శ్రీ రామకృష్ణులు: వేదాంతంలో కాదు, వేదాలలో. ఈ షడ్చక్రాలు ఎటువంటివో తెలుసా? అవి సూక్ష్మ శరీరంలో ఉన్న పద్మాలు. యోగులు వీటిని దర్శించగలరు. అవి మైనపు చెట్ల ఫలాలు ఆకుల వలే ఉంటాయి.
'ఎమ్ ': అవునండి. యోగులు వాటిని దర్శించగలరు. ఒక రకమైన అద్దం గురించి నేను చదివాను. దాని గుండా చూస్తేఅతి చిన్న వస్తువులు కూడా చాలా పెద్దవిగా కనపడతాయని నేనొక పుస్తకంలో చదివాను. అదేవిధంగా యోగం ద్వారా ఈ సూక్ష్మ పద్మాలను కాంచవచ్చును."
No comments:
Post a Comment