ANU YOGA meditation
9381490085
భోధామృతం🧘♀️
భగవంతుడు రెండు సార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు.
ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యం చేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో “ఏమీ భయం లేదమ్మా మీఅబ్బాయికి ఏమి కాదు.నేను బతికిస్తాను అన్నప్పుడు.
మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని ఇదిగో ఈభూమి నాది ,అదిగో అటు వైపు వున్నది నా తమ్మునిది అన్నప్పుడు. వీడితండ్రి,తాత,ఇదేమాట అన్నారు పోయారు.
ఇప్పుడు వీడు అదే అంటున్నాడు.రేపు వీడు పోతాడు అయినా “ఇది నాది” అనే భ్రమలో, మాయలో,అజ్ఞానంలో బతుకు తున్నాడు అని నవ్వుకుంటాడట.
నిజమే...ఏదిీ శాశ్వతం కాదు. మనం ,మన పిల్లలు,మనం సంపాదించుకున్న ఇళ్ళు,భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవి మనవెంట రావు.
కాబట్టి
మనిషి దేవుణ్ణి కోరుకోవలసిన వరాలు:-
అనాయాసేన మరణం. బాధలేని సుఖమరణం
వినా దైన్యేన జీవనం. ఒకరిపై ఆధారపడని జీవితం
దేహాంతే తవ సాన్నిధ్యం పోయేముందు నీ దర్శనం
దేహిమాం పరమేశ్వర ప్రసాదించు పరమాత్మా !!.
No comments:
Post a Comment