Thursday, February 27, 2025

 వత్తిడిని జాయిస్తేనే విజయం 

వ్యక్తిత్వ వికాసకులు జాలాది మోహన్ 

ఈ రోజు జిల్లా గ్రంధాలయం ఒంగోలు నందు చదవటం మా కిష్టం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రముఖ వ్యక్తిత్వ వికాసకులు జాలాది మోహన్ మాట్లాడుతూ వత్తిడిని జాయిస్తే విజయం మీ ముంగిట్లోకి వస్తుందని,మారుతున్న సమాజంలో వస్తున్న మార్పులు వత్తిడిని కలుగజేస్తున్నాయని వ్యక్తిగత ఆలోచనలు కుటుంబ ఉద్యోగ సామజిక రంగలలో చోటుచేసుకున్న పరిణామాలు మనసిక వత్తిడిని పెంచుతున్నాయని అన్నారు 
శక్తికి మించిన లక్ష్యాలు,తగాదాలు,చదువులో వెనకపడడం,చెడు అలవాట్లు,వృత్తి,ఉద్యోగ సమస్యలు,టీజింగ్,రాగ్గింగ్ వల్ల వత్తిడివంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు 
వత్తిడివల్ల అసహనం జ్ఞాపకాశక్తి తగ్గడం,భయం,కోపం,ఆశాంతి,అందోళన ఆస్తిరత్వం వంటి మనసిక సమస్యలు వాంతులు,తలనొప్పి,ఆకలి తక్కువగా ఉండడం,నిద్రలేమి,ఉబాకాయంవంటి మనసిక సమస్యలు వస్తాయని వత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామలు ధ్యానం,యోగా రిలేక్షేషన్ ప్రక్రియలు,లలితకలలు,ఆటలు,పాటలు,డాన్స్ పెయింటింగ్,సంగీ తము,తోడ్పాడతాయని,ముందుగా ప్రణాళిక వేసుకోవాలని,పని ఆరంభిమాచాటానికి ముందే అన్నీ సమాకుర్చుకోవాలని పనిని వాయిదా వేయకూడదని పెద్దప నులనుచిన్న చిన్న భాగాలుగా చేసి పూర్తిచేయాలనీ అన్నారు జాగ్రత్తగా వత్తిడిని తగ్గించుకొని  తప్పక అను కున్నది సాధించవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రందాలయ సిబ్బంది బొమ్మల కోటేశ్వరి,అనిల్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment