అప్రమత్తతా ఆధ్యాత్మికతే!
ఒకసారి దక్షిణేశ్వరంలోని పంచవటిలో సంకీర్తనల కార్యక్రమం ఏర్పాటైంది. అక్కడే రామకృష్ణ పరమహంస సాధన చేస్తుంటారు.
వర్షాకాలం కనుక అద్వైతానంద గురుదేవుల కోసం గొడుగు తీసుకెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక పరమహంస ఆవాసానికి విచ్చేసిన భక్తులు అద్వైతానందను గొడుగు అడిగారు. 'అయ్యో! సంగీత పారవశ్యంలో పడి ఆ విషయమే మర్చిపోయాను!' అన్నాడు. అప్పుడు గురుదేవులు 'సాధారణంగా నేనిలాంటి లౌకిక విషయాలను పట్టించుకోను. అలాగని అజాగ్రత్తను కూడా సహించను. సంగీతం విను. కానీ వచ్చేటప్పుడు వెంట తీసుకెళ్లింది గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలి. ఇలాంటివే మానసిక స్థితికి అద్దం పడతాయి. పరధ్యానం, ఏమరుపాటు పారమార్థికత అనిపించుకోదు. అప్రమత్తత కూడా ఆధ్యాత్మికతే! అడుగడుగునా జాగ్రత్తతో మసలు కోవాలి' అని హితవు పలికారు. అలా పరమహంస పారమార్థిక విషయాల్లోనే కాదు ప్రాపంచిక విషయాల్లోనూ శిక్షణ ఇచ్చేవారు. చిన్నచిన్న అంశాల్లోనే నిర్లక్ష్యంగా ఉంటే.. ఇక పెద్ద విషయాల్లో జాగ్రత్త ఎలా వస్తుందని సూటిగా ప్రశ్నించేవారు.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment