Saturday, February 22, 2025

 🙏🏻 రమణోదయం 🙏🏻

 "ఏకం' అనేకం అయిందని అంటాం..
కానీ నిజానికి "ఏకం' ఎప్పుడు 'ఏకం'గానే  ఉంది. 
"అనేక'మైనట్లు అనిపిస్తుంది అంతే. 
అది కూడా "మనసు' వల్లనే. 

"మనసు' యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే "విభజించడం'. 
"విభజించడ'మే దాని పని. 
ఏకంగా.. అవిబాజ్యం ఉన్న మనని...
విభజిస్తూ విభజిస్తూ ఇప్పుడు ఉన్న స్థితికి తీసుకొచ్చింది. 
ఎవరికి వారు ఒక ప్రత్యేకత పొంది ఉన్నారు

మనసే విభజనకు మూలం. 
మనసే అన్ని అనర్థాలకు కారణం. 
జాతి మత కుల ప్రాంతీయ లింగ బేధాలు 
మనసు వల్లనే ఏర్పడ్డాయి.
మనసు వల్లనే మనము 
ఈ విశ్వం నుండి విడిపోయి 
ఒక "ప్రత్యేక వ్యక్తి'గా తయారయ్యాం.
మనసు వల్లనే మనకు అన్యం కనిపిస్తుంది. 

ఇదంతా మనసు ఆడే ఆటనే. 
మనసు గురించి తెలియకపోతే..
మనసు ఆడే ఆటలో 
మనము ఒక పావుగా మిగిలిపోతాము. 
"మనసు' గురించి అర్థమైతే 
దాని "వెకిలి చేష్టలు' మనకు అర్థమవుతాయి.
అసలు విషయాలు బోధపడతాయి.

 ' నేను ' అనే తలంపు
ఎక్కడ ఏ మాత్రమూ లేదో అదే 'ఆత్మ'.
దానినే మౌనం అంటారు.
ఆత్మయే జగత్తు.
ఆత్మయే 'నేను';
ఆత్మయే భగవంతుడు;
అంతా శివస్వరూపమైన ఆత్మే.🙏

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

No comments:

Post a Comment