హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏
గురువు ఎలా ప్రకాశిస్తున్నాడో అలా ఉండాలి
తనను తానెరుగుట... తనలో తాను మునుగుట.. తనలో తాను మేల్కొనుట ...తనను తాను నిరశించుట ఉన్నదున్నట్లుండుట .
పారమార్ధిక విద్య అంతా ఈ నాలుగు మాటలే.
శ్వాసతో సమంగా చేస్తేనే అది స్మరణ.
త్రిపుటి ప్రభావం వలన విస్మరణ కలుగుతుంది.
పరబ్రహ్మ వాచకం అయి ఉండాలి మాట.
తనను తాను పోగొట్టుకొనే విధంగా గురువుని సేవించాలి. ... భావ రూప ధారణ చేయాలి.
ప్రసాద సేవనం వలన మానవుడు ప్రసాద స్థితికి పరిణామం చెందుతాడు .. తాను మిగలడు.
అణువు నుంచి మహత్తు వరకు వ్యాపించి ఉన్నవాడు మహేశ్వరుడు .
ఆయన యందు నీవున్నావు ... నీవు ఆయనను వెతకటం లేదు
నీతో సహా ఉన్నదంతా జ్యోతిర్మయమే ... అయినప్పుడు ద్రష్ట ఎవరు .. ప్రశ్న వేసుకోవాలి.
అఖండ శివ నామ స్మరణ పరమహంస స్థితిలో నిన్ను నిలబెట్టగల గొప్ప ఉపాసన
పరబ్రహ్మ యొక్క అంశీభూతమే ఈ జీవం .. జీవో బ్రహ్మైవ నా పర:.
పరమహంస.. పరమాత్మ.. పరబ్రహ్మ.. పరశివం .. జాగరూకులై ఈ జ్ఞాన నిర్ణయాన్ని పొందాలి.
ఇంద్రియానుభవములన్నీ విషయానందమే. త్రిపుటికి అతీతం ఆత్మానందం.
ప్రత్యగాత్మ స్థితి లో అనుభవించేది ఆత్మానందం... కూటస్థుడిగా అనుభవించేది బ్రహ్మానందం.
జ్ఞానగంగా ప్రవాహంలో మునిగినవాడికి నేనున్నానన్న ఉనికి మాసిపోయింది.
అది నేనై ఉన్నానన్న అనుసంధానం చెయ్యక్కరలేదు ..
సర్వదా... సర్వకాలేషు... సర్వత్రా బ్రహ్మానంద మగ్నుడే.
దైవీ ప్రణాళికను ఏమరుపాటు లేక చేస్తాడు .. బ్రహ్మానందమగ్నుడు.
నీకు ఇవ్వగల శక్తి ఉండాలికానీ గురువేదైనా పుచ్చుకుంటాడు .. నీ అహంకారమే అడ్డు.
పూర్ణము .. శూన్యము ఈ రెండూ ఒక్కటే అని చెప్పటం శివరాత్రి శివ కళ్యాణం.
ఏకం.. నిత్యం.. విమలం.. అచలం = ఆత్మ.. బ్రహ్మానుభవం.. పరం.. పరాత్పర నిర్ణయం.
సర్వధీ .. సర్వాన్నీ ఎరిగే అఖండ ఎరుక.
విచారణ.. అనుభవం.. అధిగమనం ఇలాసాగాలి.
జనన మరణాలు నీ చిత్తవృత్తులుగా ఉన్నాయి .. జనన మరణాలకు స్పందించక ఇండు
Death is an instinct
స్వాత్మ దర్శనం ... చిత్వ దర్శనం .. తత్వ దర్శనం.. సద్దర్శనం ఇది దర్శన క్రమం .. భావాతీత స్థితి.
వ్యవహారంలో మూడు గుణాలని గుర్తించాలి .. గుణాతీతంగా ఉండాలి. అంతరంలో సదా ఆత్మ భావనలో ఉండాలి ... మన
కైవల్యాశ్రమం అందించే బోధ ఇదే .
శ్రీ విద్యా సాగర్ స్వామి వారు
గురుగీత -42
జై గురుదేవ 🙏
No comments:
Post a Comment