*_నాకు తెలిసి... నేటి కాలంలో నిజాయితీగా ఉన్న స్నేహాలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు._*
*_నేను వాస్తవాలను చెబితే మీకు కాస్త బాధ అనిపించొచ్చు. కానీ తప్పదు. నాకు తెలిసి ఇదే నిజం._*
*_నేటి స్నేహాలన్నీ స్టేటస్ ను బట్టి, ధనాన్ని బట్టి, వారికున్న పలుకుబడి బట్టి మాత్రమే చూసి వారి మధ్యన స్నేహబంధం ముడిపడి ఉంది. ఇదే నిజం... ఇదే లోకం తీరు._*
*_స్వార్థంతో ముడిపడి ఉన్న స్నేహాలు, నీవున్న పరిస్థితిని చూసి, జాలి పడడం తప్ప, నిన్ను నిన్నుగా ప్రేమించలేని స్నేహం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే._*
*_నిన్ను నిన్నుగా... నిన్ను నీలాగ ప్రేమించే స్నేహబంధం ఒక్కరు ఉన్నా చాలు. స్నేహమనే పదం చాలా అత్యుత్తమమైనది, అతి ఉకృష్టమైనది, పవిత్రమైనది. దాని విలువ తెలిసిన వాడికే నిజమైన స్నేహమనే బంధం అర్థం మవుతుంది._*
*_మనకున్న స్నేహం ఓ నీడ లాంటిది. వెలుతురు ఉన్నంత వరకే వెంటాడుతూ ఉంటుంది. చీకటి (మనదగ్గర ఏమి లేనప్పుడు)రాగానే కనుమరుగు అవుతుంది ఇదే నిజం, ఇదే జీవిత సత్యం. కాదంటారా.?_*
*_జీవితం ఓ పెద్ద అబద్ధం. ఈ భూమి మీద మనలను ఎన్ని రోజులు ఉంచుతుందో ఆ దైవం తెలియదు... మృత్యువు ఎలా ఉంటుందో... ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాదు..._*
*_మన చుట్టూ ఉన్న సమాజం, మన పరివారం, మన స్నేహితులు ఓ... నాటక రంగం. నవరసాలు పండించి నిట్టనిలువునా ముంచేస్తారు సుమీ..._*
*_అయినా బ్రతకాలనే కోరికలతో బాధల బంధికానాలో బలౌతూనే... మన జీవనం సాగిస్తాం. బ్రతకాలంటే తప్పదు మరి... ఆఖరి పిలుపు వచ్చేవరకు. నటించే సమాజం ముందు, స్నేహితుల ముందు మనము నటిస్తూ..._*
*_రాని నవ్వుని ముఖమున తగిలించుకుని ఈ గ్యారెంటీ, వారెంటీ లేని బతుకు బతకడమే... ఈ జీవితం._*
*_ఈ నాటకీయ రంగానికి తెరదించేది ఎప్పుడు. జీవితమే ఒక నాటక రంగం. తెరదించాక బాధపడితే లాభం లేదు. నాకు తెలిసి అంతా ఒక బూటకం ఇదో ఓ... నాటకం.☝️_*
*_సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌷🌹 🪷🙇🪷 🌹🌷🌹
No comments:
Post a Comment