Monday, February 24, 2025

 🕉️ *పురాణము - అవగాహన*

కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. 
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అదే స్ఫూర్తితో పురాణము - అవగాహన అనే కార్యక్రమం శ్రీ ప్రణవపీఠము నిర్వహిస్తున్నది.
 శ్రీమద్భాగవతము ఎన్ని వేల శ్లోకాలతో ఉంటుంది? దీనిని మొదట ప్రవచన రూపంలో  ఎవరు ఎవరికి అందించారు?
 
◆ శ్రీమద్భాగవతము 18,000 శ్లోకాలతో ఉంది. దీనిని మొదట శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు సప్తాహ దీక్షతో చెప్పాడు.

 వ్యాసుడు వేదములను విభజించాడు. పురాణములు, ఉప పురాణములు రచించాడు. అయినా ఎందుకు వ్యాసునికి తృప్తి కలగలేదు?

◆ పురాణాలు, ఉప పురాణములు, మహాభారతం రచించినా, వేదాలు విభజించినా, వ్యాస మహర్షికి మనోవ్యధ తీరకపోతే అప్పుడు నారదుడు వ్యాసుని చింతను చూసి అతనికి భగవంతుని లీలలను తెలియజేసే కథలను లోకానికి అందజేయమని చెప్పాడు. అందుచేత భాగవతం అనే పురాణమును వ్యాసుడు రచించాలని పూనుకున్నాడు.

కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. 
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అదే స్ఫూర్తితో పురాణము - అవగాహన అనే కార్యక్రమం శ్రీ ప్రణవపీఠము నిర్వహిస్తున్నది.


 మహాత్ముడు నారదుడు పూర్వజన్మలో ఎటువంటి జన్మ ఎత్తారు? నారదుడిలా జన్మ ఎలా వచ్చింది?

◆ నారదుడు పూర్వ జన్మలో ఒక దాసీ పుత్రుడు. ఆమె ఇంటి పనులు చేస్తూ జీవనం సాగించేది. వీరి పూర్వజన్మ సుకృతం వల్ల వీళ్లు ఉండే  ఊరికి యాత్రలు చేస్తున్న ఋషులు వచ్చి, చాతుర్మాస్య దీక్ష చేస్తూ భాగవతం నిత్యం 8 గంటలు పాటు భక్తులకు విష్ణు కథలు చెబుతుండేవారు. వారికి ఆ దాసీ పుత్రుడు సేవ చేస్తూ వారు తిన్నగా మిగిలిన భోజనమును   మహాప్రసాదముగా స్వీకరించి తినేవాడు.   చాతుర్మాస్యం అయ్యాక ఋషులు వెళ్తుండగా ఆ దాసీ పుత్రునికి   ద్వాదశాక్షరి మంత్రం ఉపదేశించి వెళ్లారు. తీవ్ర సాధన చేయగా శ్రీ కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం పొంది తరువాతి జన్మలో నారదుడుగా జన్మిస్తాడు.

గజేంద్ర మోక్షం ఘట్టంలో పూర్వ జన్మలో గజేంద్రుడు ఎవరు? ఏ కారణం వల్ల ఈ జన్మ వచ్చింది?

◆ గజేంద్రుడు పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు. కొంతకాలానికి వైరాగ్యం వచ్చి తన పరివారంతో సహా రాజ్యం విడిచి పర్వతాలలో తపస్సు చేసారు. కొంతకాలానికి రాజు తపః ఫలితంగా ఎమన్నా అది జరుగుతుండేది. విష్ణు భక్తులలో గొప్పవాడిని అనుకున్నాడు. ఒకనాడు పండితుడు, మహాత్ముడు, తపస్వి, అయిన అగస్త్య మహర్షి వచ్చినప్పుడు నమస్కరించలేదని ఇతనికి బుద్ధి చెప్పాలని మూఢ, లుబ్ధ, గజరాజుగా మారమని, పరివారంతో  సహా అందరూ గజాలు అయ్యేలా శాపం ఇచ్చాడు.
పూర్వ జన్మలో చేసిన తపస్సు వల్ల పరమాత్ముడిని శరణు కోరి మోక్షం పొందాడు.

కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. 
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అదే స్ఫూర్తితో పురాణము - అవగాహన అనే కార్యక్రమం శ్రీ ప్రణవపీఠము నిర్వహిస్తున్నది.

దాసీ పుత్రుడుగా పుట్టిన నారదుడు తన పూర్వ జన్మలో ఎవరు? ఏ పుణ్యం చేత మహాత్ములకు సేవ చేసే భాగ్యం, విష్ణు కథలు విని తరించే భాగ్యం కలిగింది? - *శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము*

◆ అత్యంత ప్రాచీన కలంలో ఉపబర్హణుడు అనే గంధర్వుడు ఉండేవాడు పరమ విష్ణు భక్తుడు. ఒకసారి శ్రీహరి కొలువు తీరి ఉండగా, బ్రహ్మ గారు ఉపబర్హణుడిని పిలిచి పాటలు పాడమని అన్నారు, కానీ ఇతను వేశ్యాలోలుడై బ్రహ్మ పిలిచినప్పుడు వెళ్లలేదు. కావున బ్రహ్మ ఆగ్రహించి గంధర్వుడివి హరి గురించి గానం చేయమంటే వేశ్యలను కీర్తిస్తావా అని దాసీ పుత్రుడు గా భూలోకంలో జన్మించమని శపిస్తాడు.

సృష్టిలో శత్రువులు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని భీష్ముడిని ధర్మరాజు ప్రశ్నించాడు.  దానికి భీష్ముని సమాధానం ఏమిటి? - *శ్రీ మహాభారతం, శాంతి & అనుశాసనిక పర్వం

◆ ధర్మరాజు అజాతశత్రువు అయినా కౌరవులు, కర్ణుడు ద్వేషించారు. శివుడిని, విష్ణువు ని  కూడా కొందరు రాక్షసులు, మనుష్యులు, దేవతలు కూడా ద్వేషించారు.  కానీ నారద మునిని ఏ రాక్షసులు, అసురులు ద్వేషించినట్లు లేదు. అందుకే నారదుని కంటే గొప్పవారు సృష్టి లో ఎవరూ లేరు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.
✨✨✨
భాగవతం, రామాయణం, భగవద్గీత మొదలగు పవిత్ర గ్రంథములలోని అధ్యాయములు లేదా శ్లోకములు రోజుకు ఒక్కటి అయినా విన్నా, చదివినా, అర్థం తెలుసుకున్నా, పుస్తకంలో వ్రాసినా వచ్చే ఫలితం మాటలలో చెప్పలేము. తప్పక వారికి, వారి కుటుంబానికి అనంతమైన శుభములు కలుగుతాయి.

No comments:

Post a Comment