Wednesday, November 23, 2022

అదే భక్తికి సరియైన లక్షణం. దాని ప్రకారమే నడచుకోవాలి.✍️

 221122a1808. 231122-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀687.
నేటి… 

             ఆచార్య సద్బోధన:
                ➖➖➖✍️


సాధకులైనవారు ఆదర్శవంతమైన ప్రవర్తనతో, తమ పలుకులు మధురమైన పలుకులుగా, శ్రవణము ఆనందకరమైన అతి స్వచ్ఛమైన శ్రవణముగా, హృదయమును అధ్యాత్మ భావములతో తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నము చేసినప్పుడే అది భక్తికి లక్షణమవుతుంది.

అంతేకాని సత్సంగములో చేరి విభూతి, కుంకుమబొట్టు పెట్టుకొని రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు ధరించి అనేక రకములుగా చేస్తే, ఈ దృశ్యములంతా కేవలము ప్రదర్శనములే అవుతాయిగాని నిదర్శనములు కానేరవని చెప్పవచ్చు. 

ఇలాంటి చర్యలు ద్వారా  భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నాలు మానుకోవాలి.

మనం భక్తిని ప్రదర్శనముగా కాక, నిదర్శనముగా అనుభవించాలంటే హృదయ పూర్వకముగా మన పంచేంద్రియములను పవిత్రము గావించుకొనే ప్రయత్నానికి పూనుకోవాలి. అదే భక్తికి సరియైన లక్షణం. దాని ప్రకారమే నడచుకోవాలి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment