*👅జిహ్వచాపల్యాం...*👅
✍️ మురళీ మోహన్
👉నేటి సమాజంలో ప్రతి జీవి పతనమవ్వడానికి కారణం కేవలం జిహ్వచాపల్యం మాత్రమే ...
అది ఎలా...!!!
చేపలను పట్టాలనుకునే జాలరి ఒక కర్రకు తీగ కట్టి దాని క్రింద 'U' ఆకారంలో ఉండే ఇనుప కొక్కాని కట్టి అది కనిపించకుండా దానికి ఓక వానపామును చుట్టి నీటిలోనికి వదులుతాడు.
అక్కడుండే చేప తన ఆహరమైన వానపామును చూసి తన జిహ్వచాపల్యాన్ని నిరోధించలేక దానిని తినే ప్రయత్నం చేస్తుంది.
వెంటనే ఆ ఇనుప కొక్కెం దాని నోట్లోకి చొచ్చుకునిపోయి అది ఎటూ కదల్లేక కొట్టుకుంటుంది.
అది గమనించిన జాలరి దాన్ని నీటి నుంచి పైకి లాగి, తన పడవలో వేసుకుంటాడు...
జిహ్వచాపల్యం కారణంగా తన నోటి మీద నిగ్రహం లేని కారణంగా చేప తన ప్రాణాన్ని కోల్పోతుంది.
అందువలన రసేయంద్రియము (అనగా నాలుక) మీద నిగ్రహం కలిగి ఉండాలని మనము ఈరోజు చేప ద్వారా నేర్చుకోవాలి...!!!
మనకు కూడా మన నోటి మీద అదుపు వుండదు, కేవలం ఆహారం విషయంలోనే కాదు, మాట్లాడే విషయంలో కూడా...
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతాము, ఎలా పడితే అలా మాట్లాడుతాము, ఏది పడితే అది, ఎలా పడితే అలా తింటాము...
అందుకే మనము కూడా తన జిహ్వ మీద అదుపు ఉంచాలి.
తినకూడనివి తినరాదు, మాట్లాడకూడనివి మాట్లాడరాదు, త్రాగకూడనివి త్రాగరాదు. లేదంటే చేప వలె మనము కూడా పతనం అవుతాము.
No comments:
Post a Comment