💖💖💖
💖💖 *"388"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"దేహ క్రియలు మన ఇష్టాఇష్టాలతో పనిలేకుండా జరిగిపోతాయి అంటారు ఇది నిజమేనా ?"*
*"సత్యమే ! శ్రీరమణభగవాన్ తన ఎనిమిదేండ్ల వయసులో మడికట్టుకునేందుకు గోచీ పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ సిగ్గుపడి మడికట్టుకోవటం మానేశారు. అలాంటి శ్రీరమణమహర్షి జీవితకాలం అంతా గోచితోనే గడిపారు. చిన్నతనంలో భగవానుకు తీవ్రంగా తలనొప్పి వచ్చేది. అరుణాచలంకు వచ్చే వరకు అది అలాగే ఉండేదని శ్రీభాగవాన్ చెప్పారు. అయితే వీటన్నింటినీ శ్రీభాగవాన్ బాహ్య లక్షణాలుగా పేర్కొన్నారు. బాహ్యలక్షణాలు అంటే దేహకర్మలని అర్ధం. అవి మనసు ఇష్టాలతో పనిలేకుండా జరిగిపోయే క్రియలు. ఈ సృష్టి మొత్తాన్ని ఏ మహాశక్తి నడిపిస్తోందో అదే శక్తి ఈ దేహక్రియలను కూడా నడిపిస్తుంది. అదంతా ఈ సృష్టి విధానంగా ఏర్పడి ఉంది !*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment