🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"467"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"ఆంజనేయస్వామి పాదాలను తాకితే శని పట్టుకుంటుందని కొందరు అంటారు అది నిజమేనా ?"*
*"వివేకంలేని భక్తి అనుమానాన్ని కలిగిస్తుంది. వివేకంతో కూడిన భక్తి శాంతినిస్తుంది. ఆంజనేయస్వామి పాదాలను తాకితే శని అంటుకుంటుందని కొందరి అపోహ. తాము చదివిన కథలో స్వామి, శని దేవుని కాలితో తొక్కాడని, స్వామి పాదాలచెంత శని ఉండటంచేత ఈ అనుమానం ఏర్పడింది. ఆంజనేయస్వామి పేరు తలుచుకుంటేనే తన ప్రభావాన్ని చూపని శని, అదే స్వామి కాళ్ళను అంటిపెట్టుకుని ఉండటం, ఆ కాళ్ళను తాకిన వారిని పీడించడం సాధ్యమయ్యే విషయాలేనా ? మనం పూజించే దేవుళ్ళ విషయంలో ఇలాంటి అపోహలు ఎన్నో ఉన్నాయి. మనలో అవగాహన చూపించటం వల్ల దైవంపై ఉండాల్సిన భక్తి భయంగా మారింది. భగవంతుని ఏ రూపమైనా నీ మనసులోని పరమాత్మకు ప్రతిరూపమేనని తెలిస్తే భయం స్థానంలో మరింత భక్తి నెలకొంటుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
*"శ్రీ"*
No comments:
Post a Comment