🩺ఆరోగ్య దీపిక🩺
🌞సూర్య నమస్కారాలు🌞
టైం ఎంత?’.. చాలా తరచుగా ఏదో సందర్భంలో మనం అడిగే ప్రశ్న ఇది. అవతలి వారు టైం చెప్పగానే కృతజ్ఞతగా ‘థ్యాంక్స్’ అని బదులిస్తాం. ఇది కనీస మర్యాద. మరి, అసలు టైం (సమయం) మొదలయ్యేదే సూర్యుడి నుంచి. ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సమయాలకు ఆయనే ఆద్యుడు. అటువంటి ఆదిత్యునికి మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలి?. అందుకే నిద్రలేచిన వెంటనే ఆయనకు ఒక నమస్కారం చేయడం మన కృతజ్ఞత. అదే క్రమంగా సంప్రదాయంగా మారి ‘సూర్య నమస్కారాలు’గా వ్యావహారికంలోకి వచ్చాయి
ఒక అద్భుత వ్యాయామ పద్ధతి..
ఒక విశిష్ట ఆసన సరళి విధానం..
ఒక క్రమం.. ఒక లయ.. ఒక పద్ధతి.. చూడ్డానికి కనులకు ఇంపు.. ఇదీ సూర్య నమస్కారాల ప్రత్యేకత.
ఏ ప్రాచీన నాగరికత, ఏ దేశ సంప్రదాయం చూసినా సూర్యుడు ఒక దేవుడు. అత్యంత శక్తి సంపన్నుడు. ఈ సృష్టికి, వాతావరణానికి, మన ఉనికికి మూలం- సూర్యుడు. ఆయన లేనిదే మన మనుగడ లేదు. అటువంటి సూర్యుడి గురించి చేసే ప్రార్థనలో ఒక వ్యాయామ పద్ధతి ఇమిడి ఉంది. ఆ వ్యాయామంలో ఒక ఆరోగ్య సూత్రం, శ్వాసని బంధింప చేసే పద్ధతి కలగలిసి ఉన్నాయి.
తూరుపు దిక్కు ఎర్రబారుతుండ•గా, పక్షుల కిలకిలరావాలతో, చిరుగాలుల సవ్వడి, తొలిమంచు తెరలు భూదేవిని కప్పి ముద్దు చేస్తుండగా, అపుడు వికసించిన పుడమి నిట్టూర్పులకి పుట్టుకొచ్చే మంచు రేణువులు.. ఇటువంటి ఆహ్లాదకర ప్రకృతితో, ప్రశాంత చిత్తానికి మనల్ని తీసుకె•ళ్లే వేళ తన అరుణారుణ కిరణాలలో సంపూర్ణ ఆరోగ్యాన్ని నింపి, సకల జీవులకు జీవజీవాల్ని నింపడానికి సమాయత్తమయ్యే ప్రత్యక్ష దైవానికి కృతజ్ఞతా పూర్వకమైన నివాళే సూర్య నమస్కారాలు.
నిజం చెప్పాలంటే.. యోగాసనాలను ఒక పొందికగా కూర్చి చేసిన ప్రయత్నమే సూర్య నమస్కారాలు. యోగాసనాలు నేర్చుకునేటప్పుడు ఒక విధమైన కన్‍ఫ్యూజన్ ఏర్పడుతుంది. అన్ని ఆసనాల్లో ఏది ముందు, ఏది తర్వాత అనే సంశయం కలుగుతుంది. సూర్య నమస్కారాల్లో అటువంటి సంశయాలు, గందరగోళానికి తావులేదు.
సూర్య నమస్కారాలు చక్కని వ్యాయామ పద్ధతే కాక, ఇది ఆరోగ్యాన్నిచ్చే ఒక సాధనం. ఉదయమే సూర్యకాంతిలో వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగి, చర్మం వి•మిన్ ‘డి’ తయారు చేస్తుంది. అలాగే, ప్రస్తుతం ‘మెనోపాజ్’ సమస్యలు చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. ఇలా స్త్రీ పురుషుల్లో ఇద్దరిలోనూ 35-40 ఏళ్లకు ఈ లక్షణాలు కన్పిస్తున్నాయి. అలాంటి మోనోపాజ్ వచ్చిన వారికి సూర్య నమస్కారాలు మంచి సమాధానమని ‘హార్మోన్ స్పెషలిస్ట్లు’ సూచిస్తున్నారంటే, వీటి గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.
డైనమిక్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్‍సైజ్:
సూర్య నమస్కారాలను ‘డైనమిక్ ఎక్సర్‍సైజ్’ అని కూడా అంటారు. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేసేటప్పుడు శరీరంలోని ప్రతి కండరం, ప్రతి భాగం, ప్రతి అవయవం, ప్రతి అంగుళం ఇన్‍వాల్వ్ అవుతాయి. ప్రతి కీలు, ప్రతి టెండన్, ప్రతి లిగ్మెంట్ కదులుతాయి. కాబట్టి మొత్తం శరీరానికిది సంపూర్ణ వ్యాయామం అవుతుంది.
సూర్య నమస్కారాలు మంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్‍సైజ్ కూడా. వీటి వలన కండరాలు బాగా సాగి వాటిలో నిలువ ఉన్న లాక్టిక్ యాసిడ్స్ రూపంలో ఉన్న మెటబాలిక్ వేస్ట్ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. తద్వారా శరీరమంతా రిలాక్స్ అవుతుంది. యోగాసనాల్లోని ‘కౌంటర్ పోజెస్’ను సూర్య నమస్కారాలతో ఒక క్రమ పద్ధతిలో పొందుపరిచారు. ఇంకా చెప్పాలంటే.. వీటిని మామూలు ‘ఫిజికల్ ఎక్సర్‍సైజ్’లా కూడా చెయ్యొచ్చు. సూర్య నమస్కారాలను ఆచరించే వారిలో కాస్త సృజనాత్మకత ఉంటే.. వాటిలో ప్రాణాయామాన్నీ కలపవచ్చు. గాలి పీల్చడం, వదలడం, లోపల ఉంచుకోవడం, బయటకు వదిలి మళ్లీ పీల్చుకోకుండా ఉండటం.. ఇలా వివిధ దశల్లో అభ్యాసం చేస్తూ సూర్య నమస్కారాలను సాధన చెయ్యొచ్చు. అలా చెయ్యడం వలన శరీరంలోని స్టామినా లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇక ధ్యానాన్ని కూడా సూర్య నమస్కారాల్లో మంత్ర రూపంలో ప్రవేశ పెట్టవచ్చు. అప్పుడిక సూర్య నమస్కారాల పక్రియ అత్యద్భుత సాధన అవుతుంది.
సాధనకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
వయసు 55 ఏళ్లు దాటాక మొదటసారిగా సూర్య నమస్కారాలు ప్రారంభించడం అంత మంచిది కాదు. మొదట రెండు, మూడు నెలలు మిగతా ఆసనాలు వేశాక వీటిని నేర్చుకోవడం ఉత్తమం.
బి.పి., నడుపు నొప్పితో బాధ పడేవారు వీటిలోని ఫార్వర్డ్ బెండ్స్ (పాదహస్తాసన, పర్వతాసన) విషయంలో జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం నడుం నొప్పి పెరిగినా, వీటిని మానివేసి మిగతా వాటినే ప్రాక్టీస్ చేయాలి.
ప్రాణాయామ పద్ధతుల్ని ముఖ్యంగా కుంభకాన్ని ప్రవేశ పెట్టేటప్పుడు ముందుగా కొన్ని రోజులైనా మామూలుగా సూర్య నమస్కారాలని ప్రాక్టీస్ చేసి ఉండి ఉండాలి.
మొదటిసారే పెర్‍ఫెక్షన్ కోసం తాపత్రయ పడొద్దు:
సూర్యనమస్కారాలు చేసిన మొదటి రోజు కొద్దిగా ఒళ్లు నొప్పులు రావడం సహజం. కాబట్టి కంగారు పడి సాధన చేయడం మానివేయవద్దు.
✒️సేకరణ కూర్పు
💞విప్పోజు శ్రీనివాస ఆచార్య విశ్వకర్మ💓
No comments:
Post a Comment