*ఏది అవరోధం**
ఏది అవరోధం
నడవలేక పోవడమా
నమ్మకం లేని సంకల్పమా
ఏది అవరోధం
చూడలేకపోవడమా
చిరు దివ్యని చీకటిలో
వెలిగించుకోలేక పోవడమా
ఏది అవరోధం
మాట్లాడలేకపోవడమా
మౌన పోరాటంతో కూడా
జీవితంలో గెలవవచ్చు అన్న
నిజాన్ని తెలుసుకోలేకపోవడమా
ఏది అవరోధం
వినికిడి లోపమా
నీ లోపలి శక్తిని గుర్తించలేకపోవడం మా
ఏది అవరోధం
చేయి కదపలేకపోవడమా
మనసుంటే మార్గం ఉంటుంది
అని మాటని మర్చిపోవడమా
నీ లోపల దాగి ఉన్న శక్తిని
నీవు గుర్తించలేక పోవడమే
నిజమైన అవరోధం
నిన్ను నువ్వు మార్చుకోలేక
పోవడమే
నిజమైన అవరోధం
జాలి మాటలకు సానుభూతులకు
లొంగి పోవడమే
నిజమైన అవరోధం
నీ తలరాతను కొత్తగా
రచించుకునే రచయితవు నీవే
నీ కథని కొత్తగా
నీకు నచ్చినట్టుగా
చిత్రించు కునే చిత్రకారుడువి నీవే,
శ్రమని, కష్టాన్ని, వేదాన్ని
పెట్టుబడులుగా పెట్టి
సమాజంలో నీ స్థాయిని
నిలబెట్టుకునే నిర్మాతవు నీవే
నీ జీవితానికి
నీవే కర్త కర్మ క్రియ...
No comments:
Post a Comment