*_కథపేరు: #సంతృప్తి_*
*************
*_(ఇదొక చిన్న కథ.... రచయిత మాత్రం ఎవరో తెలియదు కానీ, మనకు గొప్ప గుణపాఠం నేర్పుతుంది. అసలు సంతృప్తి అంటే మనలో ఎంతమందికి తెలుసు..????)_*
*=====♀️:::•♻️•:::♀️=====*
*[జీవితంలోని భౌతిక వనరులతో మనం నిజంగా హృదయపూర్వకంగా సంతృప్తి చెందుతామా?]*
*ఆత్మసంతృప్తి చెందడం అంటే ఏంటో ప్రత్యక్షంగా నాకు తెలియజేసిన ఒక చిన్నారిని గురించినదే ఈకథ... ఇక చదవండి... —వెలిశెట్టి నారాయణరావు🙏*
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
*నేను మా ఊరికి వెళ్లేందుకు బస్టాండ్లో వేచి ఉన్నాను. బస్సు ఇంకా రాలేదు.*
*నేను అక్కడ కూర్చుని పుస్తకం చదువుతున్నాను.*
*నన్ను చూసి, దాదాపు 10 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి,.... _"సార్, ఈ పెన్నులు కొనుక్కోండి, నేను మీకు 10 రూపాయలకి నాలుగు పెన్నులు ఇస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు కొనుక్కుంటే నాకు ఏదైనా తినడానికి వీలవుతుంది."_ అంది.*
*ఆమెతో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు, బహుశా ఆమె తమ్ముడనుకుంటాను.*
*కానీ నేను, _"నాకు పెన్ను అవసరం లేదమ్మా"_ అన్నాను.*
*ఆమె తర్వాత చాలా ముద్దుగా ఇలా అడిగింది......, _"అప్పుడు మేము ఏం తింటాం, మా ఆకలి ఎలా తీరుతుంది?"_*
*"నాకు పెన్ను వద్దు, కానీ నువ్వు తప్పకుండా ఏదొకటి తింటావు" అన్నాను.*
*నా బ్యాగ్ లో రెండు బిస్కెట్ల ప్యాకెట్లు ఉన్నాయి. నేను ఆ రెండు ప్యాకెట్లను తీసి, ఇద్దరికీ చెరొకటీ ఇచ్చాను. కానీ ఆమె ఒక ప్యాకెట్ తిరిగి ఇచ్చేసి, _"అయ్యగారూ! ఒక్కటి చాలు, ఇద్దరం పంచుకుంటాం"_ అని చెప్పడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను.*
*నేను మళ్ళీ... "ఫర్వాలేదు, ఈ రెండూ ఉంచుకో" అన్నాను.*
*👏దానికి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న నన్ను, నా హృదయాన్ని, నా ఆత్మను కూడా కదిలించింది.*
*_❤️"అప్పుడు మీరు ఏమి తింటారు సార్ ?"_ అని అడిగింది.*
*_🙄దానితో ఒక్కసారిగా అవాక్కయ్యాను. ఇదిగో... ఈ ఒక్క మాట చాలదా?!! అత్యాశతో, అహంకారంతో మూసుకుపోతున్న మనకళ్ళు తెరిపించడానికి?!! అనిపించింది_*
*_🤔కోట్లకు కోట్లు సంపాదిస్తున్న మనుషులు మానవత్వాన్ని పక్కనపెట్టి విజయం పేరుతో ప్రజలను విపరీతంగా దోచుకుంటున్న ఈ ప్రపంచంలో, ఆకలితో ఉన్న ఓ అమ్మాయి నాకు మానవత్వపు విలువను తెలిపే ఉన్నతమైన గొప్ప పాఠాన్ని నేర్పింది.🙏_*
*ఆత్మసంతృప్తి చెందేవాళ్ళు ఇలాగే ఉంటారేమో అని నాలో నేనే అనుకున్నాను...*
*దురాశతో ఇతరుల వాటాను కూడా దోచుకొని తినేసేంతగా ఎదుటివారి వద్ద నుండి లాగేసుకోకండి ...!!*
*——♾️——*
*ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అదేమిటంటే... _'ఇతరుల నుండి తీసుకోవడం కాదు ఇవ్వడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై తీసుకోవాల్సి వస్తే.. తీసుకున్నదాని కంటే మరింత ఎక్కువగా ఇతరులకు మనమూ ఇవ్వాలి.'_*
*ఈ లక్షణాలు ఆధ్యాత్మిక సాధన, స్వీయ అధ్యయనం ద్వారా ఎదిగిన వ్యక్తిలోనే వ్యక్తమవుతాయి అంటారు. అదెంత నిజమో తెలియదు కానీ, ఈ పాప విషయంలో మాత్రం అలాంటి సాధనలేవీ అవసరం లేదని నిరూపించిన సంగతి అక్షర సత్యమేకదా!*
*--—--—•⛎•—--—--*
*_(It's a WhatsApp post by Nagaiah, Rtd. BSNL employee, Atmakur.. 22-05-2022)_*
*======:::=:::=:::======*
*ఈ చిన్న కథలో ఆ చిన్నారి "మానవత్వానికి మేరుశిఖరం" గా నిలిచింది. అయ్యబాబోయ్, ఇంత చిన్న వయసులో అంత సహృదయత, ఆ పరిణతి...🤔😲 నిజంగా ఆశ్చర్యం... అభినందనీయం!!!*
*_ఎంతెంత చదువులు చదివినా, ఎలాంటి పదవులు పొందినా, వయస్సు మీరుతున్నా.... అసలు "సంతృప్తి" అన్నదే లేకుండా... అంతులేని అత్యాశతో నిర్విరామంగా తరగనంత ఆస్తిపాస్తులు సంపాదించినా... ఎంతో ఎదగాలన్న ఆశ చావడంలేదు. ఇంకా ఇంకా ఎదగాలన్న తాపత్రయం తప్ప... ఎక్కడుంది మానవత్వం??? అసలు ఎదగడమంటే ఏంటి?.... దయ, జాలి, సానుభూతి, సహకారం, మానవత్వం మచ్చుకైనా లేకుండా... విలువలన్నీ మంటగలిపి, మనిషి బండరాయిగా మారిపోవడమేనా????_*
*ఇందులోని సంఘటన చాలా చిన్నదే అయినా... మనసును కలచివేసింది. ఈ కథను అందించినందుకు మిత్రుడు నాగయ్య సార్ కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.....* *_{అలాగే మూలకథ చెరపకుండా... నాకు వీలైనంతలో మార్పులు చేర్పులు చేసి, మరికొన్ని వాక్యాలు కలిపి మరింత హృద్యంగా మలచి మీకు అందించడానికి ప్రయత్నించాను: --వెలిశెట్టి నారాయణరావు🙏🙏🙏}_*
No comments:
Post a Comment