ఆపుగురూ!ఆపు!
****************
విశ్వగురువా!
ఏం చేస్తున్నావ్ గురువా!
నోరువిప్పవే!
సిగ్గెయ్యటం లేదా!
అవమానంగా లేదా!
భారతీయవిద్యార్థులు
చదువుకోసం వెళితే
సంకెళ్లు బేడీలువేసి
యుద్ధవిమానాల్లో
భారత్ గడ్డమీద
దించి పోతున్నాడే!
దాన్ని సినిమా తీసి
ప్రపంచానికి
ప్రదర్శిస్తున్నాడే !
ఇంత విరగబాటా!
ఏం చేస్తున్నావ్ గురూ!
పంజాబ్ లోనే ఎందుకు?
గుజరాత్ లో దించు!
ఆ సీ ఎం అడిగాడు!
ఆలోచించాల్సిందే!
పంజాబ్ హర్యానా
ప్రజలతో నీకేమన్నా
రాజకీయ కక్షా?
ట్రంప్ తో కలిసి
కుట్ర చెయ్యలేదుకదా!
సొంత దేశీయులకే
మూతికి ముంత
ముడ్డికి చీపురు
కట్టినవాళ్లు మీరు!
మీకు 'వీళ్ళు' ఎంతో
వాళ్ళకు 'మనం' అంత!
మనవాళ్ళను మనమే
హీనం చేసుకున్నాం!
బైటోళ్ళు గౌరవిస్తారా?
మనచరిత్ర తెలుసు!
సంకెళ్లు-బేడీలు
ముంత-చీపురు
ఏదో సామ్యం
కనిపిస్తోందికదూ!
మానావమానాల్లేవు
మీరేదన్నా చేస్తారు!
పాపం!చదువుకోసం
వెళ్లిన బిడ్డలు!
దొడ్డిదారో!
అడ్డ దారో!
ఇక్కడ పెద్దోళ్ళనుచూసి
అలవాటే కదా!
ఆ దారిలోనే పోయారు!
బతకలేకే కదా?
ఆపు గురూ!
ఈ దారుణాన్ని!
మన శ్రీ కృష్ణుడే ఉంటే
చక్రం అడ్డేసే వాడే!
నువ్వుమాత్రం తక్కువా
నువ్వూ దేవుడవే కదా!
ఏదో ఒకటి చేసి
ఆపు గురూ!ఆపు!
అపుగురూ!ఆపు!
దేశమంతా
అవమానంతో
తలదించుకుంటున్నాం!
నీ విశ్వగురుత్వం
ఇందుకేనా?
అపుగురూ!ఆపు!
*******
-తమ్మినేని అక్కిరాజు
24-2-2025
No comments:
Post a Comment