Thursday, February 27, 2025

 *పునర్జన్మ అనేది వాస్తవమేనా?*

*మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి.  అలాగే, మనం ఎప్పటికప్పుడు భౌతిక వస్త్రాలు లేదా శరీరాలను మార్చుకుంటూ జనన-మరణ చక్రంలోకి వస్తాము అనేది సాధారణంగా అంగీకరించబడిన వాస్తవం. దీన్నే పునర్జన్మ అంటారు.* 

*అదే సమయంలో పునర్జన్మను నమ్మని మరియు ఇది కేవలం ఒక ఊహ అని భావించే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. జీవితం ఒక భౌతిక విషయం మాత్రమే మరియు అన్ని ఆలోచనలు మరియు విజువలైజేషన్ మెదడు చేత చేయబడుతుంది కానీ ఆత్మ కాదని అంటారు వాళ్లు. సంస్కారాలు లేదా స్వభావం అనేది మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన భౌతిక జన్యువులు తప్ప మరొకటి కాదని, అవి ఆత్మ ద్వారా తీసుకువెళ్ళబడవని కూడా వారు నమ్ముతారు.*

*భగవంతుడు కూడా మనలాగే ఆధ్యాత్మిక శక్తి అని, వారు జనన-మరణ చక్రంలోకి  రారని ఆధ్యాత్మికత మనకు ముఖ్యమైన జ్ఞానాన్ని ఇస్తుంది. వారు నిరంతరం పరంధామంలో ఉంటారు. భూమి మీదకు ఒక్కసారి మాత్రమే దిగి వస్తారు, అది ప్రపంచం దాని ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయి, లక్షణాలలో దిగజారినప్పుడు వస్తారు. భగవంతుడు భూమిని మరియు భూమిపై తమ పాత్రను పోషించే ఆత్మలందరినీ తన ఆధ్యాత్మిక సుగుణాలతో నింపి, ప్రపంచాన్ని మళ్లీ ఉన్నతంగా చేస్తారు. వారు ఇనుప యుగం లేదా కలియుగాన్ని స్వర్ణ యుగం లేదా సత్యయుగంగా మారుస్తారు, దీనిని స్వర్గం లేదా హెవెన్ అని కూడా పిలుస్తారు.*

*భగవంతుడు భూమిపైకి వచ్చినప్పుడు పునర్జన్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. స్వర్ణయుగం ప్రారంభం నుండి ఇనుప యుగం ముగింపు వరకు వివిధ భౌతిక వస్త్రాల ద్వారా ఆత్మలు తమ పాత్రలను ఎలా పోషిస్తాయో మనకు చెప్తారు. భగవంతుడు ఆత్మలను స్వచ్ఛంగా చేసిన తరువాత మళ్లీ తిరిగి స్వర్ణ యుగంలో పాత్రను పోషిస్తాయి. స్వర్ణయుగం నుండి ఇనుప యుగం వరకు ఈ చక్రం మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది.*

*┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌷🌷🌷 🙏🕉️🙏 🌷🌷🌷

No comments:

Post a Comment