*_ఒకరి స్థానం అనేది వారు వేసుకునే రంగు రంగుల బట్టలు లేదా... వారు ధరించిన ఖరీదైన వస్తువులను బట్టి మారదు..._*
*_ఒకరు సింపుల్ గా సాదాసీదాగా కనిపించినంత మాత్రాన వారి స్థాయేమీ తగ్గిపోదు... మరొకరు హుందాగా నిండుగా కనిపించినంత మాత్రాన వారిగౌరవం ఏమీ పెరిగిపోదు..._*
*_స్థాయిని బట్టి నిజమైన గౌరవం గుర్తింపు వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ... గుణాన్ని బట్టి గౌరవం మాత్రం కచ్చితంగా వస్తుంది..._*
*_అందుకే నీ స్థాయి మారినా నీ సంస్కారాన్ని మాత్రం ఎప్పటికి మర్చిపోకు... ఆ సంస్కారమే నీకు విలువను పెంచుతుంది. కాస్త కష్టమైన... అదే నీ స్థాయిని నిర్దేశిస్తుంది._*
*_మనల్ని అందరూ కలుపుకోవాలి... ప్రేమగా చూసుకోవాలి. మనకంటూ ఓ మర్యాద గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అనుకోవటంలో తప్పులేదు కానీ..._*
*_నీతో వుండే ప్రతి ఒక్కరిలో ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, ఆ గుర్తింపును ఆ గౌరవాన్ని వెతుకు..._*
*_నిజానికి అర్హత లేని ఎంతోమంది నీ జీవితంలో నీకు తారస పడుతుంటారు. కానీ, నువ్వు అనుకున్న బంధాలు, ఆప్యాయతలు నమ్మకాలు మాత్రం అవతలి నుంచి కనపడటం కొంచెం కష్టమే సుమీ... కొంచమేంటి చాలా కష్టమే..._*
*_అవతలి నుంచి అవసరం మాత్రమే కనిపిస్తుంది... అందుకే ఈ నమ్మకం లేని మాటలు, బాధ్యత లేని బంధాలు, విలువ లేని, విలువ ఇవ్వని మనుషులు, బాధ్యత లేని బంధాలు అంటే గౌరవం లేని మనసులు వ్యర్థం..._*
*_కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో... ఎందుకంటే కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి... మెత్తని కత్తిలా మనకు తెలియ కుండానే... పొడిచిపోతారు._*
*_అదేనండి బాబు వెన్ను పోటు... పొడుస్తారు. తస్మాత్ జాగ్రత్త. నీకే చెబుతుంది అర్థమైందా...☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🦑🌸 🌹🙇🌹 🌸🦑🌸
No comments:
Post a Comment