Saturday, December 16, 2023

 *_పొదుపు.._*
*_పొద్దుపొడుపు..!_*
*********************
_ఇంధన పొదుపు దినోత్సవం_
++++++++++++++++
పొదుపు..
భావి తరాలకు మదుపు..
వినసొంపు..
ఎక్కడుంది ఆచరణ..
కంపు..కంపు..!

పొదుపు గురించి మాటాడితే
ఎవడి గోల వాడిదే..
నేను..నా..
అంతే..నేనింతే..
అందులో ఇంధనం..
అది జాతికే మూలధనం..
నాకేం పోయె..
నా సమస్య కాదే..
తోలు మందం..
దేనిమీదో 
వాన కురిసిన చందం..!

ప్రభుత్వాలే పట్టించుకోని
ఇంధన పొదుపు..
మంత్రి..ముఖ్యమంత్రి..
ఎవరు వచ్చినా కాన్వాయి..
కార్ల వరస...
ఎందుకో తెలియని హంగామా..
సర్కారు ఖర్చుతో..
ప్రజాధనంతో చేసే వృధా..
మనపై మనమే 
జల్లుకునే బురద..!

విద్యుత్తు..
పొదుపు ఉసే పట్టని 
జనాల విద్వత్తు..
మన ఉత్పత్తి చూస్తే
ఎప్పటికప్పుడు 
కరిగిపోయే కొవ్వొత్తు..
అయినా గాని పట్టించుకోని
వినియోగదారుని మత్తు..
ఇదంతా ఓ గమ్మత్తు..!
ప్రభుత్వ కార్యాలయాల్లో
మరీ దుబారా..
స్విచ్చు ఆపి 
వెళ్ళడానికి బద్ధకం..
మనది కాకపోతే..
కాశీ వరకు డేకిరేసే వాలకం!
ఇంట్లో అయితే చలికాలం
నో ఎసి..
సర్కారు ఆఫీసుల్లో 
అంతా ఓసి..!

ఎవరికి వారే జల్సా..
విలాసాలతో కులాసా..
సీరియల్ సెట్లు..
డెకరేషన్లు..
ఇంకెక్కడి పొదుపు..
మరెక్కడ అదుపు..
అంతా ఒట్టి మాటలు..
ఇదిగో ఇలాంటి 
దినోత్సవాల నాడు
కట్టేసే డొల్ల రాళ్ల కోటలు..!

✍️✍️✍️✍️✍️✍️✍️

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
       9948546286

No comments:

Post a Comment