*_తెలివి తక్కువ తనం నీటిలో ఈదుతున్న చేపకు తెలియదు ఎర వల్ల తనకు ప్రాణం పోతుందని._*
*_నోటిదురుసు కప్పకు తెలియదు తనుచేసే శబ్దం వల్లనే పాముకు ఆహారం అవుతుందని._*
*_అహంకారం జింక అందాన్ని పులి చూడదు. ఆకలిని చూస్తుంది కాబట్టి ఎక్కడ ఎలా తెల్సుకుని మెదలాలో తెలుసుకొని మసలాలి..._*
*_తొందరపాటున కుడితే చస్తుందని తేలుకు తెలుసు కానీ కుట్టకుండా ఉండలేదు... ఈ తొందరపాటు వల్లే త్వరగా చస్తుంది..._*
*_కాబట్టి తెలివి తక్కువ, నోటిదురుసు అహంకారం, తొందరపాటు ఇవే మనిషి పతనానికి కారణం..._*
*_ఆకలి కోసం వేటాడే పులికి బలం దాని పంజాలో వుంటే, ప్రాణం నిలుపుకోవడం కోసం పరిగెత్తే జింకకు బలం దాని కాళ్ళలో వుంటుంది..._*
*_నా బలం ముందు ఆ జింక ఎంత అని పులికి పొగరు తలకెక్కి వేగం తగ్గితే... జింక చేజారిపోతుంది కదా..._*
*_దాని కన్నా నేను బలహీనమైన దానిని అని జింక భయపడి ఆగిపోతే... పులికి ఆహారం ఐపోతుంది..._*
*_కాబట్టి నీ సమస్య ఏదైనా... నీ ముందు ఎంత బలవంతుడున్నా ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు నువ్వు నీ బలహీనతను పక్కన పెట్టి... నీకున్న బలాన్ని నువ్వు ఆయుధంగా మార్చుకుని ఆ సమస్యలపై పొరాడగలిగితేనే నీ అంతటి వీరుడు ఈ లోకాన ఉండడు._*
*_జీవితంలో నీవు గెలవాలంటే... ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. అలాకాకుండా ఎప్పుడైతే బలాన్ని కాకుండా బలహీనత మీద నీకు ద్యాస మళ్లిన రోజున నీవు ఓడినట్టే.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🐯🌺 🦌🙇🦌 🌺🐯🌺
No comments:
Post a Comment