Thursday, February 9, 2023

నేటి మంచి మాట

 నేటి మంచి మాట

 *మనం అందరం జీవితంలో విజయం సాధించాలని కష్టపడుతూ ఉంటాం.* 

 *అసలు విజయం అంటే ఏంటి ?? మన నిజజీవితంలో రాత్రికి రాత్రే గుర్తింపు తెచ్చుకొని గొప్పవాళ్ళు అయిన వాళ్ళను చూస్తుంటాం, అలాగే ఎన్నో ఏళ్ళు కష్టపడి విజయానికి పునాదులు వేసుకున్నవాళ్లను* 
 *చూస్తుంటాం* ,.

 *ఇందులో కొంతమంది ఆ విజయ పరంపరను కొనసాగిస్తూ ముందుకు వెళ్తే మరి కొందరు ఆ గెలుపును కొనసాగించలేక తెరమరుగు అయిపోతుంటారు.*

 *కొందరు పడి లేస్తే చాలామంది లేచి పడుతుంటారు.* 
 *అనుకున్నది సాధించడానికి మనల్ని మనం కోల్పోతే సాధించిన విజయానికి అర్ధమే ఉండదు.* 
 *ప్రపంచంలో మంచివాళ్ళు అలాగే విజయం సాదించినవాళ్లు వుంటారు, కానీ విజయం సాధించి అనుకున్న ఎత్తుకు చేరుకున్న తర్వాత కూడా ఎవరు అయితే మంచిగా వుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు..ఎక్కడో విన్నది చదివినది..* 

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment