Thursday, February 27, 2025

 *_జీవితంలో మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ  ఉంటాం కొన్ని సార్లు ఆ ప్రక్రియలో తప్పులు చేస్తూ ఉంటాం... కానీ చేసిన తప్పులు తెలుసుకోవాలే  కానీ లక్ష్యం వైపు మనం చేసే ప్రయాణం ఆగకూడదు..._*

*_నిజమైన ఎదుగుదల ఎప్పుడు సాధ్యమంటే... మనం చేసే పనులు తెలియకపోవడం తప్పుకాదు... నేర్చుకోకపోవడం తప్పు. భయపడటం తప్పు కాదు... భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు... లోపాలు ఉండటం తప్పుకాదు... వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు._*

*_మనం ఏ అంశంలో వెనకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ తప్పులు తెలుసుకుంటూ గుణపాఠాల నుంచి నేర్చుకుంటూ... అందులో మెరుగవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది._*

*_జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే... కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది... కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది._*

*_మనసుకు తగిలే దెబ్బ ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే, జీవితం మీద తగిలిన దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కొవాలో నేర్పిస్తుంది.☝️_*  
                               
       *_సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🪷🌺 🌷🙇🌷 🌺🪷🌺

No comments:

Post a Comment