Xx2.x2. 1-7. 231122-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
మహాభారతం నుండి...
చిరకారి
➖➖➖✍️
"చిరకారి " అనే ముని కుమారుని కథ.....
మేధాతిథి అనే మహర్షి పుత్రుడు చిరకారి.
చక్కగా ఆలోచించి అప్పుడు ఏ పనైనా చేస్తాడు అని అతనికి ఆ పేరు వచ్చింది.
తల్లి ,తండ్రి ,అతను చక్కని కుటుంబం తో సంతోషంగా కాలం గడిపే వారు. ఆశ్రమ జీవితము ..ప్రశాంతమైన వాతావరణం..
మేధాతిథి ఏదో ఒక కారణం వలన భార్యపై కోపించి ఆమెను వధించమని మిత్రునికి ఆదేశించి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు...
కానీ చిరకారి తాను చేసే పనులన్నీ ఆలోచించి చేసే లక్షణం కలవాడు.
కనుక ఈ విధంగా అనుకొన్నాడు…. ‘మా తండ్రి ఆజ్ఞ పాటించకుండా ఉండటానికి వీలు కాదు. అలాగని మాతృమూర్తిని చంపడం మంచిది కాదు.’
’తండ్రి మాట వినాలి.. పెద్ద వాళ్ళు అంటారు. ఎలాగైనా తల్లిని కాపాడాలి. ఈ పుత్రత్వం అనే బాధ్యత స్వేచ్ఛ లేనిది’ అని అనుకున్నాడు.
రెండు విధాలుగా నాకు పాపం రాకుండా చేసే ఉపయోగం ఏమున్నది అని ఆలోచించాడు
మాతృ హత్య మహా దోషం. తండ్రి ఆనతి ధిక్కరించడం కూడా దోషమే... వీరు వంశోద్ధారణ కోసం నాకు జన్మ ఇచ్చారు. ఇరువురికి నేను సమానంగానే చెందిన వాడిని.
అని తనలో తాను అనుకొని తండ్రి కుమారుడు గా పుడతాడు .. (ఆత్మావై పుత్రనామాసి). అంటారు
కనుక ధర్మం తపస్సు విద్య దైవము ఇవన్నీ తండ్రి ప్రీతి కలిగించే పని చేస్తే దేవతలు ప్రీతి పొందుతారు..
కానీ ఈ శరీరం అంతా తల్లి నుండే వస్తుంది.. తాను కష్టపడి, బిడ్డ కోసం పడే కష్టాలు తల్లికే ఎక్కువగా ఉంటాయి. ధర్మ శాస్త్రాలు కూడా తండ్రి కంటే తల్లి గౌరవంలో గొప్పది అని చెబుతాయి.
పది మంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు,
నూరు మంది ఆచార్యుల కన్నా ఒక తండ్రి,
వెయ్యి మంది తండ్రుల కన్నా ఒక తల్లి గౌరవం లో గొప్పవారు.
అందుకే వేదం కూడా' మాతృదేవోభవ' అని తల్లిని మొదటి దైవంగా భావించండి అని బోధించింది.
పుత్రుడు ఏ వయసులో ఉన్నా.. తల్లి ప్రేమ ఒకే విధంగా ఉంటుంది. తల్లి లేని వాడు అన్ని విధాల అశక్తుడు అవుతాడు.. దుఃఖితుడు అవుతాడు.
ఇలా అతను ఆలోచిస్తూ ఉండటం లో చాలా సమయం గడిచిపోయింది.
ఇంటి నుంచి వెళ్లిపోయిన తండ్రి మేధాతిథి కోపం తగ్గిపోయి.. ..
”అయ్యో, నేను నా భార్యను చంపమని నా పుత్రుడిని ఆజ్ఞాపించి వచ్చాను .ఈ సమయానికి ఆ పని చేసి ఉంటాడు ..అని కన్నీరు కారుస్తూ ఇంటికి వచ్చాడు.…
కానీ లోలోపల ఒక ఆశ.. నా పుత్రుడు ఏ రీతిగా అయినా ఆలోచించి పని చేసే సహజ స్వభావం కలవాడు .. నన్ను దుఃఖంలో ముంచి వేసే పని చేస్తాడా.?‘ఓ కుమారా నేను నిన్ను అవినీతికరమైన కార్యం చేయమని పురికొల్పాను. నీవు నీ తల్లి చేసిన సేవలను తలుచుకొని ఉంటే నీ పేరు సార్థకం అవుతుంది.. నీకు ఎటువంటి పాపము అంట కూడదు!’ అనుకుంటూ.. ఇంటికి వచ్చాడు.
చిరకారి క్షమించమని అడిగి తన తండ్రి పాదాలు నమస్కరించాడు.
చిరకారి తల్లి కూడా అతనికి నమస్కరించి నిలిచింది.
భార్యాబిడ్డలను ఆనందంతో కనులారా చూసుకొని కుమారుడిని గట్టిగా కౌగలించుకుని ఆశీర్వదించాడు.
ఒక కార్యం చేయవలసి వచ్చినప్పుడు చాలా కాలం ఆలోచించి ధీరత్వం తో మంచి చెడ్డలు నిర్ణయం తీసుకోవాలి అలా ఆలోచించి చేసేవాడిని ఆర్యుడు అని,. ..
తొందరపడే వారిని అనార్యుడు అని పెద్దలు అంటారు.
తొందర పడకుండా, సమయాల్లో స్థిర నిర్ణయాలు తీసుకునే వాడు సార్థకత నాముడై, శాంతిని సమస్త సుఖములను పొందుతారు..✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment