Friday, February 28, 2025

 ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*ఇప్పటికీ వెధవనే*
〰️〰️〰️〰️
అదేంటో
నేనిప్పటికీ వెధవనే..
.
నోట్సు వ్రాయలేదని
మాష్టారు బెత్తంతో కొట్టినప్పుడు.‌
నేను వెధవను...
.
ఇప్పుడు
స్టూడెంట్ నోట్సు వ్రాయలేదని
నన్ను పైవాడు తిట్టిపోస్తున్నపుడు..
నేను వెధవనే....
.
ఒంటేలుబెల్లలో
నా కాల్లో ముల్లుగుచ్చుకున్నపుడు...
ఇప్పుడు
ఇంటర్వెల్ లో స్టూడెంట్
రాయితన్నుకు పడ్డప్పుడు..
నేను వెధవనే....
.
మార్కులు రాలేదని
తరగతి లో మాస్టర్
ఇంట్లో నాన్న కొట్టినప్పుడు 
నేను వెధవనే....
.
ఇప్పుడు
కష్టించి బోధించినా
స్టూడెంట్ చదవక
మార్కులు పొందిక పోతే
అధికారి ముందు 
నేనే వెధవను...
.
తరాల విద్యావ్యవస్ధ 
వెర్రితలల విషపుకాటులమధ్య
పంతులుగా
వంతులుగా
వెధవగానే ఉన్నా...!!
.
చదువు
సామాన్యుడి చేతినుండి జారి
కార్పొరేటు కబంధహస్తాలమధ్య
లయం అయ్యేదాకా
నేనెధవనే...!!!
.
....------ శ్రీగోరస
(నాగురించి నేను.. గోక్కుంటున్నాను)
😚😚😚😚😚😚😚😚😚😚😚

No comments:

Post a Comment