Wednesday, November 2, 2022

భగవద్గీతను వినటం లేదా పారాయణం చెయ్యటం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా?

🔺 *పత్రీజీ సమాధానాలు*🔺
🌹 *చాప్టర్ --32:--- పుస్తకాలు* 🌹

🍁 *ప్రశ్న:--- భగవద్గీతను వినటం లేదా పారాయణం చెయ్యటం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా?*

🍀 *పత్రీజీ:---* పుస్తకాన్ని చదవటం కంటే కూడా ధ్యానం చెయ్యటం అనేది ఎప్పటికీ ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ధ్యానం చెయ్యకుండా మీరు గీత చదివినా మరే పుస్తకం చదివినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు.

🌳మీరు గీత చదవకపోయినా ధ్యానం చేస్తూ ఉంటే ఏదో ఒకనాటికి మీరు కూడా ఒక కృష్ణుడు అయిపోతారు. సాధన ముఖ్యం. గీత చదవటం కన్నా ధ్యానం చెయ్యటం ప్రధానం. అందుకే మన పిరమిడ్ ఫిలాసఫీలో ధ్యానానికి పెద్దపీట వేస్తాం. స్వాధ్యాయం రెండవదైతే, సజ్జన సాంగత్యం మూడవది. ఇక నాల్గవది మౌనం. మాటలు అవసరం లేనిచోట ఒక్కమాట కూడా మాట్లాడకూడదు. మీ శక్తిని కూడబెట్టుకోవటం నేర్చుకోవాలి.

🍁 *ప్రశ్న:--- మెహర్ బాబా వారి గాడ్ స్పీక్స్ లో ఏమని వ్రాసి ఉందంటే: ఏ కాలంలో అయినా ఒక అవతార పురుషుడు, ఐదుగురు పరిపూర్ణ గురువులు భూమిపై ఉండి సంరక్షిస్తూ ఉంటారు అట! మరి ప్రస్తుతం ఆ అవతారమూర్తి ఎవరు? మిగతా ఐదుగురు మాస్టర్స్ ఎవరు? తెలుసుకోవాలని ఉంది చెప్తారా?*

🍀 *పత్రీజీ:---* మిమ్మల్ని ఏదైనా పుస్తకం చదవమని ప్రోత్సహించినపుడు అది చదివిన తర్వాత అందులో మీకు ఉపయోగపడేది తీసుకుని, మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవాటిని వదిలి పారేసి వేరే పుస్తకం చదవటం మొదలు పెట్టండి. ఎప్పుడూ కూడా ఒకే పుస్తకంతో లేదా ఒకే గురువుతో ఆగిపోవద్దు. అనేక మంది గురువులు వ్రాసిన అనేకానేక గ్రంథాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండండి.

🌸 ఒక అవతారం - ఐదుగురు మాస్టర్స్ అనేదేమీ ఉండదు. మాస్టర్స్ ఇచ్చిన చిన్ని చిన్ని వ్యాఖ్యలతో మురిసిపోతూ కూర్చోకుండా, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అనుక్షణం ఎరుకతో అప్రమత్తతతో ఉండండి. ధ్యానం చెయ్యండి. అదీ సంగతి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment