🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏
🌻 శుభోదయం🌹
🏵️ నేటిపెద్దలమాట 🏵️
మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవడం మానేస్తాము.
*- సర్వేపల్లి రాధాకృష్ణన్*
🌳 నేటి మంచి మాట 🌴
ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వుకు విలువ, కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం, బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. ధైర్యం, కాలం, ప్రకృతి,... ఈ మూడూ ఉత్తమమైన గొప్ప వైద్యులు.
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺
*_నేటి మాట_*
*భక్తులు*
ఈరోజుల్లో చాలా మంది మేము ఆ దేవుడి భక్తులము, మేము ఈ దేవుడి భక్తులము అని చెప్పుకోవడం వింటుంటాము, *భక్తులనే వారు - ఎలాంటి గుణములు అలవర్చుకోవాలి???* ఒకసారి పరిశీలిద్దాము !!!...
పాముకు రెండు విషపు కోరలు ఉంటాయి!!...
ఆ కోరలు ఉన్నంత వరకు అది అందరినీ భయ పెడుతూ, కాటేస్తూ ఉంటుంది!!...
ఎప్పుడైతే ఆ రెండు కోరలు పీకేస్తామో అప్పటినుండి అది ఎవరిని భయ పెట్టకుండా ఒక మూలన దాగి ఉంటుంది...
*అలాగే " భక్తుడు అని అనుకునే వారి , మనసులో కూడా అహంకార మమకారాలు అనే రెండు విషపు కోరలు వుంటాయి !!"*...
వీటి వలన మనము చేయరాని పనులెన్నో చేస్తూ మోయలేని భారమెంతో మోస్తూ, మనకు మన చుట్టూ ఉన్న సమాజానికి గొప్ప హానిని తలపెడుతుంటాము!!...
దీని వలన అటు సమాజం, ఇటు భక్తుడు అని చెప్పుకునే వారు కూడా చెడిపోయి, నష్టాలపాలు, కష్టాలు పాలగుతుంటాడు!!...
ఇది కూడని పని, కదా !!... ఇట్టి చర్యల వలన మనకు ఉపకారం చేకూరదు కదా!!... భక్తుడి లక్షణం కూడా అది కాదు కదా!!...
ఇలా జరగకుండా ఉండాలంటే భక్తుడు తనలో ఉన్న అహంకార మమకారాలు అనే రెండు కోరల్ని పీకి పారేయాలి!!...
సహనము, వినయము, విధేయత, ప్రేమ, త్యాగము వంటి గుణాలతో మనసును నింపుకోవాలి!!...
అప్పుడే మనసు అణిగి మణిగి ఉంటుంది, ఇట్టి స్థితి వలన అటు సమాజానికి , ఇటు మనిషికి లాభం చేకూరుతుంది...
అప్పుడు దేశమునకు, ప్రపంచానికి మంగళం కలుగుతుంది... అతడే నిజమైన భక్తుడు ...
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
No comments:
Post a Comment