఇవ్వడం తెలుసుకొమ్మని. అలవరచుకొమ్మని.ఆపదల్లో ఉన్నవారిని ఆదుకొమ్మని. సమస్యలతో సతమత మవుతున్న వారికి తగిన సలహాలివ్వమని. మన జ్ఞానాన్ని పంచమని, మన సంపదలో కొంతయినా తోటివారికి సాయం చెయ్యమని.నువ్వు చేసింది ఏది ఒట్టిగా పోదు దేవుడు చూస్తూ ఉంటాడు వడ్డీతో సహా తిరిగి ఎదో ఒక రూపంలో ఇచ్చేస్తాడు.*
*🌄శుభోదయం 🌞*
🕉️🦚🌹🌻💎💜🌈
No comments:
Post a Comment