అలవాటు పడ్డ ప్రాణం:
వెంకట్రావు బాగా పై ఆదాయం వచ్చే ఓ ప్రభుత్వ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన నాటినుంచి అన్నం తినడం మానేశాడు.
భార్య పెట్టి నా,కోడలు పెట్టి నా తినడం లేదు.ఓ ఆర్నెల్లు అయ్యేటప్పటికి క్రమేపీ బరువు కోల్పాయాడు.
ఆందోళన చెందిన కొడుకు అన్ని పరీక్షలు చేయించాడు.అన్నీ బాగానే ఉన్నా యి.డాక్టరు గారు కొడుకు ని పిలిచి ఓ సారి సైకాలజిస్టుకి చూపించమని సలహా ఇచ్చారు. మీ నాన్నగారు దేనికో బాధ పడుతున్నారు అని చెప్పారు.
అలాగే సైకాలజిస్టు అపాయింట్ మెంటు తీసుకున్నాడు కొడుకు.ఆయన ఈయన పనిచేసిన డిపార్టుమెంటు వివరాలు అడిగి, కేసు స్టడీ చేసి కొడుకు కు ఓ సలహా ఇచ్చారు.
సలహా అమలుకు శ్రీ కారం.
మర్నాడు ఓ వ్యక్తి వారింటికి వచ్చాడు.ఏటండీ యెంకట్రావు గారూ
సిక్కి పోయారు రండి అలా ఒటల్కెళ్ళి ఓ పెసరట్టు లాగిద్దాం అనగానే అతనితో వెళ్లి టిఫిన్ తినేశాడు.మధ్యాహ్నం ఒంటిగంటకి
రడీగా ఉండండి ఉడిపీ హోటల్లో లంచి కెడదాం. మధ్యాహ్న భోజనానికి వెళ్లి భోజనం చేసాడు
వెంకట్రావు.
ఓ ఆర్నెల్లు గడిచి టప్పటికి వెంకట్రావు లో జవసత్వాలు వచ్చే సాయి.హమ్మయ్య బండి గాడిలో పడింది. సైకాలజిస్టు మంచి సలహా
ఇచ్చారు.
ఆ ప్రకారమే ఓ పది మందిని మాట్లాడి ఆ విధమైన ఏర్పాటు చేసాడు కొడుకు.
ఎంతైనా అలవాటు పడ్డప్రాణం కదా
ఎవడో ఒకడు పెట్టిస్తేకాని తినబుద్ది కాదు.
......
జయంతి లక్ష్మీ నరసింహం
No comments:
Post a Comment