When should we get Angry ?
ఎప్పుడు కోప్పడాలి కోపం అనేది నిన్ను నిన్నుగా నిలువనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి కోపానికి కారణాలు అనేకం నష్టాలు కూడా ఎన్నో కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది ఇంగితం నశిస్తుంది హృదయం జ్వలిస్తుంది మంచి మాటలు వినదు మాట అదుపు తప్పుతుంది కంటికి దోషాలు మాత్రమే కనపడతాయి. మనసు యదార్థాన్ని చూడదు చూసినా అంగీకరించదు చేతలు అదుపులో ఉండవు శక్తి వృధ అవుతుంది. మనసు అశాంతికి నెలవవుతుంది. మితిమీరిన కోపం ఆవహిస్తే మనిషి పశువు అవుతాడు. కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు అణచుకుంటే మనశశాంతి కోల్పోతారు ఫలితంగా తన కోపమే తనకు శత్రువు అవుతుంది. కోపం అదుపులో ఉన్నంతసేపు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు నయానా చెప్పినా గ్రహించినప్పుడు తల్లిదండ్రులు సంతానం మీద ఉపాధ్యాయులు విద్యార్థుల మీద పెద్దలు పిన్నల మీద కోపం ప్రదర్శించాలి. అది వారి నడక పద్ధతులు మాటతీరు బాగాలేవని తెలియచెప్పేందుకు భయభక్తులు కలిగించేందుకు ఒక మార్గం అంతేగాని కోపం తెచ్చుకోకూడదు ఈర్షా ద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులు తెలియజెప్పేలా ఉండాలి. ఇతరుల అహాన్ని వ్యక్తిత్వాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బ తిన్నప్పుడు తిరస్కృతికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది. విషయం మరుగునపడి విద్వంసానికి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదం పెద్దలు గురువులు సాధువుల పట్ల వినయ విధేయతలతో వారి అనుగ్రహం పొందేట్లు అప్రమత్తంగా నడుచుకోవాలి. ఆగ్రహం కలిగిస్తే వారి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. కోపానికి గురైన వారు ఇతరుల ఆగ్రహానికి కారణం అర్థం చేసుకుంటే ఘర్షణ ఉండదు. చాలామంది తాము అనుకున్న పద్ధతికి భిన్నంగా ప్రవర్తించినా బాగా ప్రేమించి అభిమానించేవారు తమ భావాలను అర్థం చేసుకోకపోయినా చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా పని చేయకపోయినా కోపం వస్తుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనాన్ని కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది. అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులకు బయటి బంధాలకు చేటు తలనొప్పి రోగం కాదు అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక రోగానికి సూచన అంటారు వైద్యులు కోపం కూడా మనసులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విజ్ఞతకు పర్యవసానం సద్వివేచన ఆత్మ విమర్శతో కోపానికి కారణాన్ని తెలుసుకొని దాన్ని పరిరక్షించుకోవాలి పరిష్కరించుకోవాలి లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు వ్యక్తిత్వానికి తనను నమ్ముకున్న వారికి దేశానికి ధర్మానికి హాని కలిగినప్పుడు ప్పుడు కోపం రాకపోతే తప్పు కోపానికి ఎవరు అతీతులు కారు కోపాన్ని సదా నియంత్రణలో ఉంచుకోవాలి అపారమైన సందర్భాల్లో మాత్రమే అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపాన్ని ప్రదర్శించాలి ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు అది పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు రాజు చేతిలో లో ఆయుధంలా మలచుకోవాలి.
No comments:
Post a Comment